తమ కుటుంబ ఆస్తులు తగ్గినట్లు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో తనకు రూ.39.88 లక్షల ఆస్తి ఉండగా.. ఈ ఏడాది మార్చికల్లా అది రూ.31.97 లక్షలకు తగ్గిందన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేరిట రూ.41,74,82,000 ఆస్తి, రూ.17, 21,99,000 అప్పు, కుమారుడు లోకేష్ పేరిట రూ.8,82,67,000 ఆస్తి, రూ.2,20,20,000 అప్పు ఉంది. కాగా కోడలు నారా బ్రహ్మణి పేరిట రూ.2,09,91,000 ఆస్తి ఉంది.
చంద్రబాబు కుటుంబం నిర్వహించే నిర్వాణ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రూ.21,36,25,000 ఆస్తి, రూ.19,34,27,000 అప్పు ఉన్నాయి. ఈ వివరాలన్నీ ఈ ఏడాది మార్చి 31 నాటివని బాబు తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏర్పాటు చేసిన నైతిక విలువల కమిటీ చేసిన సూచన మేరకు ప్రతి సంవత్సరం తనతో పాటు, తన సతీమణి ఆస్తుల వివరాలను శాసనసభ సచివాలయానికి అందజేస్తున్నామని, గ త ఏడాది నుంచి కుమారుడు, కోడళ్లను కూడా ఆస్తులు ప్రకటించాల్సిందిగా కోరానని, వారు అంగీకరించటంతో అవి కూడా వెల్లడి స్తున్నానని చెప్పారు.

No comments:
Post a Comment