పామర్రు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బకు కాంగ్రెస్, టిడిపిల కార్యాలయాలు మూత వేసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయయని టీడీపీ మాజీ నేత ఉప్పులేటి కల్పన జోస్యం చెప్పారు. కాంగ్రెస్, టిడిపిల విమర్శలకు అర్థమేలేదని ఆమె కొట్టిపారేశారు. బుధవారం పామర్రు సభా ప్రాంగణం నుంచి మాట్లాడిన ఆమె... చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంపార్టీలోకి చేరలేదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ పథకాలకు ఆకర్షితులై... వైఎస్ జగన్ నాయకత్వం మీద నమ్మకంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరడానికి నిర్ణయించుకున్నామని ఉప్పులేటి కల్పన తెలిపారు.
పామర్రులో సాయంత్రం జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు వేలాది మంది తరలివస్తున్నారని ఆ పార్టీలో చేరబోతున్న కృష్ణా జెడ్పీ మాజీ ఛైర్మన్ కుక్కల నాగేశ్వర రావుచెప్పారు. బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన ఆయన సాక్షితో మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనం దాటికి ప్రత్యర్ధులు కొట్టుకుపోవడం ఖాయమని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వైఎస్ఆర్ అభిమానులు పామర్రు సభకు తరలివస్తున్నారని ఆయన తెలిపారు.

No comments:
Post a Comment