వాన్‌పిక్‌కు కే టాయించిన భూముల్లో పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అసలు భూకేటాయింపులపై ఆయన విధానం ఏమిటో ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వాన్‌పిక్ ఒప్పందం జరిగింది కనుక అది తప్పని బాబు ఊరేగడం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. వైఎస్ పరిపాలనలో పరిశ్రమలకు, సెజ్‌లకు, ప్రాజెక్టులకు చేసిన భూ కేటాయింపులు తప్పని బాబు చెప్పదల్చుకుంటే తన పాలనలో చేసిన భూకేటాయింపులపై కూడా జవాబు చెప్పాలని, అసలు పరిశ్రమలకు భూములు ఇచ్చే విషయంలో ఆయన విధానం ఏమిటో కూడా వెల్లడించాలని డిమాండ్ చేశారు. బాబు తన హయాంలో రూ.1.60 లక్షల కోట్ల విలువ చేసే భూములను పరిశ్రమలకు కేటాయింపులు చేశారని, కొన్ని భూములను అత్యంత చవకగా లీజుకు ఇచ్చారని, వీటన్నింటిపైనా చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు తాను అధికారంలో ఉన్నపుడు ఒక మాట, ప్రతిపక్షంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తాను చేస్తే ఒప్పు, వైఎస్ చేస్తే తప్పు అని చెప్పే యత్నం చేస్తున్నారని విమర్శించారు. కాగా, ఫీజుల పథకం తానే ప్రారంభించానని బాబు చెప్పుకోవడం కన్నా పచ్చి అబద్ధం మరొకటి ఉండదని పద్మ చెప్పారు.
Thursday, 9 August 2012
చంద్రబాబును ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ నేత వాసిరెడ్డి పద్మ

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment