YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 15 December 2012

అజ్ఞాతంలో టీడీపీ ఎమ్మెల్యే

భూ కబ్జా, చీటింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న టీడీపీకి చెందిన ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే ఆమె అనుచరులు దుర్గారాజ్, ముజాహిద్‌ఖాన్‌లను అరెస్టు చేసిన పోలీసులు ఎమ్మెల్యే కోసం గాలిస్తున్నారు. ఆమె అరెస్టుకోసం కేపీహెచ్‌బీకాలనీ పోలీసులు ప్రత్యేక పోలీసు బృందాన్ని సైతం రంగంలోకి దింపారు. ఈ బృందం మూడు రోజులనుంచి ఆదిలాబాద్‌లో మకాం వేసినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. అలాగే ఆమె బంధువు ముండె వెంకట్‌రాథోడ్, అనుచరుడు డోంగ్రీ గణేష్, నకిలీ భూ యజమానికోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. కేపీహెచ్‌బీ కాలనీలోని 400 గజాల స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవడమేగాక దానిని ఇతరులకు విక్రయించి రూ.1.80 కోట్ల మేరకు సొమ్ము చేసుకున్నట్టు ఎమ్మెల్యే, ఆమె బంధువులు, అనుచరులపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

sakshi

నేడు, రేపు తంబళ్లపల్లె-నిర్మల్‌లలో విజయమ్మ పర్యటన

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆది, సోమవారాల్లో చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లలో పర్యటించనున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో ఆమె పాల్గొంటారని పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ తెలిపారు. టీడీపీ నుంచి వైదొలగిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే ఎ.వి.ప్రవీణ్‌కుమార్ రెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్న సందర్భంగా ఆదివారం బి.కొత్తకోట మండల కేంద్రంలో ఏర్పాటు చేసే బహిరంగ సభ కు విజయమ్మ హాజరవుతారని అన్నారు. విజయమ్మ ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బి.కొత్తకోట మండల కేంద్రానికి వెళతారు. అక్కడ జిల్లా పరిషత్ హైస్కూలు మైదానంలో మధ్యాహ్నం 1.30కి జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మళ్లీ ఆమె రోడ్డు మార్గంలో బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి విమానంలో అదే రోజు రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నానికి నిర్మల్ చేరుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి భారీ ఎత్తున తన అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా మధ్యాహ్నం 1.30 గంటలకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె పాల్గొంటారు. ఇంద్రకరణ్ సభ ముగిసిన తరువాత అదే రోజు అక్కడి నుంచి బయలుదేరి రాత్రికి హైదరాబాద్‌కు చేరుకుంటారని రఘురామ్ వివరించారు.

sakshi

షర్మిల కాలికి గాయం.. యాత్రకు బ్రేక్

పట్టించుకోకుండా శనివారం మధ్యాహ్నం నుంచే యాత్రకు సిద్ధమైన షర్మిల
2 రోజులైనా యాత్ర ఆపాలని సూచించిన విజయమ్మ, వైవీ సుబ్బారెడ్డి
నేడు కూడా యాత్రకు విరామం

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: రంగారెడ్డి జిల్లాలో ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేస్తున్న షర్మిల కాలికి బలమైన గాయం కావడంతో ఆమె యాత్ర శని, ఆదివారాలు వాయిదా పడింది. షర్మిలకు శనివారం వైద్యులు పరీక్షలు నిర్వహించారు. కుడికాలు చిప్పకు బలంగా గాయం కావడంతో నొప్పి తీవ్రంగా ఉందని, కనీసం రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్ ఆనంద్, డాక్టర్ హరికృష్ణ చెప్పారు. అయితే అన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవడానికి షర్మిల అంగీకరించలేదు. శనివారం మధ్యాహ్నం నుంచే పాదయాత్ర కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. అక్కడికి చేరుకున్న షర్మిల తల్లి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి.. ఆమెను వారించారు. కనీసం రెండు రోజులైనా విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో షర్మిల అంగీకరించారు. దీంతో ఆదివారం కూడా పాదయాత్ర కొనసాగదని ప్రోగ్రాం కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి ప్రకటించారు. కాగా గాయపడిన షర్మిలను పరామర్శించేందుకు వచ్చిన మేడ్చల్ కార్యకర్తలనుద్దేశించి విజయమ్మ ప్రసంగించారు. జగన్, షర్మిలకు వారి ఆశీస్సులు కావాలని కోరారు. 


నొప్పిని భరిస్తూ 4 కిలోమీటర్లు..

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా శుక్రవారం బీఎన్‌రెడ్డి నగర్‌లో షర్మిల ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బస్సుపై ఏర్పాటు చేసిన వేదిక మీది నుంచి షర్మిల ప్రసంగించారు. అనంతరం వేదిక దిగుతుండగా ఎడమ కాలు జారి ముందుకు తూలిపడబోతూ.. షర్మిల తనను తాను నిలువరించుకున్నారు. ఈ ప్రయత్నంలో కుడి మోకాలు చిప్పకు మెట్లు బలంగా గుద్దుకున్నాయి. తీవ్ర నొప్పితో ఆమె విలవిల్లాడిపోయారు. కొద్ది నిమిషాల పాటు ఆమె అక్కడే కూర్చుండిపోయారు. డాక్టర్ హరికృష్ణ ఆమెకు ప్రథమ చికిత్స చేశారు. కాలు నొప్పిని లెక్క చేయకుండా ఆమె బీఎన్‌రెడ్డి నగర్ నుంచి ఇంజాపూర్ వరకు 4 కి.మీ. నడిచి అక్కడ బస చేశారు. ఉదయానికి నొప్పి మరింత తీవ్రమవడంతో వైద్యులు పరీక్షించి యాత్ర కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని సూచించారు.

sakshi

రాష్ట్రానికి ఏం చేశారు?


జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రానికి పనికి వచ్చే ఒక్క భారీ ప్రాజెక్టునూ సాధించుకోలేకపోయారని, ఆయన అవినీతిపై విచారణలు రాకుండా తప్పించుకునేందుకే అధికారాన్నంతా ఉపయోగించారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన సీజీసీ సభ్యుడు మూలింటి మారెప్పతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తొమ్మిదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న బాబు... తానేదో నీతిమంతుడినని, తన పాలన అద్భుతమని గంటలు గంటలు డబ్బా వాయించుకుంటుకుంటున్నారని విమర్శించారు. 

గుజ్రాల్, దేవెగౌడ, వాజ్‌పేయి ప్రభుత్వాలను నిలబెట్టిన చంద్రబాబు రాష్ట్రానికి బీహెచ్‌ఈఎల్ వంటి ఒక్క ప్రాజెక్టును ఎందుకు తీసుకు రాలేకపోయారని ప్రశ్నించారు. కేంద్రంలో టీడీపీకి మంత్రిపదవులు తీసుకోకుండా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి తనపై కేసులు, విచారణలు రాకుండా బాబు తప్పించుకున్నారని దుయ్యబట్టారు. ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన రాజకీయవేత్తగా చంద్రబాబును తెహల్కా డాట్‌కామ్ సంస్థ వెల్లడించిందని శ్రీకాంత్‌రెడ్డి గుర్తుచేశారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని చంద్రబాబు స్వీయ ప్రయోజనాలకు వినియోగించుకున్నారని తప్పు పట్టారు. నిన్నటికి నిన్న చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల అంశంపై కూడా టీడీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులను గైర్హాజరయ్యేలా చేసి బాబు తన వ్యాపార ప్రయోజనాలను కాపాడుకున్నారని దుయ్యబట్టారు. బాబు ఎంతో కాలం ఇలా తప్పించుకోలేరని... ఆయన పాపం పండే రోజు వస్తుందని హెచ్చరించారు. లారీలో ఎన్ని నోట్లకట్టలు పడతాయి, ఎలా తీసుకెళ్లవచ్చు అని కథలు చెబుతున్న బాబుకు నోట్ల కట్టలు లారీల్లో పేర్చడంలో బాగా అనుభవం ఉన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. మాయావతి, ములాయంసింగ్‌లను సీబీఐ ఆయుధంగా కేంద్రం బెదిరిస్తోందనేది స్పష్టమవుతోందని... వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని కూడా అలాగే చేయాలని చూసినా ఆయన బెదరలేదని చెప్పారు. 

sakshi

పార్టీ ప్రణాళికపై విస్తృత ప్రచారం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద, బడుగు, బలహీన వర్గాలకు అందించే సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా జనంలో తిరుగుతూ ప్రచారం చేయాలని పార్టీఅనుబంధ విభాగ ప్రచార కమిటీ నిర్ణయించింది. వైఎస్సార్ సీపీపై ఇతర పార్టీలు చేస్తున్న దుష్ర్పచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని నిర్ణయం తీసుకుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ప్రచార కమిటీ సమన్వయకర్త టి.ఎస్.విజయచందర్ నేతృత్వంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ ప్లీనరీలో అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లాలని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కుమ్మక్కై ప్రజా సమస్యలను గాలికొదిలేసిన వైనంపై ప్రజల్లో చర్చ తీసుకురావాలని నిర్ణయించారు. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన పలు అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో కేంద్రపాలక మండలి సభ్యులు ఎంవీ మైసూరారెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర కన్వీనర్ గట్టు రామచంద్రరావు, సీఈసీ సభ్యులు కె.శివకుమార్, రాష్ట్ర ప్రచార కమిటీ అసిస్టెంట్ కోఆర్డినేటర్ జొన్నల శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొని సలహాలు, సూచనలు అందజేశారు.

sakshi

షర్మిలకు వైఎస్ భారతి పరామర్శ!

బలమైన కాలి గాయంతో భాదపడుతున్న షర్మిలను వైఎస్ భారతి పరామర్మించారు. రంగారెడ్డి జిల్లాలో ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేస్తున్న షర్మిల కాలికి బలమైన గాయం కావడంతో ఆమె యాత్ర శని, ఆదివారాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. షర్మిలకు శనివారం వైద్యులు పరీక్షలు నిర్వహించారు. కుడికాలు చిప్పకు బలంగా గాయం కావడంతో నొప్పి తీవ్రంగా ఉందని, కనీసం రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్ ఆనంద్, డాక్టర్ హరికృష్ణ చెప్పారు. అయితే అన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవడానికి షర్మిల అంగీకరించలేదు. శనివారం మధ్యాహ్నం నుంచే పాదయాత్ర కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. అయితే షర్మిల తల్లి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి.. ఆమెను వారించారు.

వైఎస్ఆర్‌సిపిలో చేరిన సుదర్శన్

వైఎస్ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో విజయనగరం జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ సుదర్శన్ ఆ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ విజయనగరం జిల్లా కన్వీనర్ పెన్మత్స సాంబశివరాజు, బొబ్బలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ పథకాలకు తూట్లూ పొడుస్తూ ప్రజాసమస్యలను విస్మరిస్తుందన్నారు. రాజన్నరాజ్యం మళ్లీ వైఎస్ జగన్‌తోనే సాధ్యమని వైఎస్ఆర్‌సీపీలో చేరాన్నారు.

రేపు కూడా షర్మిల యాత్రకు విరామం

వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు రేపు విరామం ప్రకటించారు. మోకాలి గాయం కారణంగా రేపు కూడా షర్మిల పాదయాత్రకు దూరంగా ఉండనున్నారు. వైద్యుల సూచన మేరకు షర్మిల విశ్రాంతి తీసుకుంటున్నారని మరో ప్రజాప్రస్థానం సమన్వయ కమిటీ సభ్యుడు తలశిల రఘురాం తెలపారు.

‘బకాయిలు చెల్లించకపోతే నిరాహారదీక్ష’

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవూరు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన రూ.11 కోట్ల బకాయిలను డిసెంబర్ 23వ తేదీలోపు రైతులు, కార్మికులకు ప్రభుత్వం చెల్లికపోతే 24న ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి దాదాపు సంవత్సరకాలంగా బకాయిలు చెల్లించకుండా రైతులు, కార్మికులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ప్రసన్నకుమార్‌రెడ్డి వివరించారు.

Srikanth Reddy Press Meet at YSRCP Office on 15th Dec

'కాంగ్రెస్ కు సీబీఐ రాజకీయాస్త్రం'


ప్రత్యర్థులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం సీబీఐని రాజకీయాస్త్రంగా వాడుకుంటోందని నెల్లూరు వైఎస్ఆర్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మండిపడ్డారు. జగన్‌ని రాజకీయంగా ఎదుర్కోలేకే కుట్రలు పన్ని జైలుకు పంపారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ ఎన్ని కుట్రలు చేసినా జగన్‌ త్వరలో బయటకు వస్తారని మేకపాటి ధీమా వ్యక్తం చేశారు.

సహకార సంఘాల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్‌ దురాగతాలకు పాల్పడుతోందని మేకపాటి ఆరోపించారు. ఎన్నికలు నిర్వహిస్తే ఘోర ఓటమి తప్పదని తెలిసే కాంగ్రెస్‌ ఇలా చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికలు ఎప్పుడూ నిర్వహించినా వైఎస్సార్‌ సీపీదే విజయమని మేకపాటి స్పష్టం చేశారు.

షర్మిలకు విశ్రాంతి అవసరం: వైద్యులు

పాదయాత్రలో వాహనం ఎక్కుతూ గాయపడ్డ షర్మిలకు వైద్యులు శనివారం పరీక్షలు నిర్వహించారు. షర్మిలకు లింగమెంట్ గాయం అయ్యిందని....విశ్రాంతి అవసరమని వైద్యులు ఆనంద్ తెలిపారు. ఎక్స్ రేలో కాలికి ఎలాంటి ఫ్రాక్చర్ కాలేదని ఆయన వెల్లడించారు. కాగా రేపటి పాదయాత్ర కొనసాగింపుపై సాయంత్రం నిర్ణయిస్తామని చెప్పారు.

నేడు షర్మిల పాదయాత్రకు విరామం

రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు రద్దు అయినట్లు సమన్వయ కమిటీ సభ్యులు తలశిల రఘురాం, కేకే మహేందర్ రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో షర్మిల కాలు బెణికింది. నొప్పితో బాధపడుతుండటంతో వైద్య పరీక్షల అనంతరం వైద్యుల సూచన మేరకు షర్మిల పాదయాత్రకు విరామం ఇచ్చారు.

Friday, 14 December 2012

To day

మరో ప్రజాప్రస్థానానికి జనహోరు.. మహిళల ఘనస్వాగతం

* నాన్న రంగారెడ్డిని సొంత జిల్లాగా భావించేవారు: షర్మిల
* మరో ప్రజాప్రస్థానానికి జనహోరు.. మహిళల ఘనస్వాగతం
* జిల్లాలో ఉత్సాహంగా సాగిన నాలుగోరోజు పాదయాత్ర
* వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం 

రంగారెడ్డి జిల్లా, న్యూస్‌లైన్ ప్రతినిధి: జనహృదయ నేత డాక్టర్ వైఎస్సార్ కుమార్తె షర్మిలకు జిల్లాలో మహిళలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఆమె చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర జిల్లాలో నాలుగోరోజు ఉత్సాహంగా సాగింది. ‘మా నాన్న జిల్లాను సొంత జిల్లాగా భావించేవారని షర్మిల పలుమార్లు ప్రస్తావించినపుడు ప్రజల నుంచి అనూహ్య స్పందన కనిపించింది. యాత్ర పొడవునా జై జగన్.. జోహార్ వైఎస్సార్ నినాదాలతో శివారు గ్రామాలు మార్మోగాయి.

వివిధ రాజకీయ పార్టీల నాయకులు, శ్రేణులు పెద్దసంఖ్యలో పార్టీ తీర్థ పుచ్చుకునేందుకు మహా పాదయాత్ర మార్గం సుగమం చేసింది. శుక్రవారం నగర శివారులోని నాదర్‌గుల్ నుంచి మొదలైన యాత్ర.. బడంగ్‌పేట్,అల్మాస్ గూడా మీదుగా ఇంజాపూర్ వరకు సాగింది. పాదయాత్ర అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. కరెంట్ బిల్లుల మోత, వ్యవసాయానికి అరకొర విద్యుత్ సరఫరా, పింఛన్లలో కోత తదితర సమస్యలను ప్రజలు షర్మిల ముందు ఏకరువు పెట్టారు.

శుక్రవారం ఉదయం 10.30 గంటలకు నాదర్‌గుల్ గ్రామంలో మొదలైన మరో ప్రజాప్రస్థానానికి మహిళలు, యువకులు, విద్యార్థులు, వద్ధులు ఇలా అన్నివర్గాల ప్రజలు పెద్దసంఖ్యలో పోటెత్తారు. వైఎస్సార్ ఆశయ సాధనకోసం చేపట్టిన పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. నాదర్‌గుల్, వీకర్ సెక్షన్‌కాలనీ, ఎంవీఎస్సార్ కాలేజి, బడంగ్‌పేట్, అల్మాస్‌గూడ, ప్రశాంతిహిల్స్, బీడీరెడ్డి గార్డెన్స్ మీదుగా బీఎన్‌రెడ్డినగర్ బహిరంగ సభ వేదిక వద్దకు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగింది. అక్కడ బహిరంగ సభ అనంతరం ఇంజాపూర్ గ్రామం వరకు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగింది. 

పింఛన్లు అందడం లేదవ్మూ..
కాగా నాదర్‌గుల్ గ్రామంలో నిర్వహించిన రచ్చబండలో వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పింఛన్లు అందడం లేదని పలువురు మహిళలు షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయానికి నాలుగు గంటలకు మించి కరెంట్ సరఫరా జరగడం లేదని తమ గోడు వినిపించారు. వైఎస్సార్ మరణం తర్వాత సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలిచ్చిందని షర్మిల ధ్వజమెత్తినపుడు ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది. చప్పట్లు కొడుతూ..జై వైఎస్సార్, జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. బడంగ్‌పేట్ గ్రామంలోనూ స్థానికుల నుంచి ఘనస్వాగతం లభించింది. షర్మిలను చూసేందుకు వ్యవసాయ కూలీలు, నిర్మాణరంగ కార్మికులు పనులు వదిలిపెట్టుకొని యాత్రవద్దకు పరుగులు తీసి.. ఆమెతోపాటు కదంతొక్కారు. టెక్నియా పాఠశాల విద్యార్థులు తరగతుల నుంచి బయటకి వచ్చి ఆత్మీయ అతిథి పాదయాత్రను ఆసక్తిగా తిలకించారు. స్థానిక యువకులు షర్మిల యాత్రపై పూలవర్షం కురిపించారు. అల్మాస్‌గూడ వద్ద పెద్దసంఖ్యలో గుమిగూడిన గ్రామస్తులు రాజన్న బిడ్డకు ఆత్మీయ స్వాగతం పలికారు. 

స్థానిక సాన్వి మేనేజ్‌మెంజ్ కళాశాల విద్యార్థినులు తరగతులు బహిష్కరించి షర్మిల యాత్రకు సంఘీభావం తెలిపారు. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు అందడంలేదని బిందు, తన్వీర్ అనే ఎంబీఏ విద్యార్థినులు తమ సమస్యలను షర్మిలకు తెలిపారు. వై.ఎస్ మరణం తరవాత ప్రస్తుత సర్కారు పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తోందని, జగనన్న ముఖ్యమంత్రి కాగానే విద్యార్థుల కష్టాలు తీరతాయని ఆమె భరోసా ఇచ్చి ముందుకు సాగారు. 

సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో బీడీరెడ్డి గార్డెన్స్ ఎదుట నిర్వహించిన రచ్చబండలో నిత్యావసరాల ధరలు పెరిగాయని పలువురు మహిళలు తమ కష్టాలను షర్మిలకు చెప్పారు. వంటగ్యాస్, కరెంట్ ఛార్జీలు, నీటిబిల్లులు పెరిగాయని, బలహీనవర్గాల కాలనీలకు రహదారులు, మంచినీటి వసతి లేదని వాపోయారు. వారి కష్టాలను సావధానంగా విన్న ఆమె అనంతరం మాట్లాడుతూ.. నగదు బదిలీ, ఆరు సిలిండర్లకే సబ్సిడీ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. 

పోటెత్తిన యువజనం..
షర్మిల యాత్రలో మహిళలతోపాటు, 18-35 ఏళ్ల మధ్య వయస్సున్న విద్యార్థులు, యువకులు, పోటెత్తారు. పాదయాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా తటస్థంగా ఉన్నవారు సైతం షర్మిల యాత్రను తిలకించేందుకు ఆసక్తిచూపడం విశేషం. గహిణులు,కూలీలు దారిపొడవునా ఆమె యాత్రకు సాదర స్వాగతం పలకడం కనిపించింది.

శ్రేణుల్లో కొత్త ఉత్సాహం...
మహేశ్వరం,ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నాయకులు,శ్రేణుల్లో షర్మిల యాత్ర కొత్త ఉత్సాహం నింపింది. వేలాదిమంది ప్రజలు స్వచ్ఛందంగా బీఎన్‌రెడ్డి నగర్ బహిరంగ సభకు తరలిరావడం చర్చనీయాంశమైంది. షర్మిల ప్రసంగిస్తున్న సమయంలో నాడు చంద్రబాబు, నేడు కిరణ్ సర్కారు దొందూ దొందేనన్న విమర్శలు చేసినపుడు ప్రజల నుంచి అనూహ్య స్పందన కనిపించింది. ఆమె ప్రసంగాన్ని అమూలాగ్రం వినేందుకు జనం గంటపాటు ఓపికగా రహదారులపైనే కదలకుండా నిలబడి ఉండడం విశేషం.

వేలాదిగా హాజరైన విద్యార్థులు..
షర్మిల యాత్ర మొదలైన నాదర్‌గుల్ నుంచి ఇంజాపూర్ వరకు మరో ప్రజాప్రస్థానంలో విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు. 

దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో తాము ఉన్నత విద్య చదువగలిగామని,ప్రస్తుత సర్కారు ఈ పథకానికి తూట్లుపొడుస్తుందని ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైతే తమకు మళ్లీ మంచిరోజులు వస్తాయని వారు ఆశాబావం వ్యక్తంచేశారు.

వృద్ధుల్లోనూ ఆసక్తి...
రాజన్న బిడ్డను చూసేందుకు వయస్సును లెక్కచేయకుండా వృద్దులు పెద్ద సంఖ్యలో పాదయాత్రకు అడుగడుగునా సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ హయాంలో పింఛన్లు సమయానికి అందాయని గుర్తుచేసుకున్నారు. పలువురు వికలాంగులు సైతం షర్మిల యాత్ర మార్గంలో ఆమెను కలిసేందుకు పోటీలు పడడం కనిపించింది.

నలువైపులా జన ప్రభంజనమే..
సాయంత్రం బీఎన్‌రెడ్డి నగర్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభకు వేలాదిగా జనం తరలివచ్చారు. ఎల్బీనగర్, ఉప్పల్, హయత్‌నగర్,తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చిన జనంతో వనస్థలిపుర ం రహదారులు కిక్కిరిశాయి. సభాప్రాంగణానికి దారితీసే అన్ని రహదారులూ జనంతో నిండాయి. ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడం కనిపించింది. 

ఆకట్టుకున్న ఆటా.. పాట..
బీఎన్‌రెడ్డినగర్ చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన వేదికపై వంగపండు ఉష నేతృత్వంలోని కళాబృందాలు ప్రదర్శించిన ఆటా.. పాట సభకు విచ్చేసిన వారిలో ఉత్సాహం నింపాయి. వైఎస్సార్ హయాంలో జరిగిన సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను పాటల రూపంలో వినిపించడంతో ప్రజల్లో ఉత్సాహం నిండింది. షర్మిలతోపాటు పాదయాత్రలో పార్టీ నేతలు పుత్తా ప్రతాప్‌రెడ్డి, బి.జనార్ధన్‌రెడ్డి, జెన్నారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, ధన్‌పాల్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి, పల్లపు రాము, అమృతాసాగర్, కొండా రాఘవరెడ్డి, బొక్క జంగారెడ్డి, వంగా మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణపై పార్టీ చిత్తశుద్ధితో ఉంది


నిర్మల్ (ఆదిలాబాద్), న్యూస్‌లైన్: తెలంగాణ విషయంలో వైఎస్సార్ సీపీ చిత్తశుద్ధితో ఉందని పార్టీ సీజీసీ మెంబర్ కేకే మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఈనెల 17న చేరుతుండడంతో నిర్మల్‌లో ఆ కార్యక్రమ ఏర్పాట్ల పరిశీలనకు శుక్రవారం ఆయన ఇక్కడకు వచ్చారు. పార్టీ ప్రో గ్రాం రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ బోడ జనార్దన్ తదితరులతో కలిసి నిర్మల్‌లోని అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఇంట్లో శుక్రవారం మహేందర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణ విషయంలో పార్టీ వైఖరిని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పార్టీ మొదటి ప్లీనరిలోనే స్పష్టం చేశారని చెప్పారు. తెలంగాణ ఇచ్చే శక్తి తమకు లేదని, ఇస్తే అడ్డుకోబోమని, తెలంగాణ ప్రజల మనోభావాలకు పార్టీ కట్టుబడి ఉందన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ రాజ కీయ ఉద్యోగాల కోసం తెలంగాణవాదాన్ని అడ్డుపెట్టుకుంటున్నారని విమర్శించా రు. రాష్ట్రంలో ప్రతిపక్షం, అధికార పక్షం ఏకమయ్యాయని, ప్రజా సమస్యలను పట్టించుకునే వారే లేరని, ప్రజల పక్షాన పోరాడుతోంది వైఎస్సార్ సీపీ ఒక్కటే అన్నారు. అందుకే పార్టీకి ప్రాంతాల కతీతంగా జనాదరణ వస్తోందన్నారు.

బాబు రాకముందే వైఎస్సార్ సీపీలో చేరిన 600 మంది ఓబుళాపూర్ గ్రామస్తులు

కోరుట్ల (కరీంనగర్), న్యూస్‌లైన్: ఊరంతా ఒకేబాట.. ఇంటింటికి ఏదో ఓ రూపంలో లబ్ధి చేకూర్చిన దివంగత వైఎస్సార్‌పై తరగని అభిమానం.. ఆయన బాటలో సాగుతున్న జగనన్నకు అండగా నిలవ డమే వారి లక్ష్యం! సరైన సమయం కోసం ఎదురుచూశారు. చంద్రబాబు పాదయాత్ర కరీం నగర్ జిల్లాలో అడుగుపెడుతున్న రోజునే.. వారంతా ఒక్కటై వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌పై అభిమానాన్ని చాటిన ఆ ఊరు పేరు.. ఓబుళాపూర్. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల సరిహద్దులోని గోదావరి నదిపై నిర్మించిన బాదన్‌కుర్తి వంతెనను ఆనుకుని మల్లాపూర్ మండలంలో ఉన్న పల్లె ఇది. చంద్రబాబు పాదయాత్ర కరీంనగర్ జిల్లాలో మొదటగా చేరేది ఈ ఊరికే. శుక్రవారం రాత్రి ఇక్కడే బాబు బస చేశారు. ఈ గ్రామ జనాభా 1800. రెండు ముదిరాజ్ కులస్తుల సంఘాలతోపాటు, కొమురం భీం యూత్(లంబాడా), పవర్‌స్టార్ యూత్, మహిళా సంఘాల వారు సుమారు 600 మంది ైవె ఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ వాకిటి సత్యంరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీలోకి చేరారు. అనంతరం భారీ ఊరేగింపు నిర్వహించారు. కోరుట్లలో కూడా పెద్ద ఎత్తున యువకులు వైఎస్సార్ పార్టీలో చేరారు.

ఎరువుల ధరలను దించండి

రెండు దశాబ్దాలుగా సాగు లాభసాటిగా లేదు 
ప్రధాని మన్మోహన్‌కు విజయమ్మ లేఖ

హైదరాబాద్, న్యూస్‌లైన్: దేశ ఆహారభద్రతను, రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని.. పెంచిన ఎరువుల ధరలను వెంటనే ఉపసంహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కోరారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వ్యవసాయానికి ప్రధాన అడ్డంకిగా మారిన సమస్యలను కూలంకషంగా వివరిస్తూ విజయమ్మ శుక్రవారం ప్రధానమంత్రికి లేఖ రాశారు. ‘దేశం మొత్తం మీద 60 శాతం మంది ప్రజలు వ్యవసాయ ఆధారిత పనుల మీదే బతుకుతున్నారు. ఆహారభద్రత పరంగానే కాకుండా వ్యవసాయం ఎక్కువ మందికి జీవనోపాధిగా ఉంది. దేశంలో ఆహారధాన్యాల దిగుబడి 1951లో 50 మిలియన్ టన్నులు ఉండగా 2012 నాటికి 250 మిలియన్ టన్నులకు చేరింది. పాల ఉత్పత్తిలో భారతదేశం ఈ రోజు ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. అలాగే ఉద్యానవనంలో ద్వితీయస్థానంలో ఉంది. 

ఇంతటి ఘనచరిత్ర ఉన్న దేశ వ్యవసాయరంగం వృద్ధిరేటు రోజు రోజుకు క్షీణిస్తోంది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘వ్యవసాయం నాలుగు శాతం వృద్ధిరేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 2.5 శాతానికి మించటంలేదు. ఫలితంగా వ్యవసాయం రెండు దశాబ్దాలుగా లాభసాటిగా లేకుండా పోయింది’ అని విచారం వ్యక్తం చేశారు. ‘కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాలన అందుకు మినహాయింపు. ఆయన చేపట్టిన కొన్ని పథకాలతో పాటు.. రైతుల పట్ల సానుకూలంగా వ్యవహరించటం వల్ల 2004-09 మధ్య కాలంలో రాష్ట్రం 6.87 శాతం వ్యవసాయవృద్ధి రేటు సాధించింది. దేశంలో తొలిసారిగా భారీ వృద్ధి సాధించటంతో పాటు సగటు ఎకరా దిగుబడి పెంచటంతో రైతులు అధిక రాబడులు సాధించారు’ అని విజయమ్మ తెలిపారు. పంట అధిక దిగుబడికి నీటిపారుదల తర్వాత ముఖ్యభూమిక పోషించేది ఎరువులేనని విజయమ్మ పేర్కొన్నారు. 

‘ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఎరువుల ధరల భారం రైతులపై పడకుండా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ నాలుగేళ్లుగా ఈ దిశగా ప్రభుత్వాలు ముందడుగు వేయలేదు. ధరల భారం రైతులపైనే పడుతోంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా ఎరువుల ధరలు ఎలా పెరిగిందీ ఆమె ప్రధానికి రాసిన లేఖలో వివరించారు. ‘డీఏపీ ధర 150 శాతం పెరగగా, ఎన్‌పీకే 200 శాతం పెరిగింది. అలాగే ఎంఓపీ కూడా 300 శాతం పెరిగింది. ఇంతకు ముందు గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరిగాయి. అయితే రెండేళ్ల కాలంలో వరి మద్దతు ధర కేవలం 25 శాతం మాత్రమే పెరిగింది. ఎరువుల ధరలు, ఇతర పెట్టుబడులు విత్తనాలు, డీజిల్, కూలీల ధరలు పెరగటంతో రైతులు భరించలేకపోతున్నార’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక పెద్దమనసు చేసుకొని దేశ ఆహారభద్రత దృష్ట్యా ఎరువుల ధరలను తగ్గించాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను విజయమ్మ అభ్యర్థించారు.

జగన్ సారథ్యంలో...జనం మెచ్చే పాలన


కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు పాలనతో ప్రజలు విసుగుచెందారని.. త్వరలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ప్రజలు మెచ్చే రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్, జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్‌లీడర్, గోల్నాక కార్పొరేటర్ కాలేరు వెంకటేష్‌లు పేర్కొన్నారు. వైఎస్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చిందని.. ప్రజా సమస్యలపై పోరాడుతున్న జగన్‌ను కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై జైలుకు పంపారని వారు ధ్వజమెత్తారు. జ్ఞానేశ్వర్, వెంకటేష్‌లు శుక్రవారం చంచల్‌గూడ జైలులో జగన్‌మోహన్‌రెడ్డిని ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు, కిరణ్‌కుమార్ ప్రభుత్వాలను చూసిన ప్రజలు.. ైవె.ఎస్ పాలనను మరువలేకున్నారని, ఆయనపై ప్రజల్లో ఉన్న అభిమానం, ఆదరణ జగన్‌పై ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అహర్నిశలు పోరాడుతున్న జగన్ సీఎం కావాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్న తరుణంలో.. వారి అభిప్రాయం మేరకు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిపారు. ఇతర పార్టీల నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి క్యూ కట్టడం అనివార్యమన్నారు.

బడుగుల భరోసా..జగన్ పైనే


బీసీల అభ్యున్నతి కోసం వైఎస్ అనేక పథకాలు చేపట్టారు
వాటికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది
ఆ పథకాలన్నింటినీ అమలు చేసే సత్తా వైఎస్సార్ కాంగ్రెస్‌కే ఉంది
జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే నమ్మకం బీసీలకుంది
అందుకే వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వస్తున్నాం: బీసీ నేతల మాట

హైదరాబాద్, న్యూస్‌లైన్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు సంపూర్ణంగా అమలు కావాలంటే.. ఆయన కుమారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని ఆయా వర్గాలకు చెందిన నాయకులు బలంగా నమ్ముతున్నారు. బీసీల అభ్యున్నతి కోసం వైఎస్ ప్రవేశపెట్టిన అనేక పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుండగా.. ఆ పథకాలన్నింటినీ కచ్చితంగా అమలు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే హామీ ఇస్తోందని.. జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం ఉన్నందునే పెద్ద ఎత్తున బలహీన వర్గాల నేతలు పార్టీలో చేరుతున్నారని వారు చెప్తున్నారు. మహానేత రాజశేఖరరెడ్డి రూపొందించిన ప్రతి పథకమూ బలహీనవర్గాలను దృష్టిలో ఉంచుకొనే ప్రవేశపెట్టారని పార్టీలో చేరుతున్న వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులు చెప్తున్నారు. ముఖ్యంగా వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాల వల్ల రాష్ట్రంలో బీసీలే ఎక్కువగా లబ్ధిపొందారని వారు స్పష్టంచేస్తున్నారు. ఈ పథకాలనే కాకుండా.. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని పథకాలను చిత్తశుద్ధితో అమలు చేసే సత్తా వైఎస్సార్ కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని ఇటీవలి కాలంలో పార్టీలో చేరిన నేతలు గట్టిగా చెప్తున్నారు. బీసీల అభ్యున్నతి విషయంలో ఇతర పార్టీలపై నమ్మకం లేనందునే.. ఇటీవలి కాలంలో బీసీ నేతలు పెద్దఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వలస వస్తున్నారని పేర్కొంటున్నారు.

వెల్లువెత్తుతున్న బీసీ నేతల మద్దతు: ఇటీవల తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించగా, తాజాగా శుక్రవారం రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్, జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కాలేరు వెంకటేష్‌లు చంచల్‌గూడ జైలులో జగన్‌ను కలిసి మద్దతు తెలపటం ఇందులో భాగమేనని అంటున్నారు. వీరే కాకుండా ఇటీవల వరంగల్ జిల్లాకు చెందిన సి.రమేష్‌బాబు, మూర్తినేని సోమేశ్వరరావు, ఆదిలాబాద్ నుంచి అప్పాల అనురాధ, తుల శ్రీనివాస్, ధర్మాజీ రాజేందర్, అప్పాల గణేష్ చక్రవర్తి, కరీంనగర్ నుంచి కె.స్టాలిన్‌గౌడ్, నల్లగొండ నుంచి రామచందర్‌గౌడ్, అనంతకుమార్‌గౌడ్, చిత్తూరు నుంచి రెడ్డమ్మ, రంగారెడ్డి నుంచి ఇ.సి.శేఖర్‌గౌడ్‌లు వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

బీసీలకు గుర్తింపునిచ్చింది వైఎస్సే...

బీసీలకు సరైన గుర్తింపు ఇచ్చి గౌరవించిన ముఖ్యమంత్రులలో మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అగ్రస్థానంలో ఉంటారు. బడుగులకు ఆయన చేసిన మేలు మరెవరూ చేయలేదు. వైఎస్ అధికారం చేపట్టిన తర్వాత నామినేటెడ్ పోస్టుల నియామకంలో మొట్టమొదటగా ఒక బీసీ వ్యక్తినైన నన్ను మార్కెట్‌యార్డు చైర్మన్‌గా నియమించారు. దీన్నిబట్టే వైఎస్‌కు బీసీల పట్ల ఉన్న గౌరవమేంటో అర్థమవుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మళ్లీ బీసీలు తలెత్తుకోగలుగుతారు.
- తుల శ్రీనివాస్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, బోధ్, ఆదిలాబాద్ జిల్లా

మళ్లీ వైఎస్ సువర్ణయుగం కోసం...

వైఎస్ హయాంలో బీసీలకు లబ్ధి చేకూరినంతగా మరెప్పుడూ జరగలేదు. ఆయన ప్రవేశపెట్టిన ప్రతీ పథకం బడుగులను దృష్టిలో పెట్టుకొనే రూపొందించేవారు. అయితే మహానేత మరణానంతరం బీసీలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మళ్లీ వైఎస్ సువర్ణయుగం కోసం మేమంతా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నాం. శనివారం గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో పార్టీ సభ్యత్వం స్వీకరిస్తున్నా.
- జి.సుదర్శన్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, విజయనగరం

వైఎస్ ఆశయ సాధన కోసం...

‘వరంగల్ మార్కెట్ యార్డు చరిత్రలో చైర్మన్‌గా మొదటి బీసీని నియమించింది వైఎస్సే. ఆయన చలువ వల్లే నేను చైర్మన్ కాగలిగాను. నాలాంటి వారికి రాజకీయంగా తోడ్పాటు అందించి నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఆ మహానేతదే. వైఎస్ మొదటి నుంచి బీసీల పట్ల ప్రేమ కనబరిచేవారు. బీసీల కోసం వైఎస్ తపనపడేవారు... ఆయన ఆశయ సాధన కోసం మేమంతా అండగా ఉంటాం.
- రమేష్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, వరంగల్ 

రోజులు: 57, కిలోమీటర్లు: 824

ఈ ప్రభుత్వం ఫీజులు కడుతుందన్న భరోసా విద్యార్థులకు లేదు
దీంతో చదువుకోవాలన్న ఆశ ఉన్నా.. స్తోమత లేక ఇంట్లోనే ఉంటున్నారు
ప్రభుత్వ వైఖరి చూస్తూ కూడా చంద్రబాబు అవిశ్వాసం పెట్టనంటున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 57, కిలోమీటర్లు: 824

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం విషయంలో విద్యార్థులకు భరోసా లేకుండా పోయిందని, ప్రభుత్వం తమ ఫీజులు కడుతుందో లేదోనన్న భయంతో చాలా మంది చదువులు మానేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ‘‘కొంతకాలం కిందట రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన చ దువుల తల్లి వరలక్ష్మి అనే విద్యార్థిని ఫీజులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంది. మరే విద్యార్థికీ ఇలాంటి దుస్థితి రాకుండా ఫీజుల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ జగనన్న నాడు వారం రోజులు ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేశారు. అయినా ఈ సర్కారుకు కనువిప్పు కలగలేదు. ఈ రోజు కూడా ప్రభుత్వం ఫీజుల పథకానికి తూట్లు పొడుస్తోంది. ఏ ఒక్క విద్యార్థికీ కూడా ఈ ప్రభుత్వం ఫీజులు కడుతుందనే భరోసా లేదు. ఎంతో మందికి చదువుకోవాలనే ఆశ ఉన్నా స్తోమత లేక, ప్రభుత్వం ఫీజులు కడుతుందన్న నమ్మకం లేక ఇంట్లో కూర్చుంటున్నారు’’ అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ప్రజాస్వామ్య విరుద్ధంగా దానితో కుమ్మక్కైన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 57వ రోజు శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో సాగింది. మార్గమధ్యంలో బడంగ్‌పేట్‌కు చెందిన ప్రణతి అనే విద్యార్థిని షర్మిలను కలిసి తాను ఎంబీఏ చదువుతున్నానని, ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడంతో మేనేజ్‌మెంట్ తమపై ఒత్తిడి తెస్తోందని తెలిపింది. డబ్బులు కట్టే స్తోమత లేదని, ఇక చదువు మానేసి ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెకు ధైర్యం చెప్పిన షర్మిల అనంతరం హయత్‌నగర్ మండలం బీఎన్‌రెడ్డి నగర్‌లో ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుకు మనసు రాలేదు..

‘‘రంగారెడ్డి జిల్లాలో నేను మర్చిపోలేని మరో సంఘటన ఉంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన అనురాధ అనే మహిళపై యాసిడ్ దాడి జరిగింది. ఆమె వైద్యం చేయించుకోవడానికి ఏడాది పట్టింది. ఆపరేషన్ తరువాత ఆపరేషన్ అంటూ ఏడాది మొత్తం వైద్యంతోనే నడిచింది. అనురాధకు సహాయం చేసి అండగా నిలబడటానికి చంద్రబాబుకు మనసు రాలేదు. ఆమెకు వైద్యసాయం అందించాలని విద్యార్థులు ధర్నాలు చేసినా చంద్రబాబు చలించలేదు. 

పభుత్వ సహాయం కోసం అనురాధ హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు ఆయనకు మొట్టికాయ వేసి వైద్య ఖర్చుల కింద రూ. 5 లక్షలు చెల్లించాలని, ఆమెకు ఉద్యోగం కల్పించాలని తీర్పు చెప్పింది. ఎవరికైనా ఇలాంటి సమస్య వస్తే ముఖ్యమంత్రి అనేవారు మానవతా దృక్పథంతో స్పందించాలి. చంద్రబాబుకు మానవత్వం అనేదే లేదు’’ అని షర్మిల నిప్పులు చెరిగారు. ‘‘అనురాధకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అనురాధ ఒక్క మాట చెప్పింది.. ‘నాపై యాసిడ్ దాడి కంటే సర్కారు వ్యవహరించిన తీరే నన్ను చాలా బాధపెట్టింది’ అని ఆవేదన వ్యక్తం చేసింది.’’ అని అన్నారు. వైఎస్సార్ సీఎం కాగానే ఆమెకు ఆర్థిక సాయం గా రూ.70లక్షలు, ఉద్యోగం ఇచ్చారని, ప్రస్తుతం ఆమె రీసెర్చ్ సైంటిస్టుగా పనిచేస్తోందని షర్మిల తెలిపారు. ప్రజలను పీడించిన చంద్రబాబు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా విఫలమయ్యారన్నారు. ప్రజలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దించేయాల్సిందిపోయి.. దానితోనే కుమ్మక్కై ప్రజలనే గాలికి వదిలేశారని విమర్శించారు.

పోటెత్తిన జనం..

పాదయాత్ర 57వ రోజు నాదర్‌గుల్ నుంచి నడక ప్రారంభించిన షర్మిల బడంగ్‌పేట్, మీర్‌పేట్ మీదుగా యాత్ర చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీఎన్‌రెడ్డి నగర్‌కు ఆమె వచ్చే సరికి జనం కిక్కిరిసిపోయారు. వారిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు ఇంజాపూరు శివారులో ఏర్పాటు చేసిన బసకు చేరుకున్నారు. శుక్రవారం మొత్తం 16.30 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ఇప్పటి వరకు మొత్తం 824 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. షర్మిల వెంట పాదయాత్రలో నడిచిన నేతల్లో ఎమ్మెల్యేలు కె.శ్రీనివాసులు, శోభానాగిరెడ్డి, బాలరాజ్, రాజేష్, మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వర్‌రావు, రాజ్‌ఠాకూర్, జనక్ ప్రసాద్, బాజిరెడ్డి గోవర్ధన్, పుత్తా ప్రతాప్, బెక్కరి జనార్ధన్‌రెడ్డి, దేప భాస్కర్, దేప సురేఖ, సింగిరెడ్డి ధన్‌పాల్, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, ఆదం విజయ్‌కుమార్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, డాక్టర్ శివభారత్, జిట్టా, రవీంద్ర నాయక్, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ సురేశ్‌రెడ్డి, వంగా మధు తదితరులు పాల్గొన్నారు.

తుర్కయంజాల్ నుంచి నేడు ‘మరో ప్రజా ప్రస్థానం’

ప్రజాసమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం... కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సాగిస్తున్న ‘మరో ప్రజా ప్రస్థానం’ యాత్ర శనివారం హయత్‌నగర్ మండలం తుర్కయంజాల్ నుంచి ప్రారంభం కానుంది. బ్రాహ్మణపల్లి క్రాస్‌రోడ్స్, రాగన్నగూడెం, మన్నెగూడ, బొంగ్లూరు గేట్, మంగల్‌పల్లి గేట్ మీదుగా సాయంత్రానికి శేరిగూడ చేరుకొని అక్కడ ముగుస్తుంది.

సీబీఐ అసలు రంగు బట్టబయలు!

Written by MK On 12/14/2012 7:06:00 PM

http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=54267&Categoryid=28&subcatid=0
సీబీఐ డెరైక్టర్‌గా పనిచేసి రిటయిరయిన మరో ఐయేయెస్ అధికారి యూఎస్ మిశ్రా కేంద్రీయ దర్యాప్తు సంస్థ -సీబీఐ-పై రాజకీయపరమయిన ఒత్తిళ్లు ఉండే మాట వాస్తవమేనని బహిరంగంగా ఒప్పుకున్నారు. గురువారంనాడు -డిసెంబర్ 13న- సీబీఐ కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం గురించి ఓ టెలివిజ్షన్ చానెల్‌లో మాట్లాడుతూ మిశ్రా ఈ విషయం చెప్పారు. మాయావతి ఆస్తుల కేసు దర్యాప్తు సందర్భంగా రాజకీయపరమయిన ఒత్తిడి ఎదుర్కొన్నానని మిశ్రా స్పష్టం చేశారు. వాస్తవానికి సీబీఐపై రాజకీయపరమయిన ఒత్తిడి గురించి మొట్టమొదటిసారి ప్రస్తావించిన ఉన్నతాధికారి మిశ్రా కాదు. మరో రిటైర్డ్ సీబీఐ డెరైక్టర్ జోగీందర్ సింగ్ ఈ విషయాన్ని ఎన్నడో బహిరంగంగా వెల్లడించారు. అంతేకాదు- పాలకుల చేతుల్లో సీబీఐ సామూహిక సంహరణాస్త్రంగా తయారయిందని కూడా గురువారంనాడు అదే టెలివిజ్షన్ చానెల్‌లో మాట్లాడుతూ సింగ్ వ్యాఖ్యానించడం గమనార్హం. 1996-97 సంవత్సరాల్లో లాలూ ప్రసాద్ యాదవ్‌పై నమోదయిన పశువుల దాణా కుంభకోణం కేసు విషయంలో తనపై ఆనాటి పాలకులు ఒత్తిడి తెచ్చారని జోగీందర్ సింగ్ వెల్లడించారు. 1977లో ఇందిరా గాంధీని అరెస్ట్ చేసిన సీబీఐ మాజీ జాయింట్ డెరైక్టర్ ఎన్.కే. సింగ్ కూడా సీబీఐ పనిలో అడుగడుగునా రాజకీయ జోక్యం ఎదురయ్యేదని చెప్పడం విశేషం.

చిత్రమేమిటంటే, కేంద్రం తరఫున నలుగురు మంత్రులు ఈ ఆరోపణలను శుక్రవారం నాడు ఖండించారు. ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాలు చూసే కేంద్రమంత్రి వి.నారాయణ స్వామి, న్యాయ శాఖామాత్యులు అశ్వినీ కుమార్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్ శుక్లా, సమాచార ప్రసార శాఖల మంత్రి మనీష్ తివారీ సీబీఐ మాజీ డెరైక్టర్ల వ్యాఖ్యలను ఖండించారు. కేంద్రం ఒకేసారి ఇంతగా ఉలిక్కిపడి, బుజాలు తడుముకోవడం విడ్డూరంగానే ఉంది. పెపైచ్చు, యూఎస్ మిశ్రా ఆరోపణపై స్పందిస్తూ, ఆయన పదవిలో ఉన్నప్పుడు కేంద్రంలో ఏలుబడి సాగించింది బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీయే కూటమే కనుక వారే ప్రతిస్పందిస్తే బాగుంటుందని కొందరు మంత్రులు పేర్కోవడం మరీ వింతగా ఉంది. ఈ నిందనుఎన్‌డీయే కూటమి నెత్తిన మోపితే తాము బయటపడిపోతామని కేంద్ర మంత్రులు భావించడమే చిత్రంగా ఉంది. ఇక్కడ చర్చ జరుగుతున్నది సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తి గురించి. ఏ కూటమికి చెందినవారయినా, కేంద్ర దర్యాప్తు సంస్థను స్వతంత్రంగా పనిచేసుకోనివ్వడం లేదన్నదే ఇక్కడ పాయింటు. మన మంత్రిపుంగవులకు ఈ విషయం తట్టినట్లు తోచదు.

ఏ మాటకయినా విలువగానీ, విశ్వసనీయతగానీ వచ్చేది ఆ మాట అన్న వ్యక్తి చరిత్రను బట్టి. అందుకే, ఈ వ్యాఖ్యలు చేసిన సీబీఐ మాజీ డెరైక్టర్లు ఎవరో వాళ్ల కథా కమామిషు ఏమిటో ఒక్కసారి చూద్దాం:

జోగీందర్ సింగ్ సీబీఐ డెరైక్టర్‌గా ఉన్నది కేవలం 11 మాసాలకాలమే. అది కూడా పదహారేళ్ల కిందటి మాట. బొఫోర్స్, సెయింట్ కిట్స్, హవాలా కుంభకోణం, జేఎంఎం లంచాల కేసు, లాలూప్రసాద్ పశువుల దాణా కుంభకోణం లాంటి అత్యంత ముఖ్యమయిన కేసుల దర్యాప్తులను ఆయన పర్యవేక్షించారు. ‘పాలకుల చేతిలో అత్యంత ప్రాణాంతకమయిన, అసహ్యకరమయిన ఆయుధం సీబీఐ’ అంటారు జోగీందర్ సింగ్. ‘ఈ విషయాన్ని రుజువు చెయ్యగల సాక్ష్యాధారాలు కోకొల్లలుగా ఉన్నాయి. వాటన్నిటినీ తెచ్చి పార్లమెంట్ భవన్‌లో చేరిస్తే మొత్తం భవనమంతా ఆ పత్రాలతోనే నిండిపోతుం’దన్నారాయన. అయితే, ‘సీబీఐ దర్యాప్తులో రాజకీయుల జోక్యం నేరుగానూ, సూటిగానూ, లిఖితపూర్వకంగానూ ఉండదు. తరచు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ ఉంటారు. తద్వారా దర్యాప్తు కొనసాగకుండా అడ్డుతగుల్తూ ఉంటారు. అది కేసు బలహీనం కావడానికి దారితీస్తుంది. నా దృష్టిలో ఇది కూడా దర్యాప్తులో జోక్యం చేసుకోవడమే!’ అన్నారు జోగీందర్ సింగ్. ‘ఉదాహరణకు లాలూ ప్రసాద్ కేసు విషయంలో ఓ నేత నాతో మాట్లాడుతూ విచారణను నిదానంగా సాగించమన్నారు. సదరు ఆదేశాన్ని లిఖిత పూర్వకంగా ఇస్తే అలాగే చేస్తానన్నాను నేను. అయితే, ఆయన అలా చెయ్యలేదనుకోండి’ అన్నారు జోగీందర్. మచ్చలేని జోగీందర్ వ్యక్తిత్వం కారణంగానే ఆయన్ను ఆ పదవికి ఎంపిక చేశారు. కానీ, కుర్చీలోకూర్చున్న క్షణం నుంచీ ఆయన్ను ఏదో రకంగా కళంకితుణ్ణి చెయ్యాలన్నదే మన పాలకుల పనయిపోయింది. ఆ బాధ భరించలేక, తనకు ఎదురవుతున్న అనాదరణను సహించలేక జోగీందర్ సింగ్ లాంటి నిజాయితీపరుడు చివరకు తప్పుకోవలసి వచ్చింది.

2003 డిసెంబర్‌లో యూఎస్ మిశ్రాను సీబీఐ డెరైక్టర్‌గా నియమించారు అప్పటి ప్రధాని ఏబీ వాజ్‌పేయీ. అయితే, అప్పట్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అందుకు కారణం లేకపోలేదు. అంతకు కొద్దిగా ముందే, సీబీఐ బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ ప్రముఖ నేతలందరి పేర్లనూ చార్జ్‌షీట్‌లోంచి తొలగించింది. సహజంగానే ప్రతిపక్షం ఆ చర్యను తీవ్రంగా విమర్శించింది. దాంతో అప్పటి సీబీఐ డెరైక్టర అల్లరిపాలయ్యారు కూడా. ఆయన చేసిన సూచన మేరకే వాజ్‌పేయీ యూఎస్ మిశ్రాను సీబీఐ డెరైక్టర్‌గా నియమించారు. అయితే, తన పనిలో నిత్యం పాలకుల జోక్యం ఎదురవుతూనే ఉండేదని అదే మిశ్రా -దాదాపు దశాబ్దం తర్వాత- వెల్లడించడం విశేషం. ముఖ్యంగా మాయావతి ఆస్తుల కేసులో ఈ జోక్యం తీవ్రస్థాయిలో ఉండేదని ఆయన వెల్లడించారు. పాలకులు ఏ పార్టీకి చెందినవారయినా, ప్రత్యర్థులను వేధించే పాపపు పనికి సీబీఐని వినియోగించేవారన్నదే ఇక్కడ ఆరోపణ. నిన్నగాక మొన్న ఎఫ్‌డీఐ బిల్లు ఓటింగ్ సందర్భంగా ఇదే మాయావతినీ, ఆమె ప్రధాన ప్రత్యర్థి పక్షమయిన ఎస్పీనీ కూడా యూపీయే ప్రభుత్వం సీబీఐ అస్త్రం ప్రయోగించే లొంగదీసుకో లేదా? యూపీయే ప్రభుత్వం ఇదే అస్త్రం ప్రయోగించి చంద్రబాబు నాయుడిని కూడా బెదిరించి, ఆయన పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనకుండా చేసిందన్నది ఓ బహిరంగ రహస్యమే కదా!

అంతెందుకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఆరేడు నెలలుగా సాగుతున్న బాగోతం సీబీఐ నిజస్వరూపాన్ని వెల్లడించడం లేదా? 26 జీవోల కేసులో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీబీఐ అక్రమంగా అరెస్ట్ చెయ్యలేదా? రాజ్యాంగం ప్రసాదించిన హక్కును సైతం కాలదన్ని, జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా సీబీఐ అడుగడుగునా అడ్డుతగలడం లేదా? ఒకే కేసులో అనేక చార్జ్‌షీట్లు దాఖలు చేసే అపూర్వ దురాచారానికి సీబీఐ తెగబడలేదా? ‘సాక్షి’ ఆర్థిక మూలాలపై దాడికి సైతం తెగబడలేదా? ఏ రాజకీయ జోక్యం లేకుండానేసీబీఐ ఇవన్నీ జరిపించిందా? అయినా ఉన్నమాటంటే ఉలుకెక్కువంటారు. జోగీందర్ సింగ్, యూఎస్ మిశ్రా, కేఎన్ సింగ్ తదితరులెందరో ఎన్నెన్నో విషయాలు వెల్లడించి సీబీఐ అసలు రంగు మరోసారి బట్టబయలు చేశారు. వందమంది ఉన్న సభలో ఒక్క వికర్ణుడు వాస్తవం పలికినట్లుగా ఈ నిజాయితీపరులు నిజం మాట్లాడుతున్నారు. అందుకు ఆక్రోశించి ప్రయోజనమేమిటి?

'సీబీఐ దర్యాప్తుల్లో రాజకీయ ఒత్తిళ్లు నిజమే'

సీబీఐ దర్యాప్తుల్లో రాజకీయ ఒత్తిళ్లు వాస్తవమేనని సీబీఐ మాజీ చీఫ్ డైరెక్టర్ యూఎస్ మిశ్రా అంగీకరించారు. తాజ్ కారిడార్ కేసులో తమపై ఒత్తళ్లు వచ్చాయని ఆయన శుక్రవారం ఇక్కడ అన్నారు. ములాయం కేసులోనూ ఈ ఒత్తిళ్లు ఉన్నాయని, ముందు ముందు కూడా ఈ ఒత్తిళ్లు కొనసాగవచ్చునని మిశ్రా వ్యాఖ్యానించారు.

ప్రధానికి వైఎస్ విజయమ్మ లేఖ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు లేఖ రాశారు. దేశ ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకొని పెంచిన ఎరువుల ధరలను తక్షణం తగ్గించాలని ఆమె తన లేఖలో కోరారు. గడిచిన రెండేళ్లలో వరి కనీస మద్దతు ధర 25 శాతం పెరిగితే ...ఎరువుల ధరలు మాత్రం దాదాపు 300 శాతం వరకూ పెరిగాయని విజయమ్మ తెలిపారు.

వ్యవసాయాభివృద్ధికి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో చర్యలు తీసుకున్నారని, వైఎస్ హయాంలో అభివృద్ధి రేటు 6.87 శాతంగా నమోదైందని విజయమ్మ లేఖలో వివరించారు. ప్రస్తుతం రైతులకు వ్యవసాయం భారంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల ధరలను తగ్గించాలని విజయమ్మ విజ్ఞప్తి చేశారు.

జనంతో హోరెత్తిన షర్మిల సభ!

మరో ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఎల్పీనగర్ లోని బీఎన్ రెడ్డి నగర్ లో షర్మిల సభ జనంతో హోరెత్తింది. కిక్కిరిసిన ప్రజలతో సభాప్రాంగణం నిండిపోయింది. బీఎన్ రెడ్డి నగర్ లో రోడ్లు, భవనాలు జనంతో నిండిపోయాయి. 
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి తాము అండగా నిలుస్తామని మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌, జీహెచ్ ఎంసీ కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ కాలేరు వెంకటేష్‌ ప్రకటించారు. వీరు ఇరువురు శుక్రవారం చంచల్ గూడ జైల్లో వైఎస్ జగన్ ను కలిశారు.

అనంతరం కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఒకటి రెండు రోజుల్లో ఆ తేదీ ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ మహానేత వైఎస్‌ఆర్‌ పాలనను మరచిపోలేకపోతున్నారని అన్నారు.

జగన్‌కు ప్రజల అండదండలు

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి తాము అండగా నిలుస్తామని మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌, జీహెచ్ఎంసీ కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ కాలేరు వెంకటేష్‌ ప్రకటించారు. వీరు ఇరువురు శుక్రవారం చంచల్గూడ జైల్లో వైఎస్ జగన్ను కలిశారు.

అనంతరం కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఒకటి రెండు రోజుల్లో ఆ తేదీ ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ మహానేత వైఎస్‌ఆర్‌ పాలనను మరచిపోలేకపోతున్నారని అన్నారు.

వైఎస్.జగన్‌కు ప్రజల అండదండలున్నాయని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాలేరు వెంకటేశ్వర్లు అన్నారు. చంచల్‌గూడ జైలులో వైఎస్ జగన్‌ను కాలేరు వెంకటేశ్వర్లు కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ భ్రష్టుపట్టిందని కాలేరు అన్నారు. వైఎస్‌ఆర్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చుతోందని కాలేరు విమర్శించారు.

Peoples join to YSRCP in Vishaka

P. Ashok kumar joins YSRCP

Sharmila's Conducts Rachabanda at BD Guardens, LB Nagar

Heavy crowd in Sharmila's Speech at LB Nagar in Hyderabad

Thursday, 13 December 2012

బాబుపైనా విచారణ జరపాలి

వాల్‌మార్ట్‌కు ఎంపీలను అమ్ముకున్న దొంగ చంద్రబాబు
ఎఫ్‌డీఐల విషయంలో బాబు నిస్సిగ్గుగా యూపీఏను గెలిపించారు
చంద్రబాబు, ఆ పార్టీ ఎంపీలు ముగ్గురిపై జేపీసీతో కూడా విచారణ జరిపించాలి
స్వలాభం కోసం ప్రజల్ని పణంగా పెట్టే నీచ సంస్కృతి బాబుది
హెరిటేజ్ కోసం 4 లక్షల మంది చిల్లర వర్తకుల పొట్టకొడుతున్నారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వాల్‌మార్ట్‌కు సరుకులు మాదిరిగా టీడీపీ ఎంపీలు ముగ్గురిని హోల్‌సేల్‌గా, రిటైల్‌గా అమ్ముకున్న ఘరానా దొంగ చంద్రబాబు. భారత్‌లో ప్రవేశించేందుకు వాల్‌మార్ట్ జరిపిన లాబీయింగ్‌పై జరిగే న్యాయ విచారణలో చంద్రబాబును కూడా చేర్చాలి. రాజ్యసభలో ఓటింగ్‌కు గైర్హాజరైన ముగ్గురు టీడీపీ ఎంపీల పాత్రను కూడా పరిగణనలోకి తీసుకోవాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్‌ప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో ప్రవేశించేందుకు రూ.125 కోట్లు ఖర్చు చేసినట్లు అమెరికా సెనేట్‌కు ఇచ్చిన నివేదికలో వాల్‌మార్ట్ తెలిపింది. రాజ్యసభలో ఎఫ్‌డీఐ బిల్లు నెగ్గేందుకు తెలుగుదేశం పార్టీ పరోక్షంగా ప్రభుత్వానికి సహరించింది. రాజ్యసభలో యూపీఏ ప్రభుత్వానికి మెజారిటీ లేదు. అయినా ఎఫ్‌డీఐల విషయంలో యూపీఏను గెలిపించేందుకు చంద్రబాబు నిస్సిగ్గుగా సహకరించారు. 

ఢిల్లీ వెళ్లి చీకట్లో ఒప్పందాలు కుదుర్చుకునే చంద్రబాబు వాల్‌మార్ట్ విషయంలో ఎంత వాటా తీసుకున్నారో బహిర్గతం చేయాలి. ఇలాంటి వ్యక్తులకే వాల్‌మార్ట్ డబ్బులు అందివుంటాయని పార్లమెంటులో ప్రతిపక్షాలు చెబుతున్నందున, చంద్రబాబు, ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చేత కూడా విచారణ జరిపించాలి. అప్పుడే బడా బాబుల బాగోతం బయటపడుతుంది’’ అని చెప్పారు. సొంత లాభం కోసం ఎంతటి నీచానికైనా దిగజారే సంస్కృతి చంద్రబాబుదని జనక్‌ప్రసాద్ దుయ్యబట్టారు. ‘‘స్వలాభం కోసం పేరొందిన ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలను కుప్పకూల్చిన చరిత్ర చంద్రబాబుది. ఆఖరికి ప్రజలను పణంగా పెట్టేందుకు కూడా వెనుకాడరు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో విజయవంతంగా నడుస్తున్న చిత్తూరు డెయిరీని పథకం ప్రకారం దెబ్బకొట్టి ఆయన సతీమణి పేరిట ప్రారంభించిన హెరిటేజ్ డెయిరీకి లబ్ధి చేకూర్చారు. చిత్తూరు డెయిరీని నామరూపాలు లేకుండా చేశారు. ఇలా అనేక ప్రభుత్వరంగ సంస్థలను దొంగ దెబ్బకొట్టి ఆయన బినామీలకు కట్టబెట్టారు. ఎఫ్‌డీఐల విషయంలో కూడా చంద్రబాబు హెరిటేజ్ సంస్థ కోసం రాష్ట్రంలోని 4 లక్షల మంది చిల్లర వర్తకుల పొట్టకొట్టేందుకు వెనకాడలేదు’’ అని చెప్పారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే హెరిటేజ్‌లోకి విదేశీ పెట్టుబడులను తీసుకోబోమని బహిరంగ ప్రకటన చేయాలని జనక్‌ప్రసాద్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్-టీడీపీ దొందూ దొందే!

నాటి చంద్రబాబు, నేటి కిరణ్ పాలన ఒక్కటే
రెండూ జనం రక్తం పీల్చే పాలనలే
రైతులు మళ్లీ అప్పుల ఊబిలో కూరుకుపోయారు
వైఎస్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా 
జనం నెత్తిన ఒక్క రూపాయి భారం కూడా వేయలేదు
ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 56, కిలోమీటర్లు: 807.70

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘నాటి చంద్రబాబు పాలన.. నేటి కాంగ్రెస్ పాలన రెండూ వేరువేరు కాదు. జనం రక్తం తాగే రాబందుల రాజ్యాలే ఇవి. నాటి చంద్రబాబునాయుడి అడుగుజాడల్లోనే నేటి కిరణ్ సర్కారు కూడా నడుస్తోంది. ఆనాటి టీడీపీ పాలనకు, ఈ కాంగ్రెస్ పాలనకు తేడానే లేదు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాలక, ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు హయాంలో మాదిరే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కష్టాల ఊబిలోకి నెట్టేసిందని మండిపడ్డారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం, ఆ ప్రభుత్వంతో కుమ్మక్కైన చంద్రబాబునాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం 56వ రోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో సాగింది. రావిరాలలో ‘రచ్చబండ’ నిర్వహించిన అనంతరం ఆదిభట్ల గ్రామంలో కిక్కిరిసిన జనసమూహాన్ని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు.

వైఎస్ పాలనలో గ్యాస్ ధర 
ఒక్క రూపాయి కూడా పెరగలేదు..

