ఏలూరు: విద్యార్థుల ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్నందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఏలూరులో చేయతలపెట్టిన దీక్ష పోస్టర్ ను ఆపార్టీ నేతలు శుక్కవారమిక్కడ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, ఎమ్మెల్యే ఆళ్లనాని, మాజీ ఎమ్మెల్యే ముదినూరి ప్రసాదరాజు, తోట గోపి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని దశలవారీగా ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. ఒక్కసారే పథకాన్ని ఎత్తివేస్తే తీవ్ర ప్రతిఘటన వస్తుందని సర్కార్ కుతంత్రాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి పేదలకు న్యాయ చేసేందుకే విజయమ్మ దీక్ష చేస్తున్నారని నాని తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంలో బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని... అర్హులైన బీసీ విద్యార్థులందరికీ పథకాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు.

No comments:
Post a Comment