తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిశారు. అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సహకరించాలని ఆమె ఈ సందర్భంగా విజయమ్మను కోరారు. లోటస్‌పాండ్‌లో వైఎస్ విజయమ్మను కలిసిన కవిత ఈ నెల17 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై వైఎస్ విజయమ్మ కూడా సానుకూలంగా స్పందించినట్లు వైఎస్ఆర్ పార్టీ నేతలు తెలిపారు.
Monday, 10 September 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment