- వైఎస్, అప్పటి మంత్రులు ఎలాంటి తప్పిదాలూ చేయలేదు
- ఆ 26 జీవోలూ కేబినెట్ రాజ్యాంగ బద్ధంగా ఆమోదించినవే
నరసన్నపేట(శ్రీకాకుళం), న్యూస్‌లైన్: దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో భూ కేటాయింపులు గానీ ఇతర విధాన నిర్ణయాలు గానీ పారదర్శకంగానే జరిగాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. నిబంధనల మేరకు కేబినెట్‌లో కూలంకషంగా చర్చించిన తర్వాతే భూ కేటాయింపులు చేశారని చెప్పారు. ఈ విషయంలో వైఎస్ గానీ, ఆయన మంత్రివర్గ సహచరులు గానీ ఎలాంటి తప్పిదాలు చేయలేదని తేల్చిచెప్పారు.
బుధవారమిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు చేసిన భూ కేటాయింపులు వ్యక్తిగత నిర్ణయాలు కావన్నారు. అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన 26 జీవోలు కూడా మంత్రిమండలి రాజ్యాంగబద్ధంగా ఆమోదించినవేనని చెప్పారు. ప్రజలను మభ్య పెట్టేందుకు కొన్ని పత్రికలు సీబీఐ విచారణను భూతద్దంలో చూపుతూ వైఎస్‌కు, ఆయన మంత్రివర్గ సహచరులకు చెడ్డపేరు తెచ్చేందుకు కుయుక్తులు పన్నుతున్నాయన్నారు

No comments:
Post a Comment