ప్రత్యర్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐని రాజకీయాస్త్రంగా వాడుకుంటోందని నెల్లూరు వైఎస్ఆర్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మండిపడ్డారు. జగన్‌ని రాజకీయంగా ఎదుర్కోలేకే కుట్రలు పన్ని జైలుకు పంపారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా జగన్ త్వరలో బయటకు వస్తారని మేకపాటి ధీమా వ్యక్తం చేశారు.
సహకార సంఘాల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ దురాగతాలకు పాల్పడుతోందని మేకపాటి ఆరోపించారు. ఎన్నికలు నిర్వహిస్తే ఘోర ఓటమి తప్పదని తెలిసే కాంగ్రెస్ ఇలా చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికలు ఎప్పుడూ నిర్వహించినా వైఎస్సార్ సీపీదే విజయమని మేకపాటి స్పష్టం చేశారు.
No comments:
Post a Comment