గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)లో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్‌లీడర్‌గా వ్యవహరిస్తున్న కాలేరు వెంకటేశ్ ఆ పదవితోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గోల్నాక డివిజన్‌నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన ఆయన జీహెచ్‌ఎంసీలో గత మూడేళ్లుగా కాంగ్రెస్‌పక్ష నాయకునిగా వ్యవహరిస్తున్నారు. తన రాజీనామా లేఖను బుధవారం గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ ద్వారా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు పంపించారు. వైఎస్ హయాంలో ప్రజాభిమానం, ప్రజాదరణ మెండుగా ఉన్న కాంగ్రెస్‌పార్టీ ప్రస్తుతం ప్రజావిశ్వాసాన్ని కోల్పోయినందున.. ఆ పార్టీలో కొనసాగలేననే తలంపుతో పార్టీ సభ్యత్వానికి, ఫ్లోర్‌లీడర్ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. వైఎస్ నాటి పాలన తిరిగి జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్‌సీపీ ద్వారానే సాధ్యమవుతుందనే నమ్మకంతో ప్రజలున్నారన్నారు. తాను త్వరలో వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్లు వెంకటేశ్ తెలిపారు.
No comments:
Post a Comment