ఒంగోలు: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వాన్ పిక్ యాత్రకు స్పందన కరువైంది. జనంలేక యాత్ర తుస్సుమంది. ఒంగోలు మండలం పాతపాడులో బాబు ప్రసంగాన్ని పట్టించుకునేవారే లేరు. ఓ పక్క చంద్రబాబు మాట్లాడుతుండగానే, మరోపక్క ఒక్కొక్కరూ అక్కడ నుంచి చల్లగా జారుకోవడం కనిపించింది. ప్రసంగానికి జనం నుంచి చప్పట్లు వస్తాయని ఆశించిన టీడీపీ అధినేతకు ఆశాభంగం కలిగింది. అయినా ఆయన గుక్కతిప్పకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. పార్టీనేతల వాహనాలు, మీడియా కవరేజీ మాత్రం కనిపించింది.తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన నాయకుణ్ని దగ్గరగా చూసేందుకయినా జనం రాకపోవడంతో బాబుగారు నిరాశగానే యాత్రను కొనసాగించారు.
ఇదిలాల ఉండగా, పాతపాడు వాన్ పిక్ భూముల్లో టీడీపీ కార్యాకర్తలు ఫెన్సింగ్ తొలగించడాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.
వాన్ పిక్ వల్ల తమకు ఎలాంటి అన్యాయం జరగలేదని ప్రకాశం జిల్లా గుండాయిపాలెం గ్రామస్తులు తెలిపారు. చౌడు భూముల్ని అధిక ధరలకు అమ్ముకున్నామని సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
వాన్‌పిక్ ప్రాంతాల్లో ఆయన పర్యటన పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కొన్ని చోట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజాంపట్నంలో తాజా మాజీ సర్పంచ్‌లు, ఎంపిటిసిలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో అశాంతి రాజేయడానికే చంద్రబాబు పర్యటిస్తున్నారని వారు మండిపతున్నారు. బాబు ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు

No comments:
Post a Comment