కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్‌ప్రసాద్ ధ్వజమెత్తారు. పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న ఆయనకు తెలియకుండా ఏ ఒప్పందాలు జరగవని ఆయన సోమవారమిక్కడ అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గ్యాస్ కేటాయింపులపై ముందుగానే ప్రధానికి లేఖ రాసి ఈవిషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకొచ్చారని జనక్ ప్రసాద్ గుర్తుచేశారు.
రత్నగిరి గ్యాస్ కేటాయింపులు తక్షణం రద్దు చేయకపోతే రాష్ట్రం పూర్తిగా అంధకారంలోకి వెళ్లే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఒట్టిచేతులతో తిరిగి వస్తే ఊరుకునేది లేదన్నారు. గ్యాస్ కేటాయింపులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున ఉద్యమం చేస్తుందని జనక్ ప్రసాద్ వెల్లడించారు.

No comments:
Post a Comment