పామర్రు: రాష్ట్రంలో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. వైఎస్ఆర్ సీపీని ఏ శక్తి ఆపలేదని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ సీపీపై ఉన్న జనాభిమానాన్ని ఎవరూ చెరపలేరని స్పష్టం చేశారు. దమ్ము, ధైర్యం ఉన్న వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయనుండడం ఆనందంగా ఉందన్నారు. 2014లో వైఎస్ జగన్ సీఎం అవడం ఖాయమన్నారు. కృష్ణా జిల్లా పామర్రులో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. విజయమ్మను కలవడానికి వెళ్తే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు. బీసీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణ, పాదయాత్రపేరుతో ప్రజలను బాబు మభ్యపెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పాదయాత్ర ప్రతిపాదనను కొంగజపంతో పోల్చారు. పాదయాత్రతో వైఎస్ఆర్ ప్రజలకు నమ్మకం కలిగించారని గుర్తు చేశారు.

No comments:
Post a Comment