నిర్మల్ (ఆదిలాబాద్), న్యూస్‌లైన్: తెలంగాణ విషయంలో వైఎస్సార్ సీపీ చిత్తశుద్ధితో ఉందని పార్టీ సీజీసీ మెంబర్ కేకే మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఈనెల 17న చేరుతుండడంతో నిర్మల్‌లో ఆ కార్యక్రమ ఏర్పాట్ల పరిశీలనకు శుక్రవారం ఆయన ఇక్కడకు వచ్చారు. పార్టీ ప్రో గ్రాం రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ బోడ జనార్దన్ తదితరులతో కలిసి నిర్మల్‌లోని అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఇంట్లో శుక్రవారం మహేందర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ విషయంలో పార్టీ వైఖరిని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పార్టీ మొదటి ప్లీనరిలోనే స్పష్టం చేశారని చెప్పారు. తెలంగాణ ఇచ్చే శక్తి తమకు లేదని, ఇస్తే అడ్డుకోబోమని, తెలంగాణ ప్రజల మనోభావాలకు పార్టీ కట్టుబడి ఉందన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ రాజ కీయ ఉద్యోగాల కోసం తెలంగాణవాదాన్ని అడ్డుపెట్టుకుంటున్నారని విమర్శించా రు. రాష్ట్రంలో ప్రతిపక్షం, అధికార పక్షం ఏకమయ్యాయని, ప్రజా సమస్యలను పట్టించుకునే వారే లేరని, ప్రజల పక్షాన పోరాడుతోంది వైఎస్సార్ సీపీ ఒక్కటే అన్నారు. అందుకే పార్టీకి ప్రాంతాల కతీతంగా జనాదరణ వస్తోందన్నారు.
No comments:
Post a Comment