సెజ్‌లు, ఐటీ పేరుతో లక్షలాది ఎకరాలు భూ సంతర్పణ చేసిన చంద్రబాబు ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నాడని... ఏం చేయాలో పాలుపోక ప్రతిపక్షనేతగా కేవలం స్వలాభం కోసమే బాబు వాన్‌పిక్ యాత్ర చేపట్టారని వివిధ పక్షాల నేతలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం సాక్షి హెడ్‌లైన్‌షో చర్చలో 'వాన్‌పిక్ - బాబు యాత్ర'పై చర్చ జరిగింది.
గతంలో రైతు వ్యతిరేకిగా వాళ్ల భవిష్యత్తును అంధకారం నెట్టిన బాబు ఇప్పుడు వాళ్ల పరిహారం కోసమంటూ పరితపించడం విడ్డూరంగా ఉందని సీనియర్ జర్నలిస్టు తులసీదాస్, టీఆర్‌ఎస్ నేత గణేష్‌గుప్తా మండిపడ్డారు. వాన్‌పిక్ వ్యవహారంలో సీబీఐ కొందరిని అరెస్ట్ చేసిందన్న బాబు వ్యాఖ్యలపై వైఎస్సాఆర్ సీపీ ధ్వజమెత్తింది. సీబీఐ ఏమైనా న్యాయదేవతా మాయావతి తాజ్ కారిడర్ విషయంలో ఏం జరిగిందనేది తెలియదా అంటూ ఆ పార్టీ నేత ఎల్లసిరి వేణుగోపాలరెడ్డి ప్రశ్నించారు.

No comments:
Post a Comment