టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వాన్ పిక్ భూములలో పర్యటించడంపై నిజాంపట్నంలో నిరసన వ్యక్తం అవడం విశేషం. ఆయన నిజాంపట్నం వెళితే అక్కడ షాపులన్నీ మూసివేసి కనిపించినట్లు కధనాలు వచ్చాయి. దీనిపై చంద్రబాబు ఆక్షేపణ తెలిపారు. తన కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు తాగు నీరు కూడా దొరకకుండా షాపులు మూసివేయడం సరికాదని ఆయన అన్నారు.నిజాంపట్నం గ్రామం పులివెందుల కాదన్నారు. ముఖ్యమంత్రి జమిందార్ల పక్షాన ఉంటారా?లేక ప్రజల పక్షాన ఉంటారో తెల్చాలన్నారు. కాదనితాను అభివృద్దికి వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. అయితే వాన్ పిక్ ప్రాజెక్టుకు ఇరవై తొమ్మిది వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు.నిజానికి వాన్ పిక్ కింద సేకరించిన భూమి పదమూడు వేల ఎకరాలే కావడం గమనార్హం. ఏ ప్రయోజనాన్ని ఆశించి చంద్రబాబు అక్కడ పర్యటిస్తున్నారో కాని నిజాంపట్నం నిరసన మాత్రం ఆసక్తికరమైనదే.కాగా చంద్రబాబు పర్యటనను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది. చంద్రబాబు హయాంలో కూడా భూ కేటాయింపులు జరిగాయని, అవి కూడా తప్పేనని చంద్రబాబు అంటారా అని ఆ పార్టీ అదికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment