వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ సాయంత్రం రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది. మహేశ్వరం నియోజకవర్గం కొలపడకల్ వద్ద అభిమానులు, కార్యకర్తలు షర్మిలకు ఘనస్వాగతం పలికారు. ఆమె చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ పాదయాత్రలో ఆ పార్టీ నేతలు వైఎస్ వివేకానందరెడ్డి, బాజి రెడ్డి గోవర్ధన్, గట్టు రామచంద్రరావు, బెక్కరి జనార్దన్‌రెడ్డి, రాజ్‌ఠాకూర్, దేపా భాస్కర్‌రెడ్డి, వెంకటప్రసాద్, కొలను శ్రీనివాస్‌రెడ్డి తదితురులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో షర్మిల 294.7 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.
మహబూబ్ నగర్ జిల్లాలో షర్మిల 294.7 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.
No comments:
Post a Comment