చంద్రబాబు హయాంలో గ్యాస్ ధర రూ.145 నుంచి రూ.305కి పెరిగిందని, అదే వైఎస్ పాలనలో ఒక్క రూపాయి కూడా పెరగలేదని షర్మిల చెప్పారు. వైఎస్ జనం నుంచి దూరమయ్యాక ఇప్పటి ప్రభుత్వం రూ.305 నుంచి రూ.460కి గ్యాస్ ధర పెంచిందని దుయ్యబట్టారు. ఆరు సిలిండర్లు దాటితే ఒక్కో సిలిండర్‌కు రూ.1,000 చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. ‘‘చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు కట్టలేక అల్లాడిపోయారు. వైఎస్ సీఎం కాగానే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే బిల్లుపై తొలి సంతకం చేశారు. గృహావసరాల కరెంటు చార్జీలు పెంచబోమని మాటిచ్చారు. ఐదేళ్లపాటు ఆ మాటపైనే ఉన్నారు. వైఎస్ మనకు దూరమయ్యాక వచ్చిన నేతలు కరెంటు చార్జీలను ఇష్టానుసారం పెంచేస్తున్నారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో రైతులందరూ అప్పుల ఊబిలో కూరుకుపోయి జీవచ్ఛవాల్లా తయారయ్యారు. వైఎస్ అధికారంలోకి రాగానే రూ.12 వేల కోట్లు రుణమాఫీ చేసి, రైతన్నను అప్పుల ఊబి నుంచి బయట పడేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ మూడేళ్లలోనే రైతును మళ్లీ అప్పుల ఊబిలోకి తోసేసింది. ఏ రకంగా చూసుకున్నా నాటి చంద్రబాబు పాలనకు, నేటి కాంగ్రెస్ పాలనకూ ఇసుమంత కూడా తేడా లేదు. జనం నెత్తిన పన్నుల భారం మోపడంలోను, ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేయడంలోనూ రెండూ రెండే..’’ అని విమర్శించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పావలా వడ్డీ, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు.. ఇలా అనేక సంక్షేమ పథకాలు చేపట్టినా వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనలో ఒక్క పైసా కూడా ప్రజలపై భారం వేయలేదని చెప్పారు. వైఎస్ మన నుంచి దూరమయ్యాక ఆయన పథకాలకు ఒకవైపు తిలోదకాలు ఇస్తూ.. మరోవైపు జనం నెత్తిన అదనపు పన్నుల భారం మోపుతున్నారన్నారు.

చంద్రబాబూ.. మీకు పాదయాత్రలు ఎందుకు?

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో అర్థం కావడం లేదని షర్మిల అన్నారు. ప్రజాసమస్యలు పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఓవైపు ప్రభుత్వాన్ని తిడుతూనే మరోవైపు ఆ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని చెప్పారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి పడగొట్టే శక్తి ఉన్నా ఆ పని చేయకుండా పాదయాత్రల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. జగన్ బయట ఉంటే తమ ఆటలు సాగవనే కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నాయని విమర్శించారు. ‘‘పాలక, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా.. ఉదయించే సూర్యుణ్ణి ఆపడం ఎవ్వరి తరమూ కాదో అలాగే జగనన్న త్వరలోనే వస్తాడు. రాజన్న రాజ్యం తెస్తాడు’’ అని చెప్పారు.


ప్రజా సమస్యల వెల్లువ..

రోజుకు నాలుగు గంటలే కరెంటు ఇస్తున్నారు.. బిల్లేమో నాలుగింతలు పెరిగిందంటూ ఓ మహిళ ఫిర్యాదు. పింఛన్ రావడం లేదంటూ ఓ అవ్వ ఆవేదన. స్కూలుకు వెళ్లేందుకు కూడా బస్సు లేదంటూ ఓ బాలిక బాధ! రావిరాలలో షర్మిల నిర్వహించిన రచ్చబండలో గ్రామస్తులు ఇలా తమ సమస్యలను చెప్పుకున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు తుక్కుగూడ నుంచి బయల్దేరిన షర్మిల 10.30 గంటలకు రావిరాల చేరుకుని రచ్చబండ నిర్వహించారు. జనం సమస్యలను ఓపిగ్గా విన్న షర్మిల.. ‘‘కొంతకాలం ఓపిక పట్టండి. రాజన్న కలలు నెరవేర్చేందుకు జగనన్న వస్తాడు..’’ అంటూ వారికి ధైర్యం చెప్పి ముందుకు సాగారు. గురువారం షర్మిల 16 కిలోమీటర్లు నడిచారు. రాత్రి 7 గంటల సమయంలో నాదర్‌గుల్ సమీపంలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకున్నారు. పాదయాత్రలో పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసులు, పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధ్దన్, కె.కె.మహేందర్‌రెడ్డి రాజ్ ఠాకూర్, జనార్దన్‌రెడ్డి, అమృతసాగర్, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు దేప సురేఖ, హరివర్ధన్‌రెడ్డి, సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.

జగన్‌కు బెయిల్ హక్కుంది

హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి
చార్జిషీటు కూడా దాఖలు చేయలేదు
చార్జిషీట్ వెయ్యకపోతే జగన్ బెయిల్‌కు అర్హుడని హైకోర్టే చెప్పింది
ఆ తీర్పుపై సీబీఐ అప్పీల్ కూడా చేయలేదు.. అదే అంతిమం
167(2) కింద బెయిల్ కోరుతున్నాం
విచారణ సోమవారానికి వాయిదా

హైదరాబాద్, న్యూస్‌లైన్: బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించినంత మాత్రాన, బెయిల్ కోరే హక్కును పిటిషనర్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోల్పోయినట్టు కాదని సీనియర్ న్యాయవాది సి.పద్మనాభరెడ్డి హైకోర్టుకు నివేదించారు. అరెస్టు చేసిన నాటి నుంచి చట్టం నిర్దేశించిన మేరకు 90 రోజుల్లోపు సీబీఐ అధికారులు దర్యాప్తు పూర్తి చేయడంలోనూ, చార్జిషీట్ దాఖలు చేయడంలోనూ విఫలమైతే సీఆర్పీసీ సెక్షన్ 167(2) కింద బెయిల్ పొందే హక్కు జగన్‌కు ఉందని హైకోర్టే గతంలో తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. 

‘‘ఆ తీర్పుపై మేము గానీ, సీబీఐ గానీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయలేదు. కాబట్టి ఆ తీర్పే అంతిమం అవుతుంది. ఆ తీర్పుకు లోబడే మేమిప్పుడు 167(2) కింద బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశాం. సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసే నాటికి, సీబీఐకి చార్జిషీట్ దాఖలు చేసేందుకు చట్టం నిర్దేశించిన 90 రోజుల గడువు పూర్తవలేదు. అందుకే జగన్‌కు సీఆర్పీసీ సెక్షన్ 167(2) కింద చట్టబద్ధమైన బెయిల్‌ను మంజూరు చేసే విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. 90 రోజుల గడువు పూర్తయినా చార్జిషీట్ దాఖలు చేయడంలో సీబీఐ విఫలమైంది. దీన్ని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. అందుకే చట్టబద్ధమైన బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాం’’ అని ఆయన కోర్టుకు వివరించారు. 167(2) కింద బెయిల్ మంజూరు చేయాలన్న తన అభ్యర్థనను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి గురువారం మరోసారి విచారించారు. జగన్ తరఫున పద్మనాభరెడ్డి వాదనలు వినిపించారు. సీబీఐ తరఫున పి.కేశవరావు హాజరయ్యారు.

జస్టిస్ చంద్రకుమార్ తీర్పే ఆధారం

ఎఫ్‌ఐఆర్‌లోని కొన్ని అంశాలపై సీబీఐ ఇప్పటిదాకా దర్యాప్తు పూర్తి చేయడం గానీ, తుది చార్జిషీట్ దాఖలు చేయడం గానీ చేయలేదని, ఈ విషయంలో చట్టం నిర్దేశించిన 90 రోజుల గడువు కూడా పూర్తయిందని పద్మనాభరెడ్డి తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, మీ అభ్యర్థనను ఏ ప్రాతిపదికన మన్నించాలని ప్రశ్నించారు. పద్మనాభరెడ్డి బదులిస్తూ.. ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచిన ఒక్కో అంశాన్ని ఒక్కో నేరంగా సీబీఐ పరిగణించడాన్ని ఇదే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ సమర్థిస్తూ తీర్పునిచ్చారని గుర్తు చేశారు. ‘‘అంతేగాక ఒక అంశంలో చూపిన అరెస్టును మిగతా వాటన్నింటికీ వర్తింపజేయాలని కూడా తీర్పునిచ్చారు. దానిప్రకారం జగన్ ప్రస్తుతం ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించిన అంశాలన్నింట్లోనూ అరెస్టయినట్టే. ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలన్నింటిపై సీబీఐ దర్యాప్తు పూర్తి చేయకపోయినా, చార్జిషీట్ దాఖలు చేయకపోయినా జగన్ బెయిల్ పొందేందుకు అర్హుడని జస్టిస్ చంద్రకుమార్ తీర్పు చెప్పారు. 

కాబట్టే, దానినే ప్రాతిపదికగా చేసుకుంటూ సెక్షన్ 167(2) కింద జగన్‌కు చట్టబద్ధమైన బెయిల్‌ను మంజూరు చేయండి’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు జరగాల్సి ఉందని సీబీఐ అధికారులు చెప్పిన ఏడు అంశాలు కొత్తవేమీ కాదని, అన్నీ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచినవేనని తెలిపారు. న్యాయమూర్తి స్పందిస్తూ, జస్టిస్ చంద్రకుమార్ తీర్పుపై ఈప్పీల్ దాఖలు చేయలేదు గనుక దాని నుంచి మీరు ఎందుకు లబ్ధి పొందకూడదని ప్రశ్నించారు. తాము అదే పనిచేస్తున్నామని పద్మనాభరెడ్డి బదులిచ్చారు. 167(2) కింద తాము బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు జస్టిస్ చంద్రకుమార్ తీర్పే ఆధారమని వివరించారు. 

ఇదే విషయాన్ని కింది కోర్టుకు వివరించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఏడు అంశాలపై దర్యాప్తు పూర్తి చేసి ఒకే చార్జిషీట్ దాఖలు చేస్తామని సుప్రీంకోర్టుకు సీబీఐ హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చలేదని తెలిపారు. సుప్రీంకోర్టు సాధారణ బెయిల్‌ను తిరస్కరించినా బెయిల్ కోరే హక్కును జగన్ కోల్పోరని, రాజ్యాంగం ప్రసాదించిన హక్కును సాధించేందుకు న్యాయపోరాటం చేస్తుంటారని పేర్కొంటూ పద్మనాభరెడ్డి తన వాదనలను ముగించారు. సీబీఐ న్యాయవాది కేశవరావు తన వాదనలను వినిపించేందుకు సమయం కోరడంతో తదుపరి విచారణను న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశారు. ఈ పిటిషన్‌తో పాటు సాధారణ బెయిల్ కోసం జగన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లోనూ కలిపి వాదనలు వినిపించేందుకు అనుమతినివ్వాలన్న కేశవరావు అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈ కేసు పూర్తయ్యాక ఆ కేసును విచారిస్తానని స్పష్టం చేశారు.

నేడు నాదర్‌గుల్ నుంచి ‘మరో ప్రజాప్రస్థానం’

‘మరో ప్రజాప్రస్థానం’లో భాగంగా శుక్రవారం నాదర్‌గుల్ నుంచి బీఎన్‌రెడ్డి నగర్ వరకు షర్మిల పాదయాత్రను కొనసాగించనున్నారు. ఉదయం నాదర్‌గుల్‌లో ప్రారంభమయ్యే యాత్ర జనప్రియ కాలనీ, గాంధీనగర్, బడంగ్‌పేట మీదుగా బీఎన్‌రెడ్డి నగర్‌కు చేరుకుంటుంది. అక్కడ జరిగే సభ అనంతరం ఇంజాపూర్ సమీపంలో షర్మిల బస చేయనున్నారు.

బి.కొత్తకోటలో 16న విజయమ్మ సభ

చిత్తూరు జిల్లాలోని బి.కొత్తకోటలో డిసెంబర్ 16న వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొనే సభలో టీడీపీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వైఎస్ఆర్ సీపీలో చేరనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బి.కొత్త కోటలో సభ ఏర్పాట్లు పార్టీ నాయకులు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్బంగా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే సింగిల్‌ విండో ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీదే విజయం అని అన్నారు.

జగన్ బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 17వ తేదీకి వాయిదా

వైఎస్సార్‌ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. జగన్ తరపున సీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి వాదనలు వినిపించారు. తదుపరి విచారణ ఈనెల 17వ తేదీకి వాయిదా పడింది.

Sharmila's Conducts Rachabanda at Ravirala, Rangareddy

Sharmila's speech at Adibatla, Rangareddy district

Wednesday, 12 December 2012

తెలంగాణపై కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేయాలి

 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. రెండుసార్లు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి కేంద్రం తీసుకున్న చర్యలేంటి? ఇప్పటిదాకా కాంగ్రెస్ సాధించిన పురోగతి ఏంటి? అని సూటిగా ప్రశ్నించారు. ఇచ్చే శక్తి, తెచ్చే శక్తి ఉందని చెప్పుకున్న కాంగ్రెస్ నేతలు పార్టీ వైఖరిపై ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. 

బాజిరెడ్డి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. హోంమంత్రి మారారంటూ ఒకసారి, కొత్తపార్టీ వచ్చిందని మరోసారి అఖిలపక్షం పేరుతో డ్రామాలాడటం కాంగ్రెస్‌కు రివాజుగా మారిందని దుయ్యబట్టారు. తెలంగాణ ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు ఉంటే పదేపదే అఖిలపక్ష సమావేశాలను ఎందుకు ఏర్పాటు చేస్తోందని ప్రశ్నించారు. తెలంగాణ పట్ల కాంగ్రెస్‌ను నిలదీయాల్సిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆ పని చేయకపోగా అదే పార్టీతో దోబూచులాడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణపై కాంగ్రెస్ వైఖరి చెప్పిన తర్వాత వైఎస్సార్‌సీపీ కూడా వెల్లడిస్తుందని గోవర్ధన్ స్పష్టం చేశారు.

పల్లెల్లో పాలన ఏదీ ?

* గ్రామాలకు సర్పంచులు ఎక్కడ?
* ఏళ్లు గడుస్తున్నా పంచాయతీలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు
* పల్లె జనం కష్టాలు, కన్నీళ్లను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు
* వైఎస్ గిరిజన తాండాలను, మారుమూల పల్లెలను గ్రామ పంచాయతీలుగా మార్చాలనుకున్నారు
* కానీ ఈ పాలకులు ఉన్న పంచాయతీలనే నిర్వీర్యం చేస్తున్నారు
* ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టకుండా చంద్రబాబు డ్రామాలాడుతున్నారు 

మరో ప్రజా ప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘గిరిజన తాండాలను, చిన్నచిన్న పల్లెలను గ్రామ పంచాయతీలుగా చేయాలని వైఎస్సార్ ఆలోచించారు. కానీ ఈ పాలకులు ఉన్న గ్రామ పంచాయతీలనే నిర్వీర్యం చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా.. పంచాయతీలకు ఎన్నికల్లేవు. గ్రామాలకు సర్పంచులు లేరు. అధికారులేమో పల్లెలకు రారు. పల్లెల్లో ప్రజల కష్టాలను, కన్నీళ్లను పట్టించుకునే నాథుడే కరువయ్యారు..’’అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. స్థానిక ఎన్నికలు పెడితే అన్ని స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని సర్కారుకు భయం పట్టుకుందని అన్నారు. 

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పాలకులతో కుమ్మక్కైన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం 55వ రోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గంలో సాగింది. సిరిగిరిపురంలో రచ్చబండ కార్యక్రమంలో పెంటమ్మ అనే వృద్ధురాలు పల్లె పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పల్లె పడావు పడింది. ఓ పెసిడెంటు (సర్పంచు) లేడు.. ఎంపీటీసు (ఎంపీటీసీ) లేడు. ఊరు దిక్కు లేకుండా పోయింది. మడి తడుపుకుందామన్నా కరెంటు లేదు. చాపంత భూమికి కూడా నీళ్లు పారుతలే.. పెసిడెంటు దిగిపోయిన దినాంనుంచి సారోళ్లు (అధికారులు) ఊళ్లకు రాట్లేదు’’ అని ఆమె అనడంతో షర్మిల ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.

ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి..
‘‘15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మన ముఖ్యమంత్రి చెప్తున్నారు. అందులో కనీసం 10 శాతం మందికి కూడా ఇప్పటివరకు ఉద్యోగాలు కల్పించలేదు. ఆరు వేల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తానని కిరణ్‌కుమార్‌రెడ్డి గారు గొప్పలు చెప్పుకుంటున్నారు. అయ్యా.. ఆరు వేల లక్షల కోట్లు ఏమో గాని కరెంటు సరఫరా లేక ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. కొన్ని పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించుకున్నాయి. మరికొన్ని పరిశ్రమలు నడిచే పరిస్థితి లేకపోవడంతో కంపెనీల్లో పనిచేసే లక్షలాదిమంది యువకులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. వాళ్ల కుటుంబాల భవిష్యత్తు రోడ్డున పడుతోంది. ఇవేవీ మీకు పట్టదా..?’’ అని షర్మిల ప్రశ్నించారు. ‘‘ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం ఏర్పడింది. పక్క రాష్ట్రాల్లో కూడా విద్యుత్తు సంక్షోభం ఉన్నప్పటికీ వాళ్లు ముందస్తు ప్రణాళికతో విద్యుత్తు కొనుగోలు చేసి సమస్యను అధిగమించారు. మన రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి తన సీటును పదిలపరుచుకునే పనిలో పడి ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారు. 

ఈ ప్రభుత్వం ఉండి కూడా ప్రజలకు ప్రయోజనం లేదు. వైఎస్సార్ 7 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తానన్నారు... ఇచ్చి చూపించారు. ఆయన బతికే ఉంటే 9 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి తీరేవారు. కానీ ఈ పాలకులు ఉచిత విద్యుత్తును ఏ క్షణంలోనైనా ఎత్తివేసినా ఆశ్చర్యం లేదు. కరెంటు రెండు మూడు గంటలైనా ఉండడం లేదని రైతులు, ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే మన ముఖ్యమంత్రి.. కరెంటు లేకపోతే ఏం? కిటికీలు, తలుపులు తీసి పడుకోండి అని అంటున్నారు. ఆయన మాత్రం ఏసీలో ఉంటూ.. ప్రజలకు ఇలా ఉచిత సలహాలు పడేస్తారు’’ అని విమర్శించారు.

డ్రామాలు ఎందుకు.. అవిశ్వాసం పెట్టు బాబు!
చంద్రబాబు ఆయన హయాంలో నాలుగు వేల మందిని పొట్టనబెట్టుకొని ఏ గ్రామాలనైతే శ్మశానాలుగా మార్చారో మళ్లీ అవే గ్రామాల్లో పాదయాత్ర పేరుతో తిరుగుతున్నారని షర్మిల నిప్పులు చెరిగారు. ‘‘గ్రామాల్లో తిరుగుతూ వైఎస్ చేసిన వాగ్దానాలనే తాను కూడా చేస్తానంటూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు. వైఎస్సార్‌గారు రైతుల కోసం 12 వేల రుణ మాఫీ చేస్తే.. ఇప్పుడు నేను కూడా ఇస్తాను అని చెప్తున్నారు. వైఎస్సార్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అమలు చేస్తే.. ఇప్పుడు నేను చేస్తానని చెప్తున్నారు. రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ చేసి చూపిస్తే.. ఆయన ఇప్పుడు నేను కూడా చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. 

అయ్యా..! చంద్రబాబునాయుడు గారు ఇప్పుడు మీరు చేస్తున్న వాగ్దానాలన్నీ వైఎస్సార్ ఏనాడో చేసి చూపించారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు నక్క జిత్తుల మాటలతో ప్రజలను నమ్మించడానికి మీరు ఎన్ని వాతలు పెట్టుకున్నా.. నక్క నక్కే..పులి పులే..’’ అని అన్నారు. చంద్రబాబు నాయుడుకు వాగ్దానాల్లో నిజాయతీ ఉండద ని, ఆయనకు నిజంగా ప్రజలపై ప్రేమే ఉంటే.. పాదయాత్రల పేరుతో కాలయాన చేయక ఈ ప్రభుత్వంపై ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదని నిలదీశారు. ఓవైపు అసమర్థ ప్రభుత్వం అంటూనే మరోవైపు అదే ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. 

జాబులు ఎవరికి ఇస్తున్నాడమ్మా?
‘‘జొన్నరొట్టెలు తినుకుంటా పిలగాండ్లను సదివించినాం. ఒక్కని కన్నా గౌరిమెంటు ఉద్దానం (ప్రభుత్వ ఉద్యోగం) లేదు. టీవీల జూత్తే కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరు లచ్చల మంది పిలగాండ్లకు ఉద్దానాలు ఇత్తున్నా అని చెప్పుతుండు. ఆయన ఎవరికి ఇత్తున్నాడమ్మా..? మా పిల్లలను సూడు.. మా బతుకులు సూడు! సిన్నతనాన పిల్లగాండ్లను మాతోటి పనికి తీసుకొనిపోయినా... వాడు ఈపాటికి సేతికొచ్చేటోడు. ఇటు జాబ్ లేదు.. అటు ఎండకు పని జేయలేడు. పిల్లలు ఎలా బతకాలమ్మా?’’ అని సిరిగిరిపురం గ్రామానికి చెందిన తిరుపమ్మ అనే మహిళ షర్మిలతో ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం మన్సాన్‌పల్లి నుంచి ప్రారంభమైన షర్మిల పాతయాత్ర మహేశ్వరం, సిరిగిరిపురం, హర్షగూడ, మంఖాల్ మీదుగా తక్కుగూడ కు చేరింది. అన్ని గ్రామాల్లో షర్మిల రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి 7 గంటలకు తక్కుగూడ శివారులో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకున్నారు. 

బుధవారం మొత్తం 18.90 కి.మీ మేర యాత్ర సాగింది. ఇప్పటివరకు మొత్తం 791.70 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. షర్మిల వెంట పాదయాత్రలో నడిచిన నేతల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, నేతలు రాజ్‌ఠాకూర్, జనక్ ప్రసాద్, జంగా కృష్ణమూర్తి, లక్ష్మీ పార్వతి, బెక్కరి జనార్దన్‌రెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, దేప సురేఖ, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, శివకుమార్, ఆదం విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!