భారీవర్షాలకు పంట నష్టపోయిన రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ హామీ ఇచ్చారు. వరదలతో రైతులు కష్టాల్లో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా శివకోడూరులో బాధితులను ఆమె పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు అధైర్యపడవద్దని చెప్పారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10 వేల నుంచి 17వేల రూపాయల వరకు వచ్చేలా చేస్తామన్నారు. పంట నష్టపరిహారంపై శాసనసభలో చర్చ జరిగేలా చూస్తామని చెప్పారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో గోదావరి డెల్టా ఆధునీకీకరణకు 200 కోట్ల రూపాయలు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఆయన బ్రతికి ఉండగా 20 శాతం పనులు పూర్తయ్యాయని, ఆ తర్వాత ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment