జక్కంపూడి రామ్మోహన్‌రావు కుటుంబం తమ కుటుంబంలో అంతర్భాగమని వైఎస్ విజయమ్మ అన్నారు. రామ్మోహన్‌రావు జీవితమంతా వైఎస్‌కు అండగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. రాజమండ్రి కంబాలచెరువు వద్ద జక్కంపూడి విగ్రహాన్ని విజయమ్మ సోమవారం ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎవరి మెప్పు కోసం కాకుండా తనను నమ్ముకున్న వారి కోసం పనిచేసిన వ్యక్తి జక్కంపూడి అన్నారు. ఓదార్పుయాత్రకు వచ్చినప్పుడు జక్కంపూడి అనారోగ్యంతో ఉన్నా జగన్ ను ఆశీర్వదించారని విజయమ్మ గుర్తు చేసుకున్నారు.
వైఎస్ జగన్ త్వరలోనే బయటకు వస్తారని... కాంగ్రెస్ టీడీపీ కుట్రపన్ని జగన్ కు అక్రమ కేసుల్లో ఇరికించారని విజయమ్మ అన్నారు. జగన్ బెయిల్ విషయంలో సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగానే ప్రజా సమస్యలపై జగన్ పోరాటాలు కొనసాగిస్తారని విజయమ్మ తెలిపారు.

No comments:
Post a Comment