‘రీయింబర్స్‌మెంట్’ను అటకెక్కించే కుట్ర
- {పమాణాలు లేకుండా ఫలితాలెలా వస్తాయి ?
- ఉత్తీర్ణులవుతోంది 30 శాతమే
- 70 శాతం మందికి ఫీజులు ఇవ్వకుంటే ఎలా?
- పథకాన్ని పాతరేస్తే ఊరుకునేది లేదు
- సర్కారు తీరుపై భగ్గుమంటున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
కనీసం సగం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులయితేనే ఫీజు రీయింబర్స్‌మెంట్ అంటూ సర్కారు పాడుతున్న కొత్త పాట విద్యార్థులకు శాపంగా పరిణమించనుంది. మౌలిక సదుపాయాలు లేని కళాశాలలకు ఇబ్బడిముబ్బడిగా అనుమతులిచ్చిన సర్కారు, అందులో ఏ మేరకు నాణ్యమైన విద్య అందుతుందో అనే అంశపై మాత్రం దృష్టి పెట్టలేదు. ఫలితంగా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక ప్రొఫెసర్ ఉండాలని నిబంధనలుండగా, సబ్జెక్టుకు కనీసం ఒక్క ప్రొఫెసర్ కూడా లేని కళాశాలలెన్నో ఉన్నాయి. కొన్ని కళాశాలలోని ప్రయోగశాలలో వసతులు కూడా సరిగా లేవంటే అతిశయోక్తి కాదు.
సిటీబ్యూరో, న్యూస్‌లైన్: జేఎన్టీయూహెచ్‌కు అనుబంధంగా నగరంలో 335 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 2.8 ల క్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల విడుదలైన ఫలితాల ను చూస్తే, 70,349 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరైతే ఉత్తీర్ణులయింది మాత్రం 22,301మందే (31.7 శాతం). ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో 3.67 శాతం, సివిల్ ఇంజినీరింగ్‌లో 18.31 శాతం, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 22 శాతం, మైనింగ్ ఇంజినీరింగ్‌లో 27.59 శాతం, బయోటెక్నాలజీలో 29 శాతం, కెమికల్ ఇంజినీరింగ్‌లో 33 శాతం, ఐటీ లో 33.36 శాతం, ఈసీఈలో 33.8 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 35 శాతం, తృతీయ సంవత్సరంలో 41 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. నుత్తీర్ణులయినవారిలో దాదాపు 90 శాతం మంది సగానికి పైగా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. సగం సబ్జెక్టుల్లో పాసైతేనే ఫీజులిస్తామంటూ సర్కారు విధించిన తాజా ఆంక్షలతో ఆ విద్యార్థుల భవిత ప్రశ్నార్థకంగా మారింది.
అనుత్తీర్ణతకు కారణాలెన్నో...
కర్ణుడి చావుకు సవాలక్ష కారణలన్నట్లు, ప్రమాణాలు లేని ఇంజినీరింగ్ కళాశాలలలో విద్యార్థు ల అనుత్తీర్ణతకూ అనేక కారణాలున్నాయి. గ్రా మీణ ప్రాంతాలలో ఇంటర్ వరకు తెలుగు మీ డియం చదివిన విద్యార్థులు బీటెక్‌లో ఆకస్మాత్తుగా ఇంగ్లిష్ మీడియంలోకి మారడానికి ఎన్నో అవస్థలు పడుతున్నారు.
ఇంజినీరింగ్ సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. సిల బస్ పూర్తి చేయాలాంటే కనీసం 40 వారాల తరగతులు అవసరం. సెకండ్ కౌన్సె లింగ్, స్పాట్ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆరు వారాలకు పైగా తరగతులు నష్టపోతున్నారు. శివారు ప్రాంతాలలో ఉన్న కళాశాలలో లెక్కకు ప్రొఫెసర్లున్నా, అర్హులు తక్కువే. ఇన్ని కష్టాల మధ్య విద్యార్థులు గట్టెక్కే పరిస్థితులు కల్పించని ప్రభుత్వం వారికి ఫీజు లివ్వమంటూ భయభ్రాంతులకు గురిచేయడం దారుణమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పేదలంటే సర్కారుకు చులకనా...
ఫీజుల భారాన్ని విద్యార్థులపై మోపేందుకు సర్కారు కుట్ర పన్నుతోంది. పేద కుటుంబాల పిల్లలకు ఆశాదీపమైన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ తీరుపై విద్యార్థులు నిప్పులు చెరుగుతున్నారు. అర్హత కలిగిన ఏ విద్యార్థీ డబ్బు లేదని ఉన్నత విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
ఆ యన ఆశయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న స ర్కార్ వైఖరిని విద్యార్థులు ఖండిస్తున్నారు. పేద కుటుంబాల పిల్లలు సాంకేతిక, ఉన్నత చదువులకు అర్హులు కాకూడదా? ఉన్నత ఉద్యోగాలు ధనవంతుల పిల్లలే చేయాలా? అని ప్రశ్నిస్తున్నారు. డబ్బు లేకపోతేనేం తమకు అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారు. పథకాన్ని ఎత్తివేస్తే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
ఈ పథకం వల్లే నా బిడ్డ చదువుతున్నాడు
ఫీజ్ రీయింబర్స్‌మెం ట్ పథకం మావంటి పేదకుటుంబాలకు వరం. లక్షల్లో ఇంజనీరింగ్ ఫీజులు కట్టే స్థోమత లేని మాబోటి వారికి దారి చూపింది. మా బిడ్డ ఫైనల్ ఇయర్ వరకు వచ్చాడంటే అది రీయింబర్స్‌మెంట్ చలవే.
-ఎల్లయ్య, పేరెంట్
ప్రభుత్వ చేతకానితనమే
విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని కళాశాలలకు అనుమతులు మంజూరు చేయాల్సిన ప్రభుత్వం ఆమాటే మరిచింది. గతేడాది లక్షకు పైగా సీట్లు మిగిలిపోతే.. ఈ ఏడాది మరో లక్ష సీట్లు పెరిగేలా కళాశాలలకు అనుమతిచ్చింది. ఇది నిజంగా సర్కారు చేతగానీతనమే. మూడు శాతం ఉత్తీర్ణత కూడా సాధించని కళాశాలలను, పట్టుమని పది మంది విద్యార్థులు కూడా లేని కళాశాలలను మూసేయాలి. నాణ్యమైన విద్యను అందించడంలో విఫలమైన ప్రభుత్వం, పేదల చదువుకు ఆంక్షలు పెట్టడం విడ్డూరంగా ఉంది.
-లలిత్‌కుమార్,
ఐఐటీ-జేఈఈ ఫోరం కన్వీనర్
వైఎస్‌ఆర్ దయతోనే...
వ్యవసాయంపై ఆధారపడిన మా కుటుంబం ఇంజినీరింగ్ చదివించే స్థితిలో లేదు. వైఎస్‌ఆర్ దయతో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ద్వారా ఇంజినీరింగ్ చేస్తున్నా. ఈ పథకాన్ని తీసేస్తే నాలాంటి పేద విద్యార్థులు రోడ్డున పడతారు.
-అనిల్, చివరి సంవత్సరం విద్యార్థి
చదువుకు దూరవుతానని భయపడ్డా...
పెద్ద చదువు చదివే ఆశ వున్నా అప్పట్లో నాకు ఆ అవకాశం లేదు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకం తో నాకు ఇంజనీరింగ్ చదివే భాగ్యం కలిగింది. ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తామనటం సమంజసం కాదు.
- ప్రణయి, చివరి సంవత్సరం విద్యార్థి
ఫీజ్ రీయింబర్స్‌మెంట్ రద్దు సరికాదు...
ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నమ్ముకుని నావంటి విద్యార్థులెంతోమంది సాంకేతిక చదువులకు దగ్గరయ్యారు. ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేస్తే ఉన్నత చదువులు ఇకపై పేద, మధ్య తరగతి వర్గాలకు దూరం అయినట్లే.
-లోహిత్ కుమార్, ద్వితీయ సంవత్సరం విద్యార్థి
మహిళా సమాజానికి ఓ వరం:
మహిళలు విద్యార్థి దశ నుంచే అభివద్ధి చెందాలంటే ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం. అలాంటిదే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకం. దీంతోనే నేను ఇంజనీరింగ్ చదువు కోగలుగుతున్నా. దీన్ని రద్దు చేస్తే సహించేది లేదు.
-ఎం.లావణ్య, ద్వితీయ సంవత్సరం విద్యార్థి

No comments:
Post a Comment