కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు పాలనతో ప్రజలు విసుగుచెందారని.. త్వరలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ప్రజలు మెచ్చే రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్, జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్‌లీడర్, గోల్నాక కార్పొరేటర్ కాలేరు వెంకటేష్‌లు పేర్కొన్నారు. వైఎస్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చిందని.. ప్రజా సమస్యలపై పోరాడుతున్న జగన్‌ను కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై జైలుకు పంపారని వారు ధ్వజమెత్తారు. జ్ఞానేశ్వర్, వెంకటేష్‌లు శుక్రవారం చంచల్‌గూడ జైలులో జగన్‌మోహన్‌రెడ్డిని ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు, కిరణ్‌కుమార్ ప్రభుత్వాలను చూసిన ప్రజలు.. ైవె.ఎస్ పాలనను మరువలేకున్నారని, ఆయనపై ప్రజల్లో ఉన్న అభిమానం, ఆదరణ జగన్‌పై ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అహర్నిశలు పోరాడుతున్న జగన్ సీఎం కావాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్న తరుణంలో.. వారి అభిప్రాయం మేరకు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిపారు. ఇతర పార్టీల నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి క్యూ కట్టడం అనివార్యమన్నారు.
Friday, 14 December 2012
జగన్ సారథ్యంలో...జనం మెచ్చే పాలన

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment