YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 10 November 2012

ఉల్లి రైతులకు అండగా ఉంటాం: షర్మిల

ప్రస్తుత ప్రభుత్వం ఉల్లికి గిట్టబాటు ధర లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పత్తికొండ శివారులోని ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆదివారం పత్తికొండలో పాదయాత్ర చేస్తున్న షర్మిలను కలిసి ఉల్లి రైతులు తమ గోడును వెల్లడించారు. ఇదే పద్దతి కొనసాగితే తమకు ఆత్మహత్యే శరణ్యమని షర్మిలకు విన్నవించారు.ఉల్లి రైతులకు అండగా ఉంటామని షర్మిల భరోసా ఇచ్చారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించిన సంగతిని ఈ సంద ర్భంగా ఉల్లి రైతులు గుర్తు చేసుకున్నారు. 

Sankineni to join YSRCP at Suryapet Public Meeting

నేడు ఆస్పరిలో షర్మిల బహిరంగ సభ

http://www.ysrcongress.com/news/news_updates/nedu_aasparilO_sharmila_bahiraMga_sabha.html

11 నవంబర్ 2012 : షర్మిల 25వ రోజు పాదయాత్ర ఆదివారం పత్తికొండ బీఈడీ కళాశాల నుంచి ప్రారంభమై రాజులమందగిరి క్రాస్, చినహల్టి మీదుగా సాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత తిరిగి బయలుదేరి  దేవరమండ, అటికెలగుండ, ఆస్పరి మీదుగా వెడతారు. ఆస్పరిసభలో ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగిస్తారు. అక్కడి నుండి శంకర బండ, చిరుమానుకొండ వరకూ పాదయాత్ర చేస్తారు. చిరుమానుకొండలో రాత్ర బస చేస్తారు. ఆదివారంనాటి షర్మిల పాదయాత్ర మొత్తం 13 కిలోమీటర్లు సాగుతుంది.

పాదయాత్రపై మరో గీతం ఆవిష్కరణ

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి:
వైఎస్ అభిమాని ఒ.ఎస్.ఆర్.కుమార్ రచించి రూపొందించిన ఆడియో సీడీని షర్మిల శనివారమిక్కడ ఆవిష్కరించారు. 

‘‘మరో.. ఇది మరో.. ఇది మరో ప్రజాప్రస్థానం.. 
మీ ఊపిరినై నేనొస్తున్నా.. మీ శక్తిని నేనై వస్తున్నా..
మీ అందరి అండగా వస్తున్నా.. జగనన్న నీడగా వస్తున్నా.. 
నాన్న నడిచిన పాదం నేను.. అమ్మ వంచిన విల్లును నేను
అన్న వదిలిన బాణం నేను.. ’’ అంటూ సాగే ఈ గీతాన్ని సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ ఆలపించారు. అనూప్ ఈ గీతానికి సంగీతం అందించారు.

‘నీలం’ నష్టాలపై ప్రధానమంత్రికి విజయమ్మ లేఖ

తుపాను వల్ల రాష్ట్రంలో భారీ నష్టం సంభవించింది 
20 లక్షల ఎకరాల్లో చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి 
ఒక్కో ఎకరాకు రూ. 30 వేల వరకూ పంట నష్టం 
కౌలురైతులకు ఎకరాకు రూ. 10 వేలు పరిహారమివ్వండి 
ప్రధానిని స్వయంగా కలిసి పరిస్థితిని వివరించేందుకు సమయం కోరిన వైఎస్సార్ కాంగ్రెస్ 

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో నీలం తుపానుకారణంగా నష్టపోయిన రైతులు, బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ శనివారం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు. అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని వారి రుణాలు రద్దుచేసి, రీషెడ్యూల్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా ప్రధానికి వివరించారు. ‘‘వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులు మీ సహాయం కోసం వేచిచూస్తున్నారు. అకాల వర్షాలతో రాష్ట్రంలోని 7 జిల్లాలు చాలా దెబ్బతిని, ఆర్థిక, ప్రాణ నష్టం సంభవించింది. అధికారవర్గాల అంచనా ప్రకారం 20 లక్షల ఎకరాల్లో ఎదిగొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. ఒక్కొక్క ఎకరాలో జరిగిన పంట నష్టం రూ. 30 వేలు వరకూ ఉంది. 41 వేల ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 31 మంది మరణించారు. 1.35 లక్షల మంది శరణార్థ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఇంకా అనేక లక్షల మంది ప్రభావిత ప్రాంతాల్లోనే ఉండిపోయారు. అదే విధంగా 670 ఆవులు, గేదెలతో పాటు దాదాపు 7 వేల కోళ్లు, ఇతర పక్షులు మృత్యువాతపడ్డాయి. 500 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ, 3 వేల కిలోమీటర్ల పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయి. 427 ఆర్‌డబ్ల్యూఎస్, 44 లిఫ్ట్ ఇరిగేషన్ సోర్స్‌లు, 1,900 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి’’ అని వివరించారు. 

గతంలోనూ ఆదుకోలేదు... 

‘‘గతంలో 2009లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితుల వల్ల తీవ్ర నష్టం కలిగింది. ఆ వరదల్లో ప్రాణ నష్టంతో పాటు పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులకు అపారనష్టాన్ని మిగిల్చాయి. అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధితుల్ని ఆదుకోవటంలో విఫలమయింది. ప్రకటించిన ప్యాకేజీలను బాధితులకు అందజేయలేదు. కనీసం ఐదు శాతం మంది రైతులకు కూడా ప్రభుత్వం పరిహారం అందించలేదు. అప్పుడు కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే ప్రవర్తించింది’’ అని విచారం వ్యక్తం చేశారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో సువర్ణయుగాన్ని చూసిన రైతులు, ఆయన మరణ ం తర్వాత సంభవించిన విపత్తులతో అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల కాలంలో వరి కనీస మద్దతు ధర 25 శాతం పెరిగితే.. ఎరువులు, రసాయనాల ధరలు 200 శాతం పెరిగాయని వివరించారు. ఇతర పెట్టుబడులు కూడా క్రమక్రమంగా పెరగటంతో రైతులకు వ్యవసాయం తలకు మించిన భారంగా మారిందన్నారు. అయినప్పటికీ అప్పుచేసి సాగుచేసిన పంట మొత్తం అకాల వర్షాల వల్ల పూర్తిగా దెబ్బతిన్నందున కేంద్ర ప్రభుత్వం పెద్దమనసు చేసుకుని రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేసి ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రధానికి కొన్ని సూచనలు చేశారు. అవి... 

పంట కోల్పోయిన రైతులకు సంబంధించి పంట రుణాలను, వాటి వడ్డీలను పూర్తిగా రద్దుచేయాలి. తర్వాతి పంట కోసం కొత్తగా రుణాలు మంజూరు చేయాలి. ఈ విషయంలో ప్రతి రైతునూ పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా కౌలురైతులను మరవొద్దు. 

స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలు వ్యవసాయ రంగంలోనే పెట్టుబడి పెట్టినందున వారి రుణాలు కూడా రీషెడ్యూల్ చేసి, ఆరు నెలల దాకా వడ్డీ వసూలును వాయిదా వేయాలి. 

రానున్న రబీ సీజన్‌కు సంబంధించి రైతులకు ప్రభుత్వం 75 శాతం సబ్సిడీతో విత్తనాలు అందజేయాలి. 

అర్హులైన రైతులంద రికీ పంటల విషయంలో 25 శాతం దాకా బీమా కల్పించాలి. 

వరి, పత్తి, చెరకు, మొక్కజొన్న తదితర వాణిజ్య పంటలను, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. 

పంట కోల్పోయిన కౌలురైతులకు కనీసం ఎకరాకు రూ. 10 వేలు తక్కువ కాకుండా విపత్తు నివారణ కింద సహాయం అందించాలి. ఈ విషయంలో భూపీందర్‌సింగ్ హూడా కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయాలి. 
ఠ మరణించిన వారి కుటుంబాలకు రూ. 3 లక్షలు పరిహారం అందించాలి. 

కూలిపోయిన, దెబ్బతిన్న ఇళ్ల పునఃనిర్మాణానికి ప్రభుత్వం తోడ్పాటు అందించాలి. ఇందిరా ఆవాస్ యోజన, లేదా మరే ఇతర పథకాల ద్వారానైనా వారికి శాశ్వత పరిష్కారం చూపుతూ పక్కా గృహాలు నిర్మించాలి. 

పశువులు, కోళ్లు తదితర పక్షుల మరణం వల్ల సంభవించిన నష్టానికి పరిహారం అందించాలి. 
వరదల కారణంగా ఉపాధి కోల్పోయిన గ్రామీణ ప్రాంత ప్రజలకు రేషన్ ద్వారా ఉచితంగా సరుకులు అందించాలి. 

ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతిన్న చేనేత కార్మికులు, మత్స్యకారులతో పాటు ఇతర చేతివృత్తిదారులకు నష్టపరిహారం అందించాలి. 

వరదల వల్ల పంట పొలాల్లో ఇసుకమేటలు, కోతకు గురైన పొలాలను బాగు చేసుకునేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి. 

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను నేరుగా కలిసి వివరించేందుకు.. వీలును బట్టి వైఎస్సార్ కాంగ్రెస్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని విజయమ్మ ఈ లేఖ ద్వారా ప్రధానిని కోరారు. 

‘మరో ప్రజా ప్రస్థానంలో’ షర్మిలతో అన్నదాత ఆవేదన

అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాం
పరిస్థితులు ఇలాగే ఉంటే బతకలేం
రైతు పరిస్థితి చూసి షర్మిల కంట తడి
మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని భరోసా
ప్రభుత్వంతో కుమ్మక్కై బాబు అవిశ్వాసం పెట్టడం లేదంటూ ధ్వజం
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’శనివారం యాత్ర ముగిసేనాటికి..రోజులు: 24, కిలోమీటర్లు: 310

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘పది ఎకరాలు గుత్తకు తీసుకుని పప్పు శనగ పంట వేశానమ్మా... గుత్త కోసం ఎకరాకు రూ. 8 వేలు ఇవ్వాలి. పెట్టుబడి ఎకరాకు రూ.7,200 చొప్పున పెట్టాను. ఈ ఏడాది సబ్సిడీ కింద రావాల్సిన శనగలు 20 రోజులు ఆలస్యంగా పంపిణీ చేశారు. దీంతో ఎక్కువ ధరతో ముందే కొనాల్సి వచ్చింది. దళారులకు అమ్ముకోవడం కోసమే వీళ్లు ఆలస్యంగా తెస్తున్నారు. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రూ. 400గా ఉన్న ఎరువుల బస్తా ఇప్పుడు రూ. 1,200 అయ్యింది. విత్తనాలు మూడు రెట్లు పెరిగాయి. ఇంత పెట్టుబడి పెడితే.. ఆ డబ్బు కూడా రావట్లేదు. వర్షాలు లేక రెండేళ్లుగా పంట చేతికి అందలేదు. అప్పులు మాత్రం ఏటా పెరిగి మా బతుకులు బజారున పడ్డాయి. మళ్లీ బాగా బతుకుతామన్న భరోసా లేదు. ఇక ఆత్మహత్యలే గతి. చావడం తప్ప ఇంకో పరిష్కారం లేదనిపిస్తోంది’’ అని కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని రాతన గ్రామ రైతు నాగరాజు.. వైఎస్సార్ సీపీ నేత షర్మిల ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి కుమ్మక్కయిన కాంగ్రెస్, టీడీపీల రాజకీయాలకు నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా ఆమె 24వ రోజు శనివారం రాతన గ్రామం మీదుగా వెళ్లారు. 

అక్కడ చేలో పనిచేసుకుంటున్న రైతు నాగరాజు చూసి ఆమె వద్దకు వచ్చి తన బాధలు చెప్పుకొన్నారు. అతడు చావు తప్ప మరో పరిష్కారం లేదనడంతో షర్మిల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఉబికి వచ్చిన కన్నీరును ఆపుకొంటూ.. ‘వద్దన్నా.. ఆ మాట అనొద్దు.. ’ అని ఆమె ఓదారుస్తుండగా.. ‘అప్పు కడతారా? ఇల్లు రాసిస్తారా? అని అప్పు తీసుకున్నచోట అడుగుతున్నారమ్మా..’ అంటూ నాగరాజు ఆవేదన వ్యక్తంచేశారు. షర్మిల స్పందిస్తూ ‘రాజన్న కొడుకున్నాడని మరచిపోకన్నా.. మళ్లీ రాజన్న రాజ్యం తెస్తాడు. అంతవరకు ధైర్యంగా ఉండాలన్నా. రైతులందరికీ నాదొక్కటే మనవి. ప్రాణాలు చాలా విలువైనవి. దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. మంచికాలం మళ్లీ వస్తుంది. రాజన్న ఉన్నప్పుడు రైతుకు ఎంత చేసినా తక్కువే అని ఆలోచించేవాడు. జగనన్న కూడా రైతు క్షేమమే తలుస్తున్నాడు..’ అని భరోసా ఇచ్చారు.

పత్తికొండ జనసంద్రం: పత్తికొండ జనసంద్రంగా మారింది. సాయంత్రం బహిరంగ సభకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. రాత్రి 7.20కి పత్తికొండ శివారులో ఏర్పాటుచేసిన రాత్రి బసకు షర్మిల చేరుకున్నారు. శనివారం పాదయాత్ర 13.2 కి.మీ.మేర సాగింది. ఇప్పటివరకు 310 కి.మీ. పాదయాత్ర పూర్తయింది. కాగా వైఎస్ అభిమాని ఒ.ఎస్.ఆర్.కుమార్ రచించి, రూపొందించిన ఆడియో సీడీని షర్మిల ఆవిష్కరించారు. ఈ గీతాన్ని సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ ఆలపించగా.. అనూప్ సంగీతం అందించారు. యాత్రలో ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, బాలనాగిరెడ్డి, రాజేశ్, పార్టీ నేతలు భూమా నాగిరెడ్డి, గౌరు వెంకటరెడ్డి, గోపాల్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, ప్రసాదరాజు, ఎస్వీ మోహన్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, కొల్లి నిర్మలాకుమారి, జనక్‌ప్రసాద్, కోట్ల హరిచక్రపాణిరెడ్డి పాల్గొన్నారు. శనివారం రాత్రి మాజీ మంత్రి కొండా సురేఖ షర్మిలను కలిశారు.

బాబు మాటలు వారి ఎమ్మెల్యేలే నమ్మట్లేదు

టీడీపీ అధినేత చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, ఆయన మాటలను ఆయన పార్టీ ఎమ్మెల్యేలే నమ్మడం లేదని షర్మిల విమర్శించారు. శనివారం సాయంత్రం 5.10కి పత్తికొండ నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్న షర్మిల అక్కడికి భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘మేం గర్వంగా చెప్పగలుగుతాం. రాజన్న రాజ్యం మళ్లీ తెస్తామని. కానీ చంద్రబాబు నాయుడు చేసింది చెప్పుకోలేకపోతున్నారు. పైగా రాజశేఖరరెడ్డిలా అన్ని పథకాలూ అమలు చేస్తానని చెప్పకనే చెబుతున్నారు. కానీ ఆయన మాటలను ఆ పార్టీ ఎమ్మెల్యేలే నమ్మడం లేదు. అందుకే వాళ్లు మా పార్టీలోకి వస్తున్నారు. చంద్రబాబుకు పాదయాత్ర అవసరమే లేదు. అవిశ్వాసం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేందుకు ఆయనకు ఎమ్మెల్యేలు ఉన్నారు. 

కానీ ఆయన పెట్టరు. ఎందుకు పెట్టరో చెప్పరు’’ అని విమర్శించారు. ‘‘ఈయన అవిశ్వాసం పెట్టరు. వాళ్లు ఈయనపై కేసులు పెట్టరు. అందుకే.. రెండెకరాల చంద్రబాబు ఇన్ని ఆస్తులు ఎలా కూడబెట్టారని కమ్యూనిస్టులు పుస్తకం ప్రచురించినా.. దానిపై విచారణ ఉండదు. అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడని తెహల్కా వెబ్‌సైట్ ప్రచురించినా.. విచారించరు. ఎకరా రూ. 2 కోట్ల విలువ చేసే భూములను ఎకరా రూ. 50 వేలకే తన బినామీ సంస్థ అయిన ఐఎంజీకి కట్టబెట్టినా.. ఆయన్ను విచారించరు. ఎందుకు విచారణ చేయరని మనం కేసు వేస్తే కోర్టులో జడ్జి గారు కూడా ఎందుకు చేయరని సీబీఐని ప్రశ్నించారు. కానీ సీబీఐ సిబ్బంది లేరని చెప్పింది. జగనన్న మీద, ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్ల మీద దాడులు జరపడానికి సిబ్బంది ఉంటారు. కేవలం ఫోన్ కాల్స్ ట్యాప్ చేయడానికే 2 వేల మంది సిబ్బందిని పెట్టారు. కానీ చంద్రబాబుపై విచారణ చేయడానికి వాళ్లకు సిబ్బంది ఉండరు. మీ చీకటి ఒప్పందాలు, రహస్య రాజకీయాలు బట్టబయలయ్యాయి..’’ అని ఆమె దుయ్యబట్టారు.

ఒక రోజు కూలి రూ.12..

‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర శనివారం సాగిన మార్గం మధ్యలో పలుచోట్ల వ్యవసాయ కూలీలు షర్మిలను కలిసి తమ బాధలు చెప్పుకొన్నారు. ‘కరువు పనులు లేవు. పోయినా రూ. 30, రూ. 40 కూలి పడుతోంది. ఒక రోజైతేరూ. 12 మాత్రమే వచ్చింది. అడిగితే మీకు దిక్కున్నచోట చెప్పుకోండంటారు. ఇందులో రవాణా చార్జీలకే నాలుగైదు రూపాయలు పోతాయి. అందుకే గుంటూరు జిల్లాకు మిర్చి ఏరడానికి వలస వెళతాం..’ అని తెలిపారు. షర్మిల స్పందిస్తూ ‘అసలు మనుషులేనా మీరు అని ఆ అధికారుల్ని అడగాల్సింది. రూ. 12 కూలితో ఎలా బతుకుతారు? ఏం అవ్వా.. ఈ వయసులో కూడా కూలి పనికి వచ్చావా.. నిన్ను చూస్తుంటే మనసుకు కష్టంగా ఉందమ్మా..’ అనేసరికి.. ‘‘కష్టం చేస్తేనే కడుపులోకి మెతుకులుపోయేది.. ఉన్న పెన్షన్ కూడా పోయింది..’ అని ఆమె వాపోయింది. దీనికి షర్మిల స్పందిస్తూ ‘ఇది రాక్షస రాజ్యం. నీళ్లు ఉండవు. పంటలు పండవు. పనులు ఇవ్వరు. ఉన్న పెన్షన్ తీసేస్తారు..’ అని సర్కారు తీరును ఎండగట్టారు.

మాతా శిశు సంరక్షణకు మంగళం..

తుగ్గలి దాటాక షర్మిలను కర్నూలు జిల్లాకు చెందిన మహిళా ఆరోగ్య కార్యకర్తలు కలిశారు. ‘రాజశేఖరరెడ్డి పెట్టిన మాతాశిశు సంరక్షణ ఇప్పుడు సరిగ్గా అమలుకావడం లేదు. చాలా పనిభారం పెట్టడంతో ఈ పథకం అంతంతమాత్రంగా అమలవుతోంది. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు మమ్మల్ని రెగ్యులర్ చేశారు. అయితే పదేళ్ల సర్వీసు నిండిన కార్యకర్తలను రెగ్యులర్ చేయాలని కోరితే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మాకు భద్రత లేకుండాపోయింది. 10 నెలలుగా కాంట్రాక్టు వర్కర్లకు వేతనాలు లేవు. కానీ పని మాత్రం చేయించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఒక్కరే సిబ్బంది ఉంటే.. పర్యవేక్షించేది మాత్రం ప్రోగ్రామ్‌కు ఒక్కరు చొప్పున పది మంది ఉంటారు..’ అని వాపోయారు. ఈ కష్టాలు త్వరలోనే పరిష్కారమవుతాయని షర్మిల అన్నారు.

నగదు చలామణీ పథకం దొంగల్ని శిక్షించండి

కర్నూలు జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నగదు చలామణీ పథకాల సాకుతో ప్రజల్ని మోసగించిన సంస్థలు, వాటి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ పథకంతో పేద ప్రజలు మోసపోయిన విషయాన్ని పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ శనివారం ఫోన్ ద్వారా హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సంస్థ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ తరఫున పార్టీ సీజీసీ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి ఇదే అంశంపై సబితకు ఓ లేఖ రాశారు. పార్టీ తరఫున దాన్ని అందజేశాక మాజీ మంత్రి మూలింటి మారెప్ప విలేకరులతో మాట్లాడారు. నగదు చలామణీ పథకం పేరుతో కొన్ని సంస్థలు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. ‘‘అధిక వడ్డీల వంటి ఆశ చూపి భారీగా దండుకున్నాయి. 

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో వందలాది మంది బాధితులు గోడు వెల్లబోసుకుంటున్నారు. మహిళలు తాళిబొట్లు, చెవి కమ్మలు తెగనమ్మారు. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బును అధికార పార్టీ నేతల అండదండలతో కొందరు కాజేస్తున్నారు. వారి కడుపు కొడుతున్నారు. కర్నూలు జిల్లాలోనే ‘శ్రీ నంది యువజన సమాఖ్య’ పేరుతో రంగస్వామి అనే వ్యక్తి పేదలను దారుణంగా మోసగించి రూ.100 కోట్ల దాకా దండుకున్నాడు’’ అని వివరించారు. బాధితులకు న్యాయం చేయాలని సబితను కోరారు.

నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా..

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో సాగనుంది. మొత్తం 13 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర చిన్నహుళ్తి సమీపంలోని బీఈడీ కళాశాల నుంచి మొదలవుతుంది. చిన్నహుళ్తి, దేవనబండ, అటికెలగుండు, ఆస్పరి మీదుగా శంకరబండ వరకు కొనసాగుతుంది. శంకరబండలో షర్మిల రాత్రి బస చేస్తారు.

ముగిసిన షర్మిల 24వరోజు మరో ప్రజాప్రస్థానం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి సోద‌రి ష‌ర్మిల చేప‌ట్టిన మ‌రో ప్రజా ప్రస్థానం 24వ రోజు పాద‌యాత్ర క‌ర్నూలులో ముగిసింది. పాద‌యాత్రలో భాగంగా ఈ రోజు క‌ర్నూలు జిల్లాలో ష‌ర్మిల 13. 2 కిలోమీట‌ర్లు వ‌ర‌కు న‌డిచారు. ఇప్పటివ‌ర‌కు 310 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ష‌ర్మిల పాద‌యాత్ర జ‌రిపారు.

రేపు వైఎస్సార్ పార్టీలో చేరనున్న సంకినేని

సూర్యాపేటలో: నల్లగొండ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు రేపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సూర్యాపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో తన మద్దతుదారులతో కలిసి వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన వైఎస్సార్ సీపీ సభ్యత్వం తీసుకోనున్నారు.

source:sakshi

చంద్రబాబుది మోసాల చరిత్ర: హరీష్‌

చంద్రబాబుకు దమ్ముంటే తెలంగాణకు చేసిన ద్రోహం, విశ్వసనీయత వంటివాటిపై కేసీఆర్‌తో బహిరంగచర్చకు రావాలని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకుడు టి.హరీష్‌రావు సవాల్ చేశారు. తెలంగాణభవన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ విశ్వసనీయత, ఆదరణ కోల్పోయిన టీడీపీలాంటి రాజకీయపార్టీ ప్రపంచంలోనే లేదన్నారు. చంద్రబాబుది మోసాల చరిత్ర అని దుయ్యబట్టారు. తెలంగాణపై రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.చంద్రబాబు విశ్వసనీయత గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. 19 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే 15 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడమే చంద్రబాబు విశ్వసనీయతకు నిదర్శనమన్నారు.

ప్రధానికి వైఎస్ విజయమ్మ లేఖ

తుపాను బాధితులను ఆదుకోవాలంటూ ప్రధానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ లేఖ రాశారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని లేఖలో ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు లేఖలో 12 రకాల డిమాండ్లు ప్రధాని ముందుంచారు. తుపాను నష్టాన్ని స్వయంగా వివరించేందుకు విజయమ్మ ప్రధాని అపాయింట్‌మెంట్ కోరారు.

జగనన్న జనం మనిషి: షర్మిల

పత్తికొండ: మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడుస్తూ ఆయన పేరు లేకుండా చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయిందని విమర్శించారు. వైఎస్‌ లేకపోవడంతో హంద్రీనీవ పనులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా పత్తికొండలో ఏర్పాటు చేసిన సభలో షర్మిల ప్రసంగించారు. మంచి భవిష్యత్తు చాలా దూరముందని ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. 

పాదయాత్రలో చంద్రబాబు ఇస్తున్న హామీలు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. కాంగ్రెస్‌ వాళ్లు సీబీఐని వాడుకుని జగన్‌ను జైలుపాలు చేశారన్నారు. చంద్రబాబుపై ఎన్ని ఆరోపణలున్నా సిబ్బంది లేరని సాకులు చెబుతున్న సీబీఐ, జగనన్నపై 28 బృందాలను రంగంలోకి దింపిందని వెల్లడించారు. టీడీపీ, కాంగ్రెస్‌ కలిసి నీచమైన కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు దుకాణం మూసుకోవాల్సి వస్తుందనే జగనన్నను జైలుకు పంపాయని అన్నారు. జగనన్న జనం మనిషని చెప్పారు. రాజన్న ఇచ్చిన హామీలన్నిటినీ జగనన్న నెరవేరుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాజన్న సువర్ణయుగం మళ్లీ వస్తుందని షర్మిల అన్నారు.

Jupudi Prabhakar Rao press meet 10th Nov

YS Sharmila's speech at Pattikonda in Kurnool

'Ede Maro Praja Prasthanam' a Song Sharmila's Padayatra

Friday 9 November 2012

నాన్న బతికుంటే మీకీ పరిస్థితి వచ్చేదా...?

 ‘హంద్రీనీవా ప్రాజెక్టు కోసం చంద్రబాబు రెండుసార్లు శిలాఫలకాలు వేశారు. కానీ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. నాన్న సీఎం కాగానే హంద్రీనీవా ప్రాజెక్టు పనులు చేపట్టారు. ఆయన చనిపోగానే ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తయితే మీ పరిస్థితి ఇంత అధ్వానంగా ఉండేదా..? సమృద్ధిగా పంటలు పండేవి. కాలువలకు నీరు వచ్చేది. భూగర్బ జలాలు పెరిగి బోర్లకు నీరొచ్చేది. తాగడానికి నీరుండేది. నాన్న బతికుంటే మీకీ పరిస్థితి వచ్చేదా...?’ అని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల ప్రజలను ప్రశ్నించారు. 

‘మరో ప్రజా ప్రస్థానం’లో భాగంగా శుక్రవారం షర్మిల పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికెర మండల కేంద్రం శివారు నుంచి ఎం. ఆగ్రహారం, హంపా క్రాస్, పెరవలి మీదుగా తుగ్గలి వరకు సాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హంద్రీనీవా పనులు పూర్తిచేసి రైతులకు నీరందించేందుకు ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే రాజన్న కలలు గన్న కోటి ఎకరాలకు సాగునీరు సాధ్యమవుతుందని, హంద్రీనీవా కూడా పూర్తయి వెనుకబడ్డ పత్తికొండ నియోజకవర్గానికి నీరందుతుందని షర్మిల అన్నారు. హంద్రీనీవా కాలువలు పక్కనుంచి వెళుతున్నా నీరు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూస్తే మనసుకు బాధేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అందరికీ కష్టాలే: ‘ప్రస్తుత ప్రభుత్వం తొమ్మిదేళ్ల చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం తీసిపోవడం లేదు. బాబు సీఎంగా ఉన్నప్పుడు 4వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పింఛన్లు ఇవ్వమంటే ఊర్లో ఎవరైనా చనిపోతే ఆ స్థానంలో దరఖాస్తు చేసుకొమ్మన్న పెద్ద మనిషి ఆయన. కరెంటు చార్జీలు ఎనిమిది సార్లు పెంచారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఎన్నో అవస్థలు పడ్డారు. ఇప్పుడు అంతకన్నా అధ్వాన్నమైన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి పోవాలంటే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు సమయం వచ్చినప్పుడు గట్టిబుద్ది చెప్పాలి. జగనన్నను ఆశీర్వదించాలి. జగనన్న సీఎం అయితేనే రాజన్న రాజ్యం వస్తుంది’ అని షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. 

మనీస్కీం నిందితుడిని ఎంపీ రక్షిస్తే ఆయనను కూడా అరెస్టు చేయాలి: శుక్రవారం ఉదయం షర్మిల పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి రాత్రి వరకు ప్రజలతో మాట్లాడితే... అందరూ మనీ స్కీం బాధితులే. శ్రీనందీ యువజన సమాఖ్య పేరుతో ఎల్‌ఐసీ పాలసీలతో ముడిపెట్టి నాలుగు జిల్లాల్లో సుమారు రూ. 100 కోట్లు వసూలు చేసి రంగస్వామి అనే వ్యక్తి పరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షర్మిల ఎక్కడకు వెళ్లినా తాము పుస్తెలు, చెవి కమ్మలు కూడా అమ్మేసి రూ. 700 మనీస్కీంలో వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి మోసపోయినట్లు ఫిర్యాదు చేశారు. రంగస్వామి అనే వ్యక్తి ఈ మోసం చేస్తే అతనికి అధికార పార్టీ నేతలు మద్దతు ఇస్తున్నారని, సాక్షాత్తూ ఎంపీ (ప్రస్తుతం కేంద్ర మంత్రి) అతన్ని కాపాడారని, కనీసం అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన షర్మిల మాట్లాడుతూ ఇంత పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడి, పేదల నుంచి రూ.కోట్లు వసూలు చేసి పరారైన నిందితుడిని పోలీసులు అరెస్టు చేయకపోవడం శోచనీయమన్నారు. ఈ విషయంపై వైఎస్‌ఆర్‌సీపీ పోరాడుతుందని, పార్టీ ఎమ్మెల్యేలు ఒకటి రెండు రోజుల్లో హోం మంత్రిని కలిసి నిందితుడిని అరెస్టు చేయమని కోరుతారని చెప్పారు. నిందితుడు రంగస్వామిని ఎంపీ కాపాడుతున్నదే నిజమైతే ఎంపీని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేయనున్నట్లు చెప్పారు. 

తెలంగాణ ఎట్ల తెస్తరో కేసీఆర్ చెప్పాలి

100 అసెంబ్లీ, 16 ఎంపీ సీట్లతో తెలంగాణ ఎట్లా వస్తుంది?
ప్రజలను మభ్యపెట్టడానికి మరోసారి ఎత్తులు వేస్తున్నారు
కాంగ్రెస్ ఎంపీగా జగన్ ప్లకార్డు పట్టుకుంటే రాద్ధాంతం చేశారు.. టీడీపీలో ఉన్నప్పుడు 610 జీవోపై మీరేం మాట్లాడారో గుర్తులేదా?

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రజలను మోసగిస్తూ పదకొండేళ్లుగా రాజకీయ పబ్బం గడుపుకుంటున్న టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు మరోసారి జనాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు కొండా సురేఖ మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 16 పార్లమెంటు స్థానాలు సాధిస్తే తెలంగాణ ఎట్లా వస్తుందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్లు, సీట్ల విధానం ద్వారా తాజాగా ప్రజలను మరోమారు మభ్యపెట్టేందుకు కేసీఆర్ ఎత్తుగడలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం కేసీఆర్‌కు ఆమె బహిరంగ లేఖ రాశారు. అనంతరం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ... కేసీఆర్ తీరును ఎండగట్టారు. ‘‘ఉప ఎన్నికల సందర్భంగా ప్రతీసారి టీఆర్‌ఎస్ గెలిస్తే నెలరోజుల్లో తెలంగాణ వస్తదని చెప్పి ప్రజల్ని మోసం చేసిండ్రు. ఇదిగో తెలంగాణ, అదిగో తెలంగాణ అంటూ వెయ్యి మంది ఆత్మహత్యలకు కేసీఆర్ కూడా కారణం. 

ఆయన మాత్రం కాంగ్రెస్‌తో లాలూచీపడి వేల కోట్లు దండుకున్నడు. తెలంగాణ మార్చ్ సందర్భంగా నెల రోజులు ఢిల్లీలో మకాం వేసి తెలంగాణ తెస్తున్నట్లు కలరింగ్ ఇచ్చారు. తీరా ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం లేదని చెప్పడం సిగ్గుచేటు’’ అని అన్నారు. తెలంగాణ సాధన కోసం గొంగళి పురుగునైనా ముద్దాడుతా... కుష్టిరోగినైనా కౌగిలించుకుంటానని ప్రగల్భాలు పలికిన వ్యక్తి.. బీజేపీని మతతత్వ పార్టీగా పేర్కొం టూ, జేఏసీతో పాటు మిగతా పార్టీలను దూరం పెట్టడం దేనికి సంకేతమన్నారు. జేఏసీ తన చెప్పు కింద తేలు మాదిరిగా ఉంటే మంచిదనే రీతిలో కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలను ఇన్నాళ్లు మోసగించినందుకు కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలే ఆయనకు బుద్ధి చెప్పే రోజు వస్తుందని స్పష్టం చేశారు.

అసెంబ్లీలో 610 జీవోపై ఏం మాట్లాడారు?

తెలంగాణ పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ స్పష్టమైన వైఖరితో ఉందని, పార్టీ మొదటి ప్లీనరీలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశామని సురేఖ గుర్తుచేశారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన అభ్యర్థులపై తమ పార్టీ పోటీ చేయకుండా చిత్తశుద్ధిని చాటుకున్నామని తెలిపారు. కానీ టీఆర్‌ఎస్ లక్ష్యం మాత్రం ఓట్ల ద్వారా కోట్లు గడించడమేనని, తెలంగాణ సాధించాలనే చిత్తశుద్ధి కేసీఆర్‌కు లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీగా వైఎస్ జగన్ ప్లకార్డు పట్టుకున్నారని రాద్ధాంతం చేస్తున్న కేసీఆర్... తాను టీడీపీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో 610 జీవోపై ఏం మాట్లాడారో గుర్తుచేసుకోవాలన్నారు. ఆనాడు నిండు సభలో సమైక్యవాదం వినిపించిన కేసీఆర్, టీఆర్‌ఎస్ పెట్టగానే తెలంగాణవాదిగా ఎలా అయ్యారో సమాధానం చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ తన విధానాన్ని మార్చుకున్నట్లుగానే జగన్ కూడా పార్టీ పెట్టాక ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తన ఆలోచనలను మార్చుకోవడం జరిగిందన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని, అందుకే నాయకులు, ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. టీఆర్‌ఎస్ చేపట్టే ఏ కార్యక్రమాన్నైనా పరకాల నియోజకవర్గంలో అడ్డుకుంటామనాని స్పష్టంచేశారు.

అందరి బాధలు పంచుకున్న షర్మిల

* అడుగడుగునా నీరాజనం 
* అందరి బాధలు పంచుకున్న షర్మిల 
* కుటుంబ సభ్యురాలిగా ఆత్మీయ పలకరింపులు 
* వెంట నడిచిన నేతలు 
* ఇదీ జిల్లాలో రెండోరోజు 
* మరో ప్రజాప్రస్థానం తీరు 

కర్నూలు, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘కరువు పనికి పోతే రూ.30 ఇస్తున్నారంటే అన్యాయం కదన్నా! 30 రూపాయలతో ఏమొస్తుందన్నా... బాధ పడకండన్నా!! జగనన్నను ఆశీర్వదించండన్నా... మంచి రోజులొస్తాయి’ ‘ అమ్మా! మీకు కూలీ రావడం లేదు. పింఛను లేదు. ఏం చేస్తామమ్మా... ఇప్పుడు మనం ప్రభుత్వంలో లేము. కాంగ్రెస్ పాలన ఇట్లనే ఉంటుందమ్మా... జగనన్న ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం వస్తుంది తల్లీ. మీ కష్టాలు తీరుతాయి’

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’లో బాధితులను అనునయిస్తూ కర్నూలు జిల్లాలో నడక సాగుతున్న తీరిది. ఆత్మీయ పలకరింపులతో... సొంతింటి ఆడ పడుచుగా మహిళలను, రైతులను, విద్యార్థులను పలుకరిస్తూ... వారి బాధలు విని ధైర్యం చెపుతూ ఆమె ముందుకు కదులుతున్నారు. శుక్రవారం 15.5 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర జరపగా... ప్రతీ గ్రామంలో ప్రజలను పలకరించారు. రోడ్డుపై నడుస్తున్నప్పుడు ఎదురైన కూలీలను, విద్యార్థులను కలిసి వారి బాధలు విన్నారు.అన్నా... అక్కా... అమ్మా అంటూ షర్మిల పలుక రిస్తుంటే జనం తమ ఇంటి ఆడబిడ్డ పిలుస్తున్నట్లుగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యువతీ యువకులు, విద్యార్థులు అక్కా అంటూ ఆత్మీయతను పంచుతున్నారు. రాయలసీమ యాసలో ఆమె మాట్లాడుతున్న తీరుకు ముచ్చటపడుతూ తమ బాధలను ఎలాంటి అరమరికలు లేకుండా చెప్పుకుంటున్నారు. 

మీ నాయన ఉన్నప్పుడు ఈ బాధలు లేవమ్మా!
శుక్రవారం పాదయాత్ర ప్రారంభమైన తరువాత ఎం. ఆగ్రహారం గ్రామానికి చేరుకున్న షర్మిల ఓ చెట్టుకింద నిలబడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్నా మీ బాధలేమున్నాయన్నా అంటూ రైతులను, విద్యార్థులను ప్రశ్నించడంతో వారు తాము ఎదుర్కొంటున్న సమస్యలను షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని, టమోటాను కిలో రూపాయికి కొనే నాథుడు లేడని చెప్పుకొచ్చారు. గుండె కుడి వైపు ఉండడంతో పాటు ఆ గుండెకు రంధ్రం కూడా ఉన్న ఓ చిన్నారి తల్లిదండ్రులు షర్మిలకు పాప పరిస్థితిని వివరించారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అపోలోలో గుండెకు ఆపరేషన్ చేస్తే రూ. 5.70 లక్షలు ఆరోగ్యశ్రీ కింద భరించారని, మరో మూడు ఆపరేషన్లు చేయాల్సి ఉంటే ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. వై.ఎస్ బతికుంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలు ప్రతిచోటా తాము పడుతున్న బాధలను ‘అక్క’కు వివరించారు. నాకు చదువుకోవాలని ఉందక్కా అంటూ అఫ్రీన్ అనే ఇంటర్ పాసైన అమ్మాయి ఏడుస్తూ అడిగితే షర్మిల అప్పటికప్పుడు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కోట్ల హరి చక్రపాణి రెడ్డికి తగు సూచనలు చేశారు. 

కాగా షర్మిల ఎవరిని కదిలించినా... మీ నాయన ఉన్నప్పుడు బాగుండేవాళ్లం. ఇప్పుడు బాధలు పడుతున్నాం. మమ్ముల్ని జగనన్నే కాపాడాలమ్మా... అంటూ ప్రజలు కోరడం గమనార్హం. కాగా షర్మిల పాదయాత్ర సాగిన రోడ్డంతా జనంతో నిండిపోయింది. ప్రవాహంలా తరలివస్తున్న జనాలను నిలువరించడం పోలీసులు, సెక్యూరిటీకి కష్టతరమైంది . గ్రామాలకు గ్రామాలు క్యూ క ట్టిన చందంగా షర్మిలను చూడాలని, ఆమె ప్రసంగం వినాలని పెద్ద ఎత్తున తరలివచ్చారు. రెండోరోజు జిల్లాలో సాగిన పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది.

