YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 29 December 2012

జగన్ కోసం... జనం సంతకం












తేదీ: 22 డిసెంబర్ 2012
మాన్యశ్రీ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి...

ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చేసుకుంటున్న విజ్ఞప్తి...

జగన్ కోసం... జనం సంతకం
     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, లోక్‌సభ సభ్యులు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిగారి మీద రాజకీయపరంగా బనాయించిన కేసును తీవ్రంగా గర్హిస్తున్నాం. నిజాలను నిర్థారించాల్సిన సీబీఐ సంస్థ- జగన్మోహనరెడ్డిని దోషిగా చిత్రీకరించటానికి అహర్నిశలు చేస్తున్న ప్రయత్నాలను, అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా భావిస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్ళకు లొంగి, పక్షపాతంతో సీబీఐ చేస్తున్న దర్యాప్తు భారతదేశంలో అధికార వ్యవస్థల దుర్వినియోగానికి నిలువెత్తు నిదర్శనమని మేమంతా భావిస్తున్నాం..

     ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నందుకు, అధికార పార్టీతో విభేదించి బయటకు వచ్చినందుకు వైయస్ జగన్మోహనరెడ్డిగారిని 200 రోజులకు పైగా అక్రమంగా నిర్బంధంలో ఉంచటాన్ని మేమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కక్ష సాధింపులు ఆపాలని, ప్రభుత్వ వ్యవస్థల ఔన్నత్యాన్ని పెంచాలని కోరుతున్నాం.




మీరూ చేయికలపండి!

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిగారి అక్రమ అరెస్టును నిరసిస్తూ 'జగన్ కోసం... జనం సంతకం' పేరిట ప్రారంభించిన కోటి సంతకాల సేకరణలో మీరూ పాలుపంచుకోండి. ఇందుకోసం ఈ కింద ఇచ్చిన ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, సంతకాలు చేసిన తర్వాత ఫార్మ్‌లో తెలిపిన పార్టీ కేంద్ర కార్యాలయం చిరునామాకు పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించగలరు.

Wednesday 26 December 2012

చినబాబునూ , బరించలేం చంద్రబాబూ !









http://telugu.greatandhra.com/politics/1-12-2012/26_china_babu.php

YSRCP leaders remember late PR Kiran Kumar Reddy's activities

Jagan bail petition adjourned

 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది.సీబీఐ మూడు నెలలలో దర్యాప్తు పూర్తి చేస్తామని సుప్రీంకోర్టుకు చెప్పిందని, ఆ గడువు ఇంకా పూర్తి కాలేదని న్యాయస్థానం తెలిపింది. మూడు నెలల గడువు ముగిశాక బెయిల్ కోసం వస్తే బాగుంటుందని కోర్టు అభిప్రాయపడింది.

మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని సుప్రీంకోర్టు చెప్పిందని సీబీఐ చెప్పిందని... అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ దర్యాప్తు విషయంలో పరిస్థితులు ఏమీ మారలేదని హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. దర్యాప్తు ఎంతవరకూ పూర్తి చేశారో నివేదిక సమర్పించాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. జనవరి 4వ తేదీన మళ్లీ వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.

Konathala Ramakrishna Press Meet on 26th Dec

Tuesday 25 December 2012

జగన్ కోసం... జనం సంతకం


ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చేసుకుంటున్న విజ్ఞప్తి...

జగన్ కోసం... జనం సంతకం
     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, లోక్‌సభ సభ్యులు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిగారి మీద రాజకీయపరంగా బనాయించిన కేసును తీవ్రంగా గర్హిస్తున్నాం. నిజాలను నిర్థారించాల్సిన సీబీఐ సంస్థ- జగన్మోహనరెడ్డిని దోషిగా చిత్రీకరించటానికి అహర్నిశలు చేస్తున్న ప్రయత్నాలను, అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా భావిస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్ళకు లొంగి, పక్షపాతంతో సీబీఐ చేస్తున్న దర్యాప్తు భారతదేశంలో అధికార వ్యవస్థల దుర్వినియోగానికి నిలువెత్తు నిదర్శనమని మేమంతా భావిస్తున్నాం..
     ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నందుకు, అధికార పార్టీతో విభేదించి బయటకు వచ్చినందుకు వైయస్ జగన్మోహనరెడ్డిగారిని 200 రోజులకు పైగా అక్రమంగా నిర్బంధంలో ఉంచటాన్ని మేమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కక్ష సాధింపులు ఆపాలని, ప్రభుత్వ వ్యవస్థల ఔన్నత్యాన్ని పెంచాలని కోరుతున్నాం.


మీరూ చేయికలపండి!
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిగారి అక్రమ అరెస్టును నిరసిస్తూ 'జగన్ కోసం... జనం సంతకం' పేరిట ప్రారంభించిన కోటి సంతకాల సేకరణలో మీరూ పాలుపంచుకోండి. ఇందుకోసం ఈ కింద ఇచ్చిన ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, సంతకాలు చేసిన తర్వాత ఫార్మ్‌లో తెలిపిన పార్టీ కేంద్ర కార్యాలయం చిరునామాకు పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించగలరు.

ప్రజలే బుద్ది చెబుతారు: వైఎస్ వివేకా

వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలులో ఉండటం కుటుంబాన్ని కలచివేస్తోందని వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. ఇడుపులపాయలో జరిగిన క్రిస్మస్ వేడుకల సందర్బంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ వివేకానంద ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్,టీడీపీలు కుమ్మక్కై వైఎస్ జగన్ బెయిల్‌ను అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని వైఎస్ వివేకా అన్నారు. 

వైఎస్ రాజశేఖరరెడ్డి మాజీ పీఎస్ కిరణ్ ఆరోగ్యం విషమం

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాజీ వ్యక్తిగత కార్యదర్శి పీ ఆర్ కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సోమవారం కిరణ్ కుమార్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్సనందిస్తున్నారు. కొద్ది నెలలుగా కిరణ్ కుమార్ రెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా సేవలందిస్తున్న ఆయన వైఎస్ ప్రభుత్వ హయంలో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పలువురు జర్నలిస్ట్ లకు ఆయన సహాయం అందించారు.

Monday 24 December 2012

జగన్ అరెస్ట్‌పై సీబీఐ వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు

వాన్‌పిక్ కేసులో మాత్రమే జగన్‌ను అరెస్ట్ చేశారనటం సరికాదు
ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అన్ని అంశాల్లో అరెస్ట్ చేశారు
రిమాండ్ రిపోర్ట్‌ను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది 
సాంకేతిక కారణాలతో చట్టబద్ధ బెయిల్ పిటిషన్ కొట్టివేత 
సాధారణ బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
జగన్‌మోహన్‌రెడ్డి వాదనను సమర్థించిన జస్టిస్ శేషశయనారెడ్డి 
సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద జగన్ జ్యుడీషియల్ కస్టడీలో లేరు
అందుకే ఆయనకు ఆ సెక్షన్ కింద బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదు

సాక్షి, హైదరాబాద్: కడప పార్లమెంట్ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అరెస్ట్ విషయంలో సీబీఐ చేస్తున్న వాదనల్లో పసలేదని హైకోర్టు తేల్చింది. జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేసింది కేవలం వాన్‌పిక్ కేసులో మాత్రమేనంటూ సీబీఐ గత కొద్ది రోజులుగా చేస్తున్న వాదనను హైకోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఆ వాదనల్లో అర్థం లేదని స్పష్టం చేసింది. జగన్‌ను కేవలం వాన్‌పిక్‌లో మాత్రమే కాదని, ఆయనను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అన్ని అంశాల్లో అరెస్ట్ చేసిందని హైకోర్టు తేల్చి చెప్పింది. తద్వారా తన అరెస్ట్ విషయంలో జగన్‌మోహన్‌రెడ్డి వాదనను హైకోర్టు సమర్థించినట్లయింది. ఇదే సందర్భంలో జగన్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు సాంకేతిక కారణాలతో కొట్టివేసింది. సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద తనకు చట్టబద్ధ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తోసిపుచ్చుతూ న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి సోమవారం తీర్పు వెలువరించారు. 

సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద తనకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై వాదనలు విని గతవారం తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి.. సోమవారం ఉదయం తన నిర్ణయాన్ని వెలువరించారు. 14.8.12 తరువాత సీబీఐ అధికారులు జగన్ కస్టడీని పొడిగించాలని కోరలేదని, కాబట్టి ఆయన కస్టడీలో లేనట్లేనని, కస్టడీలో లేని వ్యక్తికి బెయిల్ మంజూరు ప్రశ్న తలెత్తదని, అందువల్ల సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద బెయిల్ మంజూరు చేయటం సాధ్యం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. జగన్ బెయిల్ పిటిషన్‌కు సంబంధించి న్యాయమూర్తి ప్రధానంగా రెండు అంశాల గురించి చర్చించారు. 28.5.12న జగన్‌ను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అన్ని అంశాల్లోనా..? లేక వాన్‌పిక్ కేసులో మాత్రమేనా..? అన్న ప్రశ్నతో పాటు జగన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద విచారణార్హమా..? అన్న మరో ప్రశ్న గురించి తన తీర్పులో ప్రముఖంగా చర్చించారు. 

ఇందులో మొదటి ప్రశ్నకు సమాధానం చెప్తూ.. ‘జగన్ తన అరెస్ట్ అక్రమంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించే సమయంలో ఇదే హైకోర్టు సింగిల్ జడ్జి.. జగన్ రిమాండ్ ఎందులో జరిగిందనే విషయంపై పూర్తిస్థాయిలో చర్చించారు. ఇరుపక్షాలు కూడా పూర్తిస్థాయిలో వాదనలు వినిపించాయి. వాదనల అనంతరం జగన్‌ను అన్ని అంశాల్లో రిమాండ్‌కు పంపారని సింగిల్ జడ్జి స్పష్టంగా చెప్పారు. అంతేకాక చట్టం నిర్దేశించిన గడువు లోపు తుది చార్జిషీట్ దాఖలు చేయకుంటే, జగన్ సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద చట్టబద్ధ బెయిల్ పొందవచ్చునని కూడా సింగిల్ జడ్జి తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. 

జగన్‌ను అరెస్ట్ చేసిన మరుసటి రోజు అంటే 28.5.12న సీబీఐ అధికారులు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో రిమాండ్ రిపోర్ట్ దాఖలు చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్ చాలా సమగ్రంగా ఉంది. ఎఫ్‌ఐఆర్ నమోదుకు దోహదం చేసిన అంశాలన్నింటినీ కూడా ఆ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. కానీ సీబీఐ ఈ రిమాండ్ రిపోర్ట్ కేవలం వాన్‌పిక్‌కు మాత్రమే సంబంధించిందని, మిగిలిన అంశాలకు సంబంధించినది కాదని చెప్తోంది. ఈ వాదనలో అర్థం లేదు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాల్లో దర్యాప్తు నిమిత్తం జగన్ పోలీస్ కస్టడీని పొడిగించాలని కోరుతూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. నా ఉద్దేశం ప్రకారం జగన్‌ను 27.5.12న అరెస్ట్ చేసింది కేవలం వాన్‌పిక్ కేసులో మాత్రమే కాదు.. మిగిలిన అన్ని అంశాల్లో కూడా’ అంటూ మొదటి ప్రశ్నకు సమాధానమిచ్చారు.

ఇక రెండో ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘సీఆర్‌పీసీ సెక్షన్ 167(1) మరియు (2)లను క్షుణ్ణంగా పరిశీలిస్తే, నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దర్యాప్తు నిమిత్తం పోలీసుల అదుపులో ఉండాలి. సెక్షన్ 167(2) ఇందుకోసమే ఉద్దేశించింది. అయితే ఇందుకు చట్టం ఓ నిర్దిష్ట గడువును నిర్దేశించింది. ఆ గడువు పూర్తయిన తరువాత కూడా ఆ వ్యక్తిని కస్టడీలో ఉంచుకోవటం చట్టవిరుద్ధం. కాబట్టి నిర్దిష్ట గడువు తరువాత ఆ వ్యక్తి బెయిల్ పొందేందుకు అర్హుడవుతాడు. 167(2) కింద బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే, ఆ వ్యక్తి తప్పనిసరిగా జ్యుడీషియల్ కస్టడీలో ఉండి తీరాలి. 


ఇక ప్రస్తుత కేసు విషయానికొస్తే, 27.5.12న అరెస్టయిన జగన్‌కు కోర్టు 28న జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఎప్పటికప్పుడు దానిని సీబీఐ కోర్టు పొడిగిస్తూ వచ్చింది. 14.8.12 తరువాత అంటే సీబీఐ మొదటి చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత ఆ కస్టడీని సీబీఐ కోర్టు సీఆర్‌పీసీ సెక్షన్ 309 కింద మార్చింది (సీబీఐ కూడా జగన్ కస్టడీని పొడిగించాలని కోరలేదు). ఫార్మా కంపెనీలకు లబ్ధి వ్యవహారంలో 26.8.12 వరకు తాను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నానన్నది జగన్ అభిప్రాయం. అయితే నా ముందున్న రికార్డులను పరిశీలిస్తే వాస్తవం మరోలా ఉంది. 14.8.12 నాటికి జగన్ కస్టడీని సీఆర్‌పీసీ సెక్షన్ 309 కింద మార్చటం జరిగింది. కాబట్టి రికార్డులోని అంశాలు జగన్ అభిప్రాయానికి భిన్నంగా ఉన్నాయి. వాస్తవానికి జగన్ 167(2) కింద జ్యుడీషియల్ కస్టడీలో ఉండి ఉంటే.. అతను బెయిల్ పొందేందుకు అర్హుడై ఉండేవారు. అయితే 14.8.12 నుంచి ఇప్పటి వరకు జగన్ కస్టడీని కోర్టు సెక్షన్ 309 కింద మార్చింది. 167(2) కింద జగన్ జుడీషియల్ కస్టడీలో లేనప్పుడు.. అదే సెక్షన్ కింద అతనికి చట్టబద్ధ బెయిల్ మంజూరు చేసే అంశమే ఉత్పన్నం కాదు. కాబట్టి 167(2) జగన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ విచారణార్హం కాదు’ అని జస్టిస్ శేషశయనారెడ్డి పేర్కొన్నారు. 

ఇక సుప్రీంకోర్టులో జగన్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నప్పుడు.. సుప్రీంకోర్టు 167(2) కింద బెయిల్ మంజూరు చేసే విషయాన్ని పరిగణనలోకి తీసుకుందా..? లేదా..? అన్న విషయాన్ని ప్రస్తుతం పరిశీలించాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అంతేకాక 167(2) కింద దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లోని వాస్తవాల ఆధారంగా ఈ కోర్టు తన అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు భావించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

సాధారణ బెయిల్‌పై 26న విచారణ...

ఇదిలావుంటే.. వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి తుది చార్జిషీట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పినా, సీబీఐ దర్యాప్తు పూర్తి చేయలేదని, అందువల్ల తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి విచారించారు. ఇరుపక్షాల వాదనల నిమిత్తం విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

మొదటి జాబితాల్లోని వారికే పోస్టు: వైఎస్సార్ టీఎఫ్

రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో భాగంగా టీచర్ల ఎంపిక జాబితాల్లో మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ కన్వీనర్ ఓబుళపతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తొలి ఎంపిక జాబితా ప్రకటించి, మళ్లీ మార్చినందున, ఆ జాబితాలో ఉన్న వారికి సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి, పోస్టింగ్‌లు ఇవ్వాలని 
విజ్ఞప్తి చేశారు. 

శంకరరావు లేఖలు - నాడు,నేడు!

ఒకప్పుడు మాజీ మంత్రి శంకరరావు  ఉత్తరం రాస్తే హైకోర్టే స్పందించింది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై విచారణ చేయాలని ఆయన లేఖ రాస్తే అప్పట్లో హైకోర్టు వెంటనే స్పందించింది. చకచకా విచారణ జరిపి సిబిఐ దర్యాప్తు జరపాలని ఆధేశాలు ఇచ్చింది. ఎమ్.ఆర్.కేసులో శంకరరావు కోరితే అదే హైకోర్టు విచారణకు ఆదేశించింది.మరి ఇప్పుడు ఏమైందో కాని ఆయన కు పరిస్థితి ఎదురు తిరిగింది.ఆయన మంత్రి పదవి పోయింది. ఇప్పుడు ఆయన లేఖలను కూడా హైకోర్టు పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించి ఆరోపణలు చేస్తే అదే హైకోర్టు శంకరరావును మందలించింది.ఈ పిటిషన్ ను వెనక్కి తీసుకోకపోతే జరిమానా విధిస్తామని హైకోర్టు హెచ్చరించింది.శంకరరావు కొన్ని లేఖలు రాసిన ఫలితంగా మంత్రి పదవిలో ఉన్నవారు. ఎమ్.పి గా ఉన్నవారు, ఐఎఎస్ అధికారులు జైలుకు వెళ్లవలసి వచ్చింది. ఇప్పుడేమో శంకరరావు జరిమానాకు గురి అయ్యే పరిస్థితి వచ్చింది. 

http://kommineni.info/articles/dailyarticles/content_20121224_14.php

బొత్స నోరు అదుపులో పెట్టుకో: నిర్మల

ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై పీసీసీ చీఫ్ బొత్స చేసిన వాఖ్యలపై వైఎస్ఆర్ సీపీ మహిళా విభాగం నేతలు మండిపడ్డారు. బొత్స నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి హెచ్చరించారు. బొత్స వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఈ సాయంత్రం వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో బొత్స దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమం చేపట్టనున్నట్టు మహిళా విభాగం వెల్లడించింది. 

sakshi

ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు: విజయమ్మ

రాష్ట్ర ప్రజలకు, ప్రవాసాంధ్రులకు వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతియుత సహ జీవనమే క్రిస్మస్‌ మనకు ఇచ్చే దివ్య సందేశం అని వైఎస్ విజయమ్మ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు అత్యంత దారుణం

 మహిళలపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు అత్యంత దారుణం అని వైఎస్ఆర్ సీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ వంగపండు ఉష అన్నారు. బొత్స భార్య ఓ ఎంపీ..అర్ధరాత్రి పార్టీ కార్యక్రమాల కోసం ఆమె తిరగడం లేదా అని ఉష ప్రశ్నించారు. బొత్స తన మనసులోని ఉద్దేశాన్నే బయటపెట్టారని ఆమె అన్నారు. 

