నీలం తుపాను వల్ల నష్టపోయిన ప్రాంతాల సందర్శనకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈ నెల 8వ తేదీన ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ అడ్‌హాక్ కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ మంగళవారం ఈ విషయాన్ని ప్రకటిస్తూ పర్యటన వివరాలు తెలియజేశారు. విజయమ్మ 8 వ తేదీ ఉదయం హైదరాబాద్ నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి 11 గంటలకు ఖమ్మం చేరుకుంటారు.
ఖమ్మం అర్బన్, పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, వైరా పరిధిలోని కొణిజర్ల, మరో పది గ్రామాల్లో ఆమె పర్యటిస్తారని అజయ్‌కుమార్ తెలిపారు. విజయమ్మ రైతులను కలుసుకుని వారిని పరామర్శిస్తారని ఆయన తెలిపారు. పర్యటన ముగిసిన తరువాత అదే రోజు సాయంత్రం రోడ్డు మార్గంలో విజయమ్మ హైదరాబాద్‌కు బయలుదేరతారు.

No comments:
Post a Comment