YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 6 August 2012

రాజమండ్రి : రాజమండ్రి కంబాలచెరువు సెంటర్ లో మాజీమంత్రి స్వర్గీయ జక్కంపూడి రాంమోహన్ రావు విగ్రహాన్ని సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా విజయమ్మ జక్కంపూడి కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విజయమ్మ రాకతో కంబాలచెరువు జనసంద్రంగా మారింది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!