YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 5 August 2012

గ్యాస్ తరలిపోతుందని తెలిసినా నిర్లక్ష్యం.. కేంద్రానికి లేఖలతో సరి..

ప్రధానిని కలవాలని జైపాల్ సూచించినా.. అధికారులను పంపి చేతులు దులుపుకున్న కిరణ్!..కేంద్రంపై రాజకీయంగా ఒత్తిడి తేవటంలో విఫలం 
నాడు వైఎస్ ఒత్తిడితో రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు 100 శాతం పీఎల్‌ఎఫ్‌కు 
కేజీ బేసిన్ గ్యాస్ సరఫరా.. తర్వాత గ్యాస్ ఉత్పత్తి పడిపోయిందని కోతలు 
ఇప్పుడు షిండే ఒత్తిడితో మహారాష్ట్రకు గ్యాస్ మళ్లింపు.. 

హైదరాబాద్, న్యూస్‌లైన్: మన రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు సరఫరా అవుతున్న గ్యాస్‌ను మహారాష్ట్రలోని రత్నగిరి విద్యుత్ ప్లాంటుకు మళ్లించబోతున్నారన్న విషయం ఏడాది కిందటే ముఖ్యమంత్రికి తెలుసా? అయినప్పటికీ దానిని అడ్డుకునేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదా? ప్రధానమంత్రిని కలవాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి సూచించినా సీఎం పట్టించుకోలేదా? కేవలం లేఖలతోనే సరిపెట్టారా? రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతే ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి కారణమా? మన గ్యాస్‌ను మహారాష్ట్రకు మళ్లించిన వ్యవహారాన్ని లోతుగా విశ్లేషిస్తే.. పై ప్రశ్నలన్నిటికీ అవును అనే సమాధానమే వస్తోంది. రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు కేటాయించిన గ్యాస్‌ను మహారాష్ట్రకు తరలిస్తారనే సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి 11 నెలల కిందటే కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ వర్గాలు చేరవేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 

మహారాష్ట్రలోని రత్నగిరి విద్యుత్ ప్లాంటుకు గ్యాస్ కేటాయింపు నిర్ణయూన్ని 2008లో సాధికార మంత్రుల బృందం తీసుకుంది. సాధికార మంత్రుల బృందం నిర్ణయమంటే కేబినెట్ నిర్ణయమే. ఈ నిర్ణయం అమలుకాకుండా చూడాలంటే స్వయంగా ప్రధాని జోక్యం చేసుకోవటం మినహా మరో మార్గం లేదు. ఈ నేపథ్యంలో ప్రధానిపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చి.. గ్యాస్ మళ్లింపును అడ్డుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయినట్లు స్పష్టమవుతోంది. కేవలం లేఖలు రాయటం, అధికారులను ఢిల్లీకి పంపటం మినహా రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా చొరవ తీసుకోలేదు. ఫలితంగా రాష్ట్రానికి వస్తున్న గ్యాస్‌కు గండి పడింది. పొరుగు రాష్ట్రానికి తరలిపోయింది. మనకు మాత్రం విద్యుత్ సంక్షోభం మిగిలింది. 

సర్కారు చేయూల్సింది ఇదీ...

కృష్ణా - గోదావరి (కేజీ) బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తి ప్రతి ఏటా పెరుగుతుందని మొదట్లో అంచనా వేశారు. ఈ అంచనాల ప్రకారం 2009-10లో రోజుకు 70 మిలియన్ క్యూబిక్ మీటర్ల (ఎంసీఎండీల) గ్యాస్ ఉత్పత్తి అవుతుందని.. ఇది 2012 నాటికి 80 ఎంసీఎండీలకు చేరుకుంటుందని అంచనా వేశారు. అయితే, అవసరాలు మాత్రం ఇంతకంటే తక్కువగా ఉంటాయని కేంద్ర సాధికార మంత్రుల బృందం భావించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని రత్నగిరి విద్యుత్ ప్లాంటుకు గ్యాస్ కేటాయించాలని 2008 అక్టోబర్ 23న జరిగిన సమావేశంలో ఆ మంత్రుల బృందం నిర్ణయించింది. అయితే.. గ్యాస్ ఉత్పత్తిపై అంచనాలన్నీ తలకిందులయాయి. 2009-10లో గ్యాస్ ఉత్పత్తి 70 ఎంసీఎండీలకు బదులు కేవలం 42 ఎంసీఎండీలకు పడిపోయింది. 2012 నాటికి ఇది కాస్తా 29 ఎంసీఎండీలకు పడిపోయింది. భవిష్యత్తులో మరింత తగ్గుతుందని ఇప్పటికే కేంద్ర విద్యుత్‌శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందే మేల్కోవటంలో విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ గ్యాస్ ఉపద్రవాన్ని నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మూడు మార్గాలున్నాయి. అవి...

గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోతుండటంతో రాష్ట్రానికి కూడా గ్యాసు కేటాయింపులు తగ్గుతాయి. అయితే.. మన రాష్ట్ర తీరంలోని గ్యాస్ కాబట్టి.. మనకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రంపై రాజకీయంగా ఒత్తిడి తేవాలి. ఇందుకోసం సీఎం నేతృత్వంలో ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లాల్సింది. ఈ ప్రయత్నమేదీ జరగలేదు. 

గ్యాస్ అధికంగా ఉత్పత్తి అవుతుందని భావించి.. మహారాష్ట్రకు గ్యాస్ తరలించాలని 2008లో సాధికార మంత్రుల బృందం తీసుకున్న నిర్ణయానికి విలువ లేదని కేంద్రానికి రాష్ట్రం నివేదించవచ్చు. ఈ కారణంగా గ్యాస్ తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధానిని రాష్ట్ర ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. ఇందుకోసం స్వయంగా సీఎం రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఈ దిశగానూ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించలేదు. కేవలం అప్పటి ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి దినేష్‌కుమార్ మాత్రమే కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి జైపాల్‌రెడ్డిని కలిశారు. ఈ నిర్ణయాన్ని ఆపే శక్తి తనకు లేదని.. ప్రధానిని సీఎం కలవాలని జైపాల్‌సూచించినట్టు సమాచారం. అయితే, సీఎం లేఖలు రాయటం మినహా ప్రధానిని కలిసే ప్రయత్నమేదీ చేయలేదు. 

ఒకవేళ మహారాష్ట్రకు కచ్చితంగా గ్యాస్‌ను మళ్లించాలని కేంద్రం నిర్ణయిస్తే.. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ సంక్షోభాన్ని ప్రధానికి వివరించి ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేయూలని కోరవచ్చు. దురదృష్టవశాత్తూ ఈ ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేకపోయింది. రాష్ట్రం నుంచి పెద్దగా ఒత్తిడి లేకపోవటంతో కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రిగా ఉన్న సుశీల్‌కుమార్‌షిండే.. హోంమంత్రిగా బదిలీ అయ్యే ముందుగా మన గ్యాస్‌ను మహారాష్ట్రకు తరలించుకుపోయూరు. వాస్తవానికి మన రాష్ట్ర ఎంపీలందరినీ సీఎం తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఫలితం మరోలా ఉండేదని ఇంధనశాఖ వర్గాలూ అభిప్రాయపడుతున్నాయి.


మనకు ఉత్తి గ్యాసే!

కేజీ బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తి ప్రస్తుతం 29 ఎంసీఎండీలకు పడిపోయింది. ఇందులో అత్యున్నత ప్రాధా న్య క్రమంలో ఉన్న 16 ఎరువుల కర్మాగారాలకు 15.8 ఎంసీఎండీల గ్యాస్ సరఫరా చేస్తున్నారు. ఆ తర్వాత ప్రాధాన్య క్రమంలో ఎల్‌పీజీ ప్లాంట్లకు 2.6 ఎంసీఎండీల గ్యాస్ ఇస్తున్నారు. సీజీడీ, పంపిణీ నష్టాలకు ఒక ఎంసీఎండీ గ్యాస్ ఖర్చవుతోంది. దీంతో 25 విద్యుత్ ప్లాంట్లకు కలిపి మిగిలింది 9.6 ఎంసీఎండీలు మాత్రమే. ఇందులో 1,967 మెగావాట్ల సామర్థ్యంగల రత్నగిరి విద్యుత్ ప్లాంటుకు 7.6 ఎంసీఎండీల గ్యాస్ పోతే.. ఇక మిగిలేది 2 ఎంసీఎండీలు మాత్రమే. దీనిని మిగతా 24 విద్యుత్ ప్లాంట్లకు పంచాల్సి ఉంటుంది. ఇం దులో మన రాష్ట్రంలోనే సగం ఉన్నాయి. అంటే ఈ 2 ఎంసీఎండీల గ్యాసును మొత్తం 24 ప్లాంట్లకు కేటాయించాలి. వాస్తవానికి మన రాష్ట్రంలోని విద్యు త్ ప్లాంట్లకు 75% పీఎల్‌ఎఫ్‌కు గ్యాసు ఇవ్వాలంటే కనీసం 10 ఎంసీఎండీల గ్యాస్ అవసరం. అయితే.. మనకు వస్తోంది 1.36 ఎంసీఎండీలు మాత్రమే. అంటే మనకు చివరకు మిగిలింది ఉత్త గ్యాసే.

సాధికార మంత్రుల బృందంపై రాజకీయు ఒత్తిడి పనిచేయుదా?

గ్యాస్ అన్వేషణ, వెలికితీత విధానంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో నూతన గ్యాస్ అన్వేషణ, వెలికితీత విధానం (ఎన్‌ఈఎల్‌పీ-నెల్ప్) తెరపైకి వచ్చింది. ఈ నెల్ప్‌లో భాగంగా బిడ్డింగ్ నిర్వహించిన బావుల నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ను కేటాయించేందుకు నాటి కేంద్రమంత్రి ప్రణబ్‌ముఖర్జీ నేతృత్వంలో సాధికార మంత్రుల బృందాన్ని కేంద్రం నియుమించింది. ఆ బృందం కేజీ బేసిన్ గ్యాసును ఏయే ప్రాధాన్యతల కింద కేటాయించాలనే దానిపై విధాన నిర్ణయం రూపొందించింది. గ్యాస్ సరఫరాలో మొదటి ప్రాధాన్యత ఎరువుల కర్మాగారాలు, రెండో ప్రాధాన్యత ఎల్‌పీజీ ప్లాంట్లు, మూడో ప్రాధాన్యత విద్యుత్ ప్లాంట్లు, నాలుగు-సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ), ఐదు-పెట్రో కెమికల్స్, ఆరు-పెట్రో రిఫైనరీలుగా నిర్ణయించింది. గ్యాస్ ఉత్పత్తి తగ్గుతుండటంతో ప్రాధాన్యత క్రమం కింద మొదట పెట్రో రిఫైనరీలు, పెట్రోకెమికల్స్‌కు గ్యాసును పూర్తిగా నిలిపివేశారు. గ్యాస్ ఉత్పత్తి మరింత తగ్గటంతో సీజీడీకీ కోత పెట్టారు. ఇప్పుడు విద్యుత్ ప్లాంట్ల వంతు వచ్చింది. అయితే.. సాధికార మంత్రుల బృందంపై ఒత్తిడి తెచ్చి గ్యాస్ కోతల నుంచి మినహాయించుకునే అవకాశమూ ఉంది. సాధికార మంత్రుల బృందంపై రాజకీయు ఒత్తిళ్లు పనిచేస్తాయనేందుకు పలు ఉదాహరణలు ఉన్నాయి. విద్యుత్ ప్లాంట్లకు కేవలం 70 శాతం ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)కు మాత్రమే గ్యాసు కేటాయించాలనేది ఈ మంత్రుల బృందం నిర్ణయం. అయితే.. కేజీ బేసిన్ రాష్ట్రంలో ఉన్నందువల్ల రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు 75 శాతం ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)కు గ్యాస్ ఇవ్వాలని వై.ఎస్.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా అప్పట్లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు 75% పీఎల్‌ఎఫ్‌కు గ్యాసు కేటాయించారు. 

మిగతా రాష్ట్రాల్లోని విద్యుత్ ప్లాంట్లకు కేవలం 70 శాతం పీఎల్‌ఎఫ్‌కే గ్యాస్ సరఫరా చేయాలని 2008లోనే మంత్రుల బృందం నిర్ణయుం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక దివంగత నేత వైఎస్ ఒత్తిడి మినహా మరొకటి పనిచేయలేదు. అదేవిధంగా గ్యాస్ సరఫరా కంటే డిమాండ్ తక్కువగా ఉన్న సమయంలో అదనపు గ్యాస్‌ను రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు మళ్లించాలని కూడా వైఎస్ ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా 2009 ఏప్రిల్ నుంచి 2010 అక్టోబర్ వరకు రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు 100% పీఎల్‌ఎఫ్‌కు గ్యాసు సరఫరా అయింది. ఇప్పుడు రత్నగిరికి గ్యాసు కేటాయించటంలో కూడా షిండే ఒత్తిడి మినహా వురొక కారణం మనకు కనిపించదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎంపీలతో కేంద్రంలో అధికారంలోకి ఉన్న యూపీఏ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా ఒత్తిడి తెచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెప్తున్నారు. అయితే.. సీఎం ఈ ప్రయత్నమేదీ చేయకపోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పరిశీలకులు విమర్శిస్తున్నారు. 

11 నెలలు ఆపాను!
సీఎం ఏమీ చేయలేదు: జైపాల్ వ్యాఖ్యలు 

గత 11 నెలలుగా మహారాష్ట్రకు గ్యాస్ తరలిపోకుండా ఆపానని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. 11 నెలల కిందటే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారమిచ్చినా.. సర్కారు ఏమీ చేయులేదని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. మహారాష్ట్రకు గ్యాస్ తరలింపు వ్యవహారంలో జైపాల్‌రెడ్డి ఏమీ చేయలేకపోయారన్న విమర్శల నేపథ్యంలో ఆయున ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ‘సాధికార మంత్రుల బృందం నిర్ణయమంటే కేంద్ర కేబినెట్ నిర్ణయమే. దానిని నిలుపుదల చేసే శక్తి కానీ, అధికారం కానీ నాకు లేదు. ఈ విషయూన్ని సీఎంకు కూడా తెలిపాను. ప్రధానిని కలవాలని సూచించాను. అరుునప్పటికీ నాపై విమర్శలు రావటం బాధిస్తోంది’ అని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. వాస్తవానికి రత్నగిరి విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు వ్యతిరేకంగా 1991లోనే పార్లమెంటు సాక్షిగా వ్యతిరేకించిన విషయాన్నీ ఆయన ప్రస్తావించినట్లు తెలిసింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!