ఇంజనీరింగ్ ఫీజు రీయంబర్స్‌మెంట్ (ఏకీకృత ఫీజు విధానం) పై కేబినెట్ సబ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ఫీ రీయంబర్స్‌మెంట్ పొందుతున్న విద్యార్ధులు సబ్జెక్టుల్లో యాభై శాతం పాస్ అయితేనే వచ్చే ఏడాదికి ఫీ రీయంబర్స్‌మెంట్‌ను వర్తింప చేస్తామని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. ఏకీకృత ఫీజుల విధానంపై సోమవారం సచివాలయంలో సమావేశమైన కేబినెట్ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలను మంత్రి పితాని మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈనెల 8వ తేదీన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తేదీలు ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. యాజమాన్య కోటా సీట్లు కూడా ఆన్‌లైన్ విధానం ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కళాశాలల ఫీజు పెరిగినా ప్రభుత్వం రూ. 31 వేలు రియంబర్స్‌మెంట్ చెల్లిస్తుందని, మిగతా ఫీజుకు బ్యాంకు రుణం ఇస్తామన్నారు. ఎస్టీ, ఎస్సీ విద్యార్ధులకు కేంద్ర, రాష్ట్ర నిధులతో ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లిస్తామని మంత్రి తెలిపారు.
ఏఎఫ్ ఆర్సీ విధానంపై సుప్రీంకోర్టు నిబంధనలమేరకు చట్టం తీసుకువస్తామని మంత్రి పితాని పేర్కొన్నారు.

No comments:
Post a Comment