దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాజీ వ్యక్తిగత కార్యదర్శి పీ ఆర్ కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సోమవారం కిరణ్ కుమార్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్సనందిస్తున్నారు. కొద్ది నెలలుగా కిరణ్ కుమార్ రెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా సేవలందిస్తున్న ఆయన వైఎస్ ప్రభుత్వ హయంలో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పలువురు జర్నలిస్ట్ లకు ఆయన సహాయం అందించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment