YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 20 October 2012

నేడు లింగాలకు పాదయాత్ర

పులివెందుల, న్యూస్‌లైన్ : శనివారం షర్మిల పాదయాత్ర పులివెందులలోని పార్నపల్లె రోడ్డులో ఉన్న రుషి స్కూలు వరకు చేరుకుంది. అక్కడ బస చేసిన షర్మిల ఆదివారం ఉదయాన్నే పులివెందుల రింగ్‌రోడ్డు మీదుగా చిన్నరంగాపురం, ఇప్పట్ల, చిన్నకుడాల క్రాస్, పెద్ద కుడాల క్రాస్ మీదుగా లింగాలకు చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి లోపట్నూతల క్రాస్ వద్దకు వరకు పాదయాత్ర సాగనుంది. అనంతరం ఆదివారం రాత్రి అక్కడనే బస చేస్తారు. 

జనసంద్రం

రెండు పాదాలకు వేలాది పాదాలు తోడవుతున్నాయి. మహానేత వైఎస్ తనయ షర్మిల చేపట్టిన పాదయాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. పదేళ్ల పిల్లల నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు స్త్రీ, పురుష తేడా లేకుండా షర్మిలతో పాటు శనివారం అడుగులేశారు. దెబ్బతిన్న చీనీ, ఎండిపోయిన పత్తి పంటలను పరి శీలిస్తూ అన్నదాతలను షర్మిల ఓదార్చారు. అధైర్యపడవద్దన్నారు. జగనన్న నాయకత్వం లో సువర్ణపాలన వస్తుందని భరోసా ఇచ్చారు. వేల్పుల నుంచి పులివెందుల వరకు పూలపై షర్మిలను నడిపించారు. వేల్పుల గ్రామంలోని మహిళలంతా కదిలివచ్చి హారతులు పట్టారు. షర్మిల పులివెందుల చేరుకునేసరికి పట్టణమంతా జనసంద్రమైంది. 

కడప, న్యూస్‌లైన్ ప్రతినిధి: పులివెందుల పట్టణం జనసంద్రమైంది. మహానేత తనయ షర్మిలకు అపూర్వ ఆదరణ లభించింది. చిన్నాపెద్ద.. ముసలీముతక అన్న తారతమ్యం లేకుండా అందరూ కలిసొచ్చి మహా ప్రజా ప్రస్థానంలో పాల్గొన్నారు. మూడోరోజు శనివారం ఉదయం వేములలో ప్రారంభమైన పాదయాత్ర భూమయ్యగారిపల్లె క్రాస్, వేల్పుల, ఎస్సీ కాలనీ, బెస్తవారిపల్లె, కె.వెలమవారిపల్లె క్రాస్, రింగ్‌రోడ్డు సర్కిల్ మీదుగా పులివెందుల పట్టణం చేరింది. పూల అంగళ్ల సర్కిల్‌లో బహిరంగ సభ అనంతరం రాజీవ్ కాలనీ సమీపంలో బస ఏర్పాటు చేసిన ప్రదేశం వరకు పదిహేను కిలోమీటర్ల మేర సాగింది. మార్గమధ్యంలో పత్తిపంట, చీనీ తోటల పరిశీలనతోపాటు సంక్షేమ పథకాలు అందక అవస్థలు పడుతున్న ఎస్సీ కాలనీ వాసులతో మమేకమయ్యారు. వారి బాధలు వింటూ.. జగనన్న నాయకత్వంలో సువర్ణపాలన వస్తుందని ధైర్యం చెబుతూ ముందుకు కదిలారు.

హారతి పళ్లేలతో స్వాగతం 
మూడోరోజైన శనివారం ఉదయం అల్పాహారం అనంతరం వేముల నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. భూమయ్యగారిపల్లె క్రాస్‌లో మాజీ సర్పంచ్ శ్రీరామిరెడ్డి పాదయాత్రకు మద్దతు తెలిపి వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. ఆయనకు షర్మిల పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. అనంతరం మార్గమధ్యంలో పత్తిపంటను పరిశీలించి రైతుల గోడు విన్న ఆమె అధైర్యపడొద్దు.. భవిష్యత్తు మనదేనని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి సమీపంలోని వేల్పులకు చేరుకున్నారు. అక్కడ మాజీ ఉప మండలాధ్యక్షుడు రామలింగారెడ్డి నాయకత్వంలో ఘన స్వాగతం పలికారు. వేల్పుల నుంచి పులివెందుల వరకు రాజన్న బిడ్డను పూలపై నడిపించారు. రహదారికి ఇరువైపులా ఫ్లెక్సీ బోర్డులతో స్వాగతం పలికారు. మహిళలు హారతి పళ్లేలతో స్వాగతించారు. చెక్కభజన ప్రదర్శన, కవాయి కట్టెల విన్యాసం ఆకట్టుకున్నాయి. అచ్చివెళ్లి, మల్లేల గ్రామాల నుంచి కవాయి కట్టెల ప్రదర్శనకారుల విన్యాసాలు ఆకర్షించాయి. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు.


పులివెందులలో నీరాజనం 
పాదయాత్రలో భాగంగా వేముల నుంచి వచ్చిన షర్మిలకు పులివెందులవాసులు నీరాజనం పలికారు. బెస్తవారిపల్లె సమీపంలోని రింగ్‌రోడ్డు వరకు ఎదురుగా వెళ్లి స్వాగతం పలికారు. అక్కడి వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండు, మెయిన్ బజారు మీదుగా పూల అంగళ్ల సర్కిల్ వరకు పాదయాత్ర సాగింది. మార్గమధ్యంలో దారి వెంబడి గుమ్మడికాయలతో దిష్టితీసే వారు కొందరైతే, కర్పూర హారతులిస్తూ మరికొందరు కనిపించారు. రాజన్న కుటుంబానికి ఎంత బాధ వచ్చిందోనంటూ.. మేమందరం మీ వెంటే ఉన్నామంటూ స్థానికులు ధైర్యం చెప్పారు. దీంతో పులివెందుల పట్టణమంతా జనసంద్రంగా మారింది. 

తరలివచ్చిన నేతలు
మూడోరోజు పాదయాత్రలో వైఎస్‌ఆర్ సీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఎంపీ, వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతి, పార్టీ ముఖ్య నేత వైవీ సుబ్బారెడ్డిలతోపాటు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ప్రసాద్‌రాజు, బాజిరెడ్డి గోవర్దన్, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, రాష్ట్ర ఆయా విభాగాల కన్వీనర్లు కొల్లి నిర్మలా కుమారి (మహిళా విభాగం), పుత్తా ప్రతాప్‌రెడ్డి (యువజన విభాగం), మధుసూదన్‌రెడ్డి (ఐటీ), శివభారత్‌రెడ్డి (వైద్యం)లతోపాటు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయులు జక్కంపూడి రాజా, జ్యోతుల నవీన్‌కుమార్ పాదయాత్రలో పాల్గొన్నారు. వీరితోపాటు జిల్లాకు చెందిన మహిళా విభాగం అధ్యక్షులు పత్తి రాజేశ్వరి, డీసీసీ బ్యాంకు చైర్మన్ బ్రహ్మనందరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, రాజశేఖరరెడ్డి వియ్యంకుడు ఈసీ గంగిరెడ్డి, కడప నగర కన్వీనర్ అంజాద్‌బాష, మాసీమబాబు తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్రతో పులివెందుల చేరిన వైఎస్ భారతి
కడప పార్లమెంటు సభ్యుడు, వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతి మరో ప్రజాప్రస్థానంలో భాగంగా పాదయాత్ర చేస్తున్న తన ఆడబిడ్డ షర్మిలతో కలిసి వేల్పుల నుంచి పులివెందుల వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. వారితోపాటు మహానేత సతీమణి విజయమ్మ బెస్తవారిపల్లె వరకు పాదయాత్రగా వచ్చారు. వైఎస్ కుటుంబ ఔదార్యం మరొకరికి సాటి రాదంటూ అక్కడి ప్రజలు కొనియాడారు.

ప్రతినోటా జగన్‌మాటే..
మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మూడోరోజు అపూర్వ స్వాగతం లభించడం ఒక ఎత్తయితే, వేలాదిగా జతకట్టిన అందరి మనస్సులు జననేత జగన్ కోసం పరితపించాయి. ఏ నోట విన్నా జగన్నామ స్మరణే వినిపించింది. ‘జగనన్న జిందాబాద్, వైఎస్‌ఆర్ జోహార్’ అంటూ నినాదాలు చేస్తూ షర్మిలకు జేజేలు పలుకుతూ పాదయాత్రలో భాగస్వాములయ్యారు. జగనన్నను అరెస్టుచేయడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. 
రెండు పాదాలకు వేలాది పాదాలు తోడవుతున్నాయి. మహానేత వైఎస్ తనయ షర్మిల చేపట్టిన పాదయాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. పదేళ్ల పిల్లల నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు స్త్రీ, పురుష తేడా లేకుండా షర్మిలతో పాటు శనివారం అడుగులేశారు. దెబ్బతిన్న చీనీ, ఎండిపోయిన పత్తి పంటలను పరి శీలిస్తూ అన్నదాతలను షర్మిల ఓదార్చారు. అధైర్యపడవద్దన్నారు. జగనన్న నాయకత్వం లో సువర్ణపాలన వస్తుందని భరోసా ఇచ్చారు. వేల్పుల నుంచి పులివెందుల వరకు పూలపై షర్మిలను నడిపించారు. వేల్పుల గ్రామంలోని మహిళలంతా కదిలివచ్చి హారతులు పట్టారు. షర్మిల పులివెందుల చేరుకునేసరికి పట్టణమంతా జనసంద్రమైంది. 

కడప, న్యూస్‌లైన్ ప్రతినిధి: పులివెందుల పట్టణం జనసంద్రమైంది. మహానేత తనయ షర్మిలకు అపూర్వ ఆదరణ లభించింది. చిన్నాపెద్ద.. ముసలీముతక అన్న తారతమ్యం లేకుండా అందరూ కలిసొచ్చి మహా ప్రజా ప్రస్థానంలో పాల్గొన్నారు. మూడోరోజు శనివారం ఉదయం వేములలో ప్రారంభమైన పాదయాత్ర భూమయ్యగారిపల్లె క్రాస్, వేల్పుల, ఎస్సీ కాలనీ, బెస్తవారిపల్లె, కె.వెలమవారిపల్లె క్రాస్, రింగ్‌రోడ్డు సర్కిల్ మీదుగా పులివెందుల పట్టణం చేరింది. పూల అంగళ్ల సర్కిల్‌లో బహిరంగ సభ అనంతరం రాజీవ్ కాలనీ సమీపంలో బస ఏర్పాటు చేసిన ప్రదేశం వరకు పదిహేను కిలోమీటర్ల మేర సాగింది. మార్గమధ్యంలో పత్తిపంట, చీనీ తోటల పరిశీలనతోపాటు సంక్షేమ పథకాలు అందక అవస్థలు పడుతున్న ఎస్సీ కాలనీ వాసులతో మమేకమయ్యారు. వారి బాధలు వింటూ.. జగనన్న నాయకత్వంలో సువర్ణపాలన వస్తుందని ధైర్యం చెబుతూ ముందుకు కదిలారు.

హారతి పళ్లేలతో స్వాగతం 
మూడోరోజైన శనివారం ఉదయం అల్పాహారం అనంతరం వేముల నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. భూమయ్యగారిపల్లె క్రాస్‌లో మాజీ సర్పంచ్ శ్రీరామిరెడ్డి పాదయాత్రకు మద్దతు తెలిపి వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. ఆయనకు షర్మిల పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. అనంతరం మార్గమధ్యంలో పత్తిపంటను పరిశీలించి రైతుల గోడు విన్న ఆమె అధైర్యపడొద్దు.. భవిష్యత్తు మనదేనని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి సమీపంలోని వేల్పులకు చేరుకున్నారు. అక్కడ మాజీ ఉప మండలాధ్యక్షుడు రామలింగారెడ్డి నాయకత్వంలో ఘన స్వాగతం పలికారు. వేల్పుల నుంచి పులివెందుల వరకు రాజన్న బిడ్డను పూలపై నడిపించారు. రహదారికి ఇరువైపులా ఫ్లెక్సీ బోర్డులతో స్వాగతం పలికారు. మహిళలు హారతి పళ్లేలతో స్వాగతించారు. చెక్కభజన ప్రదర్శన, కవాయి కట్టెల విన్యాసం ఆకట్టుకున్నాయి. అచ్చివెళ్లి, మల్లేల గ్రామాల నుంచి కవాయి కట్టెల ప్రదర్శనకారుల విన్యాసాలు ఆకర్షించాయి. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు.


పులివెందులలో నీరాజనం 
పాదయాత్రలో భాగంగా వేముల నుంచి వచ్చిన షర్మిలకు పులివెందులవాసులు నీరాజనం పలికారు. బెస్తవారిపల్లె సమీపంలోని రింగ్‌రోడ్డు వరకు ఎదురుగా వెళ్లి స్వాగతం పలికారు. అక్కడి వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండు, మెయిన్ బజారు మీదుగా పూల అంగళ్ల సర్కిల్ వరకు పాదయాత్ర సాగింది. మార్గమధ్యంలో దారి వెంబడి గుమ్మడికాయలతో దిష్టితీసే వారు కొందరైతే, కర్పూర హారతులిస్తూ మరికొందరు కనిపించారు. రాజన్న కుటుంబానికి ఎంత బాధ వచ్చిందోనంటూ.. మేమందరం మీ వెంటే ఉన్నామంటూ స్థానికులు ధైర్యం చెప్పారు. దీంతో పులివెందుల పట్టణమంతా జనసంద్రంగా మారింది. 

తరలివచ్చిన నేతలు
మూడోరోజు పాదయాత్రలో వైఎస్‌ఆర్ సీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఎంపీ, వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతి, పార్టీ ముఖ్య నేత వైవీ సుబ్బారెడ్డిలతోపాటు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ప్రసాద్‌రాజు, బాజిరెడ్డి గోవర్దన్, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, రాష్ట్ర ఆయా విభాగాల కన్వీనర్లు కొల్లి నిర్మలా కుమారి (మహిళా విభాగం), పుత్తా ప్రతాప్‌రెడ్డి (యువజన విభాగం), మధుసూదన్‌రెడ్డి (ఐటీ), శివభారత్‌రెడ్డి (వైద్యం)లతోపాటు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయులు జక్కంపూడి రాజా, జ్యోతుల నవీన్‌కుమార్ పాదయాత్రలో పాల్గొన్నారు. వీరితోపాటు జిల్లాకు చెందిన మహిళా విభాగం అధ్యక్షులు పత్తి రాజేశ్వరి, డీసీసీ బ్యాంకు చైర్మన్ బ్రహ్మనందరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, రాజశేఖరరెడ్డి వియ్యంకుడు ఈసీ గంగిరెడ్డి, కడప నగర కన్వీనర్ అంజాద్‌బాష, మాసీమబాబు తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్రతో పులివెందుల చేరిన వైఎస్ భారతి
కడప పార్లమెంటు సభ్యుడు, వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతి మరో ప్రజాప్రస్థానంలో భాగంగా పాదయాత్ర చేస్తున్న తన ఆడబిడ్డ షర్మిలతో కలిసి వేల్పుల నుంచి పులివెందుల వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. వారితోపాటు మహానేత సతీమణి విజయమ్మ బెస్తవారిపల్లె వరకు పాదయాత్రగా వచ్చారు. వైఎస్ కుటుంబ ఔదార్యం మరొకరికి సాటి రాదంటూ అక్కడి ప్రజలు కొనియాడారు.

ప్రతినోటా జగన్‌మాటే..
మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మూడోరోజు అపూర్వ స్వాగతం లభించడం ఒక ఎత్తయితే, వేలాదిగా జతకట్టిన అందరి మనస్సులు జననేత జగన్ కోసం పరితపించాయి. ఏ నోట విన్నా జగన్నామ స్మరణే వినిపించింది. ‘జగనన్న జిందాబాద్, వైఎస్‌ఆర్ జోహార్’ అంటూ నినాదాలు చేస్తూ షర్మిలకు జేజేలు పలుకుతూ పాదయాత్రలో భాగస్వాములయ్యారు. జగనన్నను అరెస్టుచేయడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. 

పార్టీ శ్రేణులు, ప్రజల్లో ఉత్సాహం నింపుతున్న షర్మిల పాదయాత్ర


యాత్రపై టీడీపీ, కాంగ్రెస్ నేతల్లో ఎడతెగని చర్చ

అదే పిలుపు.. అవే పలుకులు.. మహానేత వైఎస్‌ను అనుసరిస్తూ.. జననేత జగన్‌ను గుర్తు తెస్తూ సాగుతోన్న షర్మిల పాదయాత్ర అటు ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. షర్మిలలో వైఎస్‌ను, జగన్‌ను చూసుకుంటూ అడుగడుగునా ‘మరో ప్రజా ప్రస్థానాని’కి జనం బ్రహ్మరథం పడుతున్నారు. తమ కష్టాలు బయటకు కనిపించకుండా, ప్రజల కష్టాలను నింపాదిగా తెలుసుకుంటున్న షర్మిల.. ‘జగనన్న నాయకత్వంలో వచ్చే రాజన్న రాజ్యంలో మీ కష్టాలన్నీ తీరుస్తాం’ అని ప్రజల గుండెతట్టి ధైర్యం చెబుతున్నారు.
పంట పాడవకుండా జాగ్రత్త: పాదయాత్ర దారిలోని పొలాల్లో రైతులు కనపడినా, కూలీలు కనిపించినా షర్మిల అడుగు పొలంవైపు వెళుతోంది. ‘ఏం పెద్దమ్మా! ఏం తాతా! చెప్పన్నా! చెప్పక్కా!’ అంటూ జగన్‌లాగా పిలుస్తూ వారి కష్టాలను ఆమె స్వయంగా తెలుసుకుంటున్నారు. తనతో పాటు పార్టీ కార్యకర్తలు పొలంలోకి వెళితే పంటకు నష్టం వాటిల్లుతుందని అందరినీ రోడ్డుపైనే ఆగమని చెప్పి.. ఆమె మాత్రమే పొలంలోకి వెళ్లి మాట్లాడి వస్తున్నారు. ఈ విషయంలో పదే పదే షర్మిల చూపుతున్న జాగ్రత్త రైతన్నలపై, వారి కష్టంపై ఉన్న చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోంది.
సామాన్యుడి కష్టాలు తెలుసుకునేలా: తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిలానే షర్మిల యాత్ర సాగిస్తున్నారు. మధ్యాహ్న భోజనమైనా.. రాత్రి నిద్రఅయినా రోడ్డు పక్కన వేసిన టెంటులోనే! శుక్రవారం రాత్రి వేములలో వర్షం కురిసింది. టెంటులో వర్షం నీరు కారుతుందని, బస్సులో నిద్రపోవాలని పోలీసులతో పాటు పార్టీ నేతలు ఆమెను కోరారు. ‘వర్షం పడితే ఏమవుతుంది. ఇక్కడే నిద్రపోతా!’ అని షర్మిల తెగేసి చెప్పారు. దీంతో ఇళ్లులేని ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ అర్థమయ్యేలా ప్రవర్తించారు.

సమస్యలపై దృష్టి: షర్మిల యాత్రలో ప్రజా సమస్యలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. గ్రామాల్లో, పొలాల్లోని ప్రజలతో అధిక సమయం కేటాయిస్తూ, తక్కిన సమయంలో వేగంగా నడుస్తున్నారు. షర్మిల నడుస్తుంటే తక్కిన వారు పరుగెత్తాల్సిన స్థితి. జగన్ తప్పకుండా బయటకు వస్తారు అంటూ ఆమెకు ప్రజలు ధైర్యం చెప్తుంటే.. ‘అందరి ఆశీస్సులు జగనన్నపై ఉన్నాయి. మీ చల్లని చూపు ఉంటే త్వరలోనే జగనన్న బయటకు వస్తాడు. సీఎం అవుతాడు. మీ సమస్యలన్నీ తీరుస్తాడు’ అని షర్మిల వారికి భరోసా ఇస్తున్నారు.
పదునుగా విమర్శలు: ప్రజా సమస్యలపై షర్మిల అవగాహన, ప్రభుత్వం, ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నిస్తున్న తీరు ప్రజలను ఆకట్టుకుంటోంది.

ఆమె ప్రశ్నాస్త్రాలతో అధికార, ప్రతిపక్షాలను గుక్కతిప్పుకోనీకుండా షర్మిల ఇరుకున పెడుతున్నారు. ‘‘చంద్రబాబును ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా! పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి వచ్చావు.. సరే! ఆయన ప్రవేశపెట్టిన రెండు రూపాయల కిలోబియ్యం, మద్యపాన నిషేధం ఎత్తేసింది మీరు కాదా? ఎందుకు వాటిని ఎత్తేశారో సమాధానం చెప్పండి’ అని షర్మిల సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితి టీడీపీది. ‘వైఎస్ మా నాయకుడు అని చెబుతున్నారు. రెండుసార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. మరి ఆయన మృతివార్త విని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునే బాధ్యత ఎందుకు తీసుకోలేదు’ అన్న ఆమె ప్రశ్నకు కాంగ్రెస్ నుంచి ఒక్కనాయకుడు సమాధానం చెప్పలేని పరిస్థితి.

కాంగ్రెస్, టీడీపీలో చర్చ: షర్మిల పాదయాత్రపై కాంగ్రెస్, టీడీపీ నేతల్లో తీవ్ర చర్చసాగుతోంది. షర్మిల పాదయాత్ర ప్రారంభించిన తర్వాత చంద్రబాబు యాత్ర ఎలాసాగుతుందనే దానికంటే, షర్మిల యాత్రపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా చర్చ సాగిస్తున్నారు.
- న్యూస్‌లైన్, కడప

ఉదయించే సూర్యుడిని ఆపలేరు

జగనన్నను బయటికి రాకుండా ఆపలేరు
ఆరోజు త్వరలోనే వస్తుంది 
కాంగ్రెస్, టీడీపీలకు మనుగడ ఉండదు

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘ఒక రోజు వస్తుంది. ఎలాగైతే ఎగిసే కెరటాన్ని, ఉదయించే సూర్యుడిని ఆపలేరో.. అలాగే జగనన్ననూ ఆపలేరు. ఆరోజు ఆ దేవుడే జగనన్నను బయటకు తెస్తాడు. ఆ రోజు ఈ కాంగ్రెస్, టీడీపీలకు మనుగడ ఉండదు. ఆ రోజు మన రాజన్న రాజ్యం దిశగా నడుస్తాం. రాజన్న ప్రతి ఆశయాన్ని జగనన్న నెరవేరుస్తాడు. అలాంటి రోజు కోసం ఎదురు చూద్దాం. ఆరోజున మీరంతా ఆ పార్టీలకు బుద్ధిచెప్పాలి..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం పట్టని ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన తెలుగుదేశం పార్టీ కుట్ర రాజకీయాలకూ నిరసనగా చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రలో మూడో రోజు శనివారం షర్మిల పులివెందుల బహిరంగ సభలో మాట్లాడారు. 

‘మీ రాజన్న గురించి, మీ జగనన్న గురించి నేను మీకు చెప్పాల్సిన పనిలేదు. మంచి మనసు, మాట మీద నిలబడే నైజం వారిద్దరిది. జగనన్న నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా. నేను రాజన్న పాదాన్ని. జగనన్న విడిచిన బాణాన్ని. కాంగ్రెస్, టీడీపీలు జగనన్నను మన మధ్యకు రానివ్వలేని పరిస్థితి సృష్టించడంతో మీకు ధైర్యం చెప్పమని అన్న నన్ను పంపించాడు. 30 ఏళ్లు కాంగ్రెస్‌కు విశ్వాసంతో సేవ చేస్తే, ప్రతి పథకానికి వాళ్ల పేర్లే పెడితే వారిచ్చిన బహుమతి ఎఫ్‌ఐఆర్‌లో నాన్న పేరు చేర్చడం. నాన్న చనిపోయినప్పుడు 600 మంది గుండె ఆగితే వారిని ఓదార్చాలన్న కనీస బాధ్యత ఆ పార్టీకి గుర్తుకు రాలేదు. ఓదారుస్తానని ఇచ్చిన మాట కోసం కట్టుబడిన జగనన్నను కక్ష గట్టి జైల్లో పెట్టారు. కాంగ్రెస్‌లోనే ఉంటే సీఎం కూడా అయ్యేవారని ఆజాద్ చెబుతున్నారు. అంటే ఇది కక్ష కాక మరేంటి?’ అని ప్రశ్నించారు.

ప్రతి పథకానికి తూట్లు..

‘‘రాజన్న రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం రైతును విస్మరించింది. విద్యార్థులకు మొండిచేయి చూపింది. ఆరోగ్యశ్రీని కట్టిపడేసింది. రాజన్న తెచ్చిన ప్రతి పథకానికి తూట్లు పొడిచింది. మూడేళ్లలో మూడు సార్లు విద్యుత్తు చార్జీలు పెంచింది. గడిచిన సంవత్సరాలకు చెందినవాటిపై సర్‌చార్జీల పేరుతో వేల కోట్ల భారం మోపింది. ఇది అన్యాయం కదా అని నిలదీయాల్సిన టీడీపీ చోద్యం చూస్తోంది. కిరణ్‌కుమార్‌రెడ్డి నిద్రపోతున్నారనుకుంటే చంద్రబాబు కూడా నిద్రపోతున్నారు. వ్యవసాయం దండగ అంటారు. ప్రాజెక్టులు కడితే రాష్ట్రానికి నష్టం అంటారు. ఉచిత విద్యుత్తు వద్దంటారు. ఆనాడు రైతులు కరువుతో విలవిల్లాడుతూ వలస పోతుంటే, ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రజల మైండ్ సెట్ మారాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కంపెనీగా మార్చి తానే సీఈవోనని అన్నారు. ప్రజల అవసరాలు అర్థం చేసుకుని వాటిని తీర్చే నాయకుడు కావాలా? లేక పాలనను వ్యాపార దృష్టితో ఆలోచించే నాయకుడు కావాలా? తన మైండ్‌సెట్ మార్చుకుని ప్రజల గురించే ఆలోచించే నాయకుడు కావాలా? ప్రజల మైండ్‌సెట్ మారాలనే హిట్లర్‌లాంటి నాయకుడు కావాలా? ఆలోచించండి’’ అని షర్మిల ఉద్వేగంగా ప్రసంగించారు.

ఊరంతా ఫ్లెక్సీలు..ట్రాక్టర్ల నిండా పూలు

పాదయాత్ర మూడో రోజు శనివారం షర్మిల మొత్తం 15 కిలోమీటర్ల మేర నడిచారు. ఉదయం 9.45కు వేములలో ప్రారంభమైన యాత్ర రోజంతా చినుకులు పడుతున్నా భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులతో వడివడిగా ముందుకు సాగింది. పులివెందుల సభలో వర్షం కురిసినా జనం కట్టుకదల్లేదు. యాత్రలో వేముల, భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లి, కోట తదితర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు వచ్చి షర్మిలకు స్వాగతం పలికారు. వేల్పుల గ్రామమైతే జాతరను తలపించింది. ఓ వైపు ఈటెల కవాతు, కళాకారుల ప్రదర్శనలు, 500 మంది మహిళల మంగళహారతులతో వేల్పుల గ్రామం ఘనస్వాగతం పలికింది. ఆ ఊళ్లో 1,500 మంది ఓటర్లు ఉంటే 1,300 మంది దాకా స్వాగత ఫ్లెక్సీలు కట్టారు. 4 కిలోమీటర్ల మేర రెండు ట్రాక్టర్లతో పూలవర్షం కురిపించారు. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం కోసం వేల్పుల సమీపంలోని బీసీ కాలనీ వద్ద షర్మిల విశ్రాంతి తీసుకున్నారు. 4 గంటలకు మళ్లీ యాత్ర ప్రారంభమవగా షర్మిల సమీప కాలనీకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. తర్వాత పంట చేలల్లో రైతులతో మాట్లాడారు. మార్గం మధ్యలో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధి బృందం ఆమెను కలిసి.. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాలని కోరింది. బెస్తవారిపల్లిలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి ఘనస్వాగతం పలికారు. సాయంత్రం 6.15కు పులివెందుల రింగ్‌రోడ్డులో ఉన్న రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి షర్మిల నివాళులర్పించారు. భారీ సంఖ్యలో జనం వెంటరాగా రాత్రి 7.20కి పులివెందుల చేరుకున్న షర్మిల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో షర్మిల, విజయమ్మ ప్రసంగించి రాత్రి 8.45కు మూడో రోజు బస ప్రాంతమైన రాజీవ్‌నగర్ కాలనీకి చేరుకున్నారు.

పాదయాత్రలో విజయమ్మ, భారతి

మూడో రోజు పాదయాత్రలో షర్మిలతో పాటు వైఎస్ విజయమ్మ, జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతి పాల్గొన్నారు. వేముల నుంచి పులివెందుల వరకు పాదయాత్ర చేశారు. బెస్తవారిపల్లి నుంచి పులివెందుల బహిరంగ సభ వరకు నాలుగు కిలోమీటర్ల వరకు షర్మిల కుమార్తె కూడా పాదయాత్రలో నడిచారు.

కుట్రలపై జగన్ బాణమే షర్మిల: జోగయ్య


 కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి చేస్తున్న కుట్రలు, కుతంత్రాలపైనా.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కుపెట్టిన బాణమే షర్మిల అని ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ హరిరామజోగయ్య వ్యాఖ్యానించారు. జగన్ పొదిలో చాలా అస్త్రాలున్నాయని.. ఇకపై కాంగ్రెస్, టీడీపీల కుట్రలు చెల్లవని పేర్కొన్నారు. ఆయన శనివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌పార్టీలో నూటికి నూరుపాళ్లు నీతిమంతులెవరో చెప్పగలిగే దమ్ము పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఉందా? అని సవాల్ చేశారు. జగన్ తన సోదరి షర్మిల ను ఎవరిపై ఎక్కుపెట్టిన బాణమంటూ బొత్స విమర్శించడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం మిన్నకుండిపోయిందని, అధికార-ప్రతిపక్షాలు ఏకమై ప్రజలను గాలికొదిలేశారని దుయ్యబట్టారు.

రైతులు గర్వించే రోజొస్తుంది

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘జగన్ బాబు పార్టీ ప్లీనరీ సమావేశంలో మాట ఇచ్చాడు. పార్టీ అధికారంలోకి వచ్చాక.. ‘అమ్మ ఒడి’ పథకం ప్రవేశపెడతానన్నాడు. పిల్లలను బడికి పంపితే ఒక్కో పిల్లాడికి రూ. 500 చొప్పున తల్లి ఖాతాలో ప్రతి నెలా జమ చేస్తానన్నాడు. పిల్లలను పూర్తిగా ఉచితంగా చదివిస్తానన్నాడు. అవ్వాతాతలు మూడు పూటలా భోజనం చేసేందుకు వీలుగా నెలకు రూ.700 పెన్షన్ ఇస్తానన్నాడు. వికలాంగులకు పెన్షన్ రూ. 1,000 చేస్తానన్నాడు. రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి కింద ప్రత్యేకంగా రూ. 3 వేల కోట్ల నిధి పెడతానన్నాడు. రైతులు ఇది మా ప్రభుత్వం అని ధైర్యంగా కాలర్ ఎగురవేసుకునే పరిస్థితి తెస్తానన్నాడు. ఇది జగన్ బాబు మాట..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ‘మరో ప్రజాప్రస్థానం’లో భాగంగా శనివారం పులివెందుల బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ‘టీడీపీ హయాంలో కరువు కాటకాలు, కరెంటు బిల్లులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రోజుల్లో వారిని ఓదార్చేందుకు రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం చేపట్టారు. 

ఈరోజు టీడీపీ హయాం కంటే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం తీసిపోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘మరో ప్రజాప్రస్థానం’ చేపట్టాలని జగన్‌బాబు జైల్లోనే రూట్‌మ్యాప్ తయారుచేసుకున్నాడు. గత నెల 28న, ఈ నెల 5న బెయిల్ వస్తుందనుకున్నాం. కానీ రాలేదు. అయినా ప్రజాసమస్యలపై నినదించాలని, వారికి ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని జగన్‌బాబు నాతో చెప్పారు. 8 కోట్ల మంది ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలన్నాడు. కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పేందుకు ఎవరో ఒకరు ఉండాలని చెప్పాడు. మోకాళ్ల నొప్పులతో ఉన్న నేను నడవలేని పరిస్థితి. ప్రజల కోసం జగన్ పడుతున్న ఆవేదన చూసి షర్మిల తాను నడుస్తానంది. జగన్ రాగానే ఈ పాదయాత్ర తానే చేస్తాడు..’ అని విజయమ్మ స్పష్టంచేశారు.

ప్రభుత్వం స్పందించలేదు..

‘జగన్ ఫీజుల గురించి, రైతుల గురించి అనేక దీక్షలు, ఆందోళనలు చేసినా ఈ ప్రభుత్వం స్పందించలేదు. కేసులు పెట్టిన తరువాత 10 నెలలు కూడా ప్రజల మధ్యే ఉన్నారు. కుటుంబం వైపు కూడా చూడలేదు. సరిగ్గా ఉప ఎన్నికల ముందు విచారణ పేరుతో అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇప్పటికి 147 రోజులైంది. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై కథ నడిపిస్తున్నాయి. ఈ కుమ్మక్కు రాజకీయాలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబువి దొంగమాటలు. ఆయనకు కూడా మీరు సమాధానం చెప్పాలి. జగన్ త్వరలోనే మీ ముందుకు వస్తానని చెప్పమన్నాడు. అంద రూ ధైర్యంగా ఉండమని తన మాటగా చెప్పమన్నాడు. మళ్లీ రాజశేఖరరెడ్డి సువర్ణ యుగం వస్తుంది..’ అని విజయమ్మ ఉద్ఘాటించారు.

వైఎస్ ఉంటే ఈ కష్టాలొచ్చేవి కావు


వేముల(వైఎస్సార్ జిల్లా), న్యూస్‌లైన్: ‘‘నాలుగేళ్ల క్రితం నా బిడ్డకు మెదడులో గడ్డ ఉండటంతో తలతిరిగి పడిపోయేవాడు.. వైఎస్ దయవల్ల ఆరోగ్యశ్రీ కార్డు ఉండటంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించాం. అయితే రోగం నయం కాకపోవడంతో మళ్లీ ఆ ఆసుపత్రికి వెళితే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు రద్దయిందంటూ వైద్యం చేయనంటున్నారు. ఇప్పుడు అక్కడ ఆపరేషన్ చేయాలంటే వేలకు వేలు అడుగుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేసే పరిస్థితే లేదు. వైఎస్ ఉండి ఉంటే మాకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావు’’ అంటూ వేల్పుల గ్రామానికి చెందిన సుశీలమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. వేల్పుల వద్ద మధ్యాహ్న భోజనం చేసి విశ్రాంతి అనంతరం సమీప కాలనీలోని సుశీలమ్మ ఇంటికి షర్మిల వెళ్లినప్పుడు ఆమె తన సమస్యలను విన్నవించారు. రోడ్డు ప్రమాదంలో తన కాలు దెబ్బతిన్నప్పుడు కూడా తాను వైఎస్ దయతో తిరుపతి వెళ్లి వైద్యం చేయించుకున్నానని తెలిపారు. ఈ ప్రభుత్వం తమ ఆరోగ్యశ్రీ కార్డును రద్దు చేయడంతోపాటు అన్నింటి ధరలూ పెంచేసిందన్నారు. కాలనీలో నీళ్లు రావట్లేదని, కరెంటు ఉండట్లేదని చెప్పారు. త్వరలో మంచి కాలం వస్తుందని, జగనన్న ముఖ్యమంత్రి అయితే సమస్యలన్నీ తీరుతాయని షర్మిల భరోసా ఇచ్చారు. కాలనీలో నీటి విషయంపై స్పందించిన ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మ.. ఎమ్మెల్యే కోటా నిధులతో కాలనీలో బోరువేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని మహిళలకు హామీ ఇచ్చారు.

YS Sharmila's speech at Pulivendula

షర్మిలకు మద్దతుగా కువైట్‌లో పాదయాత్ర

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్ షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు సంఘీభావంగా కువైట్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు పాదయాత్ర నిర్వహించారు. ఖేతాన్ ప్రాంతం నుంచి తెలుగువారు ఎక్కువగా నివసించే మాలియా వరకూ 14 కిలోమీటర్ల పొడ వున ఈ యాత్ర సాగిందని పార్టీ ఎన్నారై విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ కమిటీ సభ్యులు, వైఎస్సార్ అభిమానులు కె.వాసుదేవరెడ్డి, జి.సిద్ధయ్య, పి.విశ్వనాథ్‌రెడ్డి, సి.పెంచల్‌రెడ్డి, ఎం.సుధాకర్‌రెడ్డి, కె.సహదేవరాజు, షేక్ మహబూబ్‌బాషా, సుబ్రమణ్యం రాజుతో సహా పెద్ద సంఖ్యలో అభిమానులు ఈ యాత్రలో పాల్గొన్నారని వివరించారు. ఒక మహిళ 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టడం ప్రపంచ చరిత్రలోనే రికార్డు అని ఎన్‌ఆర్‌ఐలు కొనియాడారు. షర్మిల పర్యటనకు జనం నీరాజనాలు పడతారని, ఆమెకు మద్దతుగా లక్షలాది మంది మరో ప్రజాప్రస్థానంలో పాల్గొంటారని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలాంటి సాహసోపేతమైన పనులు చేయడం ఒక్క వైఎస్సార్ కుటుంబానికే సాధ్యమవుతుందని వక్తలు అన్నారు. వైఎస్సార్ కుటుంబానికి తామంతా అండగా నిలబడతామని వారు ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా వైఎస్ కుటుంబంపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని, లేని పక్షంలో ప్రజలు కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు.

YS Vijayamma's speech at Pulivendula

షర్మిల అనంత షెడ్యూల్ ఖరారు

అనంతపురం జిల్లాలో షర్మిల పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 23వ తేదీ నుంచి షర్మిల మరో ప్రజాప్రస్థానం యాత్ర నిర్వహించనున్నారు. దాడితోట దగ్గర షర్మిల అనంతపురం జిల్లాలో ప్రవేశిస్తారు. 14 రోజుల పాటు ధర్మవరం, రాప్తాడు, అనంతపురం, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో పాదయాత్ర జరగనుంది. మొత్తం 75 గ్రామాలు, పట్టణాల మీదుగా పాదయాత్ర జరిగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. qరాజన్న బిడ్డ కోసం జనం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని.. కనీవినీఎరుగని రీతిలో పాదయాత్ర జరగనుందని వైఎస్‌ఆర్‌ సిపి నేత శంకర నారాయణ చెప్పారు.

source:sakhi

Roja on YS Sharmila's Maro Praja Prasthanam

Free Ambulance service in Maro Praja Prasthanam

Sharmila's padayatra schedule for Anantapur finalised

YS Manohar Reddy on Sharmila's Padayatra

Sharmila's padayatra reaches Besthavaripalli

Sharmila's padayatra reaches Besthavaripalli

షర్మిల నేటి పాదయాత్ర షెడ్యూల్

భూమయ్యగారి పల్లె : మరో ప్రజాప్రస్థానంలో భాగంగా నేడు షర్మిల మూడోరోజు పాదయాత్ర వైఎస్‌ఆర్‌ జిల్లాలోని భూమయ్యగారి పల్లె క్రాస్‌ వద్దనుంచి ప్రారంభమై వేల్పులకు చేరుకుంటుంది. అక్కడినుంచి బెస్తవారి పల్లెకు, అక్కడినుంచి పులివెందుల ఆర్టీసి బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకుంటుంది. అనంతరం బస్టాండ్‌ సెంటర్‌నుంచి పూల అంగళ్ల సర్కిల్‌ దాకా షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత రిషీ స్కూల్‌లో షర్మిల రాత్రికి బస చేస్తారు. 

పత్తిపంటను పరిశీలించిన షర్మిల


వేముల : షర్మిల మరో ప్రజాస్థానం పాదయాత్రను మూడోరోజు వైఎస్ఆర్ జిల్లా భూమయ్యగారి పల్లె క్రాస్ నుంచి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కూడా షర్మిల వెంట ఉన్నారు. భూమయ్యగారి పల్లె క్రాస్ ఆమె పత్తిపంటను పరిశీలించారు. ఈ సందర్బంగా రైతుల తమ గోడును చెప్పుకున్నారు.

source:sakshi

అనంతలో 23నుంచి షర్మిల పాదయాత్ర


అనంతపురం : అనంతపురం జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 23వ తేదీ నుంచి ఆమె మరో ప్రజాప్రస్థానం యాత్ర నిర్వహించనున్నారు. పులివెందుల నియోజకవర్గాన్ని పూర్తి చేసుకున్న అనంతరం దాడితోట వద్ద వైఎస్ షర్మిల అనంతలోకి ప్రవేశిస్తారు. 

సుమారు 14 రోజుల పాటు ధర్మవరం, రాప్తాడు, అనంతపురం, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. మొత్తం 75 గ్రామాల.. పట్టణాల మీదుగా షర్మిల పాదయాత్ర జరిగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. షర్మిల పాదయాత్ర కోసం అనంత జనం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని.. కనీవినీఎరుగని రీతిలో అనంతపురంలో పాదయాత్ర జరగనుందని వైఎస్‌ఆర్‌ సిపి నేత శంకర నారాయణ చెప్పారు.

source:sakshi

జనసంద్రంగా మారిన వేల్పుల


వేల్పుల : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల రాకతో వేల్పుల జన సంద్రమైంది. మరో ప్రజాప్రస్థానం మూడోరోజు యాత్రలో వేల్పుల వచ్చిన ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారిపొడవునా పూలవర్షం కురిపించారు. మహిళలు మంగళ హారతులు ఇచ్చారు. ఆత్మీయ స్వాగతం నడుమ వేల్పుల మీదుగా వైఎస్‌ షర్మిల ముందుకు సాగారు. ఆమె వెంట వైఎస్ విజయమ్మ, భారతి కూడా ఉన్నారు.

Friday 19 October 2012

padhayatra images

అచ్చంగా రాజన్నలా..


హైదరాబాద్, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేప భాస్కర్‌రెడ్డి ఆరు పాటలతో రూపొందించిన సీడీ ప్రజలను ఆకట్టుకుంటోంది. గురువారం రాత్రి వేంపల్లెలో వైఎస్సార్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల ఈ పాట ల సీడీని ఆవిష్కరించారు. ‘‘అచ్చంగా రాజన్నలా.. ఉన్నడే జగనన్నా..’’ అనే పాట పాదయాత్రలో మార్మోగుతోంది. ‘‘ప్రస్థానం.. ప్రస్థా నం.. ప్రస్థానం... శర్మిలమ్మ చేపట్టిన మరో ప్రస్థానం..’’ పాటకు జనం నుంచి మంచి స్పందన వస్తోంది. కుర్చీ కోసం చంద్రబాబు ‘వస్తున్నా-మీ కోసం’ యాత్ర పేరుతో ప్రజలకు వద్దకు వచ్చి మొసలి కన్నీళ్లు కారుస్తుంటే.. ‘ఇందిరమ్మ బాట’ తో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నాడంటూ సాగే పాటలకు మంచి ఆదరణ వచ్చింది.

ఏ నోట విన్నా.. జగనే!

జగన్..! ఏ నోట విన్నా.. ఎవరిని కదిపినా ఇదే మాట!! మరో ప్రజాప్రస్థానం జగన్నామస్మరణతో మార్మోగుతోంది. పాదయాత్రలో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం తమ అభిమాన నేతను తలుచుకుంటున్నారు. కాంగ్రెస్, టీడీపీలు కుట్రపన్ని జైల్లో పెట్టినంత మాత్రాన జగన్‌ను తమ గుండెల్లోంచి తొలగించలేరని చెబుతున్నారు. ఎన్ని కుతంత్రాలు చేసినా చివరికి న్యాయమే గెలుస్తుందని, జగన్ త్వరలోనే తమ ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ‘‘జగన్‌పై కక్షతోనే జైళ్లో పెట్టారు. వాళ్ల కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎన్ని కష్టాలొచ్చినా మేం మాత్రం వైఎస్ కుటుంబం వెంటే ఉంటాం’’ అని పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన శెట్టిబద్దుల రాజబాబు అని చెప్పారు. 

కాంగ్రెస్‌కు దమ్ముంటే జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలని, ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధం కావాలని విశాఖపట్నానికి చెందిన ఝాన్సీ అన్నారు. ‘‘చంద్రబాబు అవిశ్వాసం పెట్టమంటే పెట్టడం లేదు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కు అయ్యానడానికి ఇదే నిదర్శనం’’ అని ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన సయ్యద్ గౌస్ పేర్కొన్నారు. ‘‘షర్మిలమ్మ పాదయాత్రకు ఎంతమంది జనం వచ్చారో చూశాక అయినా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇంతమంది జగన్ వైపు ఉంటే ఆయన తప్పు చేయలేదని ఇంతమంది నమ్ముతుంటే ఇంకెన్నాళ్లు జైల్లో పెడతారు..’’ అని వైఎస్సార్ జిల్లా పోట్లదుర్తికి చెందిన రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

గుండె చెబుతోంది.. పదం కలపమని!

‘‘చాలా దూరం.. ఒకటిన్నర రోజు ప్రయాణం.. 6 నెలలు.. 3 వేల కిలోమీటర్లు ఏదోఒక రోజు వెళ్లి పాదయాత్రలో పాల్గొనొచ్చులే అనుకున్నాం. కానీ మా గుండె మాత్రం మాట వినలేదు. షర్మిలమ్మ అడుగులో అడుగు కలపని చెప్పింది. అందుకే ఉండబట్టలేక వచ్చేశా..’ ఇదీ ఇతర జిల్లాల నుంచి పోటెత్తుతున్న జనం మాట!! షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానానికి తెలంగాణ జిల్లాలోని వరంగల్, కరీంనగర్, సిరిసిల్ల, మహబూబ్ నగర్‌తోపాటు చాలా ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. కోస్తా నుంచి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా.. ఇలా అన్ని ప్రాంతాల నుంచి ప్రజావాహిణి తరలివచ్చింది. ఇక రాయలసీమ జిల్లాల నుంచి జనం పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు.
- న్యూస్‌లైన్, కడప

జనంతో మమేకమవుతూ ముందుకు సాగిన వైఎస్ తనయ

కరెంటు ఇచ్చేంత ముందు చూపుకూడా లేదు 
రైతులకు న్యాయం చేయకుండా మొద్దునిద్ర పోతోంది
ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదు 
రాజన్న రాజ్యం మళ్లీ రావాలి.. అది జగనన్నతోనే సాధ్యం
కుమ్మక్కు రాజకీయాలకు నిరసన తెలపండి 
పాదయాత్రకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజలు
జనంతో మమేకమవుతూ ముందుకు సాగిన వైఎస్ తనయ

ఈ కన్నీళ్లు అబద్ధం చెబుతాయా?

కత్తులూరు పంచాయతీకి చెందిన మల్లకాని సిద్దయ్య కొడుకు శివ పాములూరు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పాదయాత్ర సాగుతుండగా గొర్రెలు కాస్తూ కనిపించాడు. ఆ పిల్లాడితో షర్మిల సంభాషణ ఇదీ..

షర్మిల: ఏం చిన్నా.. గొర్రెలు కాస్తున్నావ్?

శివ (కన్నీళ్లతో): మా నాన్నకు బాగోలేకుంటే నేను కాపలాకు వచ్చా. స్కూలుకు వెళ్లాలని ఉన్నా వెళ్లలేని పరిస్థితి. ఇక్కడ తిండి లేదు. పశువులకు మేత కూడా లేదు. అమ్మకు చెవుడు. పెన్షన్ కూడా రాదు. నాన్నకు బీపీ, షుగర్. పనికి వెళ్లలేడు. అన్న జేసీబీ మీద పనిచేస్తాడు. నాన్న బ్యాంకుకు వెళితే కనీసం లోను కూడా ఇవ్వలేదు.

షర్మిల: చూశారుగా.. ఈ కన్నీళ్లు అబద్ధం చెబుతాయా? చిన్న పిల్లాడు. చదువుకోవాల్సిన వయసు. ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. జగనన్న ఇలాంటి పిల్లలు చదువుకోవాలన్న ఉద్దేశంతో ‘అమ్మ ఒడి’ పథకం తెస్తానని చెప్పాడు. పిల్లలను బడికి పంపితే తల్లులకు నెలకు రూ.500 చొప్పున సాయం చేసే పథకం అది. ఏ సాయం చేయని ఈ ప్రభుత్వం మనకు అవసరమా? 

మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: పేదల గోడు పట్టని ప్రభుత్వంపై, ప్రజాసమస్యలను గాలికొదిలేసిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపై దివంగత మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వానికి కరెంటు ఇచ్చే ముందుచూపు కూడా లేదని, రైతులు కష్టాల ఊబిలో కూరుకుపోయినా మొద్దు నిద్ర వీడడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలంటే మళ్లీ రాజన్న పాలన రావాలని, అది జగనన్నతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. రైతన్నలు, విద్యార్థులు, కార్మికులు, కూలీలు, మహిళలతో మమేకమవుతూ శుక్రవారం వైఎస్సార్ జిల్లాలో షర్మిల రెండోరోజు ‘మరో ప్రజాప్రస్థానం’ కొనసాగించారు. వెళ్లిన ప్రతిచోటా జనం షర్మిలతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. కరెంటు కష్టాలు.. పింఛను వెతలు.. ఫీజుల వేదన.. ఇలా అనేక సమస్యలను ఆమెతో పంచుకున్నారు. వైఎస్ ఉన్నప్పుడు, ఇప్పుడు తమ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. ఉదయం 9.50కి వేంపల్లి సమీపంలోని రాజీవ్‌నగర్ వద్ద పాదయాత్ర ప్రారంభమైంది.

యాత్ర ముందుకు సాగుతుండగా.. సయ్యద్ బీబీ అనే మహిళ తన బాధలు వివరించింది. వైఎస్ ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నానని, ఇప్పుడు నిలువ నీడైతే ఉంది గానీ కరెంటు బిల్లులతో, కరెంటు కోతలతో నిద్రే కరువైందని విలపించింది. ఇందుకు జగనన్న తొందర్లోనే మీ ముందుకు వస్తాడని, మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని చెబుతూ షర్మిల ఆమెను ఊరడించారు. అక్కడి నుంచి ముందుకు సాగుతుండగా వృద్ధ మహిళలు చాలామంది ఎదురొచ్చారు. రాజశేఖరరెడ్డి వల్లే తనకు పెన్షన్ వచ్చిందని ఒకరు.. మూడేళ్లుగా పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకుంటూనే ఉన్నా ఇవ్వడం లేదని మరొకరు చెప్పారు. ‘‘చంద్రబాబు ఉన్నప్పుడు బియ్యం కార్డు ఉంటేనే సంఘంలో చేరనిచ్చేవారు. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చాక అందరం చేరాం. పావలా వడ్డీ పథకం అందింది. కానీ ఇప్పుడు మాతో బలవంతంగా వడ్డీ కట్టించుకుంటున్నారు..’’ అని మరికొందరు మహిళలు షర్మిల ముందు ఆవేదన వ్యక్తంచేశారు.

కార్మికులు, వారి కుటుంబాలు ఏం కావాలి?

మార్గమధ్యంలో కత్తులూరు పంచాయతీ మహిళలు షర్మిలకు ఎదురేగి స్వాగతం పలికారు. ‘‘మాకు సాగునీరు లేక పొలాలు ఎండుతున్నాయి. కనీసం తాగునీరు కూడా లేదు. కరెంటైతే అసలే ఉండడం లేదు..’’ అని వాపోయారు. ఈ సందర్భగా షర్మిల మాట్లాడుతూ.. ‘‘కరెంటు ఎందుకు ఉండడం లేదో మీకు తెలుసా? ఈ ప్రభుత్వానికి ముందుచూపు లేదు. ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని తెలుసు. కరెంటు సమస్య ఉందనీ తెలుసు. మరి కరెంటు ఎందుకు కొనుగోలు చేయలేదు. 

పొరుగు రాష్ట్రాలు ముందే కొనుక్కుని అక్కడ పరిశ్రమల పరంగా ఎలాంటి నష్టం లేకుండా ముందుకు వెళుతుంటే.. పారిశ్రామికంగా దూసుకుపోతుంటే.. ఇక్కడ మన ముఖ్యమంత్రి పరిశ్రమలను నెలలో సగం రోజులు మూసేసుకోమంటున్నారు. అలా అయితే వాటిలో పనిచేసే కార్మికులు ఏం కావాలి? వారి కుటుంబాలు ఏం కావాలి? మీరే చెప్పండి.. ఏం చేద్దాం? వైఎస్ ఉన్నప్పుడు ముందుచూపుతో విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మించాలని తలపెడితే.. ఇప్పుడేమో ఉన్న ప్రాజెక్టులకు గ్యాస్ కూడా తేలేని పరిస్థితిని తెచ్చింది ఈ ప్రభుత్వం.. ఈ పాలకులకు రైతులంటే ఎంత నిర్లక్ష్యమో తెలుస్తోంది.. వాళ్లకు కావాల్సింది సీఎం కుర్చీ. ఢిల్లీకి వెళ్లి రావడం. టీడీపీ, కాంగ్రెస్‌లను నమ్మొద్దు..’’ అని మండిపడ్డారు. వికలాంగుడైన తన మనవడికి పెన్షన్ ఇవ్వడం లేదని ఓ వృద్ధురాలు విలపించగా.. ‘‘జగనన్న సీఎం అయితే కనీసం రూ.600లకు తగ్గకుండా వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానన్నాడు.. అధైర్యపడకమ్మా.. మీకు ధైర్యం చెప్పేందుకే జగనన్న నన్ను పంపాడు..’ అని భరోసా ఇస్తూ షర్మిల ముందుకు కదిలారు.

మెస్ చార్జీలు రోజుకు రూ. 40 చొప్పున ఇవ్వాలి..

కత్తులూరు పంచాయతీ పరిధిలోని వేంపల్లి మైనారిటీ గర్ల్స్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌లో విద్యార్థులతో షర్మిల మాట్లాడారు. ‘కరెంటు లేదు. చదవుకోలేకపోతున్నాం. మెస్ చార్జీలు సరిపోవడం లేదు..’ అని వారు ఆందోళన వ్యక్తంచేయగా.. ‘‘మెస్ చార్జీలు రోజుకు రూ. 16.50 ఇస్తున్నారట. సబ్బులు, కాస్మొటిక్స్‌కు నెలకు రూ.50 ఇస్తున్నారట. మిగతావన్నీ దేవుడెరుగు. కనీసం తినడానికి రోజుకు రూ.40 చొప్పున మెస్ చార్జీలు చెల్లించాలని వైఎస్సార్‌సీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం..’’ అని షర్మిల అన్నారు.

రోడ్డుపై కూర్చొని.. మహిళతో మాట్లాడి..

నందిపల్లి సమీపంలో భారీ సంఖ్యలో మహిళలు ఎదురేగి రోడ్డుపై కూర్చోవడంతో షర్మిల అక్కడే కూర్చుని వారితో ముచ్చటించారు. వృద్దురాలు లేచి ‘‘నాకు మోకాళ్ల నొప్పులు ఉన్నాయి. ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. కానీ ఆరోగ్యశ్రీ కిందికి రాదట’’ అని చెప్పింది. ‘ఈ ప్రభుత్వానికి ప్రాణాలంటేనే లెక్కలేదు. 108నే ఆపేశారు. జగనన్న రాగానే ప్రతి పేదవాడి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటాడు’’ అంటూ షర్మిల ఆమెకు భరోసానిచ్చారు. నందిపల్లి సమీపంలో పులివెందుల జేఎన్టీయూ కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ.. ‘‘ఒక్క ప్లేస్‌మెంట్ కూడా దొరకని పరిస్థితి. ఈ కళాశాల వైఎస్ మానస పుత్రికగా పేరుగాంచింది. అలాంటిది అభివృద్ధికి నోచుకోకుండా పోయింది..’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీ తరపున పోరాడుతాం. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడతాం’’ అని షర్మిల వారికి హామీనిచ్చారు. తాళ్లపల్లి సమీపంలోని వేరుశనగ రైతుల వద్దకు వెళ్లిన షర్మిల వారి గోడు విని చలించిపోయారు. ‘‘కౌలు రైతులకు రుణాలు రావు. పంట నష్టపోతే పరిహారం అందదు. కనీసం ఎంత నష్టం వచ్చిందో కనుక్కునేందుకు అధికారులు రారు.. ఇలాంటి ప్రభుత్వం మనకు వద్దు. వైఎస్ ఉంటే ఈ నష్టాన్ని భర్తీ చేసేవారు’’ అని అన్నారు.

వైఎస్ వల్లే బతికిబట్టకట్టా..

దుగ్గన్నగారిపల్లి వద్ద నర్సింహారెడ్డి అనే విద్యార్థి షర్మిలతో మాట్లాడుతూ.. ‘‘నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. ఫస్టియర్ చదువుతున్నప్పుడు నాకు యాక్సిడెంట్ జరిగింది. ప్రాణాలు పోయే పరిస్థితి. కానీ 108 వల్ల సకాలంలో ఆసుపత్రికి చేరుకున్నా. చాలా ఖర్చయింది. సీఎం రిలీఫ్‌ఫండ్ కింద ఆ ఖర్చులన్నీ వైఎస్ భరించారు. వైఎస్ వల్లే బతికిబట్టకట్టా’’ అని చెప్పారు. 

రైతులపై కేసులు పెట్టిన ఘనత బాబుది..

పాదయాత్ర రాత్రికి వేములకు చేరుకుంది. అక్కడ భారీ జన సమూహాన్ని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. తాను చూసిన వేరుశనగ రైతుల కష్టాలపై ఆవేదన చె ందానని, ఈ ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా, జగనన్నపై కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి తనతోపాటు కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ‘‘చంద్రబాబు సీఎం అయితే ఇక ఆత్మహత్యలే శరణ్యమని రైతులు భయపడుతున్నారు. కరెంటు చార్జీలు పెంచొద్దంటే రైతులను కాల్చిచంపిన ఘనత బాబుది. రైతు కుటుంబాలను పరామర్శించకుండా పోలీసులను పరామర్శించిన ఘనత ఆయనది. కరెంటు చార్జీల వసూళ్ల పేరుతో కేసులు పెట్టి రైతులను జైలులో పెట్టిన చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపినట్టుగానే.. ఇప్పుడు క రెంటు కూడా ఇవ్వకుండా చార్జీలు భారీగా పెంచిన ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దె దింపాలి..’’ అని పిలుపునిచ్చారు. వేముల సమీపంలో ఏర్పాటు చేసిన బస స్థలానికి రాత్రి 7.50కి షర్మిల చేరుకున్నారు. రెండోరోజు మొత్తం 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.

షర్మిలతో పాటు నడచిన విజయమ్మ..

వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రెండోరోజు కూడా పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మధ్యాహ్న విరామ సమయానికి కొద్దిగా ముందు పాదయాత్ర నుంచి పక్కకు వచ్చిన విజయమ్మ.. తిరిగి మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6.30 వరకు పాదయాత్రలో నడిచారు. ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఆరోగ్యం దెబ్బతింటుందని, కారులో రావాలని సూచించగా వేముల వరకు కారులో వచ్చారు. వేముల బహిరంగ సభలో విజయమ్మ కూడా పాల్గొన్నారు.

'కాలినొప్పి తగ్గేందుకే బాబు ఉపవాసం'

తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేనేత కార్మికుల కోసం ఒకపూట ఉపవాస దీక్ష చేస్తాననడాన్ని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన ఆరోగ్యం బాగోలేక వైద్యుల సలహామేరకు ఉపవాసం చేస్తున్నారేతప్ప చేనేత కార్మికులకోసం కాదన్నారు. ఆయన శుక్రవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ... తొమ్మిదేళ్లు సీఎంగా, తొమ్మిదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నన్నాళ్లూ గుర్తుకురాని చేనేత కార్మికులు బాబుకు ఇపుడు గుర్తుకొచ్చారా? అని ప్రశ్నించారు. బాబుకు కాలినొప్పి ఎక్కువైనట్లు పత్రికల్లో చూశానని, ఆ నొప్పితగ్గడానికి వైద్యులు చేసిన సూచనల్లో భాగంగానే ఉపవాసం చేస్తున్నట్లుగా ఉందని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో కాంగ్రెస్ చేర్పించదనడం సరికాదని చెప్పారు.
:sakshi

రాజన్నది రామరాజ్యం

వేంపల్లె, న్యూస్‌లైన్ : దివంగత నేత వైఎస్ తనయ షర్మిల చేపట్టిన పాదయాత్ర రెండవ రోజు శుక్రవారం వేంపల్లె రాజీవ్‌నగర్ కాలనీ సమీపం నుంచి ప్రారంభమైంది. రాజీవ్‌కాలనీ వద్దకు రాగానే పెద్ద ఎత్తున మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. రాజన్న పాలనలో రామరాజ్యాన్ని తలపించిందని.. ప్రస్తుతం కిరణ్ పాలన రావణ రాజ్యాన్ని తలపిస్తోందని షర్మిల ఎదుట మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం తాము పడుతున్న ఇబ్బందులను ఆమెకు ఏకరువు పెట్టారు.

వైఎస్ పుణ్యమా అని ఇళ్లు కట్టించారని.. అయితే ప్రస్తుతం కరెంటు, నీరు సరిగా రావడంలేదన్నారు. పింఛన్లు, రేషన్‌కార్డులు సరిగా ఇవ్వలేదని మొరపెట్టుకున్నారు. అక్కడి నుంచి ఉర్దూ గురుకుల పాఠశాలకు షర్మిల చేరుకుని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, కరెంటు సరిగా రావడంలేదని.. మెస్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచాలని ఆమె దృష్టికి తెచ్చారు. అక్కడ నుంచి కత్తలూరు క్రాస్‌కు పాదయాత్ర చేరింది. ఇక్కడ స్థానిక మహిళలతో షర్మిల మాట్లాడారు.

నందిపల్లెకు పాదయాత్ర చేరుకోవడంతో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు ఆర్‌ఎల్‌వీ ప్రసాద్‌రెడ్డి, కిషోర్, చిన్న, రామకృష్ణారెడ్డి, బయపురెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఇక్కడ మహిళా రైతు లక్ష్మిదేవి అరటి తోటను పరిశీలించారు. ఈ ప్రభుత్వం ఉన్నా.. లేకున్నా ఒకటేనని.. పంటలు సాగు చేయాలంటే భయమేస్తోందని ఆ రైతు తెలిపారు. ప్రభుత్వం పెడుతున్న కష్టాలను చూస్తే పురుగుల మందు తాగి చచ్చిపోవాలనిపిస్తోందని అలిరెడ్డిపల్లెకు చెందిన ఇందిరమ్మ, ఓబుళమ్మ, గంగమ్మ, శివరత్నమ్మ, తులశమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు లేక, కరెంట్ కోతలతో వేరుశనగ, పత్తి పంటలను తొలగిస్తున్నామని అమ్మగారిపల్లెకు చెందిన రామతులసి, ఆదర్శ రైతు రమణారెడ్డి, రామసుబ్బమ్మ, అయ్యవారిపల్లెకు చెందిన కోనమ్మ, గంగులమ్మ ఆమె దృష్టికి తెచ్చారు.

ప్రాణం ఎంతో విలువైందని.. జగనన్న పాలనలో మళ్లీ రామరాజ్యం తప్పక వస్తుందని.. అంతవరకు ఓపిగ్గా కష్టాలను ఎదుర్కొని నిలబడాలని షర్మిల భరోసా ఇచ్చారు. తర్వాత పులివెందుల జేఎన్‌టీయూ విద్యార్థులు తమ సమస్యలను ఆమె దృష్టికి తెచ్చారు. ఈ సమస్యలను జగనన్న దృష్టికి తీసుకెళతానని ఆమె తెలిపారు. ఆ తర్వాత నందిపల్లెలో రైతులు వైఎస్ హయాంలో 90శాతం వరకు పంటల బీమా రాగా.. ప్రస్తుతం వాతావరణ బీమాను ప్రవేశపెట్టడంతో వేంపల్లె మండలానికి 0.5శాతం వచ్చిందని వాపోయారు. పాదయాత్ర తాళ్లపల్లెకు రాగానే స్థానికులు షర్మిలపై పూల వర్షం కురిపించారు. తర్వాత ముసల్‌రెడ్డిగారిపల్లె మీదుగా అమ్మయ్యగారిపల్లె ప్రాంతంలో బస చేసే ప్రాంతానికి వెళ్లి సేద తీరారు. మళ్లీ 5గంటలకు పాదయాత్ర ప్రారంభమై చాగలేరు క్రాస్, వి.కొత్తపల్లె, వేముల వరకు కొనసాగింది.
పాదయాత్రతో బాబుకు ఒళ్లు నొప్పులే
- ఎమ్మెల్యే గొల్ల బాబురావు

పాదయాత్రతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తలనొప్పి, ఒళ్లు నొప్పులు, దురద, కీళ్లు నొప్పులు తప్పా ఎలాంటి ప్రయోజనం ఉండదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. షర్మిల పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు విశ్వసించడంలేదని.. త్వరలోనే ఎన్నికలు రావడం తథ్యమని జోస్యం చెప్పారు.
ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే పాదయాత్ర
- ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి

షర్మిల ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తోందని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. నందిపల్లె వద్ద ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ఎన్‌టీఆర్ హయాంలో మద్యాన్ని నిషేధిస్తే.. చంద్రబాబు మళ్లీ మద్యం షాపులను కొనసాగించాడన్నారు.
వెన్నుపోటు చరిత్ర బాబుది
- ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

మామను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదని కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ షర్మిల పాదయాత్ర చరిత్రలోనే సువర్ణధ్యాయంగా నిలిచిపోతుందన్నారు.
జగన్‌తోనే రాజన్న రాజ్యం
- మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎక్కడ చూసినా వైఎస్‌ఆర్‌సీపీ గాలి వీస్తోందని.. జగనన్నతోనే రాజన్న రాజ్యం సాధ్యమని వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రజలు విశ్వాసం ఎప్పుడో కోల్పోయారని పేర్కొన్నారు.
కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు నమ్మరు
మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు నమ్మరని.. ప్రజల ఆదరణ చూస్తే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. మాట్లాడుతూ చంద్రబాబు చేసే పాదయాత్రను ప్రజలు విశ్వసించడంలేదని పేర్కొన్నారు.
ప్రజా విశ్వాసం కోల్పోయారు
- బాజిరెడ్డి గోవర్ధన్

సీఎం కిరణ్, టీడీపీ నేత చంద్రబాబు ప్రజా విశ్వాసం కోల్పోయారని వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర పాలక సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ దుయ్యబట్టారు. రెండు రోజులుగా షర్మిల పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి చంద్రబాబు సీఎం పదవి కోసం వెంపర్లాడుతుంటే.. కిరణ్ తన పదవిని నిలుపుకొనేందుకు ఆగచాట్లు పడుతున్నారన్నారు.
జగన్ సీఎం కావడం తథ్యం
- మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి

ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజయ ఢంకా మోగించి జగన్ సీఎం కావడం తథ్యమని కడప మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి అన్నారు. పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పాదయాత్రకు వచ్చిన జనాన్ని చూసిన ఇతర పార్టీల్లో గుబులు ప్రారంభమైందని అన్నారు.
పాదయాత్రకు నీరాజనాలు
- వైఎస్ అవినాష్‌రెడ్డి

షర్మిల పాదయాత్రకు గ్రామ గ్రామాన నీరాజనాలు పలుకుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాదయాత్ర విజయవంతంగా సాగిపోతోందన్నారు.
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు
ప్రొద్దుటూరు ఇన్‌ఛార్జి రాచమల్లు ప్రసాద్‌రెడ్డి
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై ప్రజల సమస్యలను పెడచెవిన పెట్టాయని వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నట్లు ఆయన వివరించారు.
- న్యూస్‌లైన్, పులివెందుల/వేముల

అదే జోరు..జనహోరు.. జనంతో మమేకం


అదే జోరు..జనహోరు.. జనంతో మమేకం అవుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల శుక్రవారం రెండోరోజు ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రను ప్రారంభించారు. చిరునవ్వులతో చిన్నారులను పలకరించారు. విద్యార్థినులకు, వికలాంగులకు ధైర్యం చెప్పారు. మహిళలపై ఆప్యాయత చూపారు. వృద్ధులకు భరోసా కల్పించారు. 

అన్నదాతల అగచాట్లను కళ్లారా చూశారు. కాయలు లేని వేరుశనగ కట్టెను పరిశీలించారు. వారి కష్టాలను విని చలించిపోయారు. పాలకుల దమన నీతిని ఎండగట్టారు. పాలక, ప్రతిపక్షాలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. త్వరలో రాజన్న రాజ్యం వస్తుందని, కష్టాలన్నీ తీరుతాయని భుజం తట్టారు. 

కడప, న్యూస్‌లైన్ ప్రతినిధి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు రెండో రోజు శుక్రవారం నాడు అపూర్వ ఆదరణ లభించింది. 15 కిలోమీటర్లు సాగినయాత్రలో సమస్యలను చెప్పుకునేందుకు పల్లెజనం పోటీపడ్డారు. 

వేంపల్లె సమీపం నుంచి మొదలైన పాదయాత్ర మండల కేంద్రమైన వేములకు చేరుకుని ముగిసింది. వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కేంద్రపాలకమండలి సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, ప్రసన్నకుమార్‌రెడ్డి, గొర్ల బాబూరావు, శోభా నాగిరెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే పిల్లిసుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ శేషుబాబు, నాయకులు బాజిరెడ్డి గోవర్దన్, అంబటి రాంబాబు, ప్రసాదరాజు, రఘురామిరెడ్డి తదితరులు వెంటరాగా ఉదయం 10 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. 

15 నిమిషాల్లోపు రాజీవ్‌కాలనీకి చేరుకున్నారు. కాలనీవాసులంతా ఒక్కసారిగా వారి గోడును వెళ్లబోసుకున్నారు. రాజన్న లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. దీంతో షర్మిల వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ఏపీ బాలికల గురుకుల పాఠశాలకు 10.45 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులు తమ ఇబ్బందులను మొరపెట్టుకున్నారు. స్పందించిన షర్మిల జగనన్న నాయకత్వంలో రాజన్నరాజ్యం వస్తుందని, అప్పటిదాకా ధైర్యంగా ఉండాలని కోరారు. అక్కడి నుంచి కత్తులూరు క్రాస్‌కు చేరుకున్నారు. 

సమస్యలు వినలేని స్థితిలో ప్రభుత్వం.. గుర్తించలేని స్థితిలో ప్రతిపక్షం
కత్తులూరు క్రాస్‌కు చేరుకున్న షర్మిల మాట్లాడుతూ సమస్యలు వినలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, గుర్తించలేని స్థితిలో ప్రతిపక్షం ఉందని విమర్శించారు.

రాజన్న రాజ్యం వస్తుందని, జగనన్న త్వరలో మీ ముందుకు వస్తాడని వారిలో ధైర్యం నింపారు. అక్కడి నుంచి 12.50కు నందిపల్లెకు చేరుకుని వేరుశనగ పంటను పరిశీలించారు. ఆ గ్రామస్తులు షర్మిలకు చక్కభజనతో స్వాగతం పలికారు. వారితో చర్చించిన ఆమె 1.20 గంటలకు తాళ్లపల్లె గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామస్తులు చెండుమల్లె పూల బాట వేసి షర్మిలను నడిపించారు. అనంతరం ఆమె 1.40 గంటలకు ముసల్‌రెడ్డిపల్లెకు చేరుకున్నారు. 

అలాగే 1.45 గంటలకు సుద్దన్నగారిపల్లె క్రాస్, 2.00 గంటలకు అమ్మయ్యగారిపల్లె సమీపంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన విడిదికి చేరుకున్నారు. అలాగే సాయంత్రం 4.45 గంటలకు తిరిగి ప్రారంభమైన పాదయాత్ర 5.00 గంటలకు అమ్మయ్యగారిపల్లె, 5.20 గంటలకు చాగలేరు క్రాస్, 5.30 గంటలకు వి.కొత్తపల్లెకుచేరుకుని 5.50 గంటలకు సమీపంలోని వేరుశనగ పంటను పరిశీలించారు. 6.30 గంటలకు గొందిపల్లె క్రాస్, 7.10 గంటలకు వేముల బహిరంగసభలో మాట్లాడి 7.45 గంటలకు వేముల సమీపంలో బస చేసే ప్రాంతానికి చేరుకున్నారు.

దుష్టశక్తులుండాయి జాగ్రత్త తల్లీ!
‘సువర్ణ పాలన అందించే మహానేత అర్ధంతరంగా చనిపోయారు.. జనంకోసం పరితపించే జగనన్న జైలుపాలయ్యారు... దుష్టశక్తులు తిరుగుతున్నాయి..జాగ్రత్త తల్లీ! ధైర్యంగా ఎదుర్కొలేరు, దొంగ దెబ్బ తీస్తారు.’ అంటూ పులివెందుల ఆడబిడ్డ షర్మిలకు పల్లె ప్రజలు హెచ్చరించారు. ‘తండ్రిని ఎదుర్కోలేని దుష్టులు అర్ధంతర మృతికి కారకులయ్యారు.. జనం మెప్పు పొందిన జగన్‌మోహన్‌రెడ్డిని జైలుపాలు చేశారు..’ మిమ్మల్ని కూడా దెబ్బతీస్తారమ్మా.. జాగ్రత్తలు తీసుకోండి’ అంటూ సూచనలు చేశారు. అందుకు షర్మిల స్పందిస్తూ మీ అండ ఉన్నంతకాలం, రాజన్నను అభిమానించే హృదయం ఉన్నంతకాలం మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని అన్నారు. 

పూలబాటలతో స్వాగతం
రాజన్న బిడ్డ పల్లెల వెంబడి వస్తున్నట్లు తెలుసుకున్న జనం ఎర్రనీళ్ల దిష్టి తీస్తూ, హారతులిస్తూ ఆమె నడిచి వెళ్లే దారిలో పూలను పర్చి పూలబాట ఏర్పాటు చేశారు. ఆ బాటకు ఇరువైపులా గ్రామీణులు నిల్చున్నారు. వారి అభిమానానికి షర్మిల ముగ్దులై అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రెండోరోజు పాదయాత్రలో మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి, ఐటీ విభాగం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, డాక్టర్స్ విభాగం అద్యక్షుడు శివభారత్‌రెడ్డి, కడప మాజీమేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, అంజాద్‌బాష, జమ్మలమడుగు మాజీ మున్సిపల్ చైర్మన్ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డితోపాటు జిల్లా ముఖ్య నేతలు పాల్గొన్నారు.

అన్ని పంటలు నాశనమయ్యాయి
పత్తి పంట పూర్తిగా ఎండిపోయింది. ఖరీఫ్‌లో అన్ని పంటలు నాశనమయ్యాయి. ఇన్స్యూరెన్స్ వస్తాదనుకుంటే వాతావరణ ఆధారిత బీమా పెట్టి మా కొంప ముంచారు. ఎకరాకు రూ.450 వస్తాంది. రాజశేఖరరెడ్డి హయాంలో మూడు సంవత్సరాలు వరుసగా 90 శాతానికి పైగా ఇన్స్యూరెన్స్ ఇచ్చారు. 
- రమణారెడ్డి, ఆదర్శరైతు

పనులు లేక అల్లాడుతున్నాం
అమ్మా! మాకు రాజశేఖరరెడ్డి ఇల్లు కట్టించారు.. ఆయన పుణ్యాన నీడపాటున నిద్రపోతున్నాం... మంచినీళ్లు లేవంటే జగనన్న రూ.15 లక్షలతో పైపులైను ఏర్పాటు చేయించారు. వ్యవసాయ కూలీలకు పోయేవాళ్లం. పనుల్లేక అల్లాడుతున్నాం.
- రేవతి రమాదేవి, పులివెందుల

మెస్ ఛార్జీలు చాలడం లేదు 
అక్కా! తాగేందుకు నీళ్లు లేవు. ఎటూ చాలకుండా మెస్ ఛార్జీలు ఇస్తాండారు. చదువుకునేందుకు పెద్దాయన మంచి భవనాలు కట్టించాడు. ఎం లాభం ఇప్పుడేమో కరెంటు ఉండడం లేదు.
- ఉర్దూ బాలికల పాఠశాల విద్యార్థినులు

తిండిగింజలు కూడా పండటం లేదు 
తల్లీ! పంటలు పోయినాయి. బోర్లలో నీళ్లు లేవు. అక్కడక్కడ నీళ్లొస్తాంటే తిండి గింజలకోసం సాగు చేసుకున్నాం. ఆ పంటలు కూడా అందే పరిస్థితి లేదు. ఇప్పుడేం చేయాల్నో దిక్కు తెల్లా! మీ నాయన కాలంలో అందరం బాగున్నాం. మూడేళ్లుగా నెత్తీనోరు కొట్టుకుంటున్నాం.
- లోడమ ఇందిరమ్మ, కొవ్వూరు 

ఓబులమ్మ, కత్తులూరు
ఆత్మహత్యలే శరణ్యం 
రూ.2.50 లక్షలు పెట్టుబడి పెట్టాం తల్లీ! వేరుశనగ పంటంతా ఎండిపోయింది. పశువుల మేతకుగానీ పనికి రాదు. అప్పుడేమో రామరాజ్యం చూసినాం. ఇప్పుడు రావణరాజ్యం చూస్తున్నాం. పురుగుల మందు తాగి చచ్చిపోవాలని ఉంది.
- రామతులసి, కత్తులూరు

Special edition on Maro Praja Prasthanam Padayatra

Sharmila speech @Maro Prajaprasthanam at Vemula

Maro Praja Prasthanam Padayatra in Duggannagari palli at YSR dist

Anantapur MLA Gurunath Reddy comments on TDP and Congress

YSRCP Leader Konathala Ramakrishna press meet at YSRCP Office

'పాదయాత్ర తర్వాత పెనుమార్పులు'

అనంతపురం : షర్మిల పాదయాత్ర తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు ఖాయమని అనంతపురం ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి అన్నారు. ఆమె పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఇప్పటికే తెలుగుదేశం-కాంగ్రెస్ పార్టీలు ఆత్మరక్షణలో పడ్డాయని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. 

బాబు పాదయాత్రకు డబ్బులిచ్చినా జనం రావటం లేదని గుర్నాథరెడ్డి విమర్శించారు. బాబు పాదయాత్రకు....షర్మిల పాదయాత్రకు నక్కకూ....నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. బాబు చేసేది రాజకీయ యాత్ర అయితే... షర్మిల ప్రజల సమస్యల కోసం పాదయాత్ర చేస్తున్నారన్నారు.

http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=471878&Categoryid=14&subcatid=0

Sharmila's Maro Prajaprasthanam reach Tallepalle

Konda Surekha comments on Maro Praja prasthanam

Sharmila's maro prajaprasthanam reach Nandhi palle

Sharmila with Vempalle People in Maro Praja Prasthanam

షర్మిల పాదయాత్ర రాజకీయాలలో ఒక సంచలనం


షర్మిల పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనం కానుందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఇది ఒక చరిత్రాత్మక పాదయాత్ర అని ఆయన శుక్రవారం ఉదయం 'సాక్షి' టీవీలో జరిగిన ఒక చర్చాకార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
''ఆనాడు చేవెళ్లలో వైయస్‌ చేసిన ప్రజాప్రస్థానం చూశాం. అప్పటి కన్నా కూడా షర్మిల పాదయాత్రకు ప్రజాదరణ ఎక్కువగా కనిపిస్తోంది. ఇడుపుల పాయలో నిన్న హాజరైన జనసంఖ్యను అంచనా వేయడం కూడా సాధ్యం కాదు. ఇంతగా ప్రజాదరణ రావడానికి కారణం కాంగ్రెస్‌, టిడిపిల కుమ్మక్కు రాజకీయాలు" అని రాంబాబు అన్నారు. ఆనాడు చంద్రబాబు పాలన తీరుతెన్నులకు విసిగి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు భరోసా ఇవ్వడానికి వైయస్ పాదయాత్ర చేశారు. కాగా చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలను తనవైపుకు మళ్లించుకోవడానికి ఇప్పుడు పాదయాత్ర తలపెట్టారు." అని ఆయన విశ్లేషించారు.
"విజయమ్మ ప్రసంగిస్తూ, రాజశేఖర్‌ రెడ్డి బిడ్డల్లో ఒకరు జైలులో ఉంటే, ఒకరు రోడ్డుపై ఉన్నారనీ వారిని ఆదరించండి అన్నారు. ఇవి మానవీయ స్పర్శ ఉన్నవారందర్నీ కదిలించే మాటలు" అని ఆయన వ్యాఖ్యానించారు. షర్మిల రాజకీయాల కోసం రావడం లేదనీ తాను కొన్ని ప్రత్యేకపరిస్థితుల వల్ల పాదయాత్ర చేస్తున్నానీ వివరించారన్నారు. నిజానికి ఈ యాత్ర జగన్మోహన్‌ రెడ్డి చేయాల్సిందనీ, తాను జగనన్న వదిలిన బాణాన్ని అని షర్మిల చెప్పడంలో ఉద్దేశ్యం ఇదేననీ రాంబాబు వివరించారు. ఎంతగా జగన్‌ను అణచడానికి యత్నిస్తిస్తే అంతగా ఎగసి పైకి లేస్తారన్నది  షర్మిల పాదయాత్రకు వచ్చిన జన ప్రభంజనంతో మరోసారి రుజువైందని ఆయన అన్నారు. షర్మిల ఏ హోదాలో పాదయాత్ర చేస్తున్నారన్న విమర్శకు బదులిస్తూ జనం దగ్గరకు వెళ్లడానికి హోదా ఎందుకండీ అని కొట్టిపారేశారు. "ఇదేమీ చంద్రబాబు యాత్రకు పోటీ కాదు, దీని పేరే మరో ప్రజాప్రస్థానం. రాజశేఖర్ రెడ్డి గారే పాదయాత్రతో రాజకీయాలను మలుపుతిప్పారు. షర్మిల పాదయాత్ర కూడా రాజకీయాలలో సంచలనం కాబోతుంది. తండ్రి పాదయాత్ర రికార్డును బద్దలు కొడుతుంది. కాంగ్రెస్, టిడిపిల కుట్రలను ఛేదించే దిశగా సాగుతుంది. ఆశీర్వదించండని తెలుగుప్రజలందర్నీ కోరుతున్నా" అని రాంబాబు విజ్ఞప్తి చేశారు.

నిద్ర నటిస్తున్న ఈ ప్రభుత్వాన్ని లేపుదాం: షర్మిల
రైతన్న కోసం నాన్న ఎప్పుడూ తపించేవారు.


వానలు వస్తున్నా విద్యుత్‌ లేదు. నిద్ర లేదు. రోడ్లు లేవు. ప్రజల జీవితం దుర్భరంగా మారిపోయింది. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం నిద్ర నటిస్తోంది. నిద్రపోతున్నవారినన్నా లేపవచ్చు, కానీ నిద్ర నటిస్తున్నవారిని లేపలేం. మరో ప్రజాప్రస్థానం రెండవరోజు శుక్రవారం పాదయాత్ర ప్రారంభిస్తూ యాత్రలో పాల్గొన్న, యాత్రను చూసేందుకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల మాట్లాడారు. వైయస్‌ఆర్ జిల్లా వేంపల్లె శివారులోని రాజీవ్‌నగర్ కాలనీ నుంచి ప్రారంభించారు. షర్మిల పాదయాత్రకు స్వాగతం పలికేందుకు ప్రజలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

‌దివంగత మహానేత, తన తండ్రి డాక్లర్ వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నా, లేకున్నా ‌నిరంతరమూ రైతుల సంక్షేమం కోసమే ఆలోచించేవారని షర్మిల పేర్కొన్నారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవటం వల్లే రాష్ట్రంలో విద్యుత్ కొరత సమస్య ముప్పుగా పరిణమించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అస్సలు విద్యుత్తే ఉండని పరిస్థితి నెలకొన్నదని ఆమె విచారం వ్యక్తం చేశారు. విద్యుత్‌ సమస్య కారణంగా ప్రజలు కనీసం కంటినిండా నిద్రపోయే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్, ‌టిడిపిలను నమ్ముకుంటే మనల్ని నట్టేట ముంచుతాయని షర్మిల హెచ్చరించారు. మన కష్టాలు తీర్చి, కన్నీళ్ళు తుడిచే రాజన్న రాజ్యం వస్తేనే విరుగుడు లభిస్తుందని తెలిపారు. జగనన్న సారథ్యంలో రాజన్న రాజ్యం తప్పకుండా వస్తుందని భరోసా ఇచ్చారు. రాజన్న రాజ్యం కావాలంటే జగనన్నను ఆశీర్వదించండి. అందరూ కుట్ర పన్ని జగనన్నను జైలు పాలు చేశారు. సమయం వచ్చినప్పుడు వారికి బుద్ధిచెప్పండి అని షర్మిల పిలుపునిచ్చారు.
నందిపల్లెలో విద్యార్థులను కలిసిన ఆమె వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు షర్మిల బస చేసిన ప్రాంతం జనంతో కళకళలాడింది.

http://www.ysrcongress.com/news/news_updates/sharmila_padayatra_rajakeeyalalo_oka_sanchalanam.html

రెండవ రోజు పాదయాత్ర 19 కిలోమీటర్లు

హైదరాబాద్‌, 19 అక్టోబర్ 2012 : షర్మిల శుక్రవారం వైయస్‌ఆర్‌ జిల్లాలోని పలు గ్రామాల మీదుగా పాదయాత్ర చేయనున్నారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వేంపల్లె శివారులోని రాజీవ్ నగర్ కాలనీ నుండి ప్రారంభమయ్యే రెండవ రోజు పాదయాత్ర  మొదచ నందిపల్లె (3.5 కి.మీలు) చేరుకుంటుంది. అక్కడి నుండి 1.8 కిలోమీటర్ల దూరంలోని తాళ్లపల్లె మీదుగా సాగుతుంది. ఆ తర్వాత ముసల్‌రెడ్డిగారిపల్లె నుండి 1.2 కి.మీల దూరాన ఉన్న దుగ్గన్నగారిపల్లె దిశగా సాగుతుంది. దుగ్గన్నపల్లె నుండి 1.5 కి.మీ సాగి అమ్మయ్యగారిపల్లె చేరుకుంటుంది. అక్కడి నుండి 0.6 కి.మీ నడతి వి.కొత్తపల్లె మీదుగా 3 కిలోమీటర్ల దూరాన ఉన్న గొందిపల్లె క్రాస్ వైపునకు సాగుతుంది. అక్కడి నుండి  మరో 1.5 కిలోమీటర్లు నడచి షర్మిల వేముల చేరుకుంటారు. వేముల నుండి 4.7 కిలోమీటర్లు సాగి భూమయ్యగారి పల్లె క్రాస్ వద్దకు నడుస్తారు. అక్కడే రెండో రోజు విశ్రాంతి.  రెండో రోజు షర్మిల మొత్తం 19 కి.మీలు పాదయాత్ర చేస్తారు. షర్మిల యాత్రకు సంఘీభావం తెలపాలని వైఎస్‌ఆర్ సీపీ సమీపగ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

http://www.ysrcongress.com/news/news_updates/rendavaroju_padayatra_19_kilometarlu.html

Thursday 18 October 2012

Sharmila speech @Maro Prajaprasthanam at Rejivnagar colony

Sharmila seconday Maro Prajaprasthanam starts

Kadapa Gadapalo Maro Prajaprasthanam

మీ వెనుకే మేముంటామంటూ...


మీ వెనుకే మేముంటామంటూ లక్షలాది గొంతుకల ధ్వనులు ఇడుపులపాయలో ప్రతిధ్వనించాయి. మహానేత వైఎస్ కుమార్తె షర్మిల చేపట్టిన ‘మరోప్రజాప్రస్థానం’కు ముక్తకంఠంతో జేజేలు పలికారు. దారిపొడవునా మహిళలు, వృద్ధులు, వికలాంగులు అభివాదం చేస్తూ .. నాన్నను మరిపిస్తూ షర్మిల ముందుకు సాగారు. ‘జగనన్న వదిలిన బాణాన్ని నేను’ అంటూ పాలక, ప్రతిపక్ష నేతలకు కలవరం పుట్టించారు. నా బిడ్డలను మీకే అప్పగిస్తున్నానని విజయమ్మ చేసిన ఉద్వేగ ప్రసంగం కంటతడిపెట్టించింది. తొలిరోజు 15 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర కొనసాగింది.

కడప, న్యూస్‌లైన్ ప్రతినిధి : జనాలతో ఇడుపులపాయ పోటెత్తింది. దారులన్నీ ఇడుపులపాయవైపే మళ్లాయి. లక్షలాది మంది ఇడుపులపాయకు చేరుకున్నారు. మండుటెండలో లక్షలాది పాదాలు ఏకమై షర్మిల పాదయాత్రలో అడుగు వేశాయి. ఉదయం 10.30 గంటలకు ఇడుపులపాయ వైఎస్‌ఆర్ ఘాట్‌కు చేరుకున్న వైఎస్ విజయమ్మ, తనయ షర్మిలమ్మ, కోడలు భారతి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి మహానేత వైఎస్ ఘాట్ వద్ద ప్రార్థనలుచేశారు. అనంతరం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దల ఆశీస్సులను షర్మిల అందుకున్నారు. అక్కడే ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వేదిక మీదకు చేరుకున్న వైఎస్ విజయమ్మ ఉద్వేగంగా ప్రసంగించారు.

తన కుమారుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌ను తలచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం షర్మిల మాట్లాడారు. ‘నేను జగన్ ఎక్కుపెట్టిన బాణాన్ని’ అనగానే అశేష జనం హర్షధ్వానాలు ప్రకటించారు. ప్రభుత్వం, ప్రతిపక్షం కుఠిల రాజకీయాలను ఎండగడుతూ ప్రజాపక్షాన పోరాటం చేసేందుకు సామాన్య కార్యకర్తగా, జగనన్న చెల్లెలిగా, రాజన్న బిడ్డగా మీ ముందుకొస్తున్న నన్ను ఆశీర్వదించండని కోరారు. సభ అనంతరం పాదయాత్రగా ట్రిపుల్‌ఐటీకి చేరుకున్నారు. అక్కడ విద్యార్థులతో మాటామంతీ నిర్వహించారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల అవస్థలను చూసి చలించిపోయారు.

తల్లడిల్లిన మాతృమూర్తి
‘ప్రజల మనిషి, జన హితుడు నా భర్త మృతి చెందారు. ఇద్దరు బిడ్డలుంటే ఒక బిడ్డను జైలుపాలు చేశారు. చాలా బాధగా ఉంది. జగన్ చేయాల్సిన యాత్ర ఇది. ఇంకోబిడ్డ రోడ్డుమీదికి రావాల్సి వచ్చింది’ అని గద్గద స్వరంతో వైఎస్ విజయమ్మ అనగానే సభా ప్రాంగణం మూగబోయింది. మీరంతా మా పక్షం ఉన్నారనే ధైర్యంతో నా బిడ్డను మీకప్పగిస్తున్నా. జగన్‌బాబు లాగే నా బిడ్డను మీరు ఆశీర్వదించాలని కోరడం విజయమ్మ తల్లి మనస్సుకు అద్దం పట్టింది.

చిన్నబుచ్చుకున్న సూర్యుడు
సూర్యభగవానుడు ప్రకోపించి ప్రకాశిస్తున్నాడు. అయినప్పటికీ ఇడుపులపాయకు జనం లక్షలాదిగా బారులు తీరారు. ట్రాఫిక్ స్తంభించినా నడక మార్గంలో ఇడుపులపాయకు చేరుకున్నారు. జనపోటును చూసిన సూర్యుడు చిన్నబుచ్చుకున్నాడు. అభిమానుల ముందు తలవంచుకున్నాడు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత సాయంత్రపు వరకూ ప్రకాశిస్తున్న సూర్యుడు మేఘాల చాటుకు వెళ్లిపోయాడు. వాతావరణం మేఘావృతమైంది.

లక్షలాది పాదాలు కలిసిన వేళ...
ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర లక్షలాది పాదాల సవ్వడిలతో 13 కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా వేంపల్లె నాలుగు రోడ్ల కూడలి వరకు సాగింది. వీరన్నగట్టుపల్లె, కుమ్మరాంపల్లె, వేంపల్లె వాసులు షర్మిలను చూసేందుకు ఆరాటపడ్డారు. పూల జల్లులు కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. పాదయాత్రకు రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు తరలించారు.

స్తంభించిన ట్రాఫిక్
ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన మరో ప్రజాప్రస్థానం కార్యక్రమానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి చేరుకోవడంతో వాహనాల రద్దీతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసు యంత్రాంగం పక్కా ప్రణాళిక చేపట్టకపోవడంతో పది కిలోమీటర్ల మేర ఆరు గంటలపాటు ట్రాఫిక్ జాం అయింది. ఒక డీఎస్పీ, ఆరుగురు సీఐలు, 16 మంది ఎస్‌ఐలు, 300 మంది పోలీసులు బందోబస్తు చేపట్టినా ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయలేకపోయారు.


Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!