కోరుట్ల (కరీంనగర్), న్యూస్‌లైన్: ఊరంతా ఒకేబాట.. ఇంటింటికి ఏదో ఓ రూపంలో లబ్ధి చేకూర్చిన దివంగత వైఎస్సార్‌పై తరగని అభిమానం.. ఆయన బాటలో సాగుతున్న జగనన్నకు అండగా నిలవ డమే వారి లక్ష్యం! సరైన సమయం కోసం ఎదురుచూశారు. చంద్రబాబు పాదయాత్ర కరీం నగర్ జిల్లాలో అడుగుపెడుతున్న రోజునే.. వారంతా ఒక్కటై వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌పై అభిమానాన్ని చాటిన ఆ ఊరు పేరు.. ఓబుళాపూర్. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల సరిహద్దులోని గోదావరి నదిపై నిర్మించిన బాదన్‌కుర్తి వంతెనను ఆనుకుని మల్లాపూర్ మండలంలో ఉన్న పల్లె ఇది. చంద్రబాబు పాదయాత్ర కరీంనగర్ జిల్లాలో మొదటగా చేరేది ఈ ఊరికే. శుక్రవారం రాత్రి ఇక్కడే బాబు బస చేశారు. ఈ గ్రామ జనాభా 1800. రెండు ముదిరాజ్ కులస్తుల సంఘాలతోపాటు, కొమురం భీం యూత్(లంబాడా), పవర్‌స్టార్ యూత్, మహిళా సంఘాల వారు సుమారు 600 మంది ైవె ఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ వాకిటి సత్యంరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీలోకి చేరారు. అనంతరం భారీ ఊరేగింపు నిర్వహించారు. కోరుట్లలో కూడా పెద్ద ఎత్తున యువకులు వైఎస్సార్ పార్టీలో చేరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment