సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ కాల్ లిస్టు కేసులో హైకోర్టు సీఐడీ పోలీసులకు అక్షింతలు వేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయాలని సిఐడి హైకోర్టును ఇటీవల ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం మంగళవారం విచారణ జరిపిన కోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఏ కేసులోనైనా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారించే అధికారం దర్యాఫ్తు సంస్థలకు ఉందని, అయితే వారిని వేధించవద్దని సూచించింది. నిందితులను మానసిక వేధనకు గురి చేయవద్దని సిఐడికి హితవు పలికింది. బెయిల్ పిటిషన్ రద్దు చేయాలన్న సిఐడి పిటిషన్‌ను కొట్టి వేసింది. బెయిల్ మంజూరైనప్పుడూ సీఐడీ జారీ చేసిన లుక్‌అవుట్ నోటీసులు అమల్లో ఉండడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment