కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ ఈనెల 13,14 తేదీల్లో ఏలూరులో నిర్వహిస్తున్న‘ఫీజు పోరుకు’ జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని మాజీ మంత్రి, సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ పిలుపునిచ్చారు. ఏలూరులో ఏర్పాట్లను పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డితో కలిసి బోస్ పరిశీలించారు. ఈ సందర్బంగా బోస్ మాట్లాడుతూ మహానేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీ యింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 13, 14 తేదీలలో విజయమ్మ దీక్షకు జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన లభిస్తోందన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment