హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ చేనేత దినోత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు కేక్ కట్ చేసి నేతన్నలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టారు. వైఎస్సార్‌సీపీ తరపున దీక్షలు, ధర్నా లు చేసినా, ఆఖరికి సీఎంకు వినతిపత్రం సమర్పించినప్పటికీ ప్రభుత్వంలో స్పం దన కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నేతన్నలకు ఇచ్చి న హామీలన్నింటినీ, ఆయన రెక్కల కష్టం మీద ఏర్పడిన ఈ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని ధ్వజమెత్తారు. టెక్స్‌టైల్ పార్కు, రుణాల మాఫీ, ఆత్మహత్యలకు పాల్పడిన నేతన్నల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాతో పాటు ఇతరత్రా హామీలు వేటినీ అమలు చేయడంలేదని దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు గిరిరాజ్ నగేష్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, బీసీ సెల్ కన్వీనర్ గట్టు రామచంద్రరావు, కేంద్ర పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు, ఎస్సీ సెల్ కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్‌రావు, మహిళా అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, సాంస్కృతిక విభాగం కన్వీనర్ విజయచందర్, చేనేత సంఘాల నేతలు పాల్గొన్నారు.
Tuesday, 7 August 2012
చేనేతల సమస్యలపై స్పందనేదీ?

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment