రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న విరాళాల తీరు తెన్నులు అచ్చంగా క్విడ్ ప్రొ వ్యవహారంగానే కనిపిస్తుంది. ఎడిఆర్ అనే సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం కాంగ్రెస్, బిజెపిలతో పాటు మన రాష్ట్రంలోని టిడిపి, టిఆర్ఎస్ లకు కూడా భారీగా నిధులు సమకూరాయి. గత ఎనిమిది ఏళ్లుగా కాంగ్రెస్ కు రెండువేల కోట్లు, బిజెపికి వెయ్యి కోట్ల రూపాయలను ఆయా కంపెనీలు నిధులు ఇచ్చాయి.బిఎస్పికి 450 కోట్ల మేర విరాళాలు ఇచ్చాయి. ఎస్.పి కి కూడా అదే రీతిలో నిధి వచ్చింది. వీటన్నిటిని రాజకీయ పార్టీలు సాధ్యమైనంతవరకు రహస్యంగానే ఉంచుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో టిడిపికి ఏభై కోట్లు, టిఆర్ఎస్ కు పది కోట్ల రూపాయలను ఆయా సంస్థలు సమకూర్చినట్లు ఈ సంస్థ వెల్లడించింది. స్యూ అనే కంపెనీ టిడిపికి కోటి రూపాయలు ఇచ్చినట్లు వెల్లడైంది.కాగా తెలంగాణపై ఆనాటి హోం మంత్రి చిదంబరం ప్రకటన చేసిన తర్వాత టిఆర్ఎస్ కు నిధులు రెట్టింపు అయ్యాయని కూడా తెలిపారు. సమాచార హక్కు ద్వారా ఈ సమాచారాన్ని రాబట్టామని ఆ ఎడిఆర్ చెబుతోంది. అయితే ఇందులో కొంత చెక్ ల ద్వారా వస్తే, నగదు రూపంలో కూడా పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలకు నిధులు ముడుతున్నాయని సంస్థ నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.టాటా, బిర్లా, వేదాంత,ఎల్.అండ్ టి వంటి ఏభై కార్పొరేట్ కంపెనీలు ఈ డబ్బును సమకూర్చాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment