టీడీపీని నడిపిస్తున్నదే అమెరికాకు చెందిన రిటైల్ వర్తక దిగ్గజం వాల్‌మార్ట్ సంస్థ అని బీజేపీ ధ్వజమెత్తింది. రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐకి అనుమతించటంపై రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌కు టీడీపీ ఎంపీలు ముగ్గురు గైర్హాజరు కావటం వెనుక పెద్ద మతలబు ఉందని ఆరోపించింది. బీజేపీ అధికార ప్రతినిధి ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎఫ్‌డీఐపై ఓటింగ్‌కు ముందు హెరిటేజ్ ఉన్నతాధికారి సాంబశివరావు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌కు రాసిన ఉత్తరాన్ని ప్రస్తావించారు. నియమ నిబంధనలకు లోబడే విదేశీ పెట్టుబడులను హెరిటేజ్‌లోకి ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపిన మర్నాడే వాల్‌మార్ట్ అందుకు ముందుకువచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. దీన్నిబట్టే ఎఫ్‌డీఐపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ వైఖరేమిటో అర్థం చేసుకోవచ్చన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment