మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆపివేయాలనే కుట్ర జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ కుట్రలో భాగస్వాములంటూ ఆ పార్టీ డిప్యుటీ ఫ్లోర్ లీడర్ శోభా నాగిరెడ్డి ఆరోపించారు. ఒక ప్రణాళిక ప్రకారమే ఇదంతా జరుగుతోందని ఆమె అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని యథావిథిగా అమలు చేయాలని శోభానాగిరెడ్డి డిమాండ్ చేశారు. సోనియాను వైఎస్ విజయమ్మ కలిశారని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ఈ విషయాన్ని నిరూపిస్తే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలందరం రాజకీయాల నుంచి తప్పుకుంటామని, నిరూపించకపోతే చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ఆమె సవాల్ విసిరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment