‘టీడీపీ, కాంగ్రెస్‌లు అన్యాయంగా, అక్రమంగా జగన్‌బాబును జైల్లో పెట్టించాయి. జరుగుతున్నదంతా పైనుంచి దేవుడు చూస్తున్నాడు. న్యాయం మనపక్షానే ఉంది. సుప్రీం కోర్టులో తప్పక న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. రాజమండ్రి కంబాలచెరువు సెంటర్‌లో ఏర్పాటుచేసిన దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు కాంస్యవిగ్రహాన్ని సోమవారం ఆమె ఆవిష్కరించారు. అనంతరం షెల్టన్ హోటల్‌లో ముస్లిం మహిళలతో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్నారు. ప్రతి మహిళవద్దకూ వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. విజయమ్మ ఆప్యాయతకు ముస్లిం మహిళలు ఉద్వేగభరితులయ్యారు. విజయమ్మను ఆలిం గనం చేసుకుని తమ అభిమానాన్ని చాటారు.
-న్యూస్‌లైన్, రాజమండ్రి(తూర్పుగోదావరి)
No comments:
Post a Comment