Sunday 23 December 2012

Court rejects Jagan Mohan Reddy's bail plea

జగన్ కు స్టాట్యుటరీ బెయిల్ నిరాకరణ

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టాట్యుటరీ బెయిల్ ను హైకోర్టు తోసిపుచ్చింది. స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ కు విచారణార్హత లేదంటూ బెయిల్ పిటిషన్ ను జస్టిస్ శేషశయనారెడ్డి తిరస్కరించారు. కాగా కేసు మెరిట్స్ జోలికి పోవటం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో ఈరోజు మధ్యాహ్నం జగన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.

Signatures takeup for YS Jagan at Kuwait

మొదలైన ‘కోటి సంతకాల సేకరణ’


 జగన్ కేసులో సీబీఐ కక్ష సాధింపు ధోరణికి వ్యతిరేకంగా రాష్ట్రపతికి కోటి సంతకాలతో వినతిపత్రం ఇవ్వాలన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ‘కోటి సంతకాల సేకరణ’ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మొదలైంది. విశాఖపట్నం ఎంవీపీ కాలనీ రైతుబజార్‌లో పెద్దసంఖ్యలో వినతిపత్రంపై సంతకాలు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ఐటీ విభాగం కన్వీనర్ మధు సంపత్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు. సీబీఐ కక్షపూరిత ధోరణిని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా మండపేటలో దివంగత వైఎస్ విగ్రహం వద్ద జిల్లా పార్టీ కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి చేపట్టిన సంతకాల సేకరణలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. జగన్‌ను విడుదల చేయూలంటూ విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడు గౌతంరెడ్డి ఆధ్వర్యంలో సంతకాలు చేశారు. మరోవైపు దుబాయ్ లోనూ ప్రవాసాంధ్రులు జగన్ కోసం సంతకాలు సేకరిస్తున్నారు.

జగన్ కోసం... జనం సంతకం


తేదీ: 22 డిసెంబర్ 2012
మాన్యశ్రీ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి...

ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చేసుకుంటున్న విజ్ఞప్తి...

జగన్ కోసం... జనం సంతకం
     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, లోక్‌సభ సభ్యులు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిగారి మీద రాజకీయపరంగా బనాయించిన కేసును తీవ్రంగా గర్హిస్తున్నాం. నిజాలను నిర్థారించాల్సిన సీబీఐ సంస్థ- జగన్మోహనరెడ్డిని దోషిగా చిత్రీకరించటానికి అహర్నిశలు చేస్తున్న ప్రయత్నాలను, అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా భావిస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్ళకు లొంగి, పక్షపాతంతో సీబీఐ చేస్తున్న దర్యాప్తు భారతదేశంలో అధికార వ్యవస్థల దుర్వినియోగానికి నిలువెత్తు నిదర్శనమని మేమంతా భావిస్తున్నాం..
     ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నందుకు, అధికార పార్టీతో విభేదించి బయటకు వచ్చినందుకు వైయస్ జగన్మోహనరెడ్డిగారిని 200 రోజులకు పైగా అక్రమంగా నిర్బంధంలో ఉంచటాన్ని మేమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కక్ష సాధింపులు ఆపాలని, ప్రభుత్వ వ్యవస్థల ఔన్నత్యాన్ని పెంచాలని కోరుతున్నాం.


మీరూ చేయికలపండి!
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిగారి అక్రమ అరెస్టును నిరసిస్తూ 'జగన్ కోసం... జనం సంతకం' పేరిట ప్రారంభించిన కోటి సంతకాల సేకరణలో మీరూ పాలుపంచుకోండి. ఇందుకోసం ఈ కింద ఇచ్చిన ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, సంతకాలు చేసిన తర్వాత ఫార్మ్‌లో తెలిపిన పార్టీ కేంద్ర కార్యాలయం చిరునామాకు పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించగలరు.



http://www.ysrcongress.com/home/koti_santhakaalu.html

Shobha Nagi Reddy Press Meet

'Janam Santakam' campaign by YSRCP followers in Guntur

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!