వెల్లంపల్లి: తమ పార్టీ కాంగ్రెస్ లో విలీనమవుతుందని వచ్చిన కథనాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొట్టిపారేశారు. కాంగ్రెసే తమ పార్టీలో విలీనం అయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం వెల్లంపల్లిలో కాంగ్రెస్, టీడీపీ నుంచి 1000 కార్యకర్తలు బాలినేని సమక్షంలో గురువారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పుల్లలచెరువులో బాలినేని ఆధ్వర్యంలో జరిగిన వైఎస్‌ఆర్‌సీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment