తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు సమస్యలను సృష్టించి వాటి నుంచి లబ్దిపొందడమే తప్ప వాటిని పరిష్కరించే ఆలోచన ఉండదని వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్‌రావు దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణ పేరిట చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నదంతా ఒక డ్రామా అని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘చంద్రబాబు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు ఎందుకు చట్టబద్ధత తేలేకపోయారు? వర్గీకరణపై పార్లమెంటులో చట్టం తెస్తే తప్ప అమల్లోకి రాదని సుప్రీంకోర్టు కొట్టేసిన విషయం బాబుకు తెలియదా? కేం ద్రంలో చక్రం తిప్పానని, ప్రధానులను కూడా ఫోన్‌లలో ఎంపిక చేశానంటూ గొప్పలు చెప్పుకున్న వ్యక్తి వర్గీకరణకు పార్లమెంటులో ఎందుకు చట్టం తేలేకపోయారు?’’ అని నల్లా నిలదీశారు. వర్గీకరణ విషయమై చంద్రబాబుకు ఇన్నాళ్లూ బుర్ర పనిచేయలేదా? 12 ఏళ్లుగా ఆయన నిద్రపోతున్నారా? అని మండిపడ్డారు. ఆయనకు దళితుల పట్ల ప్రేమ లేదని... అధికారంలోకి రావాలనే యావతో మాల, మాదిగల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు.
Saturday, 11 August 2012
వర్గీకరణపై చంద్రబాబు డ్రామా: నల్లా

పేదవాడి చదువుకు బాసట
విద్యార్థులకు వరంగా మారిన ఫీజుల పథకాన్ని రక్షించుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరించనుంది. ఈ నెల 13, 14 తేదీల్లో ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఏలూరులో దీక్ష చేయనున్నారు. పార్టీకి చెందిన పలువురు నేతలు దీక్షలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థులు దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. తాము సైతం దీక్షలో పాల్గొంటామని ముందుకొస్తున్నారు. కాగా, విజయమ్మ ఫీజు దీక్షకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఏలూరు ఇండోర్ స్టేడియం గ్రౌండ్స్‌లో దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. 32 అడుగుల పొడవు, 48 అడుగుల వెడల్పున భారీ వేదిక, దీని పక్కన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల కోసం మరో వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఇతరుల కోసం 280 అడుగుల పొడవు, 160 అడుగుల వెడల్పున వాటర్ ఫ్రూఫ్ షామియానా ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ సాంకేతిక నిపుణులు ఈ పనులను శరవేగంగా పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ సుమారు 12 వేల మంది ప్రజలు ఒకేసారి కూర్చోవచ్చు. దీక్షా వేదిక, షామియానా ఏర్పాట్లను పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని పర్యవేక్షిస్తున్నారు.
వానొచ్చినా ఇబ్బంది కలగకూడదు : వైవీ సుబ్బారెడ్డి
ఫీజు దీక్షా ఏర్పాట్లను పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి శనివారం పరిశీలించారు. వర్షం వచ్చినా దీక్షకు ఆటంకం కలగకుండా చూడాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 75 శాత ం మంది బీసీ విద్యార్థులు లబ్ధిపొందుతున్న ఈ ఫీజు రీయింబర్‌సమెంట్ పథకాన్ని రాష్ర్ట ప్రభుత్వం ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
ఫీజులపై తేల్చకుండా ప్రభుత్వం మొద్దునిద్ర
* రెండు లక్షల మంది విద్యార్థుల్లో ఆందోళన
* కౌన్సెలింగ్‌పై సర్కారు బాధ్యతా రాహిత్యం
* విద్యార్థులు రోడ్లెక్కుతున్నా స్పందన కరువు
* కమిటీలు, సమావేశాలు అంటూ తాత్సారం
* కాలేజీలతో చర్చలకూ చొరవ చూపలేని దైన్యం
* పసలేని బెదిరింపులకు దిగే యత్నం
* తనిఖీలకు టాస్క్‌ఫోర్స్ కమిటీలంటూ లీకులు
* రాత్రికి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
* ఏకాభిప్రాయం కోసం కాలేజీ సంఘాల యత్నం
* నేడు ఉప ముఖ్యమంత్రితో యాజమాన్యాల చర్చలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపు రెండు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచిపోయినా.. ఇంతవరకూ కౌన్సెలింగ్ షెడ్యూలు కూడా విడుదల చేయకుండా మొద్దునిద్ర పోతోంది. వివాదాస్పదమైన ఫీజుల విషయం ఎటూ తేల్చకుండా ప్రభుత్వం కమిటీల మీద కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తోంది. పొరుగు రాష్ట్రాల్లోనే కాదు.. రాష్ట్రంలోని డీమ్డ్ యూనివర్సిటీల్లోనూ వరంగల్ నిట్‌లోనూ తరగతులు మొదలైనప్పటికీ.. రాష్ట్ర విద్యార్థుల విషయం తనకేమీ పట్టనట్టు ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తోంది. వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగుతోంటే.. వారిపైకి పోలీసులను ఉసిగొల్పుతున్నారు తప్పించి.. సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వ పెద్దలెవరూ చొరవచూపటం లేదు.
పరిస్థితి చూస్తోంటే.. అసలు రాష్ట్రంలో ప్రభుత్వమన్నదే లేనట్టుగా తయారయింది. కౌన్సెలింగ్ ఎప్పుడు జరుగుతుందో అడ్మిషన్లు ఎప్పుడు పూర్తవుతాయో తెలియక మానసిక క్షోభకు గురవుతున్న విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. కౌన్సెలింగ్ షెడ్యూలు తేల్చాలంటూ శుక్రవారం రాత్రి క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లిన విద్యార్థి సంఘాల నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపించిన ప్రభుత్వం.. ఇదే విషయమై 2 లక్షల మందికి పైగా విద్యార్థులు ఆందోళనగా ఎదురుచూస్తుంటే కనీసం ఒక ప్రకటన కూడా వెలువరించలేని దుస్థితిలో ఉంది. ఫీజుల వివాదంపై కనీసం కళాశాలలతో చర్చలు జరిపేందుకు కూడా ప్రభుత్వం ఇష్టపడలేదు.
శనివారం జరిగిన ఏకైక పరిణామం ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డితో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమావేశమవటం మాత్రమే. ఆయన భేటీ అనంతరం కళాశాలల తనిఖీలకు టాస్క్‌ఫోర్స్ కమిటీ అంటూ ఓ అనధికారిక ప్రకటన లీకులా వెలువడటం తప్ప పురోగతి శూన్యం. వేలాది మంది విద్యార్థులు రోడ్డెక్కి లాఠీ దెబ్బలు తింటుండం, రాజకీయ పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తుండటం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మసోమవారం నుంచి ఫీజు దీక్ష నిర్వహిస్తుండటం వంటి పరిణామాలేవీ తనకు పట్టనట్టుగానే ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
టాస్క్‌ఫోర్స్ అంటూ సర్కారు లీకులు...
ఫీజుల వ్యవహారంపై శుక్రవారం రాత్రి సాంఘిక సంక్షేమ మంత్రి పితాని సత్యనారాయణ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి వచ్చి.. శనివారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశమవుతుందని చెప్పారు. కానీ శనివారం ఉపసంఘం సమావేశమేదీ జరగలేదు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రితో సమావేశమై వచ్చిన కాసేపటికి అనధికార సమాచారం పత్రికలకు విడుదలైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అంటూ ప్రభుత్వమే అనధికార లీకులు ఇచ్చింది. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం వృత్తివిద్యా కళాశాలలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయా? లేదా? తెలుసుకునేందుకు జిల్లా, ప్రాంతీయ స్థాయి తనిఖీ బృందాలు ఏర్పాటవుతాయని, వీటిని రాష్ట్రస్థాయిలో పర్యవేక్షించటానికి, మార్గదర్శనం చేయటానికి ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటవుతోందని ఆ ప్రకటనలో వెల్లడించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.కె.సిన్హా, సీనియర్ ఐపీఎస్ అధికారి ఉమేష్ షరాఫ్, సాంకేతిక విద్య కమిషనర్ అజయ్‌జైన్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ సత్తిరెడ్డి ఈ కమిటీలో ఉంటారని ఆ అనధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. రాత్రికి ఉత్తర్వులు జారీ చేశారు.
ముందుచూపు ఆనాడేదీ?
హైకోర్టు తీర్పు ప్రకారం కళాశాలల నుంచి ఫీజుల ప్రతిపాదనలు స్వీకరించి.. సమాచారం సరిపోనిపక్షంలో మళ్లీ స్వీకరించి ఫీజులు నిర్ధారించాల్సిన ప్రభుత్వం ఆ ప్రక్రియను ఎప్పుడో పక్కనపెట్టింది. ఇప్పుడు టాస్క్‌ఫోర్స్ అంటూ కాలేజీలపై పసలేని బెదిరింపులకు దిగుతోంది. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటే అసలే ప్రతిపాదనలు సమర్పించని కళాశాలలను కౌన్సెలింగ్ నుంచి పక్కనపెట్టే అవకాశం ఉండేది. కానీ ప్రతిపాదనలను పిలుస్తూ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లిన ప్రభుత్వానికి అక్కడ చుక్కెదురైంది. ఈలోపు పుణ్యకాలం గడిచిపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఇప్పుడు టాస్క్‌ఫోర్స్ అంటూ బెదిరింపులకు దిగుతోందే తప్ప.. ప్రభుత్వానికి విద్యార్థులపై ఉన్న ప్రేమతోనో, కాలేజీల ప్రమాణాలపై ఉన్న చిత్తశుద్ధితోనో కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లటంలో ఆలస్యం చేస్తోందని.. కామన్ ఫీజుపై సరైన వాదనలు వినిపించటంలేదని విద్యారంగ నిపుణులు మొత్తుకున్నా ఆ దిశగా ఆలోచించని ప్రభుత్వం.. ఇప్పుడు కౌన్సెలింగ్ షెడ్యూలు ప్రకటించకుండా విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తోంది.
నోరు మెదపని సర్కారు...
ఫీజుల నిర్ధారణపై కానీ, రీయింబర్స్‌మెంట్ వ్యవహారంపై కానీ, కౌన్సెలింగ్ షెడ్యూలుపై కానీ ప్రభుత్వం నుంచి సమాచారం ఇచ్చేందుకు శనివారం ఏ ఒక్క ప్రతినిధీ ముందుకు రాలేదు. టాస్క్‌ఫోర్స్ కమిటీ అంటూ అనధికారిక ప్రకటన ఇచ్చిన ప్రభుత్వం.. ఫీజులపై మౌనం వీడలేదు. కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు కొందరు శనివారం అటు ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను, ఇటు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పితాని సత్యనారాయణను కలిసేందుకు ప్రయత్నించగా.. వారు చర్చలకు సిద్ధపడలేదని సమాచారం. ఆదివారం ఏకాభిప్రాయంతో రావాలని వారు కాలేజీల యాజమాన్యాలకు సూచించినట్టు తెలిసింది. దీంతో కళాశాలలే ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నాయి.
కన్సార్షియం ఆఫ్ ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కాలేజెస్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్స్ సెక్రటరీ జనరల్ కె.వి.కె.రావు, మరో ప్రతినిధి గౌతంరావు.. కళాశాలలతో శనివారం రాత్రి మాట్లాడినట్టు సమాచారం. ఆర్డినెన్స్ రద్దు చేయాలని, ఫీజు రూ.36 వేల నుంచి రూ.40 వేల మధ్య ఉండాలని, బీ కేటగిరీ ఫీజు పాత ఫీజే ఉండాలని ప్రభుత్వం ముందు డిమాండ్లుగా పెట్టాలని చెప్తూనే దాదాపు కళాశాలలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఏఎఫ్‌ఆర్‌సీ ఫీజులు ప్రతిపాదించిన 133 కళాశాలల గ్రూపులో దాదాపు 20 కళాశాలలు మాత్రం ప్రభుత్వంతో తీవ్రంగా విభేదిస్తున్నాయని సమాచారం.
నేడు దామోదర వద్ద చర్చలు...
కనీసం కామన్ ఫీజుకు ఏదో ఒక ప్రాతిపదికను కూడా తేల్చలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉండటంతో కళాశాలలపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్ని కళాశాలలు సామరస్య పూర్వక నిర్ణయానికి వస్తే తప్ప ప్రభుత్వం ఏమీ చేయలేని దుస్థితి. అందువల్ల ఏకాభిప్రాయ సాధనను కళాశాలలకే వదిలేసిన ప్రభుత్వం ఆదివారం ఉదయం 11 గంటలకు మినిస్టర్ క్వార్టర్స్‌లోని దామోదర రాజనర్సింహ క్యాంపు కార్యాలయంలో కళాశాలలతో చర్చలు జరపనుంది. ఈ సమావేశానికి మంత్రివర్గ ఉపసంఘంలోని సభ్యులైన బొత్స సత్యనారాయణ, కొండ్రు మురళి, పితాని సత్యనారాయణ హాజరుకానున్నట్లు సమాచారం. అంతా సవ్యంగా సాగి కళాశాలలన్నీ ఏకాభిప్రాయానికి వస్తే.. సాయంత్రానికి కౌన్సెలింగ్ షెడ్యూలు ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆదివారం షెడ్యూలు వెలువడితే.. సోమవారం నోటిఫికేషన్ వెలువరించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. దీని ప్రకారం ఈ నెల 23వ తేదీనుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ మొదలవుతుంది.
టాస్క్‌ఫోర్స్ కమిటీల ఏర్పాటు
రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆల్ ఇండియా టెక్నికల్ కౌన్సిల్ (ఏఐసీటీఈ) నిర్దేశించిన నిబంధనలు అమలు చేస్తున్నారా లేదా అనే అంశాలపై అధ్యయనం చేసేందుకు జిల్లా, ప్రాంతీయ, రాష్ట్రస్థాయిల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ పేరుతో శనివారం రాత్రి దాదాపు 10 గంటలకు జీవో జారీ అయ్యింది. సుప్రీంకోర్టు సూచించిన మేరకు ఇప్పటికే 129 కళాశాలలు సమర్పించిన ఫీజుల ప్రతిపాదనలు, ఏఐసీటీఈ నిబంధనలను కళాశాలల్లో అమలు చేస్తున్నారా లేదా ఏఐసీటీఈ నిబంధనల మేరకు జీతభత్యాలు ఇస్తున్నారా లేదా తదితర అంశాలపై పూర్తిస్థాయిలో ఈ కమిటీలు తనిఖీ చేస్తాయి. జిల్లా కమిటీలు ప్రాంతీయ కమిటీలకు, ప్రాంతీయ కమిటీలు రాష్ట్ర కమిటీకి నివేదిక సమర్పిస్తాయి.
జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీల్లో పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్, టెక్నికల్ కౌన్సిల్ సూచించిన సీనియర్ ప్రొఫెసర్, రోడ్లు భవనాల శాఖ ఈఈ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నుంచి ఒకరు, లోకల్ ఫండ్ ఆడిట్ విభాగం అధికారి ఇందులో సభ్యులుగా ఉంటారు. ప్రాంతీయ కమిటీల్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగం రీజినల్ డెరైక్టర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌కు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు, రోడ్లు భవనాల శాఖ ఎస్‌ఈ, లోకల్ ఫండ్ ఆడిట్ విభాగం రీజినల్ డెరైక్టర్‌లు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర కమిటీలో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎస్.కె.సిన్హా, ఉమేష్ షరాఫ్, సాంకేతిక విద్యా మండలి కార్యదర్శి, సాంకేతిక విద్య కమిషనర్‌లు సభ్యులుగా ఉంటారు.

రామోజీ భూములను ఎప్పుడు దున్నుతున్నారు?
|
విజయమ్మ దీక్షకు తరలిరండి: బోస్
కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ ఈనెల 13,14 తేదీల్లో ఏలూరులో నిర్వహిస్తున్న‘ఫీజు పోరుకు’ జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని మాజీ మంత్రి, సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ పిలుపునిచ్చారు. ఏలూరులో ఏర్పాట్లను పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డితో కలిసి బోస్ పరిశీలించారు. ఈ సందర్బంగా బోస్ మాట్లాడుతూ మహానేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీ యింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 13, 14 తేదీలలో విజయమ్మ దీక్షకు జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన లభిస్తోందన్నారు.
బాబు బండారం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మనసులో ఒకటి ఉంటుంది. బయటకు ఒకటి మాట్లాడుతారు. ఆయన రాసుకున్న మనసులో మాట పుస్తకమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. రాష్ట్రంలో పెట్టుబడులకు తగిన వాతావరణం కల్పించాలని అంటూనే, వేరే ప్రభుత్వాల హయాంలో పెట్టుబడులు, భూ కేటాయింపులపై విషం చిమ్ముతున్నారు. వ్యాపార సంస్థలకు ఆయన భూములు కేటాయిస్తే తప్పు కాదు. వేరే వాళ్లు కేటాయిస్తే మాత్రం పెద్ద నేరం. అందుకే చంద్రబాబు భూపందేరాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అనేకసార్లు నిలదీశారు. చంద్రబాబు హయాంలో జరిగిన భూ పంపిణీపై సీబిఐ ఎందుకు విచారణ జరపదని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు "మనసులో మాట". ఆ పుస్తకం కవర్ పేజీ మీద " తగిన వాతావరణాన్ని కల్పించినట్లయితే భారతదేశం సుసంపన్నం అవుతుందని ధృడంగా విశ్వసించే వ్యక్తి కలం నుంచి వెలువడ్డ గ్రంథం " అని ఉంది. ఇక్కడ తగిన వాతావరణం అంటే పెట్టుబడులు రావడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించడం అని చంద్రబాబు అభిప్రాయం. ఇదే సూత్రం ఆధారంగా పారిశ్రామికవేత్తలకు ఆయన వేల ఎకరాల భూమి పంపిణీ చేశారు. ఆ భూముల విలువ లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది.
పెట్టుబడులకు అనువైన వాతావరణం పేరుతో చంద్రబాబు కేటాయించిన భూముల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
శంషాద్‌బాద్ ఎయిర్‌పోర్టుకు 5,500 ఎకరాలు
వైజాగ్ ఫార్మా సిటీకి 2,143 ఎకరాలు
గంగవరం పోర్ట్ కు 1800ఎకరాలు
కాకినాడ పోర్టుకు 354 ఎకరాలు
కృష్ణపట్నం పోర్టుకు 2000 ఎకరాలు
ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు 535 ఎకరాలు
డాబర్‌కు 1000 ఎకరాలు
ఓరియంటల్ సిమెంట్స్ కు 820ఎకరాలు
బీచ్ శాండ్ కు 1700 ఎకరాలు
పోలెపల్లి సెజ్ 1200 ఎకరాలు
కాకినాడ సెజ్ కు 8000 ఎకరాలు
రహేజాకు 109 ఎకరాలు
ఆగాఖాన్ ఫౌండేషన్ కు 100 ఎకరాలు
కేటలిస్ట్ సాప్టువేర్ కు 50 ఎకరాలు
ఇన్ఫోసిస్ కు 50 ఎకరాలు
మైక్రోసాప్ట్ కు 42 ఎకరాలు
విప్రోకు 30 ఎకరాలు
కంప్యూటర్ అసోషియేట్స్ కు 30 ఎకరాలు
హైటెక్ సిటీకి 80 ఎకరాలు
ఐవిఆర్ సిఎల్ కు 50ఎకరాలు
మణికొండలో ఐటీ పార్క్ కు 49ఎకరాలు
మహేశ్వరం హార్డ్‌వేర్ పార్క్‌కు 9 ఎకరాలు
ఐఎంజీ భారత్ కు 850ఎకరాలు
మలేషియా టౌన్‌షిప్ కు 35 ఎకరాలు
సింగపూర్ టౌన్‌షిప్ కు 80 ఎకరాలు
ఒక్క మాటలో చెప్పాలంటే బాబు హయాంలో కేటాయించిన మొత్తం భూమి 26వేల 634 ఎకరాలు. అప్పట్లోనే దీని మార్కెట్ విలువ లక్షా 64 వేల 420 కోట్ల రూపాయలు.
1995 నుంచి 2004 వరకు బాబు 97వేల 919 ఎకరాలు మైనింగ్ లీజుకు ఇచ్చారు. గ్రానైట్ క్వారీల లీజులు 259 ఇచ్చారు. సగటున 25 ఎకరాలు చొప్పున వేసుకున్నా 6 వేల 475 ఎకరాలు లీజుకు ఇచ్చారు. గ్రానైట్ కాకుండా ఇతరత్రా లీజులు కింద 32వేల 585 ఎకరాలు ఇచ్చారు. 2000-2004 మధ్య అత్యంత విలువైన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ లీజుల సంఖ్య 155 ఉంది. వీటి విస్తీర్ణం 363.9 హెక్టార్లు. వజ్రాల అన్వేషణ పేరుతో డీ బీర్ అనే సంస్థకు 25 లక్షల ఎకరాలు ఇచ్చారు. ఇలా పెట్టుబడులకు అనువైన వాతావరణం పేరుతో ఎన్ని భూములు పందేరం చేశారో ఆయనకే తెలియాలి.
లక్షల ఎకరాల భూమిని అప్పణంగా కట్టబెట్టిన చంద్రబాబు వాన్‌పిక్ భూముల్లో పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉంది. ఆయన పాదయాత్రకు స్థానికుల నుంచి స్పందనలేదు. ఎవరూ ఆందోళనకు దిగకపోయినా ఆయనే వెళ్లి అక్కడ రచ్చ చేశారు. ఆయన వస్తున్నారని తెలిసి స్థానికులు బంద్ చేశారంటే వారు చంద్రబాబుకు ఇచ్చిన గౌరవం ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఏ ఉద్దేశంతో ఆయన అక్కడ పాదయాత్ర చేశారు? ఆయన ఇన్ని లక్షల ఎకరాలు ఎలా ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఆయన ఇస్తే పారిశ్రామిక ప్రగతి. మరొకరు ఇస్తే మాత్రం రాద్దాంతం చేస్తారు. ఈ విషయాలను ప్రజలు గమనించరనుకోవడం అవివేకం. వాన్‌పిక్ భూముల్లో పాదయాత్ర చేసిన చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు ఎటువంటి సందేశం ఇస్తున్నారు? వారు బాబు వైఖరిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇటువంటి పాదయాత్రలు పారిశ్రామిక ప్రగతికి ఎంత విఘాతం కలిగిస్తాయో ఆయనకు తెలియదా? తగిన వాతావరణం కల్పించడమంటే ఇదేనా? వీటన్నింటికీ చంద్రబాబు సమాధానం చెప్పవలసి ఉంటుంది.
లక్షల ఎకరాలు పంపిణీ చేసిన చంద్రబాబు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన భూములపై నానా రాద్ధాంతం చేస్తున్నారు. ఆయన కేటాయిస్తే సక్రమమైనప్పుడు, వైఎస్ కేటాయిస్తే అక్రమం ఎలా అవుతుంది. ఆయన చెప్పే మాటలు వినడానికి జనం ఆమాయకులు ఏమీకాదు. వారికి అన్నీ తెలుసు. అన్ని విషయాలను అర్థం చేసుకోగలరు. వారికి ఉన్న ఒకే ఒక ఆయుధంతో తగిన విధంగా తీర్పు ఇచ్చారు. ఇకముందు కూడా ఇస్తారు.
ఫీజు దీక్ష ఏర్పాట్లపై సమీక్ష
ఏలూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టనున్న దీక్షపై ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు వైవి సుబ్బారెడ్డి నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే ఆళ్ల నాని నివాసంలో జరిగిన సమీక్షకు ఎమ్మెల్యే బాలరాజు, మాజీ మంత్రి సుభాష్ చంద్రబోస్, కృష్ణా జిల్లా కన్వీనర్ ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ కూడిపూడి చిట్టబ్బాయి, జిల్లా పరిశీలకులు జగ్గిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న దీక్షాస్థలి ఏర్పాట్లను వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. దీక్షను విజయవంతం చేయాలని పార్టీశ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
ఫీజు వేధింపులకు ఓ నిండుప్రాణం బలి
ఫీజు వేధింపులకు ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఫీజు కట్టలేక, కాలేజ్ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థి మురళీ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిది నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని గాంధీనగర్. హాస్టల్‌లో ఉంటూ మిర్యాలగూడలోని వాసవి జూనియర్ కాలేజ్‌లో ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుతున్నాడు. మురళీ హాస్టల్ ఫీజు మూడు వేల రూపాయలు ఇప్పటికే చెల్లించాడు. ఇటీవలే అతని తండ్రి పాముకాటుతో చనిపోయాడు. అందువల్ల మిగితా 16వేల రూపాయలు ఫీజు చెల్లించలేకపోయాడు. హఠాత్తుగా తండ్రి మరణించటం వల్ల అతని కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కాలేజ్ యాజమాన్యం కాలేజ్‌కి, హాస్టల్‌కి రానివ్వకుండా ఫీజు కోసం రెండు రోజులుగా వేధించిందని మృతుడు మురళీ బంధవులు తెలిపారు. వారి వేధింపులు తట్టుకోలేకే పాయిజన్ తాగి మురళీ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబీకులు లబోదిబోమంటున్నారు.
ప్రథమస్థానం వైఎస్ఆర్ సిపిదే:జెపి
అమలాపురం/కాకినాడ(తూర్పుగోదావరి), న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ బలీయమైన శక్తిగా ఎదిగిందని, రాష్ర్టంలో ఆ పార్టీ మొదటి స్థానంలో ఉందని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. నూట పాతికేళ్ల కాంగ్రెస్, ముప్పై ఏళ్ల టీడీపీలు రెండు, మూడు స్థానాల కోసం పోటీ పడుతున్నాయని చెప్పారు. సమీప భవిష్యత్తులో ఎన్నికలు జరిగితే మూడవ స్థానంలోకి దిగజారతామేమోనన్న ఆందోళన ఆ రెండు పార్టీలనూ వెన్నాడుతోందన్నారు. శనివా రం ఆయన అమలాపురం, కాకినాడడలలో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రలో మొదటి స్థానంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.. తెలంగాణాలో కూడా మంచి స్థానాలే వస్తాయని జోస్యం చెప్పారు. అన్ని పార్టీలూ ఆ పార్టీనే లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేస్తున్నాయన్నారు. లోక్‌సత్తా ఉద్యమ ఫలితంగానే రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో తమ ఆస్తిపాస్తులు, నేర చరిత్ర ను అఫిడవిట్ ద్వారా ప్రకటించాల్సి వస్తోందన్నారు. అయితే రాష్ర్ట మంత్రి పార్థసారథి ‘ఫెరా’ కింద తనపై ఉన్న కేసును ప్రస్తావించకపోవడం చూస్తుంటే చట్టాన్ని పటిష్టపర్చాల్సిన ఆవశ్యకత ఉందనిపిస్తోందన్నారు.
జగన్ కోసం 75రోజులకు చేరిన దీక్షలు
నల్గొండ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి విడుదల కావాలని కోరుతూ యువకులు చేపట్టిన దీక్షలు 75 రోజులకు చేరుకున్నాయి. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వడ్లోజు వెంకటేష్ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో వారు రిలే దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలు 75రోజులకు చేరుకున్నాయి.
వాన్‌పిక్‌పై అనవసర రాద్దాంతం:బాలినేని
ఒంగోలు: వాన్‌పిక్‌పై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనవసర రాద్దాంతం చేస్తున్నారని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ విమర్శించారు. వాన్‌పిక్ ప్రాంతాల్లో చంద్రబాబు పాదయాత్రను రైతులు పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా బాబు రాజకీయ డ్రామాలు మానుకోవాలని సలహా ఇచ్చారు.
'ఆ భూముల మధ్య తేడా ఏమిటి?'
రామోజీ ఫిల్మ్‌సిటీ (ఆర్ ఎఫ్ సి) భూములకు, వాన్‌పిక్ భూములకు తేడా ఏమిటో చెప్పాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఈరోజు విలేకరులతో మాట్లాడారు. రామోజీ ఫిల్మ్‌సిటీ భూములను చంద్రబాబు దున్నగలరా? అని ఆయన ప్రశ్నించారు. వాన్‌పిక్‌పై అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్న చంద్రబాబు సెజ్‌లపై తన విధానమేమిటో చెప్పాలని కోరారు.
Friday, 10 August 2012
భద్రిరాజు మృతిపట్ల విజయమ్మ దిగ్ర్భాంతి
ప్రముఖ భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి మృతిపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కృష్ణమూర్తి కుటుంబానికి ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ద్రావిడ భాషావేత్తల్లో ఆయన ధ్రువతార అని ఎస్ విజయమ్మ అన్నారు. తెలుగు భాషపై అధ్యయనాలకు నాంది పలికిన కృష్ణమూర్తి కేంద్రియ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా పని చేశారు. తెలుగు భాషపై అధ్యయనంతో ఆయన అంతర్జాతీయ ఖ్యాతి గడించారు.
బాబు ఆందోళనకు జనం నుంచి స్పందన కరువు
తొలి రోజు మాదిరిగానే శుక్రవారం కూడా చంద్రబాబు ఆందోళనకు ప్రజల మద్దతు కరువైంది. యాత్ర పొడవునా ఎక్కడా ఆయన వెంట కనీసం వంద మంది రైతులు కూడా కన్పించలేదు. గుండాయపాలెం వద్ద మాట్లాడేందుకు బాబు కారు దిగినా, 50 మంది కంటే ఎక్కువ కనిపించకపోవడంతో మళ్లీ కారెక్కి వెళ్లిపోయారు. పాతపాడులో పలువురితో కలిసి ట్రాక్టర్లతో పొలాలు దున్నారు. అయితే ఆ ట్రాక్టర్లతో పాటు జనాలను కూడా వాన్‌పిక్ పరిధిలో లేని ఊళ్ల నుంచే తరలించారు! పాతపాడులో వాన్‌పిక్ భూములను స్వాధీనం చేసుకునే క్రమంలో టీడీపీ నేతలు ఫెన్సింగ్ తొలగించడాన్ని గుండాయపాలెం యువకులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. రాళ్లను పడగొట్టడానికి మీరెవరంటూ వారు ఆగ్రహించారు.
హెలికాప్టర్‌లోంచి నిఘా పెట్టారేమో: బాబు
పాతపాడుతో చంద్రబాబు పాదయాత్ర జరుగుతుండగా ఒక హెలికాప్టర్ తక్కువ ఎత్తులో వెళ్లింది. దాన్ని చూపిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరికీ విస్మయం కలిగించాయి. ‘ఈ హెలికాప్టర్‌ను ప్రభుత్వమో, వాన్‌పిక్ కంపెనీయో పంపి ఉంటాయి. నా ఆందోళనకు లభిస్తున్న జన స్పందన చూసేందుకు ఇలా పై నుంచి వచ్చి ఉంటారు. మా పోరాటాన్ని చూడటం తప్ప పైనుంచి వాళ్లేమైనా బాంబులు వేస్తారా?’’ అని బాబు అనడంతో అంతా నోరెళ్లబెట్టారు.
మీడియాపై చిందులు
వాన్‌పిక్ తమ పొలాలను కారుచౌకగా లాక్కుందంటూ సంకే ఏడుకొండలు అనే టీడీపీ కార్యకర్తతో పాటు మరో ఇద్దరు మొర పెట్టుకోవడంతో ముందూ వెనకా చూసుకోకుండా బాబు రెచ్చిపోయారు. ‘రాజకీయ మాఫియా, బడా పారిశ్రామికవేత్తలు కలిసి పేదలను బెదిరించి వారి భూములు లాక్కున్నారు’ అంటూ ఆగ్రహించారు. జైలుకు వెళ్లయినా వారికి భూములిప్పిస్తామన్నారు.
కానీ ఆ ముగ్గురూ నిజానికి తమ భూములను ఆక్వా చెరువులకు అమ్ముకున్నారు! అది కూడా 2003 కంటే కూడా ముందు. బాబు మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. పైగా, నచ్చనప్పుడు భూములను ఎందుకు అమ్ముకున్నారని వారిని ప్రశ్నించిన మీడియాపైనా చంద్రబాబు ఫైర్ అయ్యారు. ‘వాన్‌పిక్‌పై మీడియా ఇష్టమొచ్చినట్టు స్టోరీలు రాస్తోంది. మా పోరాటానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు. ఇలాగే వ్యవహరిస్తే మీడియా వ్యవహారం కూడా బయటకు తీస్తా’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.
ఆయనకు గుండెల్లో తప్ప బయట నిద్రరాదా ?
కడప, పులివెం దుల ప్రాంతాల గురించి ప్రతిపక్షనేత చంద్రబాబు మరోమారు అవమానకరంగా మాట్లాడితే సహించబోమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. తొమ్మిదేళ్ళు రాష్ట్రానికి సీఎంగా, కొన్నేళ్లుగా ప్రధాన ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్న బాబు ఒక ప్రాంతాన్ని కించపరిచేలా మాట్లాడడమేమిటని ఆయన మండిపడ్డారు. బాబు అలా మాట్లాడుతుంటే ఈ ప్రాంతంలోని ఆ పార్టీ క్యాడర్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు తన తీరు మార్చుకోకుంటే ఆయనను ప్రజలు జిల్లాలోకి అడుగుపెట్టనివ్వరన్నారు. తన హయాంలో బాబు జిల్లా అభివృద్ధికి పాటు పడకపోగా, వైఎస్‌ఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని, జిల్లాలో సిమెంటు ఫ్యాక్టరీల ఏర్పాటును సైతం జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. సుమారు 20 లక్షల మందికి మేలు చేకూర్చేందుకు ఉద్దేశించిన వాన్‌పిక్ ప్రాజెక్టును సమర్ధించాల్సింది పోయి దానికి కేటాయించిన భూములన్నింటినీ రైతులతో దున్నించేస్తానంటూ మాట్లాడడం ఆయనకు తగదన్నారు. గతంలో మహానేత వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని విమర్శించిన చంద్రబాబు, నేడు అదే పథకాన్ని సక్రమంగా అమలు పరచాలంటూ రోడ్డుకెక్కడం విడ్డూరమన్నారు. తన పాలనలో చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేకంగా చేసిందేమీ లేకపోగా ప్రజల గుండెల్లో నిద్రపోతా! పారిశ్రామికవేత్తల గుండెల్లో నిద్రపోతానంటున్నాడని, ఆయనకు గుండెల్లో తప్ప బయట నిద్రరాదా అంటూ ఎద్దేవా చేశారు. |
విజయమ్మ దీక్ష పోస్టర్ విడుదల
ఏలూరు (పశ్చిమగోదావరి), న్యూస్‌లైన్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చడానికి ప్రభుత్వం చేస్తున్న కుటిల ప్రయత్నాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టనున్న 48 గంటల ఫీజు దీక్ష పోస్టర్‌ను ఏలూరులో శుక్రవారం విడుదల చేశారు. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంకా పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
12న వైఎస్సార్‌సీపీలోకి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి
పీజేఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, మాజీ సీఎల్పీ నేత పి.జనార్దన్‌రెడ్డి కుమార్తె పి.విజయారెడ్డి ఈనెల 12న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆదివారం ఉదయం 9 గం టలకు ఖైరతాబాద్‌లోని మహంకాళి దేవాలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించి అక్కడ నుంచి భారీ ఊరేగింపుతో వెళ్లి వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు ఆమె వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరబోతున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో తన తండ్రి పీజేఆర్ చేసిన సేవలు, కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. అయితే ఆయన ఆశయాలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, నియోజకవర్గంలో ఎక్కడి అభివృద్ధి అక్కడే నిలిచిపోయిందని విమర్శించారు. పీజేఆర్ కుటుంబ సభ్యులు ఖైరతాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించాలని నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారని, దీనిపై గత కొంత కాలంగా తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయని చెప్పారు. తన తండ్రి పీజేఆర్ ఆశయాలు అమలు కావాలంటే అందుకు యువరక్తం నింపుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అసలైన వేదిక అని స్పష్టంచేశారు.
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై లాఠీఛార్జి
ఖమ్మం: సీఎం ఇందిరమ్మ బాట రసాభాసాగా మారింది. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు వె ళ్ళిన వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యంగా లాఠీఛార్జి చేశారు. పార్టీ నేతలు పువ్వాడ అజయ్‌కుమార్, మదన్‌లాల్ సహా 500 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లో విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ సమీపానగల చైతన్యపురిలోని ఓ కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. ఫీజు కట్టలేదని కళాశాల యాజమాన్యం విద్యార్థికి టీసీ ఇచ్చిపంపింది. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. |
తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన నాయకుణ్ని దగ్గరగా చూసేందుకయినా జనం రాకపోవడంతో
ఒంగోలు: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వాన్ పిక్ యాత్రకు స్పందన కరువైంది. జనంలేక యాత్ర తుస్సుమంది. ఒంగోలు మండలం పాతపాడులో బాబు ప్రసంగాన్ని పట్టించుకునేవారే లేరు. ఓ పక్క చంద్రబాబు మాట్లాడుతుండగానే, మరోపక్క ఒక్కొక్కరూ అక్కడ నుంచి చల్లగా జారుకోవడం కనిపించింది. ప్రసంగానికి జనం నుంచి చప్పట్లు వస్తాయని ఆశించిన టీడీపీ అధినేతకు ఆశాభంగం కలిగింది. అయినా ఆయన గుక్కతిప్పకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. పార్టీనేతల వాహనాలు, మీడియా కవరేజీ మాత్రం కనిపించింది.తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన నాయకుణ్ని దగ్గరగా చూసేందుకయినా జనం రాకపోవడంతో బాబుగారు నిరాశగానే యాత్రను కొనసాగించారు.
ఇదిలాల ఉండగా, పాతపాడు వాన్ పిక్ భూముల్లో టీడీపీ కార్యాకర్తలు ఫెన్సింగ్ తొలగించడాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.
వాన్ పిక్ వల్ల తమకు ఎలాంటి అన్యాయం జరగలేదని ప్రకాశం జిల్లా గుండాయిపాలెం గ్రామస్తులు తెలిపారు. చౌడు భూముల్ని అధిక ధరలకు అమ్ముకున్నామని సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
వాన్‌పిక్ ప్రాంతాల్లో ఆయన పర్యటన పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కొన్ని చోట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజాంపట్నంలో తాజా మాజీ సర్పంచ్‌లు, ఎంపిటిసిలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో అశాంతి రాజేయడానికే చంద్రబాబు పర్యటిస్తున్నారని వారు మండిపతున్నారు. బాబు ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు

ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో అశాంతి రాజేయటానికే చంద్రబాబు
వాన్ పిక్ ప్రాంతాల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేస్తున్న పర్యటనపై తీవ్రంగా నిరసన వ్యక్తం అవుతోంది. ఆయన పర్యటించిన ప్రాంతాల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాంపట్నంలో తాజా మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో అశాంతి రాజేయటానికే చంద్రబాబు పర్యటిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయ చేస్తున్నారని స్థానికులు విమర్శించారు.
ఫీజుపోరు దీక్ష పోస్టర్ ఆవిష్కరణ
ఏలూరు: విద్యార్థుల ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్నందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఏలూరులో చేయతలపెట్టిన దీక్ష పోస్టర్ ను ఆపార్టీ నేతలు శుక్కవారమిక్కడ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, ఎమ్మెల్యే ఆళ్లనాని, మాజీ ఎమ్మెల్యే ముదినూరి ప్రసాదరాజు, తోట గోపి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని దశలవారీగా ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. ఒక్కసారే పథకాన్ని ఎత్తివేస్తే తీవ్ర ప్రతిఘటన వస్తుందని సర్కార్ కుతంత్రాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి పేదలకు న్యాయ చేసేందుకే విజయమ్మ దీక్ష చేస్తున్నారని నాని తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంలో బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని... అర్హులైన బీసీ విద్యార్థులందరికీ పథకాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు.

స్వలాభం కోసమే బాబు వాన్‌పిక్ యాత్ర
సెజ్‌లు, ఐటీ పేరుతో లక్షలాది ఎకరాలు భూ సంతర్పణ చేసిన చంద్రబాబు ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నాడని... ఏం చేయాలో పాలుపోక ప్రతిపక్షనేతగా కేవలం స్వలాభం కోసమే బాబు వాన్‌పిక్ యాత్ర చేపట్టారని వివిధ పక్షాల నేతలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం సాక్షి హెడ్‌లైన్‌షో చర్చలో 'వాన్‌పిక్ - బాబు యాత్ర'పై చర్చ జరిగింది.
గతంలో రైతు వ్యతిరేకిగా వాళ్ల భవిష్యత్తును అంధకారం నెట్టిన బాబు ఇప్పుడు వాళ్ల పరిహారం కోసమంటూ పరితపించడం విడ్డూరంగా ఉందని సీనియర్ జర్నలిస్టు తులసీదాస్, టీఆర్‌ఎస్ నేత గణేష్‌గుప్తా మండిపడ్డారు. వాన్‌పిక్ వ్యవహారంలో సీబీఐ కొందరిని అరెస్ట్ చేసిందన్న బాబు వ్యాఖ్యలపై వైఎస్సాఆర్ సీపీ ధ్వజమెత్తింది. సీబీఐ ఏమైనా న్యాయదేవతా మాయావతి తాజ్ కారిడర్ విషయంలో ఏం జరిగిందనేది తెలియదా అంటూ ఆ పార్టీ నేత ఎల్లసిరి వేణుగోపాలరెడ్డి ప్రశ్నించారు.

Thursday, 9 August 2012
ఇతరుల సొత్తు నాదేనని బుకాయించడం
‘ఇతరుల సొత్తు నాదేనని బుకాయించడం కన్నా సిగ్గు చేటయిన విషయం లే’దన్నాడో పెద్దమనిషి. లేకేం? ఉందని తొడ చరిచి చెప్తున్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. అవును మరి- మహానేత వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను బాబు -సిగ్గులేకుండా- సొంతం చేసుకోవడం అంతకన్నా సిగ్గు చేటయిన విషయమే కదా! మీకేమన్నా అనుమానాలుంటే, చంద్రబాబు తాజా వేషం చూడండి.
ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థుల ఫీజు మొత్తాలను వాపసు చెయ్యాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాడు చంద్రబాబు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు కొన్ని బీసీ విద్యార్థి సంఘాలు మద్దతు కూడా ప్రకటించాయి. బాబు స్కెచ్ ప్రకారమే, పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని వదిలేశారు. ఈ మొక్కుబడి వ్యవహారమంతా, బంజారా హిల్స్ ప్రాంతంలో జరగడం కొసమెరుపు. ఈ ప్రాంతంలో ఎందరు బీసీలు ఉన్నారో బాబుకే తెలియాలి.
ఇంతకీ, చంద్రబాబు నాయుడికి బీసీ విద్యార్థుల సంక్షేమం గురించి పట్టింపు మొదలై ఎన్ని గంటలయిందో? ఎనిమిదిన్నరేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా ఉన్న ఈ మహానుభావుడు తన హయాంలో బీసీ విద్యార్థుల కోసం ఎన్నెన్ని సంక్షేమ చర్యలు -సొంత చొరవ మీద- తీసుకున్నారో ఆయనెలాగూ చెప్పడు. కనీసం, బాబు ఆందోళనకు మద్దతు తెలిపిన విద్యార్థి సంఘాలయినా ఈ లెక్కలు బయటపెడితే బాగుంటుంది. అయినా, బాబు గారి సంక్షేమావతారం ఎవరికి తెలియంది? ఇప్పటికీ ఆయన కబుర్లకు మోసపోతున్న వాళ్లెవరన్నా మిగిలితే, ఒక్కసారి బాబు జమానా విశేషాలు పరిశీలిస్తే సరిపోతుంది.
సరేనండీ- చంద్రబాబుకు బీసీలూ ఎస్సీలూ నిరుపేదలూ అభివృద్ధి చెందడం ఇష్టంలేదు! అందుకే, వాళ్ల అభ్యున్నతికోసం ఆయనే చర్యలూ చేపట్టలేదు. అందుకు ఇప్పుడెవరూ బాబును తప్పుపట్టడంలేదు. అయితే, మహానేత వైఎస్‌ఆర్ నాలుగేళ్ల కిందటే ప్రవేశపెట్టిన పథకాన్ని -దానికి బీసీ విద్యార్థులూ వాళ్ల కుటుంబ సభ్యుల నుంచి విశేషమయిన స్పందన రావడం గమనించి- లటుక్కున తన్నుకుపోవాలన్న గద్ద బుద్ధి ఉందే, దానికే అభ్యంతరం చెప్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చంకలో దూరి సొంత పనులన్నీ జరిపించుకుంటున్న టీడీపీకి అప్పుడప్పుడు తాను ప్రతిపక్షాన్నని గుర్తుకు వస్తూ ఉంటుంది. ఒక్కసారి జూలు విదిలించి ‘ఆందోళన’కు దిగుతుంటుంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదయినా కార్యక్రమం తలపెట్టిన సందర్భాల్లో టీడీపీ జూలువిదిలింపులు కొంచెం ‘ఎగస్ట్రా’గా ఉండడం కద్దు.
ఇప్పుడూ అదే జరిగింది. ఈనెల 12, 13 తేదీల్లో -పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో- ఫీజు వాపసు పథకం అమలు సక్రమంగా జరిపించాలన్న డిమాండ్‌తో సహా విద్యార్థుల సంక్షేమం కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్షకు కూర్చోవాలని తలపెట్టారు. ఇటీవల ఫీజు వాపసు పథకం విషయంలో అటు ప్రభుత్వం- ఇటు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలూ పీటముడి బిగించి, బీదా సాదా విద్యార్థుల పీకలు పిసికేందుకు కుట్ర పన్నిన సంగతి అందరికీ తెలిసిందే. పదవుల మాంసంముక్కలు దక్కించుకున్న ప్రభుత్వ నేతలు మాత్రం చాలా రోజులు పడక సీనులో నిద్ర నటించారు.
చెవులు పగిలే ప్రమాణానికి చేరిన విద్యార్థుల ఉద్యమం వాళ్లు కళ్లు తెరవకతప్పని పరిస్థితిని సృష్టించింది. దానికి తోడు విజయమ్మ దీక్షకు లభిస్తున్న స్పందన ఒకటి! దాంతో ఏలూరు దీక్ష సమయం దగ్గిరయ్యే కొద్దీ చంద్రబాబు బీపీ ఎగదన్నడం మొదలుపెట్టింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలి కన్నా ముందే ఏదో ఒకటి చేసేసి, సొడ్డు అనెయ్యాలని బాబు ఆత్రపడ్డారు. దాని ఫలితమే ఆయన చేపట్టిన ‘ఆందోళన’!
బీసీ ఉద్యమకారుల వత్తిడితో నోరు విప్పిన మంత్రి దానం నాగేందర్ గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ధర్నా నాటకం- అరెస్ట్ అంతర్నాటకం విడ్డూరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ వీథి నాటక ప్రదర్శన రక్తి కట్టడానికి తమ సర్కారు సంపూర్ణంగా సహకరించిన విషయం ఆయన చెప్పనూ లేదు- ఎవరూ అడగనూ లేదనుకోండి! అయినా, తాను ప్రభుత్వంలో భాగంగా ఉన్న సంగతి మర్చిపోయినట్లు ప్రవర్తించడం నాగేందర్‌కు పరిపాటే- పాతపాటే!

సీఎంకు అడుగడుగునా నిరసనల పర్వం
ఖమ్మం : ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అడుగడుగునా నిరసనలే ఎదురవుతున్నాయి. సీఎం మూడోరోజు కూడా ప్రజల నుంచి నిరసనలు ఎదుర్కొన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి బస చేసిన ఆర్ అండ్ బీ అతిథిగృహాన్ని సీపీఎం కార్యకర్తలు ముట్టడించారు.
పేదలకు ఇళ్లస్థలాలు, అర్హులైన వారికి ఫించన్లు ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా ఇందిరమ్మ బాటలో సీఎం వెళ్లిన ప్రతిచోటా సమస్యలపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. పోలీసుల లాఠీఛార్జ్ సర్వసాధారణమైపోయింది.

రైల్వేలకు ఉదారంగా నిధులు అందించాలని మేకపాటి విజ్ఞప్తి
రైల్వే ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల పరిరక్షణకు, రైళ్లలో భద్రతా ఏర్పాట్లను పటిష్టపర్చడానికి, అలాగే రైలు బోగీల్లో ఉపయోగించే సామగ్రిలో మండే స్వభావం ఉన్నవాటిని క్రమేపీ తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులు అందించాలని నెల్లూరు లోక్‌సభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన గత నెల 30వ తేదీన చోటుచేసుకున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాద ఘటనను ప్రస్తావించారు. చెన్నై వెళ్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు సమీపాన చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మహిళలు, పిల్లలతో సహా 30మందికిపైగా అమాయక ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారని చెప్పారు.
ఒక ప్రమాదం జరిగిన ప్రతిసారీ విచారణకు ఆదేశించడం, సిఫార్సులు చేయడం, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టడం చేయడానికి నిధులు లేవంటూ రైల్వేలు చెప్పడం పరిపాటిగా మారిందని ఆవేదన వెలిబుచ్చారు. ఇలాంటి ప్రమాదాలకు సంబంధించి ప్రతి ఒక్క కోణాన్ని స్పశిస్తూ లోగడ విచారణ కమిటీలు సమర్పించిన నివేదికల్లో పలు సిఫార్సులు అమలుకోసం ప్రభుత్వం వద్ద నిరీక్షిస్తున్న వైనాన్ని గుర్తుచేశారు. ఆయా కమిటీలు ఇచ్చిన సిఫార్సుల ప్రకారం రైల్వేలు సంస్కరణలను అమలుచేయలేకపోతున్నాయని, చాలినన్ని నిధులు లేకపోవడం, ప్రణాళికా సంఘం నుంచి బడ్జెట్‌పరంగా తోడ్పాటు అందాల్సివుండటం దీనికి ప్రధాన కారణాలని తెలిపారు. ఇది ప్రయాణికుల భద్రతకు సంబంధించిన అంశమైనందున ఇప్పటికైనా రైల్వేలకు ఉదారంగా నిధులు ఇవ్వాలని కోరారు.
జగన్‌కు బెయిల్ ఎందుకివ్వకూడదు? సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు
అరెస్ట్‌ను అక్రమంగా ప్రకటించాలన్న జగన్ పిటిషన్ కొట్టివేత
వాదనలు పునరావృతమయ్యే ఆస్కారముండటమే కారణం
విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్
సాయిరెడ్డికి కోర్టు నోటీసులు.. వచ్చే వారం విచారణ?
న్యూఢిల్లీ, సాక్షి లీగల్ కరస్పాండెంట్: పెట్టుబడుల కేసులో తనకు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. ఆయనకు బెయిల్ ఎందుకు మంజూరు చేయరాదో వివరించాలంటూ సీబీఐకి నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తన అరెస్టును అక్రమంగా ప్రకటించాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను మాత్రం తోసిపుచ్చింది. బెయిల్, అక్రమ అరెస్టు పిటిషన్లలోని వాదనలు ఒకేలా ఉండే ఆస్కారముంది. అక్రమ అరెస్టు పిటిషన్‌ను విచారిస్తే వాదనలు పునరావృతమయ్యే అవకాశముంది.
అందువల్ల సమయం వృథా కారాదనే ఉద్దేశంతోనే రెండో పిటిషన్‌ను సుప్రీం కొట్టేసింది. బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును రద్దు చేసి బెయిలివ్వాలంటూ జూలై 28న సుప్రీంలో జగన్ పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. వివాదాస్పద జీవోలకు సంబంధించి ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంది ఐఏఎస్‌లకు న్యాయ సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ మేరకు జీవోలు కూడా జారీ చేసిందని అందులో ఆయన పేర్కొన్నారు. ‘‘అవే జీవోలు క్విడ్ ప్రొకొలో భాగంగా జారీ అయ్యాయని, అందుకే తన కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చాయని ఆరోపిస్తూ అంతకుముందు సీబీఐ నాపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసింది. కానీ మంత్రులు, ఐఏఎస్‌లకు ప్రభుత్వం ఇప్పుడు న్యాయ సాయం చేస్తున్నందున ఆ జీవోలు క్విడ్ ప్రొకొలో భాగం కాదని స్పష్టమవుతోంది. తద్వారా నేను ఏ నేరమూ చేయలేదని కూడా రుజువవుతోంది’’ అని జగన్ వివరించారు. దర్యాప్తు మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా తాను ఆ ప్రక్రియలో ఎన్నడూ జోక్యం చేసుకోవడం కానీ, సాక్షులను ప్రభావితం చేయడం గానీ చేయలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటూ తనకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. తన అరెస్టును అక్రమంగా ప్రకటించాలన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ మరో పిటిషన్ కూడా జగన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై గురువారం ఉదయం ధర్మాసనం విచారణ చేపట్టింది. వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించింది. వెంటనే సీబీఐకి నోటీసులు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. జగన్‌కు ఎందుకు బెయిలివ్వరాదో వివరించాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణ ఎప్పుడన్నది మాత్రం ధర్మాసనం స్పష్టంగా చెప్పలేదు.
సాయిరెడ్డికి నోటీసులు..
ఆడిటర్ విజయసాయిరెడ్డికి హైకోర్టు బెయిలివ్వడాన్ని సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ధర్మాసనం విచారించింది. విజయసాయికి నోటీసులు జారీ చేసింది. జగన్ పిటిషన్‌నూ, దాన్నీ ఒకేసారి విచారిస్తామని స్పష్టం చేసింది. నిర్దిష్ట తేదీ మాత్రం చెప్పలేదు. పిటిషన్‌పై వచ్చే వారం వాదనలు జరిగే అవకాశముందని విచారణ అనంతరం జగన్ తరఫు న్యాయవాది సురేశ్ సుప్రీంకోర్టు ప్రాంగణంలో మీడియాకు చెప్పారు.

ఉన్నత విద్య ‘ఊపిరి’ తీస్తారా?!
|
చంద్రబాబును ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ నేత వాసిరెడ్డి పద్మ
వాన్‌పిక్‌కు కే టాయించిన భూముల్లో పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అసలు భూకేటాయింపులపై ఆయన విధానం ఏమిటో ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వాన్‌పిక్ ఒప్పందం జరిగింది కనుక అది తప్పని బాబు ఊరేగడం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. వైఎస్ పరిపాలనలో పరిశ్రమలకు, సెజ్‌లకు, ప్రాజెక్టులకు చేసిన భూ కేటాయింపులు తప్పని బాబు చెప్పదల్చుకుంటే తన పాలనలో చేసిన భూకేటాయింపులపై కూడా జవాబు చెప్పాలని, అసలు పరిశ్రమలకు భూములు ఇచ్చే విషయంలో ఆయన విధానం ఏమిటో కూడా వెల్లడించాలని డిమాండ్ చేశారు. బాబు తన హయాంలో రూ.1.60 లక్షల కోట్ల విలువ చేసే భూములను పరిశ్రమలకు కేటాయింపులు చేశారని, కొన్ని భూములను అత్యంత చవకగా లీజుకు ఇచ్చారని, వీటన్నింటిపైనా చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు తాను అధికారంలో ఉన్నపుడు ఒక మాట, ప్రతిపక్షంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తాను చేస్తే ఒప్పు, వైఎస్ చేస్తే తప్పు అని చెప్పే యత్నం చేస్తున్నారని విమర్శించారు. కాగా, ఫీజుల పథకం తానే ప్రారంభించానని బాబు చెప్పుకోవడం కన్నా పచ్చి అబద్ధం మరొకటి ఉండదని పద్మ చెప్పారు.
బాబు ‘బాట’వెలవెల. పూర్తిగా విఫలమైన వాన్‌పిక్ వ్యతిరేక యాత్ర
ఆద్యంతం సహాయ నిరాకరణ చేసిన నిజాంపట్నం
బాబు రాకను నిరసిస్తూ స్థానికుల స్వచ్ఛంద బంద్
మంచినీరూ దొరక్క రేపల్లె నుంచి తెచ్చుకున్న వైనం
అట్టహాసంగా వెళ్లిన చంద్రబాబుకు అవమానాల స్వాగతం
స్థానికులు ఒక్కరైనా లేకుండా నిజాంపట్నంలో సభ
నిజాంపట్నం (గుంటూరు), న్యూస్‌లైన్: రాజకీయ లబ్ధే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గురువారం గుంటూరు జిల్లాలో చేపట్టిన వాన్‌పిక్ పోరుబాట పూర్తిగా విఫలమైంది. ఎక్కడికక్కడ వెల్లువెత్తిన స్థానికుల వ్యతిరేకత మధ్య ఆయన యాత్ర ఆద్యంతమూ వెలవెలపోయింది. వాన్‌పిక్ సిటీకి సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇవ్వాలనే డిమాండ్‌కు వారి నుంచే వ్యతిరేకత ఎదురైంది.
రైతులకు మేలు జరిగి, తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే సహించలేకపోతున్నారంటూ బాబుపై స్థానికులు దుమ్మెత్తిపోశారు. నిజాంపట్నంలోనైతే ఆయన సభను వారు బహిష్కరించారు. పైగా బాబు పర్యటనకు నిరసనగా ఉదయం నుంచే దుకాణాలను, హోటళ్లను స్వచ్ఛందంగా మూసేశారు. దాంతో టీడీపీ నేతలు, కార్యకర్తలకు మంచినీళ్లు కూడా దొరకలేదు! ఇక కాలినడకన, కాన్వాయ్‌లో 10 కిలోమీటర్లు ప్రయాణించినా.. ఒకట్రెండు గ్రామాల్లో తప్ప జనమెవరూ రాకపోవడంతో బాబు కంగుతిన్నారు. ప్రజలు వలస వెళ్లారంటూ సర్దిచెప్పజూశారు. అంతలోనే.. రౌడీయిజంతో వారిని అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. పట్టలేని నిరాశతో.. షెడ్యూల్‌లో ఉన్నా, పలు గ్రామాలకు వెళ్లకుండానే వెనుదిరిగారు. ఇక వాన్‌పిక్ భూములు దున్నండన్న బాబు పిలుపును కూడా రైతులు ఆట్టే పట్టించుకోలేదు. చివరికి స్వయంగా నాగలి పట్టి ఏరువాక సాగించబోయినా, ఎద్దు నుంచి కూడా ఆయనకు సహాయ నిరాకరణే ఎదురైంది!
నిజాంపట్నానికి ఉదయం 10.30కు రావాల్సిన చంద్రబాబు, అక్కడ జనం లేరనే సమాచారంతో నింపాదిగా మధ్యాహ్నం 2.50కి చేరుకున్నారు. అయినా జనం లేక అక్కడ తలపెట్టిన బహిరంగ సభ వేదిక పూర్తిగా వెలవెలపోతూ కన్పించింది. నిజాంపట్నం వాసులంతా దూరంగా వుండి సహాయ నిరాకరణ చేశారు. మెయిన్ బజారు సెంటర్‌ను వేదికగా ఎంచుకున్నా వ్యాపార, దుకాణాలను ముందుగానే మూసేయటంతో బంద్ వాతావరణ మే రాజ్యమేలింది. స్థానికులెవరూ అటుకేసి చూసిన పాపాన పోకపోవడంతో తెనాలి, రేపల్లె తదితర మండలాల నుంచి తరలించిన టీడీపీ కార్యకర్తలతో కవర్ చేసేందుకు విఫలయత్నం జరిగింది. వారికి కూడా కనీసం మంచినీళ్లయినా అందక, రేపల్లె నుంచి తెప్పించుకోవాల్సి వచ్చింది. దాంతో ఆగ్రహాన్ని అణచుకోలేక పోయిన బాబు, ఇది పులివెందుల కాదనీ రౌడీయిజానికి పాల్పడితే అంతు చూస్తామని ఊగిపోయారు. ‘‘మంత్రి తమ్ముడు బంద్ చేయించాడు. మంచినీళ్లు కూడా లేకుండా చేశాడు. షాపులు మూయించటం, మంచినీళ్లు లేకుండా చేయడం, సభకు ఎవరూ రావొద్దనడం అనాగరికం. నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి చోటా రౌడీలను చాలామందిని చూశాను. నేనొచ్చినపుడే ఇంత దౌర్జన్యం చేశారంటే , మీ కథ తేలుస్తాను’ అంటూ పోలీసులను హెచ్చరించారు.
ఖాకీ బట్టలకు న్యాయం చేస్తారో, ప్రజల్లో చులకనవుతారో తేల్చుకోండంటూ హూంకరించారు. చిన్న చిన్న రౌడీల కోరలు తీస్తానన్నారు. అక్కడ్నుంచి పాదయాత్రగా బయల్దేరినా బాబు వెంట బ్లాక్ క్యాట్ కమెండోలు, రోప్ పార్టీ పోలీసులు, టీడీపీ నేతలే తప్ప జనం కన్పించలేదు. చానళ్లకు ఇంటర్వ్యూలిస్తూ ఆయన ముందుకు సాగారు. అదవల, పరిశావారిపాలెంలో అక్కడక్కడా మినహా మరే గ్రామంలోనూ ప్రజలు కన్పించలేదు. దాంతో, భూములు కోల్పోయిన రైతులు పనులు కోసం వలసలు వెళ్లడమే కారణమని బాబు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అదవల నుంచి బయల్దేరాక వర్షం రావడంతో కాన్వాయ్‌లో ముందుకు సాగారు. పరిశావారిపాలెంలో వాన్‌పిక్ భూముల్లో బాబు ఏరువాక చేశారు. కానీ ముందుగా తీసుకొచ్చిన ఎద్దు దున్నకుండా మొరాయించింది. దాంతో మరో ఎద్దుల జతను తెప్పించి దున్నారు. తర్వాత అడవుల దీవిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి సభలో మాట్లాడటంతో పోరుబాటను ముగించారు. షెడ్యూలులో ఉన్నా నర్రావారిపాలెంలో కాన్వాయి ఆగలేదు. మహ్మదీయపాలెం, అడవులదీవి దళితవాడను సందర్శించలేదు.
ప్రచారం కోసమే బాబు యాత్ర వాన్‌పిక్ పోరుబాటపై రైతుల నిరసన
వాన్‌పిక్ పోరుబాట పేరిట నిజాంపట్నం నుంచి యాత్ర ప్రారంభించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు స్థానిక రైతుల నుంచి అనూహ్య నిరసన ఎదురయ్యింది. ఈ సందర్భంగా రైతులువ్యక్తం చేసిన అభిప్రాయాలు వారి మాటల్లోనే.. ‘‘ చంద్రబాబు ఎందుకొచ్చారో మాకు అర్థం కావడం లేదు. ఇక్కడ ఎవరికీ అన్యాయం జరగలేదు. గతంలో ఇక్కడ ఉన్న భూముల పూర్తిగా చవుడు భూములు. ఎకరా 30 వేల నుంచి 40 వేల రూపాయలు మాత్రమే ఉండేది. వాన్‌పిక్ రావడంతో ఎకరాకు లక్ష నుంచి రెండు లక్షల వరకు చెల్లించడం జరిగింది. రైతులు పిల్లల్ని చదివించుకుని, పెళ్లిళ్లు చేసి, ఇళ్లు కట్టుకుని ఎంతో సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు ప్రచారం కోసం ఆర్భాటం చేస్తున్నారు. ఆయన హయాంలో రైతులు గ్రామాలొదిలి పోయారు. రైతుల గురించి ఆయనకేం తెలుసు. అసలిక్కడ ఏం అన్యాయం జరిగిందని చంద్రబాబు యాత్ర చేపట్టారు?’’

ప్రభుత్వంపై భగ్గుమన్న విద్యార్థి లోకం
రీయింబర్స్‌మెంట్‌ను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్
వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
కలెక్టరేట్ల ముందు ధర్నాలు.. రాస్తారోకోలు.. కలెక్టర్లకు వినతి పత్రాలు
సీఎం కార్యాలయం ముందు టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన
మంత్రుల క్వార్టర్లను ముట్టడించిన విద్యార్థి సంఘాలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్న ప్రభుత్వ వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. బడుగులను పెద్ద చదువులకు దూరం చేస్తే సహించబోమని హెచ్చరించింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మాదిరి పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. పథకంపై ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థిలోకం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి, ప్రభుత్వం తన తీరు మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. హైదరాబాద్ ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో వేలాది మంది విద్యార్థులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. రోడ్డుపై బైఠాయించి ‘‘పెద్ద చదువులు.. పేదల హక్కు’’ అంటూ నినదించారు.
పెరిగిన ఫీజులను ప్రభుత్వమే భరించాలని, దివంగత వైఎస్ హయాంలో కొనసాగించిన విధానాన్నే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పుత్తా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ... దివంగత మహానేత రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సాచ్యురేషన్ పద్ధతికి స్వస్తి చెప్పి.. శ్లాబు విధానాన్ని విద్యార్థులపై రుద్దాలని చూస్తే సహించేది లేదన్నారు. ఫీజుల విధానం పట్ల ప్రభుత్వ తీరు మారకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫీజుల పథకానికి తూట్లు పొడిస్తే రాష్ట్రం అగ్ని గుండమవుతుందని ధర్నాలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పార్టీ శాసనసభా పక్షం ఉప నాయకురాలు మేకతోటి సుచరిత హెచ్చరించారు. కేవలం వైఎస్ ప్రవేశపెట్టారనే అక్కసుతోనే ఫీజుల పథకానికి తిలోదకాలిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యల కారణంగా విద్యా సంవత్సరం నష్టపోవాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్లీజ్.. మీ రాజకీయాలకు మా జీవితాల్ని బలిచేయొద్దు. ఫీజులు చెల్లించి మా చదువులను సాగనివ్వండి..’’ అంటూ పలువురు విద్యార్థులు గోడు వెల్లబోసుకున్నారు. విద్యార్థులకు మద్దతుగా ఈ ధర్నాలో మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, సేవాదళం కన్వీనర్ కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు రాజ్‌ఠాకూర్, ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి, ట్రేడ్ యూనియన్ కన్వీనర్ జనక్‌ప్రసాద్, పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలతోపాటు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ నేతలు ఉన్నత విద్యామండలి కార్యదర్శి సత్తిరెడ్డికి విజ్ఞాపన పత్రం అందజేశారు. తర్వాత రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి గోషామహల్‌కు తరలించారు. తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
కదం తొక్కిన జిల్లాలు..: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలంటూ మెదక్ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగం సంగారెడ్డిలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. అనంతరం పార్టీ నాయకులు జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. విశాఖపట్నంలో కలెక్టరేట్ వద్ద పార్టీ చేపట్టిన ధర్నాలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో పార్టీ నేతలు, విద్యార్థులు ప్రధాన రహదారులపై రాస్తారోకోలు చేశారు. తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. కరీంనగర్‌లో కలెక్టరేట్ ఎదుట గంటపాటు ధర్నా నిర్వహించి, మోకాళ్లపై భిక్షాటన చేసి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. చిత్తూరులో పార్టీ నాయకులు విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో కలెక్టరేట్ వద్ద ధర్నా అనంతరం విద్యార్థులు హోటళ్లలో టీలు, మిర్చీలు అమ్ముతూ నిరసన తెలిపారు. కర్నూలు, అనంతపురం కలెక్టరేట్ల ముందు చేపట్టిన ధర్నాలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతలో జరిగిన ధర్నాలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు తోపుదుర్తి కవిత తదితరులు పాల్గొన్నారు.
సీఎం కార్యాలయం ముందు టీడీపీ ధర్నా: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని, ఫీజు మొత్తం ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం ముందు ధర్నా చేశారు. సచివాలయంలో సీఎం కార్యాలయం ఉండే సీ బ్లాక్ ప్రధాన ద్వారం ముందు కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు ఎమ్మెల్యేలను అరెస్టు చేసి తీసుకెళ్లారు. ధర్నాలో పాల్గొన్నవారిలో ఎమ్మెల్యేలు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బల్లి దుర్గాప్రసాద్, మండవ వెంకటేశ్వరరావు, బీదా మస్తాన్‌రావు, దేవినేని ఉమామహేశ్వరరావు, జి. జైపాల్‌యాదవ్, మల్లెల లింగారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, టి.ప్రకాశ్ గౌడ్ ఉన్నారు.
మంత్రుల క్వార్టర్ల ముట్టడి..: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎలాంటి షరతు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు గురువారం బంజారాహిల్స్‌లోని మంత్రుల క్వార్టర్లను ముట్టడించారు. అలాగే టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో సుమారు 50 మంది విద్యార్థులు రాజ్‌భవన్ ముట్టడికి యత్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ విధానాన్ని తప్పుబడుతూ టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వీరిని అడ్డుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Subscribe to:
Posts (Atom)