పామర్రు: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (శ్రీవెంకటేశ్వరరావు), టీడీపీ పొలిట్‌బ్యూరో నుంచి వైదొలగిన ఉప్పులేటి కల్పన, కాంగ్రెస్‌ను వీడిన కృష్ణా జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు, వీవీఆర్ హౌసింగ్ అధినేత వాకా వాసుదేవరావు తదితరులు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వీరందరికీ పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ లు వైఎస్సార్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. జిల్లా నలు మూలల నుంచి నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment