YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 7 August 2012

వైఎస్సార్ సీపీ ఎస్సీ, ఎస్టీ కమిటీ భేటీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. దళిత, గిరిజనుల అభివృద్ధి కోసం ఓ కొత్త పాలసీ సిద్ధం చేసేందుకు సమాలోచనలు జరుపుతున్నారు. ప్రతిపాదిత పాలసీ సిద్ధం చేసి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఎస్సీ, ఎస్టీ కమిటీ అందజేయనుంది. దళితులు, గిరిజనుల సమస్యలను పూర్తిగా పరిశీలించి పాలసీ రూపొందిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. దేశం, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం, ఏ పార్టీ చేయని విధంగా ఈ పాలసీ ఉంటుందన్నారు. జగన్‌ సూచనలతో పాలసీ విధివిధానాలు త్వరలో మీడియాకు వివరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జూపూడి ప్రభాకరరావు, గొల్ల బాబూరావు, నల్లా సూర్యప్రకాశ్‌, కుంభ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!