గ్యాస్ కష్టాలను మహానేత వైఎస్ఆర్ ఎప్పుడో ఊహించారు. కేజీ బేసిన్ గ్యాస్‌ను రాష్ట్రానికి ఇచ్చిన తర్వాతనే ..వేరే రాష్ట్రాలకు ఇవ్వాలని కేంద్రానికి లేఖ కూడా రాశారు. అంతేకాదు.. గ్యాస్‌పై రిలయన్స్ పెత్తనాన్ని ప్రశ్నించారు. వైఎస్ఆర్ బాటలోనే పయనించారు ఆయన తనయుడు వై.ఎస్. జగన్. గ్యాస్ ప్లాంట్‌లకు సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వచ్చారు.
రాష్ట్ర పాలకుల పనితీరు ఎలా ఉందంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడంలా ఉంది. అంతా అయినపోయిన తర్వాత నేతలు హడావుడి చేస్తున్న తీరును సామాన్య ప్రజలు చీదరించుకుంటున్నారు.ఇప్పటికే రాష్ట్రంలోని 14 గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్‌లు చతికిలబడ్డాయి. రోజుకు 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉంది. జలాశయాలు అడుగంటాయి. కళ్ల ఎదుట ఇన్ని హెచ్చరికలు కనిపిస్తోన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. ఫలితం గా రాష్ట్రంలో తీవ్ర విద్యత్ కొరత నెలకొంది. ఈ పరిణామాలను మహానేత వైఎస్ఆర్ ఎప్పుడో అంచనావేశారు. కాబట్టే ..కేజీ బేసిన్ గ్యాస్ మాది అని ధైర్యంగా చెప్పగలిగారు. గ్యాస్‌పై ఆశ్రద్ధ చూపినట్లైతే చాలా నష్టపోవాల్సి వస్తుందని పలు సందర్భాల్లో వైఎస్ జగన్ కూడా హెచ్చరించారు. రాష్ట్రంలో 14 గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్‌లు చతికిలబడటంతో 1, 174 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్రం కోల్పోయింది. ఈ 14 విద్యుత్ ప్లాంట్లు ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ 27.23 మిలియన్ యూనిట్లు మాత్రమే. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన ప్రయోజనం లేకపోయింది. ఇక గత్యంతరం లేక సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ విమానం ఎక్కాల్సి వచ్చింది. అదే వైఎస్ఆర్ మాటలు, వైఎస్ జగన్ చేసిన హెచ్చరికలు విని.. కాస్తంత ముందుగానే కళ్లు తెరచి ఉంటే కిరణ్‌కు ఢిల్లీ విమానం ఎక్కాల్సిన అవసరమే ఉండేది కాదేమో.

No comments:
Post a Comment