YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 15 September 2012

రేపు వైఎస్ఆర్ సిపి శాసనసభాపక్ష సమావేశం

 వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్షం రేపు సమావేశం కానుంది. ఈ నెల 17 నుంచి శాసనసబ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు చర్చించనున్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. విద్యుత్‌ సంక్షోభం, ఫీజురీఇంబర్స్‌మెంట్‌ పథకానికి పరిమితుల విధింపు, విషజ్వరాల వంటి సమస్యలతో ప్రజలు అల్లాడుతున్న నేపధ్యంలో ప్రజల పక్షాన శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమాయత్తమవుతోంది. లోటస్‌పాండ్‌లోని క్యాంప్‌ ఆఫీస్‌లో జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కూడా హజరవుతారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!