ఎఫ్ డిఐలకు టిడిపి పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లేనని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి అన్నారు. ఎఫ్ డిఐలను ఆమోదించడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్ అవినీతికి పాల్పడిందన్నారు. అన్ని పార్టీలు వ్యతిరేకించినా కేంద్రం బిల్లు ఎలా పెట్టిందని ఆయన ప్రశ్నించారు. లాబీయింగ్ కు 125 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పారు. రాజ్యసభలో ఓటింగ్ కు టీడీపీ హాజరుకాకపోవడంపై అనుమానాలు వస్తున్నాయన్నారు. తెలంగాణపై పార్టీలకు ఏకాభిప్రాయం లేదని కేంద్రం చెబుతోందన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment