విద్యార్థులకు వరంగా మారిన ఫీజుల పథకాన్ని రక్షించుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరించనుంది. ఈ నెల 13, 14 తేదీల్లో ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఏలూరులో దీక్ష చేయనున్నారు. పార్టీకి చెందిన పలువురు నేతలు దీక్షలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థులు దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. తాము సైతం దీక్షలో పాల్గొంటామని ముందుకొస్తున్నారు. కాగా, విజయమ్మ ఫీజు దీక్షకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఏలూరు ఇండోర్ స్టేడియం గ్రౌండ్స్‌లో దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. 32 అడుగుల పొడవు, 48 అడుగుల వెడల్పున భారీ వేదిక, దీని పక్కన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల కోసం మరో వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఇతరుల కోసం 280 అడుగుల పొడవు, 160 అడుగుల వెడల్పున వాటర్ ఫ్రూఫ్ షామియానా ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ సాంకేతిక నిపుణులు ఈ పనులను శరవేగంగా పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ సుమారు 12 వేల మంది ప్రజలు ఒకేసారి కూర్చోవచ్చు. దీక్షా వేదిక, షామియానా ఏర్పాట్లను పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని పర్యవేక్షిస్తున్నారు.
వానొచ్చినా ఇబ్బంది కలగకూడదు : వైవీ సుబ్బారెడ్డి
ఫీజు దీక్షా ఏర్పాట్లను పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి శనివారం పరిశీలించారు. వర్షం వచ్చినా దీక్షకు ఆటంకం కలగకుండా చూడాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 75 శాత ం మంది బీసీ విద్యార్థులు లబ్ధిపొందుతున్న ఈ ఫీజు రీయింబర్‌సమెంట్ పథకాన్ని రాష్ర్ట ప్రభుత్వం ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
No comments:
Post a Comment