లేని కేసులో ఇరికించి కేవలం ఎఫ్ ఐఆర్ లో పేరు వచ్చినందుకే వైఎస్ జగన్ తప్పు చేశారని, దోషి అని తప్పుడు కూతలు కూసిన కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు జ్ఞానోదయం అయిందా అంటూ వివిధ పక్షాల నేతలు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నించారు.. సీబీఐ నిర్ణయాలు వెనుక కొందరు వ్యక్తులు ఉంటారంటూ మంత్రి ధర్మాన వ్యాఖ్యాలపై సాక్షి హెడ్‌లైన్ షోలో మంగళవారం ఉదయం చర్చ జరిగింది.
సీబీఐ కాంగ్రెస్ కనుసన్నల్లోనే నడుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే చెప్తుందని ఆ పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డి గుర్తు చేశారు. వైఎస్ జగన్ ఎంపీ కాబట్టి సాక్షులను ప్రభావితం చేస్తారంటూ ఆర్భాటం చేసిన సీబీఐకి ధర్మాన మంత్రి అనే విషయం తెలియదా అంటూ సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్ రెడ్డి సహా మిగతా పక్షాల నేతలు ప్రశ్నించారు.

No comments:
Post a Comment