వైఎస్ పోయాక చితికిపోయాం..


మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: పాదయాత్ర మార్గం మధ్యలో తగర్రాయికి చెందిన కూలీలు చేనులో పనిచేస్తుండగా.. షర్మిల రావడంతో వారంతా తమ బాధలు వినిపించారు. ఉపాధి హామీ కింద రూ. 30 కూలి ఇస్తున్నారని వాపోయారు. వారి సంభాషణ సాగిందిలా..

షర్మిల: ఏమ్మా.. కరువు పని దొరుకుతోందా?

మహిళ: దొరికినా ఏం లాభం ఉండదమ్మా... కూలి రూ. 30 పడుతాంది. 10 మందితో పని చేయించుకుని 20 మంది పేర్లు రాసి వచ్చిన దుడ్లు మాకు సగమిచ్చి సగం తీసేసుకుంటాండారు. 

షర్మిల: రాజన్న ఉన్నప్పుడు ఎంత పడిందమ్మా..

మహిళ: రూ. 70 నుంచి 100 వరకు ఇచ్చినారమ్మా..

షర్మిల: కరెంటు బిల్లు ఎంతొస్తుందమ్మా..

మహిళ: రూ. 300 వస్తాంది. బుగ్గకని(బల్బు), ఫ్యాన్‌కని వే స్తాండారు.

షర్మిల: రాజన్న ఉన్నప్పుడు ఎంతొచ్చిందమ్మా..?

మహిళ: ఇంతకుమునుపు రూ. 50, రూ. 60, రూ. 70 కట్టినాం. ఇప్పుడైతే ఏం తెలియనోళ్లమని రూ. 500 కట్టించుకుంటాండారు.

షర్మిల: ఇది శ్రమదోపిడీ కదా. రాబందుల రాజ్యం ఇది. పీక్కుతింటున్నారు.

మహిళ: ఎండనక వాననక కడప, గుంటూరు వలసపోతాండాం. కొందరు హైదరాబాద్ వెళుతుండారు. కానీ పశువులను ఇడిచి హైదరాబాద్ ఎట్లా పోయేది.

ఓ వృద్ధురాలు: దేవుడున్నంతసేపు(వైఎస్‌ను ఉద్దేశించి) బాగుండాది.. దేవుడు పోయినాడు.. మా బతుకులు ఇట్లా మిగిలినాయి.

షర్మిల: చంద్రబాబు హయాంలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడూ అదే పరిస్థితి ఎదురవుతోంది. సమయం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధిచెప్పి జగనన్నను ఆశీర్వదిస్తే మళ్లీ మనకు మంచిరోజులొస్తాయి.

అఫ్రీన్ చదువు ఆగిపోయింది..

అగ్రహారం గ్రామానికి చెందిన నిరుపేద అయిన ఇమాంసాహెబ్ కుమార్తె అఫ్రీన్ పదో తరగతిలో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్ బైపీసీలో 72.5 శాతం మార్కులతో పాసైంది. ఎంసెట్‌లో ర్యాంకు సాధించింది. కానీ ఇప్పుడు చదువు ఆగిపోయింది. పాదయాత్ర చేస్తున్న షర్మిలకు ఎదురేగి ఆమె ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. ‘ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకున్న నేను బీ-ఫార్మసీ చేద్దామనుకున్నా. కానీ కేవలం డబ్బులు లేక చదువు ఆగిపోయింది. హైదరాబాద్‌లో సీటొచ్చిందని కబురొచ్చింది. కానీ ఫోన్ చేసి వివరాలు కనుక్కుంటే రూ. 2లక్షలు కట్టాలన్నారు. దాంతో ఇక చదువు ఆపేశా..’ అని చెప్పడంతో షర్మిల స్పందిస్తూ పూర్తి వివరాలు తెలుసుకుని అమ్మాయి చదువు మళ్లీ కొనసాగేలా చేస్తామని చెప్పారు.

చిన్నారి ప్రాణాలు నిలబెట్టరట..: ఎం.అగ్రహారం గ్రామంలో రఘువర్ధన్, సుజాత దంపతులు షర్మిలను కలిసి ‘ఆరోగ్య శ్రీ’ అందకపోవడంతో తమ కూతురు సాయిలక్ష్మి(10) తమకు దక్కదేమోనని భయమేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ‘నాలుగేళ్ల క్రితం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కింద పాపకు గుండె ఆపరేషన్ చేయించాం. దాదాపు రూ.5.70 లక్షలు ప్రభుత్వమే భరించింది. కానీ పాప గుండె కుడిపక్కన ఉండడం, వాల్వ్ చిన్నగా ఉండడంతో రెండోసారి ఆపరేషన్ చేయించాలని అప్పుడే చెప్పారు. రూ. 4 లక్షలు ఖర్చవుతుంది. కానీ అపోలో ఆస్పత్రికి వెళితే రెండోసా రి చేయలేమని తిప్పిపంపిస్తున్నారు’ అని ఆమె వాపోయింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయిం చేందుకు యత్నిస్తామని షర్మిల హామీ ఇచ్చారు.

దళారులకే టమాటా గిట్టుబాటు: ఎడవల్లి క్రాస్‌లో రైతులు షర్మిల వద్దకు వచ్చి తమ సమస్యలు వివరించారు. టమాటా పంట పెడుతూ ఏటా నష్టపోతూనే ఉన్నామని, మార్కెట్లో టమాటా రూ.7 నుంచి రూ. 10 ఉన్నా.. రైతుల వద్ద మాత్రం కిలో రూ. 1, రూ. 2 చొప్పున దళారులు కొనుగోలు చేస్తున్నారని వాపోయారు. దీనికి షర్మిల స్పందిస్తూ జగనన్న వస్తే మళ్లీ రైతు రాజ్యమే వస్తుందని, టమాట పంటకు కూడా గిట్టుబాటయ్యేలా తగిన విధానం రూపొందిస్తాడని భరోసా ఇచ్చారు.

మనీ స్కీమ్‌తో ముంచేశారు!అధికార పార్టీ అండతోనే !

తాళిబొట్లు, కమ్మలు కూడా తాకట్టు పెట్టి డబ్బులు కట్టాం..
నాలుగు జిల్లాల్లో వేల మందిని వంచించారు రూ.100 కోట్ల మేర మోసం 
ఆత్మహత్యాయత్నం చేసుకున్నవాళ్లూ ఉన్నారు అధికార పార్టీ అండతోనే ఈ ద్రోహం
నిందితులకు కాంగ్రెస్ ఎంపీ సపోర్ట్ ఉందని వెల్లడి
హోంమంత్రికి విన్నవించి న్యాయం చేస్తామని షర్మిల హామీ
నిందితులను అరెస్టు చేసేంతవరకు పోరాడతామని భరోసా
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 23, కిలోమీటర్లు: 296.80

మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకొంటూ సాగుతున్న షర్మిల ముందుకు శుక్రవారం ఓ కొత్త సమస్య వచ్చింది. ఇంతకాలం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులనే చూసిన ఆమె.. అధికార పార్టీ ఎంపీ మద్దతుతో ఆ పార్టీకే చెందిన ఓ వ్యక్తి రూ.100 కోట్ల మేర కర్నూలు సహా నాలుగు జిల్లాల ప్రజల్ని ముంచేశాడని తెలిసి ఆశ్చర్యపోయారు. మనీ సర్క్యులేషన్ స్కీమ్ పేరుతో అధికార పార్టీకి చెందిన రంగస్వామి అనే వ్యక్తి తమను మోసం చేశాడని, తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదని, అతడికి ఓ కాంగ్రెస్ ఎంపీ మద్దతు ఉండడంతో పోలీసులు కూడా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు. కర్నూలు జిల్లాలో 23వ రోజు శుక్రవారం షర్మిల పాదయాత్ర సాగిన దారి పొడవునా రైతులు, వ్యవసాయ కూలీలు ప్రధానంగా ఇదే అంశంపై షర్మిలకు ఫిర్యాదుచేశారు. రంగస్వామి ‘శ్రీనంది యువజన సమాఖ్య’ పేరుతో సంస్థ ప్రారంభించాడని, తాను ఎల్‌ఐసీతో ఒప్పందం చేసుకున్నానంటూ తమను నమ్మించాడని తెలిపారు. రూ.700 కడితే 10 నెలల పాటు ప్రతి నెలా రూ. 300 చొప్పున చెల్లిస్తామని చెప్పాడని, రూ. 700కు రూ. 3 వేలు వస్తున్నాయని ఆశపడి తాళిబొట్లు, చెవి కమ్మలతో సహా తాకట్టు పెట్టి ఈ స్కీమ్‌లో పెట్టామని పలువురు మహిళలు వాపోయారు. కొద్దిరోజులు డబ్బులు ఇచ్చి అందరినీ నమ్మించి బిచాణా ఎత్తేశాడన్నారు. సుమారు రూ.100 కోట్ల దాకా మోసం జరిగి ఉండొచ్చని పలువురు తెలిపారు. తమకు న్యాయం చేయాలని షర్మిలను కోరారు.

అవసరమైతే ఎంపీనీ అరెస్టు చేయాలి: షర్మిల

ఉదయం గం.10.40కు పత్తికొండ నియోజకవర్గ పరధిలోని అగ్రహారంలో రచ్చబండ వద్ద షర్మిల ప్రజలతో ముచ్చటించినపుడు వారు ఈ మనీ సర్క్యు లేషన్ స్కీమ్ గురించి చెప్పారు. అది మొదలు యాత్ర సాగిన దారి పొడవునా ప్రజలు ఇదే అంశాన్ని ఆమెకు మొరపెట్టుకున్నారు. న్యాయం చేస్తామన్న డోన్ డీఎస్పీ రెండు నెలలైనా తమ ముఖం చూడలేదని చెప్పుకొచ్చారు. నిందితులకు ఎవరి సపోర్టు ఉందని షర్మిల ఆరాతీయగా.. ‘కాంగ్రెస్ ఎంపీ అని చెబుతున్నారు. స్కీమ్ తెచ్చింది కాంగ్రెస్ వ్యక్తి రంగస్వామి. మాకైతే ఏజెంట్లే దిక్కు. దాదాపు 2 వేల మంది ఏజెంట్లు ఆయన కింద పనిచేశారు’ అని ఒకరు చెప్పారు. 

మరో వ్యక్తి మాట్లాడుతూ మల్లికార్జున్ అనే యువకుడు రూ.5 లక్షలు అప్పుతెచ్చి బాండ్లు కొన్నాడు. మోసపోయానని గ్రహించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే మేమే రూ. 12 వేలు ఖర్చుపెట్టి బతికించుకున్నాం..’ అని వాపోయారు. దీనికి షర్మిల స్పందిస్తూ ‘మనీ స్కీమ్‌లో వందల కోట్లు మోసపోయారని చెబుతున్నారు. మోసం చేసిన వాళ్లకు అధికార కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉందని చెబుతున్నారు. పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. తప్పుచేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దు. అవసరమైతే సపోర్ట్ చేస్తున్న ఎంపీని కూడా అరెస్టు చేయాలి. ప్రభుత్వం తక్షణం కళ్లు తెరవాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. వీళ్ల బతుకుల మీద, కడుపుల మీద దెబ్బ కొట్టొద్దు..’ అని పేర్కొన్నారు. ‘మా పార్టీ తరఫున హోంమంత్రిని క లిసి ఈ సమస్యపై విన్నవిస్తాం. తక్షణం సమస్య పరిష్కారమయ్యే దిశగా వైఎస్సార్ సీపీ మీకు అండగా నిలుస్తుంది’ అని భరోసా ఇచ్చారు.

జనప్రవాహం: శుక్రవారం పాదయాత్ర మద్దికెర నుంచి తుగ్గలి వరకు 15.5 కిలోమీటర్ల మేర సాగింది. అడుగడుగునా జనప్రవాహం ఎదురేగి షర్మిలకు స్వాగతం పలికింది. సాయంత్రం 6.50కి తుగ్గలి చేరుకున్న షర్మిల అక్కడ బహిరంగ సభలో మాట్లాడారు. సభ అనంతరం రాత్రి 7.20కు దగ్గరలో ఏర్పాటు చేసిన రాత్రి బసకు చేరుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బస వద్ద షర్మిలను కలిశారు. ఇప్పటివరకు పాదయాత్ర మొత్తం 296.80 కిలోమీటర్లు పూర్తయింది. శుక్రవారం పాదయాత్రలో ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, మాజీ మంత్రి మారెప్ప, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌చార్జి గోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కోట్ల హరిచక్రపాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: పాదయాత్ర మార్గం మధ్యలో తగర్రాయికి చెందిన కూలీలు చేనులో పనిచేస్తుండగా.. షర్మిల రావడంతో వారంతా తమ బాధలు వినిపించారు. ఉపాధి హామీ కింద రూ. 30 కూలి ఇస్తున్నారని వాపోయారు. వారి సంభాషణ సాగిందిలా..

షర్మిల: ఏమ్మా.. కరువు పని దొరుకుతోందా?

మహిళ: దొరికినా ఏం లాభం ఉండదమ్మా... కూలి రూ. 30 పడుతాంది. 10 మందితో పని చేయించుకుని 20 మంది పేర్లు రాసి వచ్చిన దుడ్లు మాకు సగమిచ్చి సగం తీసేసుకుంటాండారు. 

షర్మిల: రాజన్న ఉన్నప్పుడు ఎంత పడిందమ్మా..

మహిళ: రూ. 70 నుంచి 100 వరకు ఇచ్చినారమ్మా..

షర్మిల: కరెంటు బిల్లు ఎంతొస్తుందమ్మా..

మహిళ: రూ. 300 వస్తాంది. బుగ్గకని(బల్బు), ఫ్యాన్‌కని వే స్తాండారు.

షర్మిల: రాజన్న ఉన్నప్పుడు ఎంతొచ్చిందమ్మా..?

మహిళ: ఇంతకుమునుపు రూ. 50, రూ. 60, రూ. 70 కట్టినాం. ఇప్పుడైతే ఏం తెలియనోళ్లమని రూ. 500 కట్టించుకుంటాండారు.

షర్మిల: ఇది శ్రమదోపిడీ కదా. రాబందుల రాజ్యం ఇది. పీక్కుతింటున్నారు.

మహిళ: ఎండనక వాననక కడప, గుంటూరు వలసపోతాండాం. కొందరు హైదరాబాద్ వెళుతుండారు. కానీ పశువులను ఇడిచి హైదరాబాద్ ఎట్లా పోయేది.

ఓ వృద్ధురాలు: దేవుడున్నంతసేపు(వైఎస్‌ను ఉద్దేశించి) బాగుండాది.. దేవుడు పోయినాడు.. మా బతుకులు ఇట్లా మిగిలినాయి.

షర్మిల: చంద్రబాబు హయాంలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడూ అదే పరిస్థితి ఎదురవుతోంది. సమయం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధిచెప్పి జగనన్నను ఆశీర్వదిస్తే మళ్లీ మనకు మంచిరోజులొస్తాయి.

అఫ్రీన్ చదువు ఆగిపోయింది..

అగ్రహారం గ్రామానికి చెందిన నిరుపేద అయిన ఇమాంసాహెబ్ కుమార్తె అఫ్రీన్ పదో తరగతిలో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్ బైపీసీలో 72.5 శాతం మార్కులతో పాసైంది. ఎంసెట్‌లో ర్యాంకు సాధించింది. కానీ ఇప్పుడు చదువు ఆగిపోయింది. పాదయాత్ర చేస్తున్న షర్మిలకు ఎదురేగి ఆమె ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. ‘ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకున్న నేను బీ-ఫార్మసీ చేద్దామనుకున్నా. కానీ కేవలం డబ్బులు లేక చదువు ఆగిపోయింది. హైదరాబాద్‌లో సీటొచ్చిందని కబురొచ్చింది. కానీ ఫోన్ చేసి వివరాలు కనుక్కుంటే రూ. 2లక్షలు కట్టాలన్నారు. దాంతో ఇక చదువు ఆపేశా..’ అని చెప్పడంతో షర్మిల స్పందిస్తూ పూర్తి వివరాలు తెలుసుకుని అమ్మాయి చదువు మళ్లీ కొనసాగేలా చేస్తామని చెప్పారు.

చిన్నారి ప్రాణాలు నిలబెట్టరట..: ఎం.అగ్రహారం గ్రామంలో రఘువర్ధన్, సుజాత దంపతులు షర్మిలను కలిసి ‘ఆరోగ్య శ్రీ’ అందకపోవడంతో తమ కూతురు సాయిలక్ష్మి(10) తమకు దక్కదేమోనని భయమేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ‘నాలుగేళ్ల క్రితం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కింద పాపకు గుండె ఆపరేషన్ చేయించాం. దాదాపు రూ.5.70 లక్షలు ప్రభుత్వమే భరించింది. కానీ పాప గుండె కుడిపక్కన ఉండడం, వాల్వ్ చిన్నగా ఉండడంతో రెండోసారి ఆపరేషన్ చేయించాలని అప్పుడే చెప్పారు. రూ. 4 లక్షలు ఖర్చవుతుంది. కానీ అపోలో ఆస్పత్రికి వెళితే రెండోసా రి చేయలేమని తిప్పిపంపిస్తున్నారు’ అని ఆమె వాపోయింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయిం చేందుకు యత్నిస్తామని షర్మిల హామీ ఇచ్చారు.

దళారులకే టమాటా గిట్టుబాటు: ఎడవల్లి క్రాస్‌లో రైతులు షర్మిల వద్దకు వచ్చి తమ సమస్యలు వివరించారు. టమాటా పంట పెడుతూ ఏటా నష్టపోతూనే ఉన్నామని, మార్కెట్లో టమాటా రూ.7 నుంచి రూ. 10 ఉన్నా.. రైతుల వద్ద మాత్రం కిలో రూ. 1, రూ. 2 చొప్పున దళారులు కొనుగోలు చేస్తున్నారని వాపోయారు. దీనికి షర్మిల స్పందిస్తూ జగనన్న వస్తే మళ్లీ రైతు రాజ్యమే వస్తుందని, టమాట పంటకు కూడా గిట్టుబాటయ్యేలా తగిన విధానం రూపొందిస్తాడని భరోసా ఇచ్చారు.

తుపాను సమయంలో ప్రజలను గాలికొదిలి సీఎం ర్యాలీకి వెళతారా?

త్వరలో విజయమ్మ నేతృత్వంలో ప్రధానిని కలవనున్న పార్టీ బృందం
వరద బాధిత రైతులకు ఎకరాకు రూ. 10 వేల పరిహారం ఇవ్వాలి 
ఇళ్లు దెబ్బతిన్న వారికి ప్రభుత్వమే పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి 
వైఎస్సార్ కాంగ్రెస్ పాలక మండలి సమావేశం డిమాండ్.. తీర్మానం 
తుపాను సమయంలో ప్రజలను గాలికొదిలి సీఎం ర్యాలీకి వెళతారా? 
సర్కారు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజం

హైదరాబాద్, న్యూస్‌లైన్: నీలం తుపాను ప్రభావంతో పాటు అనేక ప్రతికూల కారణాలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న రైతుల రుణాలను మాఫీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రైతుల రుణాలను రద్దు చేయటంతో పాటు వారికి కొత్త రుణాలను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సమావేశం ఈ మేరకు తీర్మానం చేసింది. సోమవారం పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ అధ్యక్షతన సీజీసీ సమావేశం జరిగింది. నీలం తుపానుతో ముంచెత్తిన వరదలు, ఆ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగం కష్టాలపై సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. పంట చేతికొచ్చే సమయంలో ముంచెత్తిన వరదల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇలాంటి తరుణంలో ముందుకొచ్చి ఆదుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని సమావేశం అభిప్రాయపడింది. తక్షణం రైతుల రుణాలను రద్దు చేసి కొత్త అప్పులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమావేశం తీర్మానం చేసింది. సీజీసీ సభ్యులతో పాటు పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం సమావేశ వివరాలను రాజకీయ వ్యవహారాల కమిటీ కో-ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ పార్టీ సీనియర్ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, భూమన కరుణాకర్‌రెడ్డి, మేకా శేషుబాబులతో కలిసి విలేకరులకు వివరించారు. 

తక్షణం అసెంబ్లీని సమావేశపరచాలి: నీలం తుపాను ప్రభావాన్ని బాధ్యత గల రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు తక్కువగా అంచనా వేశారని, అందువల్లనే ముందస్తు చర్యలు కూడా చేపట్టలేక పోయారని ధ్వజమెత్తారు. తుపాను బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటాన్ని సమావేశం తీవ్రంగా ఖండించిందన్నారు. పంటలు వేసుకున్న కౌలు రైతుల రుణాలను రద్దు చేయాలని.. వారికి మళ్లీ 75 శాతం సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని కోరారు. రాష్ట్రంలో వరద బీభత్సంపై చర్చించటానికి తక్షణం శాసనసభను సమావేశపరచాలని కూడా డిమాండ్ చేశారు. తుపాను నష్టాలను వివరించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కోరటానికి విజయమ్మ నేతృత్వంలో పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఒక ప్రతినిధి బృందం త్వరలో ఢిల్లీ వెళ్లాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈలోగా రాష్ట్రానికి ఇతోధికంగా సాయం అందజేయాలని కోరుతూ ప్రధానికి విజయమ్మ ఒక లేఖ రాస్తారని తెలిపారు. 

ఎకరాకూ రూ. 10 వేల పరిహారం ఇవ్వాలి... 

ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు హెక్టారుకు 25 వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని కేంద్ర వైపరీత్యాల నిధి చైర్మన్ భూపేంద్రహూడా చేసిన సిఫారసులను ఇపుడు అమలు చేయాలని ఆ ప్రకారం రాష్ట్రంలో రైతులకు ఎకరాకు పది వేలు చొప్పున లభిస్తుందని కొణతాల వివరించారు. గృహాలు దెబ్బతిన్న వారికి ప్రభుత్వమే పూనుకుని పక్కా గృహాలను నిర్మించాలని కూడా సమావేశం కోరిందన్నారు. పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లు నష్టపోయిన వారికి మళ్లీ రుణాలు ఇవ్వాలని, బాధితులకు బియ్యం, కిరోసిన్‌తో పాటుగా వంట పాత్రలు సహా ఒక నెల రేషన్ ఇవ్వాలని సమావేశం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 

డ్వాక్రా రుణాల వసూళ్లను వాయిదా వేయాలి... 

డ్వాక్రా గ్రూపు మహిళలు తీసుకున్న రుణాలను వ్యవసాయరంగంలోనే ఉంచారని అది పూర్తిగా దెబ్బ తిన్నందున ఏడాది పాటు వాటి వసూళ్లను వాయిదా వేసి తాజా రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కొణతాల పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు గోదావరి కరకట్టలను నిర్మించటానికి భారీగా నిధులు కేటాయించారని అయినా వాటిని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. వెంటనే కరకట్టల నిర్మాణం చేపట్టాలని కోరారు. రైతుల పొలాల్లో వరదల ఫలితంగా ఏర్పడిన ఇసుక మేటలను తొలగించటానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టాలని సూచించారు. 

వర్షాల తరువాత ప్రబలే రోగాల నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అన్నారు. తుపాను సమయంలో రాష్ట్ర ప్రజలను గాలికొదిలేసి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీకి వెళ్లటాన్ని కొణతాల తీవ్రంగా తప్పు పట్టారు. ఇంతకన్నా నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం మరొకటి ఉండదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి ప్రజల గురించి ఆలోచించి వారి కష్టాలు తీర్చాలని కోరారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ముఖ్య నేతలు ఎం.వి.మైసూరారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, డి.ఎ.సోమయాజులు, ఎస్.రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకరరావు, మేకా శేషుబాబు, సీజీసీ సభ్యులు బాలమణెమ్మ, కె.కె.మహేందర్‌రెడ్డి, చందా లింగయ్యదొర, కె.గంగారెడ్డి, తోపుదుర్తి కవిత, డి.రవీంద్రనాయక్, కృష్ణారావు, జ్యోతుల నెహ్రూ, అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, బి.జనక్‌ప్రసాద్, హెచ్.ఎ.రెహ్మాన్, గట్టు రామచంద్రరావు సమావేశంలో పాల్గొన్నారు.

source:sakshi

నల్లగొండ జిల్లా నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రముఖ నాయకురాళ్లు శుక్రవారం ఆ పార్టీలో చేరారు. సీపీఎం సీనియర్ నాయకురాలు మల్లు స్వరాజ్యం కుమార్తె, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ నాయకురాలు పాదూరి కరుణ, మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్‌రెడ్డి కుమార్తె శ్రీకళారెడ్డి కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, సూర్యాపేటకు చెందిన కార్యకర్తలతో భారీ ఊరేగింపుగా వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నివాసానికి చేరుకున్నారు. విజయమ్మ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పాదూరి కరుణ 2009 ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చే శారు. శ్రీకళారెడ్డి వ్యాపారవేత్తగా ఉన్నారు. వీరు పార్టీలో చేరిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వై.వి.సుబ్బారెడ్డి, నల్లగొండ జిల్లా పార్టీ అడ్‌హక్ కమిటీ కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి, ముఖ్య నేతలు గున్నం నాగిరెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

జగన్ సీఎం కావాలనే పార్టీలో చేరా: శ్రీకళారెడ్డి

ప్రస్తుత పరిస్థితుల్లో జగనన్న ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నానని అందుకే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరానని శ్రీకళారెడ్డి అన్నారు. జగనన్న ముఖ్యమంత్రి కావడం కోసం ఇంట్లో కూర్చుంటే లాభం లేదని భావించాననని కష్టపడి పార్టీ విజయం కోసం కృషి చేసేందుకే వచ్చానని అన్నారు. సంక్షేమ పథకాల అమలు జరగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావడమే మార్గమని అభిప్రాయపడ్డారు. 

ఎన్నికలెప్పుడు జరిగినా జగన్‌దే గెలుపు: కరుణ

రాష్ట్రంలో ఎన్నికలు ఎపుడు జరిగినా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గెలుపు ఖాయమని పాదూరి కరుణ అన్నారు. వైఎస్సార్సీపీలో చేరిన అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ రెండూ రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని, కొత్త ప్రత్యామ్నాయం కోసం వారు ఎదురు చూస్తున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆ శక్తిగా ఎదిగిందని అందుకే అశేష జనవాహిని ఆ పార్టీ వెనక ఉన్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కళ్లు మూస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి, కళ్లు తెరిస్తే జగన్, ఆయన వెనుక జనవాహిని కనిపిస్తోందని, దీంతో అభద్రతాభావం పెరిగిపోయిందన్నారు. 

పార్టీ బలపడింది: సోమిరెడ్డి

కరుణ, శ్రీకళా చేరికతో నల్లగొండ జిల్లాలో పార్టీ ఇంకా బలపడిందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి అన్నారు. రాజకీయాల్లో జగన్ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారని, అందుకే జనం ఆయన ఉన్నారన్నారు. జగన్ సీఎం కావాలనే ఆకాంక్ష రోజురోజుకూ బలపడుతోందని సంక్షేమ పథకాల అమ లు ఆయన వల్లనే సాధ్యమని భావిస్తున్నారని పేర్కొన్నారు.

వైఎస్సార్సీపీలోకి కరుణ, శ్రీకళా


నల్లగొండ జిల్లా నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రముఖ నాయకురాళ్లు శుక్రవారం ఆ పార్టీలో చేరారు. సీపీఎం సీనియర్ నాయకురాలు మల్లు స్వరాజ్యం కుమార్తె, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ నాయకురాలు పాదూరి కరుణ, మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్‌రెడ్డి కుమార్తె శ్రీకళారెడ్డి కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, సూర్యాపేటకు చెందిన కార్యకర్తలతో భారీ ఊరేగింపుగా వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నివాసానికి చేరుకున్నారు. విజయమ్మ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పాదూరి కరుణ 2009 ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చే శారు. శ్రీకళారెడ్డి వ్యాపారవేత్తగా ఉన్నారు. వీరు పార్టీలో చేరిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వై.వి.సుబ్బారెడ్డి, నల్లగొండ జిల్లా పార్టీ అడ్‌హక్ కమిటీ కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి, ముఖ్య నేతలు గున్నం నాగిరెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

జగన్ సీఎం కావాలనే పార్టీలో చేరా: శ్రీకళారెడ్డి

ప్రస్తుత పరిస్థితుల్లో జగనన్న ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నానని అందుకే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరానని శ్రీకళారెడ్డి అన్నారు. జగనన్న ముఖ్యమంత్రి కావడం కోసం ఇంట్లో కూర్చుంటే లాభం లేదని భావించాననని కష్టపడి పార్టీ విజయం కోసం కృషి చేసేందుకే వచ్చానని అన్నారు. సంక్షేమ పథకాల అమలు జరగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావడమే మార్గమని అభిప్రాయపడ్డారు. 

ఎన్నికలెప్పుడు జరిగినా జగన్‌దే గెలుపు: కరుణ

రాష్ట్రంలో ఎన్నికలు ఎపుడు జరిగినా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గెలుపు ఖాయమని పాదూరి కరుణ అన్నారు. వైఎస్సార్సీపీలో చేరిన అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ రెండూ రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని, కొత్త ప్రత్యామ్నాయం కోసం వారు ఎదురు చూస్తున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆ శక్తిగా ఎదిగిందని అందుకే అశేష జనవాహిని ఆ పార్టీ వెనక ఉన్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కళ్లు మూస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి, కళ్లు తెరిస్తే జగన్, ఆయన వెనుక జనవాహిని కనిపిస్తోందని, దీంతో అభద్రతాభావం పెరిగిపోయిందన్నారు. 

పార్టీ బలపడింది: సోమిరెడ్డి

కరుణ, శ్రీకళా చేరికతో నల్లగొండ జిల్లాలో పార్టీ ఇంకా బలపడిందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి అన్నారు. రాజకీయాల్లో జగన్ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారని, అందుకే జనం ఆయన ఉన్నారన్నారు. జగన్ సీఎం కావాలనే ఆకాంక్ష రోజురోజుకూ బలపడుతోందని సంక్షేమ పథకాల అమ లు ఆయన వల్లనే సాధ్యమని భావిస్తున్నారని పేర్కొన్నారు.

నేటి షర్మిల పాదయాత్ర సాగేదిలా..

 ‘మరో ప్రజా ప్రస్థానం’ యాత్రలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల శనివారం జిల్లాలో 13.2 కిలోమీటర్లు నడవనున్నారు. తుగ్గలి శివారు నుంచి ఉదయం పాదయాత్ర ప్రారంభించిననున్నారు. రాతన, పత్తికొండ, గుత్తిరోడ్డు, పాతపేట మీదుగా మెయిన్ రోడ్డు నుంచి ఆదోని రోడ్డు వరకు ఈ యాత్రను కొనసాగిస్తారు. ఆదోని రోడ్డులోని బీఈడీ కళాశాల ఆవరణలో రాత్రి బస చేస్తారని పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పత్తికొండలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు.

Sharmila's 24th Day Maro Prajaprasthanam padayatra route map

ముగిసిన 23వ రోజు షర్మిల పాదయాత్ర

వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల 23వ రోజు మరోప్రస్థానం పాదయాత్ర ముగిసింది. ఈరోజు 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు 286.5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.

Sharmila in Tuggali, Kurnool Dist

మరో ప్రజాప్రస్థానం 24వ రోజు షెడ్యూల్

http://www.ysrcongress.com/news/news_updates/sharmila_marO_prajaaprasthaanaM_SanivaaraM_saagaedilaa.html

మరో ప్రజాప్రస్థానం 24వ రోజు షెడ్యూల్‌ను పాదయాత్ర కన్వీనర్‌ తలశిల రఘురామ్‌ శుక్రవారం వెల్లడించారు. కర్నూలు జిల్లా తుగ్గలి నుంచి శనివారం ఉదయం షర్మిల పాదయాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం రత్న, పత్తికొండ (టౌన్‌) మీదుగా కొనసాగుతుందని ఒక ప్రకటనలో రఘురామ్‌ వివరించారు. అక్కడి నుంచి పాదయాత్ర వైయస్‌ఆర్‌ సర్కిల్‌ వద్ద షర్మిల బహిరంగ సభ ఉంటుందన్నారు. బహిరంగ సభ అనంతరం షర్మిల పాదయాత్ర గుత్తి రోడ్‌, పాతపేట, మెయిన్‌రోడ్‌, ఆదోని రోడ్‌ మీదుగా కొనసాగుతుంది.

Konda Surekha Press Meet

YSRCP leader Konatala speech on flood effected areas

Sharmila speech in M.Agraharam at Kurnool district -

బయటపడిన బాబు గుట్టు!

చంద్రబాబు నాయుడు మహామేధావి. ప్రత్యర్థి పక్షానికి ఎప్పుడూ ఛాన్సివ్వరు. తన లోటుపాట్లూ, వాటి లోతుపాతులూ ఆయనే స్వయంగా బయటపెట్టుకుంటారు తప్ప ప్రత్యర్థులతో మాట పడరు. ప్రస్తుతం ఆయన నడిపిస్తున్న పాదయాత్ర నాటకం ఆంతర్యమేమిటో బాబుగారే బయటపెట్టుకున్నారు. ‘వస్తున్నా మీ కోసం’ అని తన యాత్రకు ఆయన పేరు పెట్టుకున్నారు. అయితే, ఆ యాత్ర ఇతరుల కోసం చేస్తున్నది కాదనీ, ముఖ్యమంత్రి పదవిని ఎలాగయినా పట్టేయాలనే పట్టుదలతోనే నడిపిస్తున్నారనీ అందరికీ తెలుసు. ఈ రహస్యం ఇతరులకన్నా బాబుకే బాగా తెలుసు. అదే ఆయన మాటల్లో అడుగడుగునా బయటపడుతూ వస్తోంది.

తాబేళ్లతోనూ నత్తలతోనూ పోటీపడి నడుస్తున్న చంద్రబాబు తన పాదయాత్ర పొడుగునా క్రమం తప్పకుండా చేస్తున్నది ఒక్కటే- హామీలూ వాగ్దానాల వర్షం కురిపించడమే! దానికితోడు, గతంలో జీవించే జబ్బు ఒకటి! మహానేత వైఎస్‌ఆర్ అసెంబ్లీలోనే ఒకసారి చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడికి తానిప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదనే విషయం బుర్రకెక్కలేదు. ‘నేను నిద్రపోను- మిమ్మల్ని నిద్రపోనివ్వను!’ అంటూ హుంకరించి హుంకరించి ఆయనకు మరే విషయమూ గుర్తులేకుండా పోయింది. ప్రస్తుతం పాదయాత్ర సందర్భంగానూ అదే ప్రవర్తన కొనసాగిస్తున్నారు.

2003లోనూ, 2009లోనూ తనను జనం తిప్పికొట్టిన సంగతి జాపకంలేకపోయినా, బీజేపీ తోకపట్టుకుని జాతీయ రాజకీయాల్లో ఈదిన విషయం మాత్రం మర్చిపోలేదు బాబుగారు. ‘నాకు పదవి కొత్తకాదు- ఢిల్లీలో చక్రం తిప్పా’ అంటూ అడుగడుగునా బాబు చేసే ప్రలాపాలు విని జనం నవ్వుకుంటున్నారు. ‘ఢిల్లీలో చక్రం తిప్పానంటున్నాడు- అక్కడేమన్నా ట్యాక్సీయేమన్నా తిప్పినాడా?’ అనుకుని కుర్రకారు జోకులేసుకుంటున్నా బాబు జంకడంలేదు. ‘వాజపేయికి నేనెంత చెప్తే అంత- అబ్దుల్ కలాంను నేనే రాష్ట్రపతిని చేశా- మీ జేబుల్లోని సెల్‌ఫోన్లు నేనిచ్చినవే’ అంటూ చెప్పుకుపోతూనే ఉన్నారు.

అంతకుమించి, ‘రాష్ట్రంలో చేనేత కార్మికులూ రైతులూ ఆత్మహత్యలు చేసుకుంటున్నా’రని బాబు మొసలి కన్నీరు కార్చడం నవ్వులపాలవుతోంది. ఆయన హయాంలో నేతన్నలూ రైతన్నల ఆత్మహత్యల గురించి బాధ్యతారహితంగా మాట్లాడిన బాబేనా ఈ గంభీర ప్రసంగాలు చేస్తున్నది? అని జనం ఆశ్చర్యపోతున్నారు. నష్టపరిహారంగా వచ్చే డబ్బులకోసమే వాళ్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రకటించి, ఘోరపరాజయం పాలయిన బాబు గతాన్ని విస్మరించి ఉండొచ్చు. కానీ జనం ఆ మాటలనూ, దానివెనక ఉన్న మనస్తత్వాన్నీ మర్చిపోలేదు.

జనం కష్టాల్లో ఉన్నారని పదేపదే ప్రటిస్తున్న బాబు ప్రధాన ప్రతిపక్షంగా చెయ్యాల్సిన పనేమిటి? ఈ చేతకాని ప్రభుత్వాన్ని పడగొట్టడం! చిన్నపిల్లలక్కూడా ఈ విషయం తెలుసు. కానీ, ఆయన ఆ పని చెయ్యడంలేదు. పెపైచ్చు, అధికార పక్షంతో కుమ్మక్కయి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని మొగ్గలోనే తుంచేయాలని ప్రయత్నిస్తున్నారని ప్రజలందరికీ తెలుసు. అందుచేతనే ఆయన పాదయాత్రకు ప్రజల మద్దతు లేకుండా పోయింది.

కానీ, బాబు మహానటుడు! ఆ విషయం గుర్తించనట్లే మాట్లాడుతూ పోతున్నారు. ‘నానా ఇబ్బందులూ పడి నేను మిమ్మల్ని చూడ్డానికి వస్తే, మీరు ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించి నన్ను మరింత ఇబ్బంది పెట్టడం న్యాయమేనా?’ అని బాబు ప్రజల్ని దీనంగా ప్రశ్నిస్తున్నారు. అంతే తప్ప తన పాదయాత్ర నాటకం సంగతి జనానికి అర్థమయిపోయిందన్న వాస్తవాన్ని ఆయన గుర్తించినట్లు తోచదు.

అయినా, చంద్రబాబు నాయుడు పాదయాత్రకు సంబంధించిన నిజాలను ఎక్కడికక్కడ రుజువు చేస్తున్నది ప్రత్యర్థి పక్షాలకు చెందిన నేతలు కాదు- స్వయంగా ఆయనే! తను అధికారంలోకి రాగానే, పొడిచేస్తానని బీరాలు పోతుండడం చూస్తేనే ఆయన పాదయాత్ర లక్ష్యం పదవీ సముపార్జన మాత్రమేనని స్పష్టమయిపోవడం లేదూ? మహా మేధావినని చెప్పుకునే చంద్రబాబుకు ఇంత చిన్న విషయం తట్టలేదంటే, ఆయన సాఫ్ట్‌వేర్ చెడిపోయిందని అర్థం. ఇప్పటికయినా బాబు తన పాదయాత్ర నాటకానికి తెరదించి హెరిటేజ్ వ్యాపారం చూసుకోవడంలో కొడుక్కి సాయం చేస్తే బాగుంటుందని జనం అంటున్నారు. బాబుగారూ, వినబడిందా? 


http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=52249&Categoryid=28&subcatid=0

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!