వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం జేపీ దర్గా నుంచి ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డిలు తెలిపారు.
అక్కడి నుంచి ఇన్ములనార్వ, మేకగూడ గేట్, కొత్తూరు, కొత్తూరు తాండ మీదుగా యాత్రను కొనసాగించి ఆ రాత్రికి కొత్తూరు తాండ గ్రామ శివారు ప్రాంతంలోఏర్పాటు చేసిన టెంట్‌లో షర్మిల బసచేస్తారని వారు వివరించారు. సోమవారం 16 కి.మీ యాత్ర కొనసాగిస్తారని పేర్కొన్నారు.
ఇటు ప్రభుత్వం.. అటు ప్రతిపక్షం ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమగోడు వినిపించేందుకు షర్మిల కోసం ఎదురు చూస్తున్నారు. టీడీపీ హయాంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటలు పండక పలువురు ఆత్మహత్యల పాల్పడితే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆ కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థిక సహాయం అందించిన విషయం తెలిసిందే. సహాయం చేసినందుకు సంతోషించాల్సిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చే పైసల కోసం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని హేళన చేశారు.
పేదల కోసం వైఎస్ అమలుచేసిన సంక్షేమ పథకాలన్నింటినీ ప్రభుత్వం ఆయా వర్గాలకు ఒక్కొక్కటిగా దూరం చేస్తూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ గోడు చెప్పాలనుకున్నా టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కుకావడంతో బాధలు వినేవారు కరువయ్యారు. పేదలకోసం మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని వారికి భరోసా ఇచ్చి ఆత్మస్థైర్యం నింపేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు మహిళలు తరలొచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారు.
ల్లాలో ఇప్పటి వరకు పర్యటించిన గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో సమస్యలను షర్మిల క్షుణ్ణంగా విన్నారు. ప్రతిచోట కూడా అధైర్యపడొద్దు.. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని హామీ ఇస్తుండటంతో అలాంటి హామీ కోసం కొత్తూరు మండల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సోమవారం జేపీ దర్గా నుంచి ప్రారంభమయ్యే యాత్ర కొత్తూరు తండా వరకు కొనసాగుతుంది. ఆదివారం యాత్ర కు విరామం ఇవ్వడంతో షర్మిలను చూసేందుకు జనం ఆమె బసచేసిన టెంట్ వద్దకు చేరుకున్నారు.

No comments:
Post a Comment