ఫీజు వేధింపులకు ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఫీజు కట్టలేక, కాలేజ్ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థి మురళీ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిది నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని గాంధీనగర్. హాస్టల్‌లో ఉంటూ మిర్యాలగూడలోని వాసవి జూనియర్ కాలేజ్‌లో ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుతున్నాడు. మురళీ హాస్టల్ ఫీజు మూడు వేల రూపాయలు ఇప్పటికే చెల్లించాడు. ఇటీవలే అతని తండ్రి పాముకాటుతో చనిపోయాడు. అందువల్ల మిగితా 16వేల రూపాయలు ఫీజు చెల్లించలేకపోయాడు. హఠాత్తుగా తండ్రి మరణించటం వల్ల అతని కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కాలేజ్ యాజమాన్యం కాలేజ్‌కి, హాస్టల్‌కి రానివ్వకుండా ఫీజు కోసం రెండు రోజులుగా వేధించిందని మృతుడు మురళీ బంధవులు తెలిపారు. వారి వేధింపులు తట్టుకోలేకే పాయిజన్ తాగి మురళీ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబీకులు లబోదిబోమంటున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment