వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి వెలగపల్లి వరప్రసాదరావు సోమవారం వైఎఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. లోటస్‌పాండ్‌లో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.
వరప్రసాద్ 2009 ఎన్నికల్లో తిరుపతి పీఆర్‌పీ ఎంపీ అభ్యర్ధిగా పోటీచేశారు. దాదాపు 27 ఏళ్ళ పాటు తమిళనాడులో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన...వీఆర్‌ఎస్ తీసుకుని ఎన్నికల బరిలో నిలిచారు. వరప్రసాద్ స్వస్ధలం కృష్ణా జిల్లా గుడివాడ. ఆయనకు చిత్తూరు జిల్లాతో అనుబంధం ఎక్కువగా ఉంది. ఆయనతో పాటు పలువురు సన్నిహితులు కూడా విజయమ్మను కలిశారు.

No comments:
Post a Comment