ప్రధాని మన్మోహన్ సింగ్తో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రహస్యంగా ఏం మాట్లాడారో స్పష్టం చేయాలని వైఎస్ఆర్ సీపీ అధికార పార్టీ ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ప్రధానిని ఏకాంతంగా కలవడం వెనుక అంతర్యం ఏమిటో బాబు బయటపెట్టాలని ఆమె అన్నారు. చంద్రబాబుకు రహస్యంగా చర్చలు జరపడం మొదటి నుంచి అలవాటేనని పద్మ ఎద్దేవా చేశారు.
వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఢిల్లీలో చంద్రబాబును కాంగ్రెస్ ఎంపీలు కలిసింది వాస్తవం కాదా అని పద్మ ప్రశ్నించారు. జగన్‌ను ఎదిరించాలంటే కాంగ్రెస్-టీడీపీలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకోలేదా అని ఆమె అన్నరాఉ. మీడియాను అడ్డంపెట్టుకుని కుళ్లురాజకీయాలు చేసేది టీడీపీ నేతలేనని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు.. కాంగ్రెస్‌తో కుమ్మక్కవుతున్నారని ఆరోపించారు.
వైఎస్ విజయమ్మ వాయిస్‌ను అధికారికంగా పీటీఐ వార్తా సంస్థ విడుదల చేయలేదని ఆమె అన్నారు. కాని పీటీఐ పేరుతో టీడీపీ, మీడియా సంస్థల ప్రచార నాటకాన్ని పీటీఐ అధికారులు దృష్టికి తీసుకెళతామన్నారు. ఎన్ టీఆర్ ట్రస్ట్‌కు కార్పొరేట్ సంస్థల నిధులపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ సీపీ అధికార పార్టీ ప్రతినిధి వాసిరెడ్డి పద్మ కోరారు.

No comments:
Post a Comment