రైతు సమస్యలపై ఉద్యమించాలన్న తీర్మానాన్ని వైఎస్‌ఆర్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆమోదించారు. పండిట్ రవిశంకర్‌కు నివాళులర్పిస్తూ మరో తీర్మానాన్ని ఆమోదించారు. సమావేశం ముగిసిన తరువాత పార్టీ రాజకీయ వ్యవహారా కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ విలేకరులతో మాట్లాడారు. పండిట్ రవిశంకర్ మరణం దేశానికి తీరని లోటు అన్నారు. సహకార ఎన్నికల్లో అర్హులకు అవకాశం దక్కేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ వైఫల్యం రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు బాటలో సీఎం కిరణ్ నడుస్తున్నారన్నారు. నీలం తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పారు. అఖిలపక్షంపై కేంద్రం నుంచి లేఖ అందలేదని చెప్పారు. లేఖ అందితే అందులో ఉన్న అంశాలను బట్టి స్పందిస్తామన్నారు. తెలంగాణపై తమ పార్టీకి స్పష్టమైన వైఖరి చెబుతుందన్నారు.
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును నియమించినట్లు తెలిపారు.
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును నియమించినట్లు తెలిపారు.
No comments:
Post a